సమ్మతి లేకుండా తీసిన సన్నిహిత చిత్రాలను నివేదించడం లేదా తీసివేత నోటీసుకు ప్రతిస్పందించడం

ఈ పేజీలో, సమ్మతి లేకుండా తీసిన సన్నిహిత చిత్రాలపై (NCII) Shopify విధానం, తీసివేత అభ్యర్థనను ఎలా సమర్పించాలి, అలాగే మీ స్టోర్ నుండి కంటెంట్‌ను తీసివేస్తే ఎలా ప్రతిస్పందించాలి అనే వాటి గురించి సమాచారాన్ని మీరు కనుగొనవచ్చు.

NCIIకి Shopify ఎలా స్పందిస్తుంది

వర్తించే చట్టానికి అనుగుణంగా, స్టోర్‌లతో పాటు Shop వంటి తన ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడా కూడా సమ్మతి లేకుండా తీసిన సన్నిహిత చిత్రాలను (NCII) Shopify అనుమతించదు. NCII అనగా, చిత్రంలో ఉన్న వ్యక్తి అనుమతి లేకుండా పంచుకునే నగ్న లేదా లైంగిక చిత్రాలు. ఇందులో కిందివి ఉంటాయి:

  • నిజమైన ఫోటోగ్రాఫ్‌లు లేదా వీడియోలు
  • ఆ వ్యక్తికి సంబంధించిన అసలైన సన్నిహిత చిత్రం ఏదీ లేకపోయినా, గుర్తించదగిన వ్యక్తిని చూపే డీప్‌ఫేక్‌ల వంటి AI-జనరేటెడ్ లేదా డిజిటల్‌గా మార్చబడిన కంటెంట్

కంటెంట్ NCII కిందకు వస్తుందని Shopify నిర్ధారిస్తే, ఆ కంటెంట్ తీసివేయబడుతుంది.

NCIIని నివేదించడం

మీరు ఏదైనా స్టోర్‌లో లేదా Shopలో NCIIని గమనిస్తే, మీరు Shopifyకి తీసివేత అభ్యర్థనను సమర్పించవచ్చు.

నివేదికను ఎవరు సమర్పించగలరు

కింది సందర్భాల్లో మీరు NCII తీసివేత అభ్యర్థనను సమర్పించవచ్చు:

  • కంటెంట్‌లో ఉన్న వ్యక్తి మీరైతే, లేదా
  • కంటెంట్‌లో ఉన్న వ్యక్తి తరఫున వ్యవహరించడానికి మీకు అధికారం ఉంటే

నివేదికను ఎలా సమర్పించాలి

మీ నివేదికను సమర్పించడానికి ముందు, కంటెంట్ ప్రదర్శించబడుతున్న స్టోర్ పేజీ లేదా Shop లిస్టింగ్ URL మీకు అవసరం. నివేదికను సమర్పించడానికి, ఆన్‌లైన్‌లోని సమ్మతి లేకుండా తీసిన సన్నిహిత చిత్రాలను నివేదించండి ఫారమ్‌ను ఉపయోగించండి.

మీరు నివేదికను సమర్పించిన తర్వాత ఏమి జరుగుతుంది

NCII నివేదికలను Shopify ప్రాధాన్యతగా తీసుకుని సమీక్షిస్తుంది. అదనపు సమాచారాన్ని అభ్యర్థించడానికి Shopify ఫాలో అప్ చేయవచ్చు. ఒకవేళ కంటెంట్ NCII కిందకు వస్తే, అది తీసివేయబడుతుంది.

NCII తీసివేత నోటీసుకు ప్రతిస్పందించడం

NCII నివేదిక కారణంగా మీ స్టోర్ నుండి కంటెంట్‌ను Shopify తీసివేసినట్లయితే, మీరు ఆ నోటీసును సమీక్షించవచ్చు లేదా నిర్ణయంపై అప్పీల్ చేయవచ్చు.

నా స్టోర్ నుండి కంటెంట్ తీసివేయబడిందని నాకు ఒక నోటీసు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి?

ఒకవేళ NCII నివేదికకు ప్రతిస్పందనగా మీ స్టోర్ నుండి కంటెంట్‌ను Shopify తీసివేస్తే, ఏమి తీసివేయబడింది, ఎందుకు తీసివేయబడింది అని వివరిస్తూ మీ Shopify అడ్మిన్‌లో అలాగే ఇమెయిల్ ద్వారా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీ ముందు రెండు ఎంపికలు ఉంటాయి:

  • ఆ నోటీసును సమీక్షించి, కంటెంట్ మీ స్టోర్‌లో ఉండి ఉండకూడదని మీరు అంగీకరిస్తే, ఇక ఎటువంటి చర్య అవసరం లేదు.
  • పొరపాటున కంటెంట్ తీసివేయబడిందని మీరు భావిస్తే, మీరు ఆ నిర్ణయంపై అప్పీల్ చేయవచ్చు.

తీసివేత నిర్ణయంపై నేను ఎలా అప్పీల్ చేయాలి?

అప్పీల్ చేయడానికి, మీ Shopify అడ్మిన్‌లో లేదా ఇమెయిల్ ద్వారా మీకు వచ్చిన నోటిఫికేషన్‌లోని సూచనలను ఫాలో అవ్వండి. షరతుల ఉల్లంఘనలను పరిష్కరించడం గురించి మరింత తెలుసుకోండి.