యాప్‌లతో తగ్గింపులను సృష్టించడం
Shopifyలో అందుబాటులో ఉన్న డిఫాల్ట్ తగ్గింపు రకాలకు అదనంగా, మీరు యాప్‌ని ఉపయోగించి ఇతర రకాల తగ్గింపులను సృష్టించవచ్చు.
థర్డ్-పార్టీ యాప్ లేదా కస్టమ్ యాప్‌తో మీరు సృష్టించగల తగ్గింపుల కింది ఉదాహరణలను రివ్యూ చేయండి:
- కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల మొత్తం ఖర్చు ఆధారంగా ఆర్డర్ షిప్పింగ్ ఖర్చుపై కొంత మొత్తాన్ని తగ్గించే తగ్గింపు.
- ఆర్డర్‌పై 10% తగ్గింపు, అదే సమయంలో ఉచిత షిప్పింగ్‌ను అందించడం వంటి ఒకటి కంటే ఎక్కువ తగ్గింపు ఆదాలను కలిగి ఉండే సింగిల్ తగ్గింపు.
యాప్‌తో మీ స్వంత తగ్గింపును సృష్టించండి
యాప్‌ను ఉపయోగించి మీరు Shopify అడ్మిన్‌లో ఇతర రకాల తగ్గింపులను సృష్టించవచ్చు. కొన్ని థర్డ్-పార్టీ యాప్‌లతో, మీరు మీ తగ్గింపులను యాప్ సెట్టింగ్‌లలో సృష్టించాల్సి రావచ్చు.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, డిస్కౌంట్‌లకు వెళ్లండి.
తగ్గింపును సృష్టించండి క్లిక్ చేయండి.
తగ్గింపు రకాన్ని ఎంచుకోండి డైలాగ్‌లో, మీరు ఉపయోగించే యాప్ నుండి మీకు కావాల్సిన తగ్గింపు రకాన్ని ఎంచుకోండి.
మీ తగ్గింపును సెటప్ చేసి, ఆపై తగ్గింపును సేవ్ చేయండిని క్లిక్ చేయండి.
మీరు ఏ తగ్గింపులను యాప్‌తో సృష్టించారో చెక్ చేయడానికి, మీరు మీ Shopify అడ్మిన్‌లోని డిస్కౌంట్‌ల విభాగంలో తగ్గింపుపై హోవర్ చేయవచ్చు, అప్పుడు యాప్ బ్యాడ్జ్, టూల్‌టిప్ వచనం ప్రదర్శించబడతాయి.
బహుళ ఆదాలు ఉన్న సింగిల్ తగ్గింపులు
అనుకూలమైన థర్డ్-పార్టీ డిస్కౌంట్‌ల యాప్‌ని ఉపయోగించి మీరు బహుళ ఆదాలు ఉన్న సింగిల్ తగ్గింపులను సృష్టించవచ్చు లేదా మీరు మీ స్వంత కస్టమ్ యాప్‌ను సృష్టించవచ్చు. కార్ట్ లేదా చెక్‌అవుట్‌లో ప్రదర్శించినప్పుడు ఒకటి కంటే ఎక్కువ తగ్గింపు ఆదాలను కలిగి ఉండే సింగిల్ ఆటోమేటిక్ డిస్కౌంట్ లేదా సింగిల్ డిస్కౌంట్ కోడ్‌ను మీరు మీ కస్టమర్‌లకు అందించవచ్చు.
అనుకూలమైన థర్డ్-పార్టీ యాప్ లేదా కస్టమ్ యాప్‌తో మీరు సృష్టించగల బహుళ ఆదాలు ఉన్న సింగిల్ తగ్గింపుల కింది ఉదాహరణలను రివ్యూ చేయండి:
- ఆర్డర్‌పై 10% తగ్గింపు, ఉచిత షిప్పింగ్ తగ్గింపును అందించే
WELCOME10డిస్కౌంట్ కోడ్. - ఒకే కలెక్షన్ నుండి నిర్దేశించిన సంఖ్యలో ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు, ప్రతి ఉత్పత్తి ధరపై 10% తగ్గింపుతో పాటు, లాయల్టీ బోనస్‌గా మొత్తం ఆర్డర్ ఖర్చుపై అదనంగా $10 USD తగ్గింపును ఇచ్చే ఆటోమేటిక్ డిస్కౌంట్.

మీరు డ్రాఫ్ట్ ఆర్డర్‌కు బహుళ ఆదాలు ఉన్న సింగిల్ డిస్కౌంట్ కోడ్‌ను కూడా వర్తింపజేయవచ్చు.
తగ్గింపు తరగతులను వీక్షించడం
మీరు బహుళ ఆదాలు ఉన్న సింగిల్ తగ్గింపును సృష్టించినట్లయితే, ఆ తగ్గింపునకు వర్తించే తగ్గింపు తరగతులను మీరు చెక్ చేయవచ్చు. తగ్గింపు తరగతులు అనేవి తగ్గింపును వర్తింపజేయగల కస్టమర్ చెక్‌అవుట్ అంశాలు - ఉత్పత్తి తగ్గింపు తరగతి, ఆర్డర్ తగ్గింపు తరగతి, షిప్పింగ్ తగ్గింపు తరగతి.
మీ Shopify అడ్మిన్‌లోని డిస్కౌంట్‌ల విభాగంలో, మీ తగ్గింపుల పట్టికలోని రకం నిలువు వరుసలో వచనంతో పాటు విభిన్న ఐకాన్‌లు ప్రదర్శించబడతాయి. ఐకాన్ దానిలోపల ఒక సంఖ్యతో ప్రదర్శించబడితే, ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ తగ్గింపు తరగతులను కలిగి ఉన్న తగ్గింపును సూచిస్తుంది.
మీరు రకం నిలువు వరుసలో తగ్గింపుపై హోవర్ చేసినప్పుడు, సంఖ్య గల ఐకాన్ స్థానంలో కింది ఐకాన్‌ల కలయిక వస్తుంది:
- తగ్గింపులో ఉత్పత్తి తగ్గింపు తరగతి ఉన్నట్లు సూచిస్తుంది
- తగ్గింపులో ఆర్డర్ తగ్గింపు తరగతి ఉన్నట్లు సూచిస్తుంది
- తగ్గింపులో షిప్పింగ్ తగ్గింపు తరగతి ఉన్నట్లు సూచిస్తుంది
మీ తగ్గింపుల పట్టికలోని కలయికల నిలువు వరుసలో, ,
, మరియు
ఐకాన్‌లలో ఏదైనా నలుపు రంగు అవుట్‌లైన్‌తో ప్రదర్శించబడితే, మీ తగ్గింపు ఏ ఇతర తగ్గింపులతో కలిపి ఉపయోగించబడవచ్చో అది సూచిస్తుంది. మీరు ఐకాన్‌లపై హోవర్ చేసినప్పుడు, మీ తగ్గింపుతో కలపగల ఇతర తగ్గింపుల నిర్దిష్ట వివరాలతో ఒక డైలాగ్ ప్రదర్శించబడుతుంది.
మీరు ఒకటి కంటే ఎక్కువ తగ్గింపు ఆదాలను కలిగి ఉన్న సింగిల్ తగ్గింపును సృష్టించడానికి యాప్‌ని ఉపయోగిస్తే, అది చేర్చబడిన అన్ని తగ్గింపు తరగతులతో కలయికలను అనుమతించే ఇతర తగ్గింపులతో మాత్రమే కలపబడుతుంది.