డిస్కౌంట్ రకాలు
మీ Shopify స్టోర్‌లో అమ్మకాలను పెంచడానికి, కస్టమర్‌లకు రివార్డ్ ఇవ్వడానికి, ప్రమోషన్‌లను మేనేజ్ చేయడంలో సహాయపడే ఫ్లెక్సిబుల్ డిస్కౌంట్ ఆప్షన్‌లను మీరు సృష్టించవచ్చు. ఈ డిస్కౌంట్‌లను మీ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్‌లు, వెబ్‌సైట్ కాపీలలోనూ, మరియు ఉత్పత్తి పేజీలు లేదా మీ ఆన్‌లైన్ స్టోర్ కార్ట్‌లోని అప్‌సెల్ వ్యూహాలలోనూ ఉపయోగించవచ్చు.
మీరు డిస్కౌంట్‌లను అనేక రకాలుగా అందించవచ్చు, అనగా ఆర్డర్‌పై నిర్దిష్ట మొత్తాల తగ్గింపును అందించడం, ఉచిత షిప్పింగ్‌ను అందించడం లేదా కొన్ని నిర్దిష్ట ఆర్డర్ వాల్యూమ్‌ల వద్ద మాత్రమే డిస్కౌంట్‌లను అందించడం లాంటివి. మీ స్టోర్ ద్వారా మీరు ఏ డిస్కౌంట్‌లను అందించవచ్చో తెలుసుకోవడానికి కింది రకాలను రివ్యూ చేయండి:
- మొత్తం తగ్గింపు డిస్కౌంట్‌లు: ఈ డిస్కౌంట్‌ల ద్వారా 25% లేదా $50 USD లాగా ఒక ఆర్డర్‌పై శాతాన్ని లేదా స్థిరమైన మొత్తాన్ని తగ్గించవచ్చు. ఈ డిస్కౌంట్ ఒక నిర్దిష్ట ఉత్పత్తికి, ఉత్పత్తుల కలెక్షన్‌కు లేదా మొత్తం ఆర్డర్‌కు వర్తించవచ్చు.
- Xని కొనుగోలు చేస్తే Y పొందే డిస్కౌంట్‌లు: ఈ డిస్కౌంట్‌ల ద్వారా మీరు కస్టమర్ ఒక డిస్కౌంట్ పొందడానికి నిర్దిష్ట కొనుగోలు ఆవశ్యకతలను సెట్ చేయవచ్చు. వీటిని డిస్కౌంట్ కోడ్‌ల లాగా లేదా కస్టమర్‌లు ఆవశ్యకతలను తీర్చినప్పుడు వారి కార్ట్‌కు ఆటోమేటిక్‌గా వర్తించే డిస్కౌంట్‌ల లాగా కూడా అప్లై చేయవచ్చు.
- ఉచిత షిప్పింగ్ డిస్కౌంట్‌లు: నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కస్టమర్‌ల కోసం ఉచిత షిప్పింగ్‌ను సెటప్ చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. చాలా ఖరీదైన షిప్పింగ్ ఆప్షన్‌లకు డిస్కౌంట్ ఇవ్వడాన్ని నివారించడానికి, నిర్దిష్ట మొత్తాన్ని మించిన షిప్పింగ్ రేట్లను కూడా మీరు మినహాయించవచ్చు.
మీ స్టోర్‌కు టైర్డ్ డిస్కౌంట్‌లు, మల్టీ-లాజిక్ స్టెప్ డిస్కౌంట్‌లు లేదా కస్టమ్ అర్హత ఆవశ్యకతలు లాంటి మరింత అధునాతన డిస్కౌంట్ సొల్యూషన్‌లు అవసరమైతే, కింది ఆప్షన్‌లను రివ్యూ చేయండి:
- మీరు Shopify App Store నుండి డిస్కౌంట్ కోడ్ యాప్‌లను ఉపయోగించవచ్చు.
- ఒకవేళ మీ స్టోర్ Shopify Plus ప్లాన్‌లో ఉంటే, Checkout Blocksను ఉపయోగించడాన్ని పరిగణించండి.
మీ కస్టమర్‌లకు ఒకే ఆటోమేటిక్ డిస్కౌంట్‌ను లేదా ఆర్డర్‌పై ఒకటి కంటే ఎక్కువ డిస్కౌంట్ ఆదాలను వర్తింపజేసే ఒకే డిస్కౌంట్ కోడ్‌ను అందించడానికి మీరు అనుకూలమైన థర్డ్-పార్టీ డిస్కౌంట్‌ల యాప్‌ని కూడా ఉపయోగించవచ్చు లేదా మీ స్వంత కస్టమ్ యాప్‌ను సృష్టించవచ్చు. ఉదాహరణకు, మీరు ఆర్డర్‌పై 10% తగ్గింపుతో పాటు ఉచిత షిప్పింగ్‌ను కూడా ఒకే సమయంలో అందించే ఒకే డిస్కౌంట్‌ని కలిగి ఉండవచ్చు.