Checkout Blocks యాప్‌లో చెక్‌అవుట్ బ్లాక్‌లను సృష్టించడం

Checkout Blocks బహుళ రకాల బ్లాక్‌లకు మద్దతు ఇస్తుంది. మీరు మీ చెక్‌అవుట్‌కు జోడించాలనుకునే కంటెంట్ రకం, షరతులతో కూడిన డిస్‌ప్లే నియమాలను జోడించాలనుకుంటున్నారా, అలాగే ఏ పేజీలకు బ్లాక్‌ను జోడించాలనుకుంటున్నారు అనే వాటి ఆధారంగా బ్లాక్ రకం ఆధారపడి ఉంటుంది.

బ్లాక్ పనితీరు కారణంగా కొన్ని బ్లాక్‌లను నిర్దిష్ట చెక్‌అవుట్ పేజీలకు జోడించలేరు. ఉదాహరణకు, కస్టమ్ నోట్‌ను జోడించడం లేదా చెక్‌బాక్స్‌ను టిక్ చేయడం వంటి అదనపు సమాచారాన్ని ఇన్‌పుట్ చేయడానికి కస్టమ్ ఫీల్డ్ బ్లాక్ కస్టమర్‌పై ఆధారపడి ఉంటుంది. ఆర్డర్ పూర్తయ్యేలోపు ఈ సమాచారాన్ని తప్పక క్యాప్చర్ చేయాలి కాబట్టి, కస్టమ్ ఫీల్డ్‌ను థ్యాంక్ యు లేదా ఆర్డర్ స్టేటస్ పేజీ లాంటి కొనుగోలు తర్వాతి పేజీలకు జోడించడం సాధ్యపడదు.

Checkout Blocksలో అందుబాటులో ఉన్న బ్లాక్‌లు, వాటికి మద్దతు ఉన్న చెక్‌అవుట్ పేజీలు, మరియు ఒక్కో బ్లాక్ గురించిన క్లుప్తమైన వివరణను చూపే పట్టిక.
బ్లాక్మద్దతు ఉన్న పేజీలువివరణ
అడ్రస్ బ్లాకర్
  • చెక్‌అవుట్
అడ్రస్ ఫార్మాట్ నియమాల ఆధారంగా చెక్‌అవుట్‌ను నిరోధించండి.
కస్టమ్ ఫీల్డ్
  • చెక్‌అవుట్
నిబంధనలకు అంగీకరిస్తున్నట్లు తెలిపే చెక్‌బాక్స్ లేదా గిఫ్ట్ మెసేజింగ్ ఫీల్డ్ లాంటి కస్టమ్ ఫీల్డ్‌లను చెక్‌అవుట్‌లో చేర్చండి.
డైనమిక్ కంటెంట్
  • చెక్‌అవుట్
  • థ్యాంక్ యు
  • ఆర్డర్ స్టేటస్
మీరు సెట్ చేసిన షరతులతో కూడిన నియమాల ఆధారంగా టెక్స్ట్, బ్యానర్‌లు మరియు బటన్‌ల లాంటి కంటెంట్‌ను ప్రదర్శించండి.

ఈ బ్లాక్ Basic Shopify ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ ఉన్న వ్యాపారులకు అందుబాటులో ఉంటుంది, అలాగే దీన్ని థ్యాంక్ యు మరియు ఆర్డర్ స్టేటస్ పేజీలలో మాత్రమే ఉంచగలరు. చెక్‌అవుట్ పేజీలలో ఉంచాలంటే Shopify Plus ప్లాన్ అవసరం.
లైన్ ఐటెమ్ ఎడిట్
  • చెక్‌అవుట్
  • థ్యాంక్ యు
  • ఆర్డర్ స్టేటస్
వేరియంట్ లేదా పరిమాణ సెలెక్టర్‌ను చేర్చడం వంటి చెక్‌అవుట్ ఆర్డర్ సారాంశంలోని లైన్ ఐటెమ్‌లను ఎడిట్ చేయడానికి కస్టమర్‌లను అనుమతించండి. అలాగే ఇది లైన్ ఐటెమ్ కంటెంట్కు ఒక కంటైనర్‌గా కూడా పనిచేస్తుంది.
లైన్ ఐటెమ్ కంటెంట్
  • చెక్‌అవుట్
  • థ్యాంక్ యు
  • ఆర్డర్ స్టేటస్
ఫైనల్ సేల్ (Final sale) లాంటి నిర్దిష్ట లైన్ ఐటెమ్ మెసేజింగ్‌ను ప్రదర్శించండి.
షిప్పింగ్ మరియు చెల్లింపు ఐకాన్‌లు
  • చెక్‌అవుట్
మద్దతు ఉన్న షిప్పింగ్ మరియు చెల్లింపు పద్ధతుల కోసం ఐకాన్‌లను ప్రదర్శించండి.
స్టాటిక్ కంటెంట్
  • చెక్‌అవుట్
  • థ్యాంక్ యు
  • ఆర్డర్ స్టేటస్
డైనమిక్ కంటెంట్ బ్లాక్‌లలా కాకుండా, ఈ కంటెంట్ కస్టమర్‌లందరికీ ప్రదర్శించబడుతుంది మరియు టెక్స్ట్, బ్యానర్‌లకు మద్దతు ఇస్తుంది.

ఈ బ్లాక్ Basic Shopify ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ ఉన్న వ్యాపారులకు అందుబాటులో ఉంటుంది, అలాగే దీన్ని థ్యాంక్ యు మరియు ఆర్డర్ స్టేటస్ పేజీలలో మాత్రమే ఉంచగలరు. చెక్‌అవుట్ పేజీలలో ఉంచాలంటే Shopify Plus ప్లాన్ అవసరం.

బ్లాక్ రకం ఆధారంగా, మీరు Checkout Blocks యాప్‌లో బ్లాక్ వివరాలు మరియు సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయాల్సి రావచ్చు, ఆపై చెక్‌అవుట్ మరియు అకౌంట్స్ ఎడిటర్‌కు విడిగా ఆ బ్లాక్‌ను జోడించాల్సి ఉంటుంది. స్టాటిక్ కంటెంట్ బ్లాక్ వంటి కొన్ని సాధారణ బ్లాక్‌లు Checkout Blocks యాప్‌లో కాన్ఫిగర్ చేయబడవు, దానికి బదులుగా అవి పూర్తిగా చెక్‌అవుట్ మరియు అకౌంట్స్ ఎడిటర్‌లోనే సృష్టించబడి, కాన్ఫిగర్ చేయబడతాయి.

ఈ విభాగంలో