కాపీరైట్, ట్రేడ్‌మార్క్, ట్రేడ్ డ్రెస్ మధ్య తేడా ఏమిటి?

మేధో సంపత్తి (IP) అనేది పుస్తకాలు, వచనం, కోడ్, ఇమేజ్‌లు, వీడియోలు, లోగోలు, స్లోగన్‌లు వంటి సృజనాత్మక ప్రయత్నాల ద్వారా ఉత్పత్తి అయ్యే వాటిని సూచిస్తుంది. కాపీరైట్, ట్రేడ్‌మార్క్, ట్రేడ్ డ్రెస్ అన్నీ IPకి చెందిన రకాలే.

ఆన్‌లైన్ స్టోర్‌లోని ఫోటోలు లేదా వచన వివరణల వంటి ప్రత్యక్షమైన అసలు పనులను కాపీరైట్ రక్షిస్తుంది. ప్రాంతాలను బట్టి కాపీరైట్ చట్టాలు మారుతుంటాయి, అయితే సాధారణంగా పనిని సృష్టించిన సమయం నుండి కాపీరైట్ రక్షణ వర్తిస్తుంది.

Shopify కాపీరైట్ విధానం, కాపీరైట్ ఉల్లంఘనను నివేదించే విధానం, కాపీరైట్ నోటీసుకు ఎలా ప్రతిస్పందించాలి అనే విషయాల గురించి మరింత తెలుసుకోండి.

ట్రేడ్‌మార్క్, ట్రేడ్ డ్రెస్ అంటే ఏమిటి?

ఇతర వ్యాపారాలు లేదా ఉత్పత్తుల నుండి ఒక వ్యాపారాన్ని లేదా ఉత్పత్తిని ప్రత్యేకంగా గుర్తించే చిహ్నాలు లేదా పదాలనే ట్రేడ్‌మార్క్‌లు అంటారు. ఒక ఉత్పత్తిని ఇతరుల నుండి ప్రత్యేకంగా చూపే పరిమాణం, ఆకారం, రంగు, ఆకృతి వంటి లక్షణాలతో సహా ఉత్పత్తి రూపాన్ని ట్రేడ్ డ్రెస్ కవర్ చేస్తుంది. ఉత్పత్తుల మూలం లేదా పుట్టుక గురించి వినియోగదారులను గందరగోళానికి గురిచేసేలా ఇతరులు సారూప్య గుర్తులు లేదా ట్రేడ్ డ్రెస్‌ను ఉపయోగించడాన్ని నిరోధించే హక్కు సాధారణంగా ట్రేడ్‌మార్క్, ట్రేడ్ డ్రెస్ యజమానులకు ఉంటుంది.

Shopify ట్రేడ్‌మార్క్, ట్రేడ్ డ్రెస్ విధానం, ట్రేడ్‌మార్క్ లేదా ట్రేడ్ డ్రెస్ ఉల్లంఘనను నివేదించే విధానం, ట్రేడ్‌మార్క్ లేదా ట్రేడ్ డ్రెస్ నోటీసుకు ఎలా ప్రతిస్పందించాలి అనే విషయాల గురించి మరింత తెలుసుకోండి.