కొత్త B2B కస్టమర్‌లు మీ స్టోర్‌కు యాక్సెస్‌ని అభ్యర్థించడానికి అనుమతించడం

కంపెనీ అకౌంట్ అభ్యర్థనలను ఉపయోగించి కొత్త B2B కస్టమర్‌లు మీ ఆన్‌లైన్ స్టోర్‌కు యాక్సెస్‌ను అభ్యర్థించడానికి మీరు అనుమతించవచ్చు. దీనికోసం మీరు Shopify ఫారమ్‌ల యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, టోకు కస్టమర్‌లు పూరించడానికి ఒక ఫారమ్‌ను సృష్టించి అనుకూలీకరించాలి, ఆపై మీ ఆన్‌లైన్ స్టోర్‌కు పాప్అప్ లేదా ఇన్‌లైన్ ఫారమ్‌ను జోడించాలి.

కస్టమర్ ఫారమ్‌ను సమర్పించినప్పుడు, మీ Shopify అడ్మిన్‌లో కంపెనీ, కంపెనీ లొకేషన్ మరియు కస్టమర్ ఆటోమేటిక్‌గా సృష్టించబడతారు. ఈ ఫీచర్ కస్టమర్‌లను ఇప్పటికే ఉన్న కంపెనీకి జోడించడానికి అనుమతించదు. మీరు వారి సమాచారాన్ని రివ్యూ చేసి, మీ ఆన్‌లైన్ స్టోర్‌ను యాక్సెస్ చేయడానికి మరియు మీ వ్యాపారం నుండి కొనుగోలు చేయడానికి వారు చేసిన అభ్యర్థనను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

కంపెనీ అకౌంట్ అభ్యర్థన ఫారమ్‌ను సెటప్ చేయండి

మీరు కంపెనీ అకౌంట్ అభ్యర్థన ఫారమ్‌ను సెటప్ చేయడానికి ముందు, Shopify ఫారమ్‌ల యాప్ను ఇన్‌స్టాల్ చేయాలి.

మీరు మీ ఆన్‌లైన్ స్టోర్‌లో పాప్అప్ లేదా ఇన్‌లైన్ ఫారమ్‌ను సెటప్ చేయవచ్చు. సాధారణంగా, చిన్న ఫారమ్‌ల కోసం పాప్అప్‌లను ఉపయోగిస్తారు. ఇన్‌లైన్ ఫారమ్‌లు పెద్ద ఫారమ్‌లకు లేదా మీ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రత్యేక సైన్ అప్ (sign up) పేజీని కలిగి ఉండాలనుకున్నప్పుడు బాగా సరిపోతాయి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, యాప్‌లు > ఫారమ్‌లుకు వెళ్లండి.

  2. ఫారమ్‌ను సృష్టించండిని క్లిక్ చేయండి.

  3. మీరు పాప్అప్ ఫారమ్‌ను లేదా ఇన్‌లైన్ ఫారమ్‌ను సృష్టించాలనుకుంటున్నారా అనేది ఎంచుకోండి.

  4. ఫారమ్ కోసం ఒక పేరును నమోదు చేయండి.

  5. సృష్టించండిని క్లిక్ చేయండి.

  6. ఫీల్డ్‌లు విభాగంలో, కంపెనీ మరియు కస్టమర్ను క్లిక్ చేయండి. కంపెనీ రికార్డును ఆటోమేటిక్‌గా సృష్టించడం కోసం కంపెనీ పేరు మరియు ఇమెయిల్ చిరునామా తప్పనిసరిగా అవసరం.

  7. ఐచ్ఛికం: అదనపు ఫీల్డ్‌లను జోడించడానికి, కింది వాటిని చేయండి:

    1. కొత్త ఫీల్డ్‌ని జోడించండిని క్లిక్ చేయండి.
    2. ఇప్పటికే ఉన్న ఫీల్డ్‌ను ఎంచుకోండి లేదా కస్టమ్ ఇన్‌పుట్ను సృష్టించడానికి కొత్త ఫీల్డ్‌ను క్లిక్ చేయండి. ఇప్పటికే ఉన్న ఫీల్డ్‌లను సమర్పించినప్పుడు, మీ Shopify అడ్మిన్‌లో ఆ ఫీల్డ్ రికార్డ్‌ను ఆటోమేటిక్‌గా సృష్టిస్తాయి. డిఫాల్ట్‌గా అన్ని ఫీల్డ్ సమర్పణలు మెటాఆబ్జెక్ట్‌గా సేవ్ చేయబడతాయి. మీరు ఫీల్డ్‌ను కంపెనీ మెటాఫీల్డ్ లేదా కస్టమర్ మెటాఫీల్డ్‌గా కూడా స్టోర్ చేయవచ్చు.
  8. మీ ప్రాధాన్యతలను బట్టి ఫారమ్‌లోని మిగిలిన భాగాలను కాన్ఫిగర్ చేయండి.

  9. సేవ్‌ను క్లిక్ చేయండి.

  10. మీరు ఎంచుకున్న ఫారమ్ రకాన్ని బట్టి:

    1. మీ ఆన్‌లైన్ స్టోర్‌కు పాప్-అప్ ఫారమ్‌ను జోడించండి
    2. మీ ఆన్‌లైన్ స్టోర్‌కు ఇన్‌లైన్ ఫారమ్‌ను జోడించండి

మీ ఫారమ్‌కు కస్టమ్ ఇన్‌పుట్ ఫీల్డ్‌లను జోడించడం

మీరు మీ ఫారమ్‌కు కస్టమ్ ఫీల్డ్‌లను జోడించవచ్చు మరియు వాటిని లోకల్ ఫీల్డ్‌లు, కస్టమర్ మెటాఫీల్డ్‌లు లేదా కంపెనీ మెటాఫీల్డ్‌ల (కస్టమర్ లేదా కంపెనీ) వలె స్టోర్ చేయవచ్చు. మీరు కస్టమ్ ఫీల్డ్‌ను సృష్టించినప్పుడు, మీరు దానికి పేరు పెట్టాలి, ఫీల్డ్ రకాన్ని ఎంచుకోవాలి, అలాగే ఫారమ్ సమర్పణకు ఇది అవసరమో లేదో ఎంచుకోవాలి. ఫారమ్ ఫీల్డ్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

లోకల్ ఫీల్డ్‌లు

లోకల్ ఫీల్డ్‌లు మీరు వాటిని సృష్టించే ఫారమ్‌లో మాత్రమే స్టోర్ చేయబడతాయి. ఇతర ఫారమ్‌లలో భవిష్యత్తు ఉపయోగం కోసం అవి సేవ్ చేయబడవు. కొత్త ఫారమ్‌లో లోకల్ ఫీల్డ్‌ను మళ్లీ ఉపయోగించడానికి, ఆ ఫీల్డ్‌ను ఉపయోగించే ఇప్పటికే ఉన్న ఫారమ్‌ను డూప్లికేట్ చేయాలి.

లోకల్ ఫీల్డ్‌ల కోసం సమర్పించిన సమాచారం కేవలం మెటాఆబ్జెక్ట్‌లలో మాత్రమే చూడటానికి వీలవుతుంది. కస్టమర్ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత సృష్టించబడే కంపెనీ లేదా కస్టమర్ ప్రొఫైల్‌లో ఇది అందుబాటులో ఉండదు. మీరు సమర్పించిన మొత్తం సమాచారాన్ని కంపెనీ లేదా కస్టమర్ ప్రొఫైల్‌లో చూడాలనుకుంటే, ఆ సమాచారాన్ని కస్టమర్ లేదా కంపెనీ మెటాఫీల్డ్‌గా స్టోర్ చేయండి.

మీరు కస్టమర్ మెటాఫీల్డ్‌గా కూడా స్టోర్ చేయిని ఎంచుకోవడం ద్వారా ఏ సమయంలోనైనా లోకల్‌గా స్టోర్ చేయబడిన ఫీల్డ్‌ను కస్టమర్ లేదా కంపెనీ మెటాఫీల్డ్‌కు మార్చవచ్చు. మీరు లోకల్ ఫీల్డ్‌ను మెటాఫీల్డ్‌కు మార్చినప్పుడు, కేవలం కొత్త ఫారమ్ సమర్పణలు మాత్రమే మెటాఫీల్డ్‌లో స్టోర్ చేయబడతాయి. మునుపటి సమర్పణలు లోకల్ ఫీల్డ్ డేటాగానే ఉంటాయి.

కస్టమర్ లేదా కంపెనీ మెటాఫీల్డ్‌లు

కస్టమర్ లేదా కంపెనీ మెటాఫీల్డ్‌లు ఇతర ఫారమ్‌లలో మళ్లీ ఉపయోగించడానికి వీలుగా ఫారమ్ ఫీల్డ్ పికర్‌లో సేవ్ చేయబడతాయి. మీకు 20 వరకు మెటాఫీల్డ్‌లు ఉంటే, అప్పుడు అవన్నీ మళ్లీ ఉపయోగించడానికి అందుబాటులో ఉంటాయి. మీకు 20 కంటే ఎక్కువ మెటాఫీల్డ్‌లు ఉంటే, పిన్ చేసిన మెటాఫీల్డ్‌లు మాత్రమే ప్రదర్శించబడతాయి. మీరు పిన్ చేసిన మెటాఫీల్డ్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

మీరు కస్టమ్ ఇన్‌పుట్ ఫీల్డ్‌ను మెటాఫీల్డ్‌గా స్టోర్ చేసిన తర్వాత, దానిని తిరిగి లోకల్ ఫీల్డ్‌కు మార్చలేరు, అలాగే మెటాఫీల్డ్‌లలో చేసే ఏవైనా మార్పులు ఆ ఫీల్డ్‌ను ఉపయోగించే అన్ని ఫారమ్‌లను అప్‌డేట్ చేస్తాయి.

మీరు కస్టమ్ ఇన్‌పుట్ ఫీల్డ్‌ను మెటాఫీల్డ్‌గా స్టోర్ చేసిన తర్వాత, ఇది మీ Shopify అడ్మిన్‌లోని కస్టమ్ డేటా > కస్టమర్‌లు లేదా కంపెనీలు విభాగంలో సేవ్ చేయబడుతుంది. B2B కస్టమర్‌ల కోసం కంపెనీ అకౌంట్ అభ్యర్థనలను మదింపు చేయడానికి లేదా కస్టమర్ విభాగాలను సృష్టించడానికి మీరు ఈ మెటాఫీల్డ్ డేటాను ఉపయోగించవచ్చు.

ఇప్పటికే తమ కస్టమర్ ప్రొఫైల్‌కు లింక్ చేయబడిన ఫీల్డ్ కోసం కస్టమర్ ఒకటి కంటే ఎక్కువ సార్లు సమాచారాన్ని సమర్పిస్తే, వారి కస్టమర్ ప్రొఫైల్ అత్యంత ఇటీవలి ఫారమ్ సమర్పణకు సంబంధించిన మెటాఫీల్డ్ డేటాను మాత్రమే ప్రదర్శిస్తుంది.

కస్టమ్ ఇన్‌పుట్ ఫీల్డ్ డేటా రకాలు

కస్టమ్ ఫీల్డ్ అనేది ఈ కింది డేటా రకాలలో ఏదైనా ఒకటి కావచ్చు:

కస్టమ్ ఇన్‌పుట్ ఫీల్డ్ డేటా రకాలు
ఫీల్డ్ డేటా రకంవివరణ
సింగిల్-లైన్ టెక్స్ట్ఒకే వాక్యానికి సరిపోయే చిన్న టెక్స్ట్ ఫీల్డ్.
డ్రాప్‌డౌన్ లిస్ట్ఒక డ్రాప్‌డౌన్ మెనుగా ప్రదర్శించబడే ఎంపికల జాబితా, దీని నుండి యూజర్ ఒక ఎంపికను ఎంచుకోవచ్చు.
రేడియో బటన్‌లు బటన్‌ల శ్రేణి వలె ప్రదర్శించబడే ఎంపికల జాబితా, దీని నుండి యూజర్ ఒక ఎంపికను ఎంచుకోవచ్చు.
మల్టీ-లైన్ టెక్స్ట్ఒక పేరాకు సరిపోయే పెద్ద టెక్స్ట్ ఫీల్డ్.
మల్టిపుల్ ఛాయిస్చెక్‌బాక్స్‌ల శ్రేణి వలె ప్రదర్శించబడే ఎంపికల జాబితా. డ్రాప్‌డౌన్ లిస్ట్ మరియు రేడియో బటన్‌లకు భిన్నంగా, యూజర్‌లు ఒకటి కంటే ఎక్కువ ప్రతిస్పందనలను ఎంచుకోవచ్చు.
తేదీఒక నిర్దిష్ట తేదీ.
సంఖ్యఒకే సంఖ్య.
ఫైల్ అప్‌లోడ్20 MB లేదా అంతకంటే తక్కువ సైజ్ గల సింగిల్ ఫైల్ అటాచ్‌మెంట్. ఫైల్ తప్పనిసరిగా ఆమోదించబడిన ఈ కింది ఫైల్ రకాలలో ఒకటి అయి ఉండాలి:
  • GIF
  • HEIC
  • JPEG
  • PDF
  • SVG
  • WebP
  • XML

ఉదాహరణకు, కంపెనీని B2B కస్టమర్‌గా ఆమోదించడానికి ముందు వారికి ఎన్ని షిప్పింగ్ లొకేషన్‌లు ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు కస్టమ్ సంఖ్యా ఫీల్డ్‌తో కూడిన ఫారమ్‌ను సృష్టించవచ్చు. కొత్త B2B కస్టమర్‌లు ఫారమ్‌ను పూరించినప్పుడు, వారు సమర్పించడానికి ముందు వారికి ఉన్న లొకేషన్‌ల సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేయాలి. భవిష్యత్తు సూచన కోసం మీరు ఈ సమాచారాన్ని వారి కంపెనీ ప్రొఫైల్‌లో మెటాఫీల్డ్‌గా స్టోర్ చేయవచ్చు.

కంపెనీ అకౌంట్ అభ్యర్థనలను రివ్యూ చేయండి

మీరు మీ ఆన్‌లైన్ స్టోర్‌కు ఫారమ్‌ను జోడించిన తర్వాత, మీ వ్యాపారం నుండి కొనుగోలు చేయడానికి యాక్సెస్‌ను అభ్యర్థిస్తూ కొత్త టోకు కస్టమర్‌లు ఫారమ్‌ను సమర్పించవచ్చు. కస్టమర్ ఫారమ్‌ను సమర్పించినప్పుడు, రివ్యూ చేయడానికి లింక్ చేయబడిన కస్టమర్, అలాగే లొకేషన్‌తో కూడిన కంపెనీ మీ Shopify అడ్మిన్‌లో సృష్టించబడుతుంది. మీరు ఇప్పటికే ఉన్న ఫీల్డ్‌లను జోడించినట్లయితే, అప్పుడు అవి కంపెనీ, అలాగే కస్టమర్ కోసం కూడా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి.

డిఫాల్ట్‌గా, మీరు ఆమోదించే వరకు ఫారమ్ ద్వారా సృష్టించబడిన కంపెనీలు మీ ఆన్‌లైన్ స్టోర్‌లో ఆర్డర్‌లను చేయలేరు లేదా B2B ధరల విధానాన్ని యాక్సెస్ చేయలేరు. Shopify Flowలోని కంపెనీ అకౌంట్ అభ్యర్థనల ద్వారా సృష్టించబడిన కంపెనీలకు ఆర్డరింగ్‌ను అనుమతించండి టెంప్లేట్‌ని ఉపయోగించి, మీరు అన్ని కొత్త కంపెనీ అకౌంట్ అభ్యర్థనల సమర్పణలను ఆటోమేటిక్‌గా ఆమోదించవచ్చు. Shopify Flow కోసం B2B టెంప్లేట్‌ల గురించి మరింత తెలుసుకోండి..

మీరు ఆర్డరింగ్ నిలువు వరుసలో కంపెనీ అకౌంట్ అభ్యర్థనలను రివ్యూ చేయవచ్చు మరియు Shopify అడ్మిన్‌లో కంపెనీలను ఆమోదించాలో లేదో ఎంచుకోవచ్చు. మీరు మీ Shopify అడ్మిన్‌లో కంటెంట్ > మెటాఆబ్జెక్ట్‌లు > ఇటీవలి ఎంట్రీలకు వెళ్లడం ద్వారా అన్ని ఫారమ్ సమర్పణల రికార్డ్‌ను చూడవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, కస్టమర్‌లు > కంపెనీలకు వెళ్లండి.
  2. ఆర్డరింగ్ ఆమోదించబడలేదు ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు రివ్యూ చేయాలనుకుంటున్న కంపెనీని క్లిక్ చేయండి.
  4. ఈ మెటాఫీల్డ్‌లు విభాగంలో, మీ ఫారమ్‌ను ఉపయోగించి కంపెనీ కాంటాక్ట్ సమర్పించిన సమాచారాన్ని రివ్యూ చేయండి:
    • అప్లికేషన్‌ను తిరస్కరించడానికి, కంపెనీని తొలగించండి.
    • కంపెనీని ఆమోదించడానికి, ఈ కింది వాటిని చేయండి:
      1. అనుమతులను మేనేజ్ చేయిని క్లిక్ చేయండి.
      2. లొకేషన్‌లు మరియు అనుమతులను కేటాయించుని ఎంచుకోండి.
      3. తర్వాతిని క్లిక్ చేయండి.
      4. ఆప్షనల్: కంపెనీ కాంటాక్ట్‌కు ఇమెయిల్ పంపడానికి వారు B2B ఆర్డర్‌లను చేయడం ప్రారంభించవచ్చని కస్టమర్‌కు తెలియజేయిని ఎంచుకోండి.
  5. ఐచ్ఛికం: మీ ఫారమ్‌లో లోకల్ ఫీల్డ్‌లు ఉంటే, మీరు ఆ ఫీల్డ్‌ల కోసం సబ్మిట్ చేసిన సమాచారాన్ని మెటాఆబ్జెక్ట్‌లలో రివ్యూ చేయవచ్చు:
    • మెటాఫీల్డ్‌లు విభాగంలో, Shopify Forms సబ్మిషన్‌లు పక్కన ఉన్న గ్రే రంగు సమయం మరియు తేదీ బాక్స్‌ను క్లిక్ చేయండి.
    • లోకల్ ఫీల్డ్‌లు మరియు ఫారమ్ సబ్మిషన్ మొత్తాన్ని వీక్షించడానికి ఫారమ్ సమర్పించబడిన సమయం మరియు తేదీని క్లిక్ చేయండి.

గేటెడ్ B2B స్టోర్‌లు మరియు కంపెనీ అకౌంట్ అభ్యర్థనలు

గేట్ చేయబడి, కేవలం B2B కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేక స్టోర్‌ను మీరు కలిగి ఉన్నప్పుడు కంపెనీ అకౌంట్ అభ్యర్థనలను ఉపయోగించలేరు.

అయితే, మీరు స్టోర్ గేటింగ్‌ను తీసివేయవచ్చు మరియు సున్నితమైన సమాచారాన్ని దాచవచ్చు, తద్వారా లాగిన్ అయిన టోకు కస్టమర్‌లు మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలరు. మీరు పబ్లిక్‌గా షేర్ చేయకూడదనుకునే ఏ సమాచారాన్ని వెల్లడించకుండానే, మీ ఆన్‌లైన్ స్టోర్‌లోని పబ్లిక్‌కు కనిపించే భాగానికి ఫారమ్‌ను జోడించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీరు ఉపయోగించే థీమ్‌పై ఆధారపడి, Liquid కోడ్ లేదా థీమ్ ఎడిటర్‌ని ఉపయోగించి లాగిన్ చేయని కస్టమర్‌ల నుండి ఉత్పత్తులు, ధరలు, కొనుగోలు బటన్‌లు మరియు ఇతర సమాచారాన్ని దాచవచ్చు. మీరు మీ థీమ్‌ను అనుకూలీకరించే ముందు, బ్యాకప్ కాపీని సృష్టించడానికి మీ థీమ్‌ను డూప్లికేట్ చేశారని నిర్ధారించుకోండి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్‌కు వెళ్లండి.

  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్ పక్కన ఉన్న, థీమ్‌ను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.

  3. డిఫాల్ట్ సందర్భంలో, హోమ్, ఉత్పత్తులు లేదా పేజీలు వంటి మీరు సమాచారాన్ని దాచాలనుకుంటున్న పేజీని ఎంచుకోవడానికి డ్రాప్-డౌన్ మెనుని ఉపయోగించండి.

  4. మీరు దాచాలనుకుంటున్న సమాచారాన్ని గుర్తించి, ఆపై కంటెంట్‌ను దాచడానికి కన్ను ఐకాన్‌ను క్లిక్ చేయండి.

  5. ఐచ్ఛికం: మీరు విక్రయించే ఉత్పత్తిని కొత్త కస్టమర్‌లకు లేదా తెలియని వారికి కనపడకుండా దాచిపెట్టి, లాగిన్ చేసిన మీ B2B కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంచాలనుకుంటే, ఆన్‌లైన్ స్టోర్ విక్రయాల ఛానెల్ నుండి ఉత్పత్తిని తీసివేయండి. మీరు బహుళ ఉత్పత్తులను దాచాలనుకుంటే, మీరు బల్క్ యాక్షన్‌లను ఉపయోగించవచ్చు.

  6. మీ వీక్షణను B2B సందర్భానికి మార్చండి మరియు లాగిన్ చేసిన B2B కస్టమర్‌లకు సంబంధిత సమాచారం అంతా ఇంకా అందుబాటులో ఉందో లేదో నిర్ధారించుకోండి.