Checkout Blocksలో బ్లాక్‌లను ఉపయోగించడం
UI ఎక్స్‌టెన్షన్‌లతో రూపొందించబడిన బ్లాక్‌లు, మీరు నేరుగా చెక్‌అవుట్, అకౌంట్ల ఎడిటర్‌లోకి లాగి వదిలేయగల (drag and drop) బ్లాక్‌లను అందించడం ద్వారా చెక్‌అవుట్‌ను అనుకూలీకరించడంలో మీకు సహాయపడతాయి. కొన్ని బ్లాక్ రకాలు సమాచారం, హెచ్చరిక బ్యానర్‌లు లేదా లైన్ ఐటెమ్ మెసేజింగ్ లాంటి విజువల్ అనుకూలీకరణ ఎలిమెంట్‌లను మీ చెక్‌అవుట్‌కు జోడిస్తాయి. ఇతర బ్లాక్ రకాలు మీ చెక్‌అవుట్‌కు లైన్ ఐటెమ్‌ల కోసం వేరియంట్ లేదా పరిమాణ సెలెక్టర్‌లు లేదా అదనపు సమాచారాన్ని ఎంచుకోవడానికి లేదా ఇన్‌పుట్ చేయడానికి కస్టమర్‌ల కోసం చెక్‌బాక్స్‌లు లేదా టెక్స్ట్ ఫీల్డ్‌ల లాంటి ఇంటరాక్టివ్ ఎలిమెంట్‌లను జోడిస్తాయి.
మీ చెక్‌అవుట్‌ను అనుకూలీకరించడానికి మీరు కోడ్‌ని ఉపయోగించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, మద్దతు ఉన్న కొన్ని Liquid సింటాక్స్‌లను ఉపయోగించి మీరు మీ బ్లాక్ కంటెంట్‌కు అధునాతన అనుకూలీకరణలను చేయవచ్చు. కొన్ని బ్లాక్‌లు (కస్టమ్ ఫీల్డ్‌ల బ్లాక్ లాంటివి) అదనపు డేటాను స్టోర్ చేయడానికి మెటాఫీల్డ్‌లను ఉపయోగిస్తాయి కాబట్టి, మీరు మెటాఫీల్డ్‌ల నేమ్‌స్పేస్‌లు, కీస్ గురించి మరింత తెలుసుకోవాలనుకోవచ్చు.