వినియోగదారుల రక్షణ చట్టాలు
మీరు Shopify ద్వారా ఉత్పత్తులను విక్రయించినప్పుడు, మీ వ్యాపారానికి వర్తించే వినియోగదారు రక్షణ చట్టాలు మరియు నిబంధనలకు మీరు లోబడి ఉండాలి. ఈ చట్టాలు సాధారణంగా మీరు ఎలా అడ్వర్టైజ్ చేయగలరు, కస్టమర్‌లు లోపభూయిష్ట ఉత్పత్తులను ఎలా వాపసు చేయవచ్చు మరియు ఉత్పత్తి భద్రత ఇంకా రీకాల్ ప్రమాణాల వంటి అంశాలను కవర్ చేస్తాయి.
మీ ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయవచ్చు మరియు కొత్త కస్టమర్‌లను చేరుకోవచ్చు. మీరు గ్లోబల్‌గా విక్రయించినప్పుడు, మీ స్టోర్ లొకేషన్‌కు సంబంధించిన చట్టాలకు మరియు మీరు రవాణా చేసే ప్రదేశాల చట్టాలకు మీరు లోబడి ఉండాలి. మీ వ్యాపారానికి వర్తించే కొన్ని వినియోగదారుల రక్షణ చట్టాల గురించి తెలుసుకోవడానికి ఈ పేజీలోని సమాచారాన్ని ఉపయోగించండి.
మీకు వర్తించే చట్టాలు మీ స్టోర్ ఉన్న ప్రాంతం మరియు మీరు విక్రయించే ప్రాంతాలపై ఆధారపడి ఉంటాయి.
మీ Shopify స్టోర్‌ను అంతరాయం లేకుండా ఉపయోగించడానికి, మీరు వ్యాపారం నిర్వహించే ఏ అధికార పరిధిలోనైనా వినియోగదారు రక్షణ చట్టాలను అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి.
ఈ పేజీలో
సంప్రదింపు సమాచారం
Shopify సేవా నిబంధనల ప్రకారం, మీ ఆన్‌లైన్ స్టోర్‌లో మీరు ప్రస్తుత మరియు ఖచ్చితమైన సంప్రదింపు సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. ఈ సమాచారంలో ఇవి ఉండాలి:
- మీ వ్యాపారం పేరు
- ఏవైనా ప్రశ్నలు, ఫిర్యాదులు లేదా క్లెయిమ్‌లతో కస్టమర్‌లు మిమ్మల్ని సంప్రదించడానికి ఉపయోగించే ఇమెయిల్ అడ్రస్ మరియు ఫోన్ నంబర్
- మీ వ్యాపారానికి సంబంధించిన భౌతిక చిరునామా
మీ సంప్రదింపు సమాచారం పబ్లిక్‌కు కనిపించేలా మరియు సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుగా ఉండాలి.
మీరు మీ ఆన్‌లైన్ స్టోర్‌కు స్టోర్ విధానాలను జోడించవచ్చు, లేదా మీరు మమ్మల్ని సంప్రదించండి పేజీని జోడించవచ్చు.
మీ వెబ్‌సైట్ కోసం కింది విధానాలను సులభంగా సృష్టించడానికి మీరు ఉచితంగా లభించే ఈ Shopify పాలసీ జనరేటర్ టూల్స్ మరియు వనరులను ఉపయోగించవచ్చు:
యూరోపియన్ ఆర్థిక ప్రాంతం వారి సంప్రదింపు సమాచార ఆవశ్యకతలు
మీరు యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలో ఉన్న లేదా అక్కడికి షిప్పింగ్ చేస్తున్న వ్యాపారి అయితే, లేదా యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న వ్యాపారి అయితే, మీ ఆన్‌లైన్ స్టోర్‌లో మీ కంపెనీ నంబర్ మరియు విలువ ఆధారిత పన్ను (VAT) నంబర్‌ను చేర్చడం తప్పనిసరి.
యూరోపియన్ ఆర్థిక ప్రాంతం నుండి లేదా దానికి ఉత్పత్తులను విక్రయించడానికి సంబంధించి కింది చట్టాలను సమీక్షించండి:
రీఫండ్ విధానం
Shopify సేవా నిబంధనల ప్రకారం, మీ ఆన్‌లైన్ స్టోర్‌లో మీ రీఫండ్ విధానం గురించి అప్‌డేట్ చేయబడిన, ఖచ్చితమైన, పబ్లిక్‌గా కనిపించే, ఇంకా సులభంగా యాక్సెస్ చేయగల సమాచారాన్ని మీరు తప్పనిసరిగా అందించాలి.
మీ రీఫండ్ విధానంలో కింది సమాచారం ఉండాలి:
- ఉత్పత్తిని రిటర్న్ చేయాల్సిన గడువు సమయం.
- రిటర్న్‌ను పంపాల్సిన చిరునామా.
- ఉత్పత్తిని రిటర్న్ చేయడానికి అయ్యే ఖర్చు, మరియు ఆ రిటర్న్ ఖర్చును ఎవరు చెల్లిస్తారు.
- మీ లొకేషన్‌కు సంబంధించి కస్టమర్ ఎక్కడ నివసిస్తున్నారు అనే దానిపై ఆధారపడి, రీఫండ్ పొందడానికి పట్టే సమయం ఎలా ఉండవచ్చనే దాని గురించిన సమాచారం.
- ఒకవేళ కస్టమర్‌కు సకాలంలో రీఫండ్ అందకపోతే, వారు మిమ్మల్ని సంప్రదించడానికి ఉపయోగించగల సంప్రదింపు సమాచారం.
మీ ఆన్‌లైన్ స్టోర్‌కు రీఫండ్, గోప్యత, సేవా నిబంధనలు, షిప్పింగ్ లేదా చట్టబద్ధమైన స్టోర్ విధానం లాంటి స్టోర్ విధానాలను జోడించడం గురించి మరింత తెలుసుకోండి.
యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలో రీఫండ్ విధాన ఆవశ్యకతలు
మీరు యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలో ఉన్న వ్యాపారి అయితే, లేదా యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న వ్యాపారి అయితే, మీ రీఫండ్ విధానం ద్వారా యూరోపియన్ ఆర్థిక ప్రాంత వినియోగదారులకు ఉపసంహరణ హక్కు మరియు వస్తువుల అనుగుణ్యతతో సహా వారి ప్రాథమిక హక్కుల గురించిన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి.
యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలోని వినియోగదారులకు ఉత్పత్తులను విక్రయించడానికి సంబంధించిన కింది చట్టాలను సమీక్షించండి:
ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ మరియు డెలివరీ
Shopify సేవా నిబంధనల ప్రకారం, మీరు పబ్లిక్‌గా కనిపించే సంప్రదింపు సమాచారం, రీఫండ్ విధానం మరియు ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ టైమ్‌లైన్‌లను మీ స్టోర్‌కు తప్పనిసరిగా జోడించాలి. మీ కస్టమర్ కొనుగోలును పూర్తి చేయడానికి ముందే, వారి ఆర్డర్ చేరడానికి ఎంత సమయం పడుతుందనేది వారికి స్పష్టంగా తెలియాలి.
మీరు కింది సమాచారాన్ని మీ కస్టమర్‌లకు తెలియజేయాలి:
- కస్టమర్ ఆర్డర్‌లో ఏవైనా మార్పులు లేదా ఆలస్యం ఉన్నట్లయితే.
- మీరు వేరొక దేశం నుండి వారికి షిప్పింగ్ చేస్తున్నందున, ఒకవేళ దిగుమతి రుసుములు లేదా కస్టమ్స్ ఛార్జీలు విధించబడే అవకాశం ఉంటే.
ఆర్డర్‌లను ఫుల్‌ఫిల్ చేయడానికి మీరు డ్రాప్‌షిప్పింగ్ లేదా వేరొక థర్డ్-పార్టీ సేవను ఉపయోగిస్తున్నట్లయితే, ఉత్పత్తులు వేరొక లొకేషన్ నుండి ఒక థర్డ్-పార్టీ ద్వారా షిప్పింగ్ చేయబడతాయని మీ కస్టమర్‌లకు తెలియజేయాలి.
యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలో ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ మరియు డెలివరీ ఆవశ్యకతలు
ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్, షిప్పింగ్ సమాచారం, అలాగే దిగుమతి లేదా కస్టమ్స్ ఛార్జీల వెల్లడికి సంబంధించి యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలో చట్టాలు ఉన్నాయి, వాటికి కింది ఉదాహరణలు ఉన్నాయి:
ఉత్పత్తి పనితీరు, మార్కెటింగ్, మరియు ధర నిర్ణయానికి సంబంధించిన క్లెయిమ్‌లు
మీ స్టోర్‌లో మీరు విక్రయించే ఉత్పత్తులు, సేవల గురించి మీరు చేసే క్లెయిమ్‌లు సత్యంగా ఉండాలని Shopify సేవా నిబంధనలు కోరుతున్నాయి. కొన్ని అధికార పరిధుల్లో, మీ ఉత్పత్తుల గురించి మీరు చేసే మార్కెటింగ్ లేదా పనితీరు క్లెయిమ్‌లకు సంబంధించి చట్టం కఠినమైన నియమాలను విధించవచ్చు.
ఉత్పత్తికి ఉన్న ప్రజాదరణ మరియు లభ్యత గురించిన క్లెయిమ్‌లు స్పష్టంగా మరియు ఖచ్చితంగా ఉండాలి. మోసపూరితమైన లేదా తప్పుదారి పట్టించే అవకాశమున్న మార్కెటింగ్‌లో కింది ఉదాహరణలు చేరి ఉంటాయి:
- వాస్తవానికి ఎక్కువ ఐటెమ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, "కేవలం [x] ఐటెమ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి" వంటి పరిమిత స్టాక్ నోటిఫికేషన్‌లను పంపడం
- క్లెయిమ్ నిజం కానప్పుడు, “కేవలం [x] గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి” వంటి కౌంట్‌డౌన్ టైమర్‌లను చూపించడం
- నిజం కానప్పుడు, “ఈ రోజు [x] మంది వ్యక్తులు ఈ ఉత్పత్తిని కొనుగోలు చేశారు” అంటూ ఒక నిర్దిష్ట ఉత్పత్తిని ఎంత మంది కొనుగోలు చేశారనే దాని గురించిన క్లెయిమ్‌లు చేయడం
యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలో ఉత్పత్తి పనితీరు, మార్కెటింగ్, మరియు ధర నిర్ణయ క్లెయిమ్‌ల ఆవశ్యకతలు
మీరు యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలో ఉన్న వ్యాపారి అయితే, లేదా యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న వ్యాపారి అయితే, కింది నియమాలను పరిగణనలోకి తీసుకోండి:
- మీ ఉత్పత్తి పనితీరు, మార్కెటింగ్, మరియు ధర నిర్ణయ క్లెయిమ్‌లలో, మీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయించబడే ఉత్పత్తుల కోసం చూపించే తుది ధరలలో VAT మరియు దిగుమతి సుంకాలను మీరు తప్పనిసరిగా చేర్చాలి.
- మీరు తగ్గింపు లేదా ధర తగ్గింపును అందిస్తున్నట్లయితే, ఆ ఉత్పత్తి మునుపటి ధరను మీరు స్పష్టంగా సూచించాలి. తప్పుదారి పట్టించే లేదా దూకుడుగా ఉండే మార్కెటింగ్ క్లెయిమ్‌లను కూడా యూరోపియన్ చట్టం నిషేధిస్తుంది. యూరోపియన్ ప్రైసింగ్ ఇండికేషన్ డైరెక్టివ్ గురించి మరింత తెలుసుకోండి.
యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలోని వినియోగదారులకు ఉత్పత్తులను విక్రయించడానికి సంబంధించిన కింది చట్టాలను సమీక్షించండి:
ఉత్పత్తి రీకాల్స్
రీకాల్ చేయబడిన ఉత్పత్తుల గురించి అనేక దేశాల్లో నిబంధనలు ఉన్నాయి. కస్టమర్ ఆరోగ్యం మరియు భద్రతకు హాని కలిగిస్తాయని నిర్ధారించినప్పుడు సాధారణంగా ఉత్పత్తులు రీకాల్ చేయబడతాయి. మీరు వ్యాపారం నిర్వహించే ఏ అధికార పరిధిలోనైనా రీకాల్‌లకు సంబంధించిన చట్టపరమైన ఆవశ్యకతలకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీదే. మీ స్టోర్ లొకేషన్, అలాగే మీ కస్టమర్‌ల లొకేషన్‌ల ఆధారంగా, మీరు కింది చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని దీని అర్థం:
- మీరు విక్రయించే, లేదా గతంలో విక్రయించిన ఉత్పత్తిని రీకాల్ చేసినట్లయితే, రీకాల్ చేయబడిన ఆ ఉత్పత్తులను మీ ఆన్‌లైన్ స్టోర్ నుండి మీరు వెంటనే తీసివేయాలి.
- ఒకవేళ చట్టపరంగా అవసరమైతే, ఆ చట్టాలకు అనుగుణంగా రీకాల్ చేయబడిన ఉత్పత్తిని కొనుగోలు చేసిన కస్టమర్‌లకు మీరు నోటిఫై చేయాలి.
కింది ప్రభుత్వ వెబ్‌సైట్‌ల వంటి వాటి ద్వారా మీరు ఉత్పత్తి రీకాల్స్ గురించిన నిర్దిష్ట సమాచారాన్ని ఆన్‌లైన్‌లో కనుగొనవచ్చు:
- ఆసియా-పసిఫిక్: అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN) ప్రొడక్ట్ అలర్ట్‌లు
- యూరోపియన్ యూనియన్: ప్రమాదకరమైన ఉత్పత్తుల కోసం యూరోపియన్ రాపిడ్ అలర్ట్ సిస్టమ్ (RAPEX)
- OECD: ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్స్ (OECD) ఉత్పత్తి రీకాల్స్ పై గ్లోబల్ పోర్టల్
- యునైటెడ్ స్టేట్స్: Recalls.gov
వినియోగదారుల రక్షణ వనరులు
కింది ఉదాహరణలతో సహా ఏదైనా అధికార పరిధికి చెందిన వినియోగదారుల అవగాహన మార్గదర్శకాల గురించి నిర్దిష్ట సమాచారాన్ని మీరు ఆన్‌లైన్‌లో కనుగొనవచ్చు:
యూరోపియన్ ఆర్థిక ప్రాంతం (EEA) చట్టం ఎప్పుడు వర్తిస్తుంది
మీరు యూరోపియన్ ఆర్థిక ప్రాంతం (EEA) వెలుపల ఉండి, EEAలోని కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లయితే, ఈ చట్టాలు మీకు వర్తించవచ్చు. ఉదాహరణకు, మీరు EEA దేశంలోని స్థానిక మీడియాను ఉపయోగించి ప్రకటనలు చేసినా, ఇంగ్లీష్ కాకుండా స్థానిక EEA భాషను ఉపయోగించినా లేదా EEA ఆధారిత డొమైన్ పేరుతో వెబ్‌సైట్‌ను సృష్టించినా కూడా ఈ చట్టాలు మీకు వర్తించవచ్చు.