B2B కోసం బ్యాంక్ ఖాతా వాల్టింగ్‌ను సెటప్ చేయడం

కస్టమర్‌లు ప్రతిసారీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని నమోదు చేయాల్సిన అవసరం లేకుండా వారి ఖాతాల నుండి డెబిట్ చేయడానికి, ఆ సమాచారాన్ని సురక్షితంగా సేవ్ చేయడానికి బ్యాంక్ ఖాతా వాల్టింగ్ అనుమతిస్తుంది.

ఈ ఫీచర్ Shopify Payments ఉపయోగిస్తున్న యునైటెడ్ స్టేట్స్‌లోని వ్యాపారులకు, అలాగే యునైటెడ్ స్టేట్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్న కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

B2B కస్టమర్‌లు మాత్రమే బ్యాంక్ ఖాతాలను వాల్ట్ చేయగలరు. మీ కస్టమర్ తరఫున మీరు బ్యాంక్ ఖాతా వివరాలను వాల్ట్ చేయలేరు.

బ్యాంక్ ఖాతాలను వాల్ట్ చేయడానికి కస్టమర్ అనుభవం

B2B కస్టమర్‌లు చెక్‌అవుట్‌లో వారి బ్యాంక్ ఖాతా సమాచారాన్ని వాల్ట్ చేయడానికి చెక్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. వారు కంపెనీ లొకేషన్‌కు వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతాను జోడించడానికి కస్టమర్ ఖాతాలలోకి లాగిన్ కూడా అవ్వొచ్చు. కస్టమర్ బ్యాంక్ ఖాతాను వాల్ట్ చేసినప్పుడు, వారు మాండేట్‌ను అంగీకరిస్తారు, అలాగే ఆ బ్యాంక్ ఖాతాను ప్రస్తుత ఆర్డర్, భవిష్యత్తు ఆర్డర్‌లకు ఉపయోగించడానికి అనుమతి ఇస్తారు.

బ్యాంక్ ఖాతాను కంపెనీ లొకేషన్‌కు వాల్ట్ చేసినప్పుడు, ఆ లొకేషన్‌కు అనుమతులు ఉన్న కస్టమర్‌లు అందరూ ఆ బ్యాంక్ ఖాతాను చెక్‌అవుట్‌లో ఉపయోగించవచ్చు. ఒక కంపెనీ లొకేషన్‌కు అనుమతులు ఉన్న కస్టమర్‌లు కస్టమర్ ఖాతాల నుండి బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయడం లేదా బ్యాంక్ ఖాతాను తొలగించడం లాంటి వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతాలను కూడా మేనేజ్ చేయవచ్చు.

చెల్లింపు నిబంధనలు ఉన్న ఆర్డర్ కోసం వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ చేయండి

చెల్లింపు నిబంధనలు ఉన్న ఆర్డర్ చెక్‌అవుట్ సమయంలో, చెల్లింపు నిబంధనల వ్యవధి ముగిశాక ఏ బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ చేయాలో కస్టమర్‌లు పేర్కొనవచ్చు. చెల్లింపు నిబంధనల గడువు ముగిసినప్పుడు బ్యాంక్ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా డెబిట్ చేయబడదు. మీరు మీ Shopify అడ్మిన్ నుండి ఆ బ్యాంక్ ఖాతా నుండి మాన్యువల్‌గా డెబిట్ చేయాల్సి ఉంటుంది.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, కస్టమర్‌లు > కంపెనీలుకు వెళ్లండి.

  2. కంపెనీని క్లిక్ చేయండి, ఆపై మీరు ఛార్జ్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌కు అనుబంధించబడిన లొకేషన్‌ను క్లిక్ చేయండి.

  3. మీరు ఛార్జ్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌ను క్లిక్ చేయండి.

  4. చెల్లింపు విభాగంలో, చెల్లింపును వసూలు చేయండిని క్లిక్ చేసి, ఆపై మీరు డెబిట్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను క్లిక్ చేయండి.

  5. ఎంచుకున్న బ్యాంక్ ఖాతా నుండి డిస్‌ప్లే అయిన మొత్తాన్ని డెబిట్ చేయడానికి ఛార్జ్‌ను క్లిక్ చేయండి.

చెల్లింపు నిబంధనలు ఉన్న ఆర్డర్ కోసం డెబిట్ చేయాల్సిన బ్యాంక్ ఖాతాను మార్చండి

మీ కస్టమర్‌లు ఆర్డర్‌తో అనుబంధించిన బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేయలేరు, కానీ మీ కస్టమర్ తరపున మీరు బ్యాంక్ ఖాతాను మార్చవచ్చు.

కస్టమర్ ఒక బ్యాంక్ ఖాతాను మాత్రమే వాల్ట్ చేసి ఉంటే, మీరు దాన్ని మార్చడానికి ముందు వారు వారి కస్టమర్ ఖాతా ప్రొఫైల్‌కు మరొక బ్యాంక్ ఖాతాను జోడించాల్సి ఉంటుంది. మీరు అనుబంధిత బ్యాంక్ ఖాతాను మార్చే ముందు తప్పనిసరిగా కస్టమర్ నుండి ఆమోదం పొందాలి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, కస్టమర్‌లు > కంపెనీలుకు వెళ్లండి.

  2. కంపెనీని క్లిక్ చేయండి, ఆపై మీరు ఏ ఆర్డర్ కోసం అయితే బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ చేయాలనుకుంటున్నారో దానికి అనుబంధించబడిన లొకేషన్‌ను క్లిక్ చేయండి.

  3. మీరు బ్యాంక్ ఖాతాను మార్చాలనుకుంటున్న ఆర్డర్‌ను క్లిక్ చేయండి.

  4. చెల్లింపు విభాగంలో, చెల్లింపును వసూలు చేయండిని క్లిక్ చేసి, ఆపై మీరు ఛార్జ్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను క్లిక్ చేయండి.

  5. ఎంచుకున్న బ్యాంక్ ఖాతాకు డిస్‌ప్లే అయిన మొత్తాన్ని ఛార్జ్ చేయడానికి ఛార్జ్‌ను క్లిక్ చేయండి.

డ్రాఫ్ట్ ఆర్డర్ కోసం వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ చేయండి

Shopify అడ్మిన్‌లో మీరు లేదా మీ సిబ్బంది సృష్టించిన డ్రాఫ్ట్ ఆర్డర్ కోసం మీరు వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ చేయవచ్చు. ఇది చెల్లింపును క్యాప్చర్ చేస్తుంది, అలాగే ఒక ఆర్డర్‌ను సృష్టిస్తుంది.

డ్రాఫ్ట్ ఆర్డర్ కోసం వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ చేయడానికి, మీరు స్టోర్ యజమాని అయి ఉండాలి లేదా డ్రాఫ్ట్ ఆర్డర్‌లు > వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతాకు ఛార్జ్ చేయండి స్టోర్ అనుమతి ఉన్న సిబ్బంది సభ్యుడు అయి ఉండాలి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లు > డ్రాఫ్ట్‌లుకు వెళ్లండి.

  2. మీరు వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ చేయాలనుకుంటున్న డ్రాఫ్ట్ ఆర్డర్‌ను క్లిక్ చేయండి.

  3. చెల్లింపు విభాగంలో, చెల్లింపును వసూలు చేయండిని క్లిక్ చేసి, ఆపై మీరు డెబిట్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను క్లిక్ చేయండి.

  4. ఎంచుకున్న బ్యాంక్ ఖాతా నుండి డిస్‌ప్లే అయిన మొత్తాన్ని డెబిట్ చేయడానికి ఛార్జ్‌ను క్లిక్ చేయండి.

ఆర్డర్ సమీక్షతో పాటు వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతాలను ఉపయోగించడం

మీరు ఆర్డర్‌లను సమీక్ష కోసం డ్రాఫ్ట్‌లుగా సమర్పించడానికి కంపెనీ లొకేషన్‌ను కాన్ఫిగర్ చేసినప్పుడు, కస్టమర్‌లు ఇప్పటికీ చెక్‌అవుట్‌లో బ్యాంక్ ఖాతాను వాల్ట్ చేయగలరు. మీరు సమీక్షించడానికి ఆర్డర్ డ్రాఫ్ట్‌గా సమర్పించబడుతుంది, అలాగే బ్యాంక్ ఖాతా నుండి వెంటనే డెబిట్ చేయబడదు. మీరు ఆర్డర్‌ను నిర్ధారించినప్పుడు, చెక్‌అవుట్ వద్ద ఎంచుకున్నది అనే లేబుల్ ఉన్న బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ చేయవచ్చు.

కంపెనీ లొకేషన్ కోసం వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతాను తొలగించండి

మీరు వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతాను తొలగించినప్పుడు, భవిష్యత్తులోని ఎలాంటి ఆర్డర్‌లకైనా దాని నుండి మీరు డెబిట్ చేయలేరు, అలాగే మీ కస్టమర్‌లు దీన్ని చెక్‌అవుట్‌లో చూడలేరు లేదా ఎంచుకోలేరు. ఆ బ్యాంక్ ఖాతాను ఉపయోగించి ప్లేస్ చేయబడి, చెల్లింపు నిబంధనలు ఉన్న ప్రస్తుత ఆర్డర్‌ల కోసం మీరు ఆ బ్యాంక్ ఖాతా నుండి ఇప్పటికీ డెబిట్ చేయవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, కస్టమర్‌లు > కంపెనీలుకు వెళ్లండి.

  2. కంపెనీని క్లిక్ చేయండి, ఆపై మీరు వాల్ట్ చేసిన బ్యాంక్ ఖాతాను తొలగించాలనుకుంటున్న లొకేషన్‌ను క్లిక్ చేయండి.

  3. కంపెనీ లొకేషన్ వివరాల విభాగంలో, …ను క్లిక్ చేసి, ఆపై చెల్లింపు పద్ధతులను మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.

  4. మీరు తొలగించాలనుకుంటున్న బ్యాంక్ ఖాతా కోసం, …ను క్లిక్ చేసి, ఆపై చెల్లింపు పద్ధతిని తీసివేయండిని క్లిక్ చేయండి.

  5. మీరు బ్యాంక్ ఖాతాను తొలగించాలనుకుంటున్నారని నిర్ధారించడానికి చెల్లింపు పద్ధతిని తీసివేయండిని క్లిక్ చేయండి.