ఆల్కహాల్ ఉత్పత్తులు
మీరు Shopify ద్వారా ఆల్కహాల్‌ను విక్రయించినప్పుడు, మీ వ్యాపారానికి వర్తించే చట్టాలు, నిబంధనలను మీరు పాటించాలి. ఏయే చట్టాలు, నిబంధనలు వర్తిస్తాయి అనేది మీ స్టోర్ ఉన్న ప్రాంతం, మీరు విక్రయాలు చేసే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. మీ వ్యాపారానికి వర్తించే ఆల్కహాల్ సంబంధిత చట్టాలు, నిబంధనల గురించి తెలుసుకోవడానికి ఈ పేజీలోని సమాచారాన్ని ఉపయోగించండి.
ఈ పేజీలో
- యునైటెడ్ స్టేట్స్ (US)లో ఆల్కహాల్‌ను విక్రయించడానికి చట్టాలు మరియు నిబంధనలు
- కెనడాలో ఆల్కహాల్‌ను విక్రయించడానికి చట్టాలు మరియు నిబంధనలు
- యూరోపియన్ యూనియన్ (EU)లో ఆల్కహాల్‌ను విక్రయించడానికి చట్టాలు మరియు నిబంధనలు
- యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో ఆల్కహాల్‌ను విక్రయించడానికి చట్టాలు మరియు నిబంధనలు
- ఆస్ట్రేలియాలో ఆల్కహాల్‌ను విక్రయించడానికి చట్టాలు మరియు నిబంధనలు
- న్యూజిలాండ్‌లో ఆల్కహాల్‌ను విక్రయించడానికి చట్టాలు మరియు నిబంధనలు
యునైటెడ్ స్టేట్స్ (US)లో ఆల్కహాల్‌ను విక్రయించడానికి చట్టాలు మరియు నిబంధనలు
మీ వ్యాపారం యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నట్లయితే, లేదా మీరు యునైటెడ్ స్టేట్స్‌లోని కస్టమర్‌లకు ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయిస్తుంటే, మీ ఆల్కహాల్ ఉత్పత్తులను ఎక్కడైతే అడ్వర్టయిజ్ చేస్తారో లేదా విక్రయిస్తారో ఆ అధికార పరిధిలోని అన్ని ఫెడరల్, రాష్ట్ర మరియు స్థానిక చట్టాలను మీరు తప్పక పాటించాలి.
యునైటెడ్ స్టేట్స్‌లో, ఆల్కహాల్ రాష్ట్ర స్థాయిలో భారీగా నియంత్రించబడుతుంది మరియు నిబంధనలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. మీరు ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయిస్తే లేదా రవాణా చేస్తే, మీరు వ్యాపారం చేసే రాష్ట్రాల మరియు మీ కస్టమర్‌ల రాష్ట్రాల చట్టాలను సమీక్షించాలి. ఆల్కహాల్‌ను విక్రయించడానికి ఈ సాధారణ అవసరాలను పరిగణించండి:
- మీ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి, మార్కెట్ చేయడానికి, విక్రయించడానికి మరియు డెలివరీ చేయడానికి అవసరమైన అన్ని లైసెన్స్‌లను విడివిడిగా పొందండి మరియు నిర్వహించండి.
- రికార్డులను భద్రపరిచే అవసరాలతో సహా, వర్తించే అన్ని లైసెన్స్ అవసరాలకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండండి.
- 21 ఏళ్లలోపు వారు ఆల్కహాల్ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా లేదా స్వీకరించకుండా ఉండేందుకు సమర్థవంతమైన వయస్సు ధృవీకరణ పద్ధతులను కలిగి ఉండండి.
- మీ వ్యాపారం మరియు మీ కస్టమర్ల అధికార పరిధిలో వర్తించే చట్టాలకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఆల్కహాల్ ఉత్పత్తులను రవాణా చేయండి, అలాగే డెలివరీ చేయండి. మీరు వేరొక రాష్ట్రానికి రవాణా చేస్తుంటే, మీరు ఆ రాష్ట్ర చట్టాలకు లోబడి ఉండాలి.
ప్రత్యేకించి Californiaలో ఆల్కహాల్‌ను విక్రయించడానికి, మీరు ఒక Prop 65 Alcohol Warning ఉత్పత్తి ప్రకటనను చూపవచ్చు.
యునైటెడ్ స్టేట్స్‌లో ఆల్కహాల్‌ను విక్రయించడం గురించి వనరులు
కింది వనరులతో సహా, యునైటెడ్ స్టేట్స్‌లో ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయించడం గురించి మీరు ఆన్‌లైన్‌లో నిర్దిష్ట సమాచారాన్ని కనుగొనవచ్చు:
కెనడాలో ఆల్కహాల్‌ను విక్రయించడానికి చట్టాలు మరియు నిబంధనలు
మీ వ్యాపారం కెనడాలో ఉన్నట్లయితే లేదా మీరు కెనడాలోని కస్టమర్‌లకు ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయిస్తుంటే, మీ ఆల్కహాల్ ఉత్పత్తులు అడ్వర్టయిజ్ చేయబడే, విక్రయించబడే లేదా డెలివరీ చేయబడే అధికార పరిధిలోని వర్తించే అన్ని ఫెడరల్ మరియు ప్రావిన్షియల్ చట్టాలను మీరు తప్పక పాటించాలి. ఆ ప్రావిన్స్‌లో మీ ఆల్కహాల్ ఉత్పత్తులు విక్రయించడానికి మీరు పాటించాల్సిన నిర్దిష్ట లేబులింగ్ అవసరాలు కూడా కొన్ని ప్రావిన్సుల్లో ఉండవచ్చు.
మీరు కెనడాలో ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయిస్తుంటే, కింది వనరులను తప్పక సమీక్షించండి:
- ఫుడ్ అండ్ డ్రగ్స్ యాక్ట్
- ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేషన్స్
- సేఫ్ ఫుడ్ ఫర్ కెనడియన్స్ యాక్ట్
- సేఫ్ ఫుడ్ ఫర్ కెనడియన్స్ రెగ్యులేషన్స్.
ఫెడరల్ స్థాయిలో, ప్యాకేజింగ్ మరియు లేబులింగ్ అవసరాలకు మీరు కట్టుబడి ఉండాలి. ఒక ఉత్పత్తిని ఒక నిర్దిష్ట రకమైన మద్యం వలె లేబుల్ చేయడానికి సంబంధించిన కూర్పు ప్రమాణాలు, మరియు భౌగోళికతకు సంబంధించిన IP రక్షణలు ఈ అవసరాలలో ఉంటాయి. ఉదాహరణకు, ఫ్రాన్స్‌లోని షాంపైన్ ప్రాంతం నుండి వచ్చే మెరిసే వైన్‌కు మాత్రమే "షాంపైన్" ఉపయోగించబడుతుంది.
ప్రతి ప్రావిన్షియల్ అధికార పరిధికి ఆల్కహాల్ విషయంలో వేర్వేరు నియమాలు ఉన్నాయి, సాధారణంగా ఉదహరించబడే కింది నిబంధనలే కాకుండా ఇతర నిబంధనలు కూడా ఉంటాయి:
- మద్యం సేవించడానికి చట్టబద్ధమైన వయస్సు అవసరాలు
- ఆల్కహాల్ పంపిణీ హక్కు కోసం లైసెన్సింగ్ అవసరాలు
- మద్యాన్ని ప్రమోట్ చేయడానికి మరియు మార్కెటింగ్ చేయడానికి విధానాలు
- రిజిస్ట్రేషన్ మరియు మార్కెటింగ్ విధానాలు
మీరు కెనడాలో ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయిస్తే లేదా రవాణా చేస్తే, సాధారణంగా ఉదహరించబడే కింది అవసరాలను పరిగణనలోకి తీసుకోండి:
- ఆల్బెర్టా, మానిటోబా మరియు క్యూబెక్‌లలో, చట్టబద్ధమైన మద్యపాన వయస్సు 18.
- బ్రిటిష్ కొలంబియా, న్యూ బ్రున్స్‌విక్, న్యూఫౌండ్‌ల్యాండ్ అండ్ లాబ్రడార్, నార్త్‌వెస్ట్ టెరిటరీస్, నోవా స్కోటియా, నునావట్, ఒంటారియో, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, సస్కట్చెవాన్ మరియు యుకాన్‌లలో చట్టబద్ధమైన మద్యపాన వయస్సు 19.
- ఉత్పత్తి లేదా దిగుమతి సమయంలో ఆల్కహాల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు విధించబడతాయి, వీటిని తయారీదారు లేదా దిగుమతిదారు చెల్లించాలి.
కెనడాలో ఆల్కహాల్‌ను విక్రయించడం గురించి వనరులు
కింది వనరులతో సహా, కెనడాలో ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయించడం గురించి మీరు ఆన్‌లైన్‌లో అదనపు నిర్దిష్ట సమాచారాన్ని కనుగొనవచ్చు:
యూరోపియన్ యూనియన్ (EU)లో ఆల్కహాల్‌ను విక్రయించడానికి చట్టాలు మరియు నిబంధనలు
మీ వ్యాపారం యూరోపియన్ యూనియన్‌లో ఉన్నట్లయితే, లేదా మీరు యూరోపియన్ యూనియన్‌లోని కస్టమర్‌లకు ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయిస్తుంటే, మీరు ఆల్కహాల్ ఉత్పత్తులను ఎక్కడైతే అడ్వర్టయిజ్ చేస్తారో లేదా విక్రయిస్తారో ఆ అధికార పరిధిలోని వర్తించే అన్ని చట్టాలను మీరు తప్పక పాటించాలి. యూరోపియన్ యూనియన్‌లో మీరు ఆల్కహాల్ ఉత్పత్తిని విక్రయించే ముందు, కింది చట్టాలు మరియు నిబంధనలను సమీక్షించాలి:
- రెగ్యులేషన్ (EU) No 1169/2011
- కౌన్సిల్ డైరెక్టివ్ 92/83/EEC
- మీరు ఉత్పత్తులను ఎక్కడ ఉత్పత్తి చేయాలని, మార్కెట్ చేయాలని, లేదా విక్రయించాలని భావిస్తున్నారో ఆ సభ్య దేశానికి సంబంధించిన చట్టాలు.
ప్రతి EU అధికార పరిధికి ఆల్కహాల్ విషయంలో వేర్వేరు అవసరాలు ఉన్నాయి, వ్యాపారుల కోసం సాధారణంగా ఉదహరించబడే కింది అవసరాలే కాకుండా ఇతర అవసరాలు కూడా ఉంటాయి:
- పదార్ధాల జాబితా మరియు పోషకాహార ప్రకటన వంటి అవసరమైన అన్ని వెల్లడింపులు మీ ఉత్పత్తుల లేబుల్‌ల మీద ఉండేలా చూసుకోండి.
- ఆల్కహాల్ మరియు ఆల్కహాలిక్ పానీయాలపై విధించే వర్తించే అన్ని ఎక్సైజ్ సుంకాలకు కట్టుబడి ఉండండి.
- సంబంధిత అధికార పరిధిలో చట్టబద్ధమైన వయస్సు లేని వారు ఆల్కహాల్ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా లేదా స్వీకరించకుండా ఉండేందుకు సమర్థవంతమైన వయస్సు ధృవీకరణ పద్ధతులను ఉపయోగించండి.
- మీరు మీ ఆల్కహాల్ ఉత్పత్తులను అడ్వర్టయిజ్ చేసే, మార్కెట్ చేసే మరియు విక్రయించే తీరు మీ అధికార పరిధిలోని మరియు మీ కస్టమర్ల అధికార పరిధిలోని అన్ని వర్తించే చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి.
యూరోపియన్ యూనియన్‌లో ఆల్కహాల్‌ను విక్రయించడం గురించి వనరులు
కింది వనరులతో సహా, యూరోపియన్ యూనియన్‌లో ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయించడం గురించి మీరు ఆన్‌లైన్‌లో నిర్దిష్ట సమాచారాన్ని కనుగొనవచ్చు:
యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో ఆల్కహాల్‌ను విక్రయించడానికి చట్టాలు మరియు నిబంధనలు
మీ వ్యాపారం యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నా, లేదా మీరు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కస్టమర్‌లకు ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయించినా, మీ ఆల్కహాల్ ఉత్పత్తులు అడ్వర్టైజ్ చేయబడే లేదా విక్రయించబడే ఏ అధికార పరిధిలోనైనా వర్తించే ఫెడరల్, కౌంటీ మరియు స్థానిక చట్టాలన్నింటినీ మీరు తప్పనిసరిగా పాటించాలి.
ఇంగ్లాండ్ మరియు వేల్స్‌లో ఇన్-స్టోర్ మరియు ఆన్‌లైన్ ద్వారా ఆల్కహాల్‌ను విక్రయించే లేదా సరఫరా చేసే వ్యాపారాలు, సంస్థలు మరియు వ్యక్తుల కోసం, మీరు Licensing Act 2003 నిర్దేశించిన నియమాలు మరియు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
మీరు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయించినా, పంపిణీ చేసినా లేదా రవాణా చేసినా, సర్వసాధారణంగా పేర్కొనబడే ఈ ఆవశ్యకతలను పరిగణనలోకి తీసుకోండి:
- ఆల్కహాల్‌ను విక్రయించడానికి అవసరమైన అన్ని లైసెన్స్‌లను పొందండి మరియు నిర్వహించండి.
- వర్తించే అన్ని లైసెన్స్ ఆవశ్యకతలను పూర్తిగా పాటించండి.
- 18 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తులు ఆల్కహాల్ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా లేదా స్వీకరించకుండా ఉండేందుకు సమర్థవంతమైన వయస్సు ధృవీకరణ పద్ధతులను ఉపయోగించండి. ఒక వ్యక్తి వయస్సును ధృవీకరించడంలో మీ వ్యాపారానికి సహాయపడటానికి మీరు PAS 1296: 2018 నిర్దేశించిన ప్రమాణాలను అనుసరించవచ్చు.
- మీ వ్యాపారం మరియు మీ కస్టమర్ల అధికార పరిధిలోని వర్తించే చట్టాలకు పూర్తిగా అనుగుణంగా ఆల్కహాల్ ఉత్పత్తులను రవాణా మరియు డెలివరీ చేయండి.
- దిగుమతి చేసుకున్న ఏదైనా ఆల్కహాల్‌లో అవసరమైతే, డ్యూటీ స్టాంప్ ఉండేలా చూసుకోండి.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆల్కహాల్ విక్రయానికి సంబంధించిన వనరులు
కింది వనరులతో సహా, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆల్కహాల్ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని మీరు ఆన్‌లైన్‌లో కనుగొనవచ్చు:
ఆస్ట్రేలియాలో ఆల్కహాల్ విక్రయించడానికి వర్తించే చట్టాలు మరియు నిబంధనలు
మీ వ్యాపారం ఆస్ట్రేలియాలో ఉన్నా, లేదా మీరు ఆస్ట్రేలియాలోని కస్టమర్‌లకు ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయించినా, మీ ఆల్కహాల్ ఉత్పత్తులు అడ్వర్టైజ్ చేయబడే లేదా విక్రయించబడే ఏ అధికార పరిధిలోనైనా వర్తించే రాష్ట్ర లేదా ప్రాదేశిక చట్టాలన్నింటినీ మీరు తప్పనిసరిగా పాటించాలి.
మీరు ఆల్కహాల్ ఉత్పత్తులను అడ్వర్టైజ్ చేయడానికి వర్తించే యాడ్ ప్రమాణాల మార్గదర్శకాలు మరియు ABAC బాధ్యతాయుత ఆల్కహాల్ మార్కెటింగ్ కోడ్‌ను రివ్యూ చేయాలి.
ఆస్ట్రేలియాలోని ప్రతి రాష్ట్రం లేదా భూభాగానికి ఆల్కహాల్ గురించి వేర్వేరు ఆవశ్యకతలు ఉన్నాయి. కింది సర్వసాధారణ ఆవశ్యకతలను పరిగణనలోకి తీసుకోండి:
- 18 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తులు ఆల్కహాల్ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా లేదా స్వీకరించకుండా ఉండేందుకు సమర్థవంతమైన వయస్సు ధృవీకరణ పద్ధతులను కలిగి ఉండండి.
- ప్యాకేజింగ్ మరియు లేబులింగ్ ఆవశ్యకతలను పాటించండి.
- మీ వ్యాపారం మరియు మీ కస్టమర్ల అధికార పరిధిలోని వర్తించే చట్టాలకు పూర్తిగా అనుగుణంగా ఆల్కహాల్ ఉత్పత్తులను రవాణా మరియు డెలివరీ చేయండి.
- మీరు ఆల్కహాల్ ఉత్పత్తులను అడ్వర్టైజ్, మార్కెట్ మరియు విక్రయించే విధానం, మీ అధికార పరిధి మరియు మీ కస్టమర్ల అధికార పరిధిలోని అన్ని చట్టపరమైన ఆవశ్యకతలకు కట్టుబడి ఉండేలా చూసుకోండి.
ఆస్ట్రేలియాలోని ఆల్కహాల్ చట్టాల గురించి మరింత తెలుసుకోండి.
న్యూజిలాండ్‌లో ఆల్కహాల్ విక్రయించడానికి వర్తించే చట్టాలు మరియు నిబంధనలు
మీ వ్యాపారం న్యూజిలాండ్‌లో ఉన్నా, లేదా మీరు న్యూజిలాండ్‌లోని కస్టమర్‌లకు ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయించినా, మీ ఆల్కహాల్ ఉత్పత్తులు అడ్వర్టైజ్ చేయబడే లేదా విక్రయించబడే ఏ అధికార పరిధిలోనైనా వర్తించే ఫెడరల్ మరియు స్థానిక చట్టాలన్నింటినీ మీరు తప్పనిసరిగా పాటించాలి.
మీరు న్యూజిలాండ్‌లో ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయిస్తే, మీరు సేల్ అండ్ సప్లై ఆఫ్ ఆల్కహాల్ యాక్ట్, 2012తో పాటుగా వర్తించే ఇతర చట్టాలను తప్పనిసరిగా రివ్యూ చేయాలి.
మీరు న్యూజిలాండ్‌లో ఆల్కహాల్ ఉత్పత్తులను విక్రయించినా, పంపిణీ చేసినా లేదా రవాణా చేసినా, సర్వసాధారణంగా పేర్కొనబడే ఈ ఆవశ్యకతలను పరిగణనలోకి తీసుకోండి:
- 18 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తులు ఆల్కహాల్ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా లేదా స్వీకరించకుండా ఉండేందుకు సమర్థవంతమైన వయస్సు ధృవీకరణ పద్ధతులను కలిగి ఉండండి.
- మీ ప్రమోషన్‌లు మరియు మార్కెటింగ్ మెటీరియల్‌లు అధిక ఆల్కహాల్ వినియోగం మరియు తక్కువ వయసు వారు మద్యపానం చేయడాన్ని ప్రోత్సహించడాన్ని పరిమితం చేసేలా చూసుకోండి.
- మీ వ్యాపారం మరియు మీ కస్టమర్ల అధికార పరిధిలోని వర్తించే చట్టాలకు పూర్తిగా అనుగుణంగా ఆల్కహాల్ ఉత్పత్తులను రవాణా మరియు డెలివరీ చేయండి.
న్యూజిలాండ్‌లో ఆల్కహాల్ విక్రయానికి సంబంధించిన వనరులు
కింది వనరులతో సహా, న్యూజిలాండ్‌లో ఆల్కహాల్ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని మీరు ఆన్‌లైన్‌లో కనుగొనవచ్చు: