Markets ఉపయోగించి B2B ద్వారా అంతర్జాతీయంగా విక్రయించడం
ఈ గైడ్ Marketsను ఉపయోగించే స్టోర్ల కోసం ఉద్దేశించబడింది. మీరు Marketsను ఉపయోగించకపోతే, దానికి బదులుగా B2B ద్వారా అంతర్జాతీయంగా విక్రయించడం విభాగాన్ని చూడండి.
Shopifyలోని Markets ఫీచర్ మీ అంతర్జాతీయ B2B విక్రయాలను నిర్వహించడానికి, అలాగే విస్తరించడానికి మీకు సహాయపడుతుంది. మీరు ఈ ఫంక్షనాలిటీతో కిందివాటిని చేయవచ్చు:
- కొత్త మార్కెట్లకు విస్తరించవచ్చు.
- వివిధ B2B మార్కెట్ల కోసం భాష, కరెన్సీ, డొమైన్లను కాన్ఫిగర్ చేయడం ద్వారా కస్టమర్ అనుభవాలను అనుకూలీకరించవచ్చు.
- మార్కెట్ ఆవశ్యకతలకు అనుగుణంగా షిప్పింగ్, డెలివరీ రేట్లను సెటప్ చేయవచ్చు, అలాగే షిప్పింగ్ ఆప్షన్లను రూపొందించవచ్చు.
ఈ పేజీలో
Marketsతో ఉన్న ఆర్డర్లు, డ్రాఫ్ట్ ఆర్డర్లలో స్థానిక కరెన్సీ
అంతర్జాతీయ విక్రయాల కోసం Marketsను ఉపయోగిస్తున్నప్పుడు, స్థానిక కరెన్సీ, ధరల నిర్ణయం అనేది కస్టమర్ ఆర్డర్‌తో అనుబంధించబడి ఉన్న మార్కెట్ ద్వారా నిర్ణయించబడతాయి.
ఆర్డర్‌తో అనుబంధించబడిన మార్కెట్, అలాగే పన్నులు, సుంకాలు అనేవి కస్టమర్ షిప్పింగ్ చిరునామా ద్వారా నిర్ణయించబడతాయి. ఆర్డర్‌కు ఒక కస్టమర్‌ను జోడించినప్పుడు, ధర అప్డేట్ అవుతుంది, అలాగే మీ కస్టమర్ మార్కెట్ కరెన్సీ ప్రదర్శించబడుతుంది.
స్టోర్ కరెన్సీ కాకుండా స్థానిక కరెన్సీని ప్రదర్శించే డ్రాఫ్ట్ ఆర్డర్లలో, మీరు డ్రాఫ్ట్ ఆర్డర్‌ను సృష్టించినప్పుడు విదేశీ మారకం రేటు లెక్కించబడుతుంది. మారకపు రేటు మారినా సరే ఈ రేటు స్థిరంగా ఉంటుంది, ఇన్వాయిస్లో ఉపయోగించబడుతుంది. అయితే, మీరు ఆర్డర్‌ను డ్రాఫ్ట్‌గా సేవ్ చేసి, ఆ తర్వాత ఎడిట్ చేసినట్లయితే, దాన్ని ఎడిట్ చేస్తున్న సమయానికి ఉన్న విదేశీ మారకపు రేటును బట్టి ఆర్డర్‌కు సంబంధించిన మొత్తం ధర అప్డేట్ చేయబడుతుంది.
మీరు డ్రాఫ్ట్ ఆర్డర్ కోసం వేరొక ధర, కరెన్సీని ఉపయోగించాలనుకుంటే, అప్పుడు ధరను మార్చి ఆర్డర్‌పై ధరను మార్చడం వలన కలిగే ఈ కింద పేర్కొన్న ప్రభావాలను రివ్యూ చేయండి:
- లొకేషన్ ఆధారంగా ఐటెమ్ ధరల నుండి పన్నులు చేర్చబడవచ్చు లేదా మినహాయించబడవచ్చు. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్ మార్కెట్‌తో ఉన్న ఆర్డర్లు ధరల నుండి పన్నులను మినహాయిస్తాయి, అయితే జర్మనీ మార్కెట్‌తో ఉన్న ఆర్డర్లు పన్నులను ధరలలో చేర్చుతాయి.
- పన్ను రేట్లు మార్కెట్‌ను బట్టి మారుతాయి. చెక్అవుట్లో, కస్టమర్ తమ షిప్పింగ్ చిరునామాను మార్కెట్‌కు వెలుపల ఉన్న చిరునామాకు మార్చినట్లయితే, అప్పుడు కస్టమర్ షిప్పింగ్ చిరునామాకు వర్తించే సరైన పన్ను రేటు ఛార్జ్ చేయబడుతుంది. ఆర్డర్‌పై పన్నును చేర్చిన లేదా మినహాయించిన సెట్టింగ్‌తో ఉన్న మార్కెట్ మారదు.
- ఒకవేళ మార్కెట్ విదేశీ మారకపు రేటును నిర్ణయించడానికి మీరు థర్డ్-పార్టీ సర్వీస్‌ను ఉపయోగిస్తే, ఆర్డర్ ధర అనేది ఆ సర్వీస్ అందించే మారకపు రేటు ద్వారా నిర్ణయించబడుతుంది. అయితే, మీ పేఅవుట్‌ను లెక్కించడానికి Shopify Payments ఉపయోగించే రేటు, Shopifyలో మీరు ఎంచుకున్న మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఆర్డర్‌పై ఛార్జ్ చేసిన మొత్తం, మీరు చెల్లింపులో స్వీకరించే మొత్తం భిన్నంగా ఉండవచ్చు. మరింత సమాచారం కోసం, కరెన్సీ మార్పిడులు, మారకం రేట్లును చూడండి.
- తయారీదారు సూచించిన రిటైల్ ధర (MSRP): కస్టమర్ మార్కెట్లో ఏదైనా ఉత్పత్తిని MSRP ధరకే మీరు విక్రయించాల్సి ఉండి, ఒకవేళ మీరు మార్కెట్లను మార్చి దానికి ప్రత్యామ్నాయ మార్కెట్ ధరను ఉపయోగిస్తే, అప్పుడు మీరు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది.
Marketsతో ఉన్న డ్రాఫ్ట్ ఆర్డర్‌కు కరెన్సీని మార్చడం
ఆటోమేటిక్‌గా, కస్టమర్‌ను జోడించడానికి ముందు మార్కెట్ విభాగం మీ బ్యాకప్ ప్రాంతం మార్కెట్‌ను ప్రదర్శిస్తుంది. ఒక చిరునామాతో కస్టమర్‌ను జోడించిన తర్వాత, దానికి సంబంధించిన మార్కెట్, కరెన్సీ ప్రదర్శించబడతాయి.
షిప్పింగ్ చిరునామాను జోడించిన తర్వాత, ఆ చిరునామాకు సరిపోలే అనుబంధిత మార్కెట్లతో పాటు ఆ మార్కెట్ కరెన్సీ ప్రదర్శించబడతాయి. డ్రాఫ్ట్ ఆర్డర్‌కు వర్తింపజేయడానికి మీరు వేరొక కరెన్సీని ఎంచుకోవచ్చు. మీరు ధరను మార్చడానికి ముందు, ధరను మార్చడం వలన కలిగే ప్రభావాన్ని తప్పకుండా రివ్యూ చేయండి.
మీరు ఆర్డర్లో కింది మార్పులలో దేనినైనా చేస్తే మినహా, ఆర్డర్ ధర అనేది సంబంధిత మార్కెట్ కరెన్సీలో ప్రదర్శించబడుతుంది:
- మీరు అనుకూల లైన్ ఐటెమ్ లేదా ఆర్డర్ తగ్గింపును జోడిస్తే, అప్పుడు తగ్గింపు విలువ స్టోర్ కరెన్సీలో ప్రదర్శించబడుతుంది.
- మీరు అనుకూల షిప్పింగ్ ధరను జోడిస్తే, ఆ ధర స్టోర్ కరెన్సీలో ప్రదర్శించబడుతుంది.
- మీరు అనుకూల ఐటెమ్‌ను జోడిస్తే, ఆ ధర స్టోర్ కరెన్సీలో ప్రదర్శించబడుతుంది.
ఈ మార్పులలో దేనినైనా చేసిన తర్వాత, ఆర్డర్‌పై ధర అనేది కస్టమర్ మార్కెట్ కరెన్సీలో ప్రదర్శించబడుతుంది.
Markets ఉపయోగించి బహుళ కరెన్సీలలో విక్రయించడం
మీరు Marketsతో స్థానిక కరెన్సీలను ఉపయోగించడం ద్వారా మీ కస్టమర్ల స్థానిక కరెన్సీలలో వారికి విక్రయించవచ్చు. ఆటోమేటిక్‌గా, మీ మార్కెట్ కోసం మీరు ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నారో ఆ ప్రాంతానికి చెందిన కరెన్సీకే ఒక మార్కెట్ కరెన్సీ సెట్ చేయబడుతుంది. అలాగే మీరు ఒక మార్కెట్‌కు వర్తింపజేయాలనుకుంటున్న కరెన్సీని కూడా ఎంచుకోవచ్చు, అంతేకాకుండా మీ ఆన్లైన్ స్టోర్, కార్ట్, చెక్అవుట్, డ్రాఫ్ట్ ఆర్డర్లలోని ధరలు మీ కస్టమర్ షిప్పింగ్ చిరునామా ఆధారంగా వారికోసం కాన్ఫిగర్ చేయబడిన కరెన్సీలోనే ప్రదర్శించబడతాయి. ఉదాహరణకు, మీరు ఉత్తర అమెరికా B2B మార్కెట్‌ను కలిగి ఉండి, దాని కరెన్సీని USDకి సెట్ చేసినట్లయితే, అప్పుడు కెనడాలోని కస్టమర్‌కు ఆన్లైన్ స్టోర్‌లో ధర USDలో ప్రదర్శించబడుతుంది. ఒకవేళ మీరు ఆ స్థానిక కరెన్సీ ప్రతిబింబించేలా సెట్టింగ్‌ని మార్చినట్లయితే, అదే కస్టమర్‌కు ఆన్లైన్ స్టోర్‌లో ధర CADలో ప్రదర్శించబడుతుంది.
మార్కెట్‌ను సృష్టించేటప్పుడు లేదా అనుకూలీకరించేటప్పుడు, ఆటోమేటిక్ కరెన్సీ మార్పిడిని ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు లేదా మాన్యువల్‌గా ఒక రేటును సెట్ చేయవచ్చు, అలాగే కరెన్సీ మార్పిడి కోసం రౌండింగ్ వర్తిస్తుందో లేదో నిర్ణయించవచ్చు. మార్కెట్ కోసం కరెన్సీని సెట్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.