Shopify ద్వారా డొమైన్‌ను కొనుగోలు చేయడం

మీరు డొమైన్‌ను సెటప్ చేసుకోవడంలో సహాయపడటానికి, మీ Shopify అడ్మిన్ నుండి మీ డొమైన్ సెట్టింగ్‌లన్నింటినీ నిర్వహించడానికి, మీరు Shopify ద్వారా డొమైన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మీరు Shopifyకి జోడించే మొదటి డొమైన్ ఇదే అయితే, కస్టమర్‌లకు ప్రదర్శించే వెబ్ చిరునామాగా ఇది ఆటోమేటిక్‌గా కాన్ఫిగర్ చేయబడుతుంది. మీరు ఇప్పటికే మీ స్టోర్‌తో ఒక డొమైన్‌ను ఉపయోగిస్తుంటే, కొత్త డొమైన్ ఆటోమేటిక్‌గా మీ ప్రాథమిక డొమైన్‌కు దారి మళ్లించబడుతుంది.

మీరు Shopify ద్వారా డొమైన్‌ను కొనుగోలు చేసిన తర్వాత, మీ Shopify అడ్మిన్‌లోని డొమైన్‌లు విభాగంలో కింది పనులను చేయవచ్చు:

  • మీ డొమైన్ సెట్టింగ్‌లను ఎడిట్ చేయడం
  • సబ్‌డొమైన్‌లను సృష్టించడం
  • ఫార్వార్డింగ్ ఇమెయిల్ చిరునామాలను సెటప్ చేయడం
  • మీ డొమైన్ కోసం చెల్లించడం
  • మీ డొమైన్‌ను రెన్యువల్ చేయడం

Shopify ద్వారా మీరు డొమైన్ కొనుగోలు చేసే ముందు పరిగణించాల్సిన అంశాలు

Shopify ద్వారా డొమైన్ కొనుగోలు చేసే ముందు, కింది అంశాలను రివ్యూ చేయండి:

  • ఇమెయిల్ హోస్టింగ్ సేవలు Shopifyలో అందించబడవు. దానికి బదులుగా, మీరు మీ Shopify-నిర్వహణ డొమైన్‌ను ఒక థర్డ్-పార్టీ ఇమెయిల్ హోస్టింగ్ సేవకు కనెక్ట్ చేయవచ్చు.
  • పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రేషన్ రికార్డుల నుండి మీ వ్యక్తిగత సంప్రదింపు సమాచారాన్ని గోప్యంగా ఉంచే సేవ అయిన WHOIS గోప్యతను కొన్ని డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లు కలిగి ఉంటాయి. మీకు WHOIS గోప్యత కావాలంటే, మీ డొమైన్ ఎక్స్‌టెన్షన్ WHOIS మినహాయింపుల జాబితాలో లేదని నిర్ధారించుకోండి.
  • కొన్ని డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లు నిర్దిష్ట నివాసం లేదా వ్యాపార రిజిస్ట్రేషన్ ఆవశ్యకతలను కలిగి ఉంటాయి. మీరు ఈ ఆవశ్యకతలను తీర్చగలరని నిర్ధారించుకోండి, ఎందుకంటే మీరు మీ రిజిస్ట్రేషన్ సమాచారాన్ని ధృవీకరించాల్సి రావచ్చు. మీరు ఈ ఆవశ్యకతలను తీర్చలేకపోతే, మీ డొమైన్ తాత్కాలికంగా నిలిపివేయబడవచ్చు.
  • మీరు Shopify ద్వారా డొమైన్‌ను కొనుగోలు చేసినప్పుడు ఆటోమేటిక్‌గా కొత్త TLS (ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ) సర్టిఫికెట్, దీనినే SSL సర్టిఫికెట్ అని కూడా పిలుస్తారు, ఇది క్రియేట్ అవుతుంది. మీ డొమైన్ కోసం మీరు SSL ఎన్‌క్రిప్షన్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
  • మీ డొమైన్ సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించడానికి మీరు ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలి. డొమైన్ పునరుద్ధరణల కోసం మీ Shopify ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ రుసుముల నుండి విడిగా ఛార్జ్ చేయబడుతుంది. కచ్చితమైన ధర మీరు ఎంచుకునే డొమైన్ ఎక్స్‌టెన్షన్‌పై ఆధారపడి ఉంటుంది.
  • అన్ని డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లను Shopify ద్వారా కొనుగోలు చేయలేరు. ఒకవేళ టాప్-లెవల్ డొమైన్ అందుబాటులో లేకపోతే, మీరు థర్డ్ పార్టీ డొమైన్ హోస్ట్ నుండి డొమైన్‌ను కొనుగోలు చేయవచ్చు మరియు దానిని మీ Shopify స్టోర్‌కు కనెక్ట్ చేయవచ్చు.
  • డొమైన్ హోస్టింగ్ సేవలు చెల్లింపుతో కూడిన Shopify ప్లాన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీరు మీ స్టోర్ లేదా మీ Shopify ఖాతాను డీయాక్టివేట్ చేయాలనుకుంటే, కానీ మీరు మీ డొమైన్‌ను ఉపయోగించడాన్ని కొనసాగించాలనుకుంటే, మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయడానికి ముందే మీరు మీ డొమైన్‌ను బదిలీ చేయాలి. మీరు మీ డొమైన్‌ను కింది ఎంపికలలో ఒకదానికి బదిలీ చేయవచ్చు:
  • కొనుగోలు చేస్తున్నప్పుడు .se డొమైన్‌లకు, సంప్రదింపు సమాచారం కింది ఫార్మాట్‌లో ఉండాలి:
    • పోస్టల్ కోడ్ ఖాళీలను కలిగి ఉండకూడదు.
    • మీ ఫోన్ నంబర్‌లోని మొదటి 0ని చేర్చకూడదు.
    • మీ స్వీడిష్ గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా 10 అంకెలు మరియు YYMMDD-XXXX ఫార్మాట్‌లో ఒక హైఫన్‌ను కలిగి ఉండాలి.

Shopify ద్వారా డొమైన్‌ను కొనుగోలు చేయండి

మీరు Shopify ద్వారా కస్టమ్ డొమైన్‌ను కొనుగోలు చేసే ముందు, Shopify వారి డొమైన్ నేమ్ జనరేటర్‌ని ఉపయోగించి మీ డొమైన్ పేరు ధర, లభ్యతను చెక్ చేయండి. Shopify ద్వారా కొనుగోలు చేసిన డొమైన్‌ల కచ్చితమైన ధర మీరు ఎంచుకున్న TLD (టాప్-లెవల్ డొమైన్) ఎక్స్‌టెన్షన్‌పై ఆధారపడి ఉంటుంది. TLDల లభ్యత మారవచ్చు.

డొమైన్ నేమ్ జనరేటర్ మీరు ఎంచుకున్న డొమైన్ పేరు లభ్యతను, అలాగే అందుబాటులో ఉన్న ఇతర TLDలు మరియు ప్రత్యామ్నాయ డొమైన్ పేర్లను చూపిస్తుంది. మీరు ఎంచుకున్న డొమైన్ పేరు లేదా TLD అందుబాటులో లేకపోతే, మీరు సూచించిన ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు లేదా కొత్త శోధనను ప్రారంభించవచ్చు.

AI-సూచించిన డొమైన్ పేర్లు

మీరు డొమైన్ పేరు కోసం శోధించినప్పుడు, AI-ఆధారిత సూచనలు మీ శోధనకు సమానంగా ఉండే అదనపు డొమైన్ పేరు ఎంపికలను ప్రదర్శిస్తాయి. ఈ సూచనలలో మీ బ్రాండ్‌కు సరిగ్గా సరిపోయే లేదా మీ కస్టమర్‌లకు మరింత గుర్తుండేలా ఉండే వైవిధ్యాలు ఉంటాయి. ఒకవేళ మీరు ఇష్టపడే డొమైన్ సూచనను గుర్తిస్తే, దాని ధరను రివ్యూ చేసి, కొనుగోలు చేయడానికి మీరు దానిని ఎంచుకోవచ్చు.

దశ 1: మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న డొమైన్ పేరును ఎంచుకోండి

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > డొమైన్‌లకు వెళ్లండి.

  2. కొత్త డొమైన్‌ను కొనుగోలు చేయండిపై క్లిక్ చేయండి.

  3. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న డొమైన్ పేరును ఎంటర్ చేయండి.

  4. అందుబాటులో ఉన్న డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లు మరియు వాటి ధరలను రివ్యూ చేయండి.

  5. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న డొమైన్ కోసం కొనండి మీద క్లిక్ చేయండి.

దశ 2: డొమైన్ కొనుగోలు సారాంశాన్ని రివ్యూ చేయండి

  1. డిఫాల్ట్‌గా ఆటోమేటిక్ డొమైన్ పునరుద్ధరణ యాక్టివ్‌గా ఉంటుంది. ఆటోమేటిక్ పునరుద్ధరణను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయడానికి మీరు ప్రతి సంవత్సరం ఈ డొమైన్‌ను ఆటో-రెన్యూ చేయండి టోగుల్ చేయవచ్చు.
  2. Shopify స్టోర్ యజమాని ఇమెయిల్ చిరునామా మరియు సమాచారం సరైనవేనని నిర్ధారించుకోవడానికి సంప్రదింపు సమాచారం విభాగాన్ని రివ్యూ చేయండి. మీ సంప్రదింపు సమాచారాన్ని సర్దుబాటు చేయడానికి మీరు Edit ఐకాన్‌ను క్లిక్ చేయవచ్చు.
  3. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రేషన్ రికార్డుల నుండి మీ వ్యక్తిగత సంప్రదింపు సమాచారాన్ని గోప్యంగా ఉంచే సేవ అయిన WHOIS గోప్యత ఈ డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లో ఉందో లేదో నిర్ధారించండి:
    • మీరు ఎంటర్ చేసిన డొమైన్ పేరులో WHOIS గోప్యత ఉంటే, డొమైన్ WHOIS గోప్యతను కలిగి ఉందనే సందేశం ప్రదర్శించబడుతుంది.
    • మీకు ఈ సందేశం రాకపోతే మరియు మీ డొమైన్‌లో మీకు WHOIS గోప్యత కావాలంటే, రద్దు చేయండి క్లిక్ చేసి, WHOIS మినహాయింపుల జాబితాలో లేని వేరొక డొమైన్ ఎక్స్‌టెన్షన్‌ను ఎంచుకోండి.
  4. చెల్లింపు పద్ధతి విభాగంలో, మీ డొమైన్ కోసం ఒక చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి.
  5. ICANN విధానాన్ని మరియు డొమైన్ రిజిస్ట్రేషన్ ఒప్పందాన్ని చదవండి.
  6. డొమైన్ కొనుగోలు చేయండిపై క్లిక్ చేయండి.

మీ డొమైన్ పని చేయడం ప్రారంభించడానికి 48 గంటల వరకు సమయం పట్టవచ్చు. మీరు Shopifyకి జోడించే మొదటి డొమైన్ ఇదే అయితే, కస్టమర్‌లకు ప్రదర్శించబడే వెబ్ చిరునామాగా ఇది ఆటోమేటిక్‌గా కాన్ఫిగర్ చేయబడుతుంది. మీరు ఇప్పటికే మీ స్టోర్‌తో ఒక డొమైన్‌ను ఉపయోగిస్తుంటే, కొత్త డొమైన్ ఆటోమేటిక్‌గా మీ ప్రాథమిక డొమైన్‌కు దారిమళ్లించబడుతుంది. మీరు కొత్త డొమైన్‌ను మీ ప్రాథమిక డొమైన్‌గా సెట్ చేయవచ్చు.

మీరు Shopify ద్వారా మీ డొమైన్‌ను కొనుగోలు చేసినప్పుడు లేదా ఒక థర్డ్-పార్టీ డొమైన్‌ను Shopifyకి బదిలీ చేసినప్పుడు, మీ డొమైన్ కోసం A రికార్డ్ మరియు CNAME రికార్డ్ ఆటోమేటిక్‌గా జోడించబడతాయి మరియు Shopify కోసం డిఫాల్ట్ DNS రికార్డ్‌లకు సెట్ చేయబడతాయి. మీ Shopify స్టోర్ మీ Shopify డొమైన్‌ను పాయింట్ చేయడానికి మీరు మీ డిఫాల్ట్ A రికార్డ్ లేదా CNAME రికార్డ్‌ను సవరించాల్సిన అవసరం ఉండదు. మీరు A రికార్డ్ లేదా CNAME రికార్డ్‌ను సవరించి, వాటిని డిఫాల్ట్‌కి రీసెట్ చేయాలనుకుంటే, అప్పుడు మీరు A రికార్డ్, CNAME రికార్డ్ మరియు AAAA రికార్డ్ కోసం మీ DNS రికార్డ్‌లను రీసెట్ చేయవచ్చు.

దశ 3: డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం మీ ఇమెయిల్ చిరునామాను ధృవీకరించండి

మీరు డొమైన్‌ను కొనుగోలు చేసిన తర్వాత, మీ డొమైన్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి మీరు మీ ఇమెయిల్ చిరునామాను ధృవీకరించాలి. మీరు రివ్యూ చేయాల్సిన Shopify నుండి వచ్చిన పలు ఇమెయిల్‌ల కోసం మీ ఇమెయిల్ ఖాతాను చెక్ చేయండి. ఈ ఇమెయిల్‌లలో కింది వివరాలు ఉంటాయి:

  • మీ కొనుగోలును నిర్ధారించడం.
  • మీ ఇమెయిల్ చిరునామాను ధృవీకరించడం.
  • మీ డేటా ఎలా షేర్ చేయబడుతుందో నిర్వహించడం.

ఒకవేళ మీరు ఎలాంటి డొమైన్ ధృవీకరణ ఇమెయిల్‌లను స్వీకరించకపోతే, మీ ఇమెయిల్‌లోని స్పామ్ లేదా జంక్ ఫోల్డర్‌ను చెక్ చేయండి.

కింది ఉదాహరణలతో సహా, డొమైన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంటర్ చేసిన ఇమెయిల్ చిరునామాతో ఏవైనా సమస్యలు ఉన్నాయేమో మీరు చెక్ చేయవచ్చు:

  • ఇమెయిల్ చిరునామా మీరు రిజిస్టర్ చేస్తున్న డొమైన్‌నే ఉపయోగించడం లేదని చెక్ చేయండి. ఉదాహరణకు, మీరు example.comని రిజిస్టర్ చేస్తుంటే, డొమైన్ ఇంకా పూర్తిగా యాక్టివ్‌గా లేనందున, ఇమెయిల్‌లను స్వీకరించలేరు కాబట్టి మీరు info@example.comకు పంపబడిన ధృవీకరణ ఇమెయిల్‌ను పొందలేరు.
  • డొమైన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంటర్ చేసిన ఇమెయిల్ చిరునామాలో ఏవైనా టైపింగ్ లేదా స్పెల్లింగ్ పొరపాట్లు ఉన్నాయేమో చెక్ చేయండి.
  • మీరు ఇంతకు ముందే అలా చేయకపోతే, gmail.com ఇమెయిల్ అడ్రస్‌ని ఉపయోగించి ప్రయత్నించండి.

మీ డొమైన్ రిజిస్టర్ చేయడం కోసం మీరు మీ Shopify అడ్మిన్‌లో ఇమెయిల్ అడ్రస్‌ను మార్చవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > డొమైన్‌లకు వెళ్లండి.

  2. మీరు ఏ డొమైన్‌కి సంబంధించిన ఇమెయిల్ అడ్రస్‌ని చెక్ చేయాలనుకుంటున్నారో, దానిపై క్లిక్ చేయండి.

  3. రిజిస్ట్రేషన్ వివరాలు విభాగంలో, సంప్రదింపు సమాచారం పక్కన ఉన్న ఎడిట్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.

  4. ఇమెయిల్ ఫీల్డ్‌లో, ఇమెయిల్ అడ్రస్‌ని చెక్ చేసి అవసరమైన మార్పులు లేదా సవరణలు చేయండి.

  5. మీరు ఇమెయిల్ అడ్రస్‌లో ఏవైనా మార్పులు చేసినట్లయితే, సేవ్ క్లిక్ చేయండి.

  6. ఆ తర్వాత మీకు వచ్చే ఇమెయిల్‌లో, మీరు కింది వాటిలో ఒకదాన్ని చేయాల్సి రావచ్చు:

    • మీ Shopify అడ్మిన్‌లో ఇమెయిల్ అడ్రస్‌కి మీరు చేసిన మార్పులను నిర్ధారించడానికి, లింక్‌పై క్లిక్ చేసి, సూచనలను ఫాలో అవ్వండి.
    • మీ Shopify అడ్మిన్‌లో ఇమెయిల్ అడ్రస్‌కి మీరు చేసిన మార్పులను నిర్ధారించడానికి ఫారమ్‌ను పూరించి, దాన్ని Shopify సపోర్ట్‌కు సమర్పించండి.
  7. మీరు మీ ఇమెయిల్ అడ్రస్‌ను విజయవంతంగా సవరిస్తే లేదా మార్చినట్లయితే, మీరు రివ్యూ చేయాల్సిన డొమైన్ వెరిఫికేషన్ ఇమెయిల్‌లను ఆటోమేటిక్‌గా అందుకుంటారు.

మీ Shopify అడ్మిన్ నుండి వెరిఫికేషన్ ఇమెయిల్‌ను మళ్లీ పంపడానికి కూడా మీరు ప్రయత్నించవచ్చు. అయినా మీ డొమైన్ కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఇమెయిల్‌లు మీకు రాకపోతే, లేదా మీ Shopify అడ్మిన్ నుండి వెరిఫికేషన్ ఇమెయిల్‌ను మళ్లీ పంపే ఆప్షన్ మీకు లేకపోతే, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.

మీరు 15 రోజులలోపు మీ ఇమెయిల్ అడ్రస్‌ను వెరిఫై చేయకపోతే, మీ డొమైన్ సస్పెండ్ కావచ్చు.

డొమైన్ కొనుగోళ్ల ట్రబుల్షూటింగ్

Shopify ద్వారా డొమైన్‌ను కొనుగోలు చేయడంలో మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, సాధారణ సమస్యలను పరిష్కరించడానికి కింది ట్రబుల్షూటింగ్ దశలను ఉపయోగించండి.

దశ 1: సాధారణ ట్రబుల్షూటింగ్

నిర్దిష్ట ఎర్రర్‌లను పరిష్కరించే ముందు ఈ కింది సాధారణ ట్రబుల్షూటింగ్ దశలను ప్రయత్నించండి:

  • మీ డొమైన్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో అలాగే వాటిలో ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్‌లు లేవో నిర్ధారించుకోండి.
  • మీ చెల్లింపు పద్ధతి ఇప్పటికీ చెల్లుబాటులో ఉందని, దాని గడువు ముగియలేదని నిర్ధారించుకోండి.
  • వేరొక చెల్లింపు పద్ధతిని ఉపయోగించి చూడండి.
  • మీ బ్రౌజర్ కాష్, కుక్కీలను క్లియర్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.
  • మీరు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) ఉపయోగిస్తుంటే, దాన్ని తాత్కాలికంగా డీయాక్టివేట్ చేయడానికి ప్రయత్నించండి.

దశ 2: డొమైన్ కొనుగోలు సమస్యను ఎంచుకోండి

మీరు నిర్దిష్ట ఎర్రర్‌ను ఎదుర్కొంటున్నట్లయితే, దానికి తగిన ట్రబుల్షూటింగ్ విభాగాన్ని ఎంచుకోండి:

డొమైన్ పేరులోని స్పెషల్ క్యారెక్టర్ ఎర్రర్‌ల ట్రబుల్షూటింగ్

మీ డొమైన్ పేరులో స్పెషల్ క్యారెక్టర్‌లు, యాక్సెంట్‌లు లేదా సింబల్స్ ఉంటే, కొనుగోలు చేసే సమయంలో మీకు ఎర్రర్ వస్తుంది.

దశలు:

  1. మీ డొమైన్ పేరు నుండి ఏవైనా స్పెషల్ క్యారెక్టర్‌లు, యాక్సెంట్‌లు లేదా సింబల్స్‌ను తీసివేయండి.
  2. ఇంటర్నేషనల్ క్యారెక్టర్‌లకు బదులుగా వాటికి సమానమైన ఇంగ్లీష్ క్యారెక్టర్‌లను ఉపయోగించండి (Å → A, ß → B, Æ → AE).
  3. మీ డొమైన్ కొనుగోలును మళ్లీ ప్రయత్నించండి.
సంప్రదింపు సమాచారంలోని స్పెషల్ క్యారెక్టర్ ఎర్రర్‌ల ట్రబుల్షూటింగ్

మీ సంప్రదింపు సమాచారంలో స్పెషల్ క్యారెక్టర్‌లు ఉంటే, "[ఫీల్డ్ పేరు] ఏ స్పెషల్ క్యారెక్టర్‌లను కలిగి ఉండదు" అనే ఎర్రర్ చూపిస్తుంది.

దశలు:

  1. ఎర్రర్‌లో పేర్కొన్న సంప్రదింపు సమాచార ఫీల్డ్‌లను రివ్యూ చేయండి.
  2. పేర్లు, అడ్రస్‌ల నుండి స్పెషల్ క్యారెక్టర్‌లు, యాక్సెంట్‌లను తీసివేయండి.
  3. ప్రామాణిక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్‌లను మాత్రమే ఉపయోగించండి.
  4. ఫీల్డ్‌ను అప్‌డేట్ చేయండి.
  5. మీ డొమైన్ కొనుగోలును మళ్లీ ప్రయత్నించండి.
"తప్పనిసరిగా నాన్-న్యూమరిక్ క్యారెక్టర్‌లను కలిగి ఉండాలి" ఎర్రర్‌ల ట్రబుల్షూటింగ్

మీరు పేరు ఫీల్డ్‌లలో నంబర్‌లు లేదా కంపెనీ కోడ్‌లను ఎంటర్ చేస్తే, "తప్పనిసరిగా నాన్-న్యూమరిక్ క్యారెక్టర్‌లను కలిగి ఉండాలి" ఎర్రర్ చూపిస్తుంది.

దశలు:

  1. సంప్రదింపు పేరు ఫీల్డ్‌లు అసలు పేర్లను కలిగి ఉన్నాయని, నంబర్‌లు లేదా కంపెనీ కోడ్‌లు కాదని నిర్ధారించుకోండి.
  2. ఏవైనా కంపెనీ పేర్లకు బదులుగా వ్యక్తుల పేర్లను ఉపయోగించండి.
  3. పేరు ఫీల్డ్‌ల నుండి నంబర్‌లను తీసివేయండి.
  4. మీ డొమైన్ కొనుగోలును మళ్లీ ప్రయత్నించండి.
"అనేక డొమైన్‌లు కొనుగోలు చేయబడ్డాయి" ఎర్రర్‌ల ట్రబుల్షూటింగ్

మీరు తక్కువ వ్యవధిలో అనేక డొమైన్‌లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లయితే, మీకు రేట్ పరిమితి ఎర్రర్ రావచ్చు. అనేక ఛార్జీ ప్రయత్నాలను పరిమితం చేయడానికి ఇది ఒక ముందస్తు జాగ్రత్త చర్య.

మరొక డొమైన్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించే ముందు కొన్ని గంటల పాటు వేచి ఉండండి. డొమైన్ కొనుగోళ్లు సాధారణంగా 24 గంటల వరకు వేచి ఉన్న తర్వాత విజయవంతమవుతాయి.

చెల్లని సంప్రదింపు సమాచార ఎర్రర్‌ల ట్రబుల్షూటింగ్

మీ సంప్రదింపు సమాచారం రిజిస్ట్రీ అవసరాలకు అనుగుణంగా లేకపోతే, మీరు వ్యాలిడేషన్ ఎర్రర్‌లను అందుకుంటారు.

దశలు:

  1. పోస్టల్ కోడ్ ఫార్మాటింగ్‌ను నిర్ధారించుకోండి. ఉదాహరణకు, .nl డొమైన్‌లకు "1234 AB" ఫార్మాట్ అవసరం.
  2. అడ్రస్ ఫీల్డ్‌లు క్యారెక్టర్ పరిమితులను మించకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి.
  3. దేశం కోడ్‌లు రిజిస్ట్రీ ద్వారా గుర్తించబడ్డాయని నిర్ధారించుకోండి.
  4. అపార్ట్‌మెంట్ లేదా యూనిట్ నంబర్‌లను సరైన ఫీల్డ్‌లుగా విభజించండి.
  5. మీ సంప్రదింపు సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
  6. మీ డొమైన్ కొనుగోలును మళ్లీ ప్రయత్నించండి.
"ఈ డొమైన్ ఇప్పటికే వేరొక Shopify స్టోర్‌కు కనెక్ట్ చేయబడింది" ఎర్రర్ ట్రబుల్షూటింగ్

మీరు ఇప్పటికే వేరొక స్టోర్‌కు కనెక్ట్ చేయబడిన డొమైన్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే, "ఈ డొమైన్ ఇప్పటికే వేరొక Shopify స్టోర్‌కు కనెక్ట్ చేయబడింది" అనే ఎర్రర్ చూపిస్తుంది.

ఆ డొమైన్ మీదే అయితే, అది వేరొక Shopify స్టోర్‌కు కనెక్ట్ చేయబడి ఉంటే, ఆ డొమైన్‌ Shopifyచే నిర్వహించబడుతుందా లేదా థర్డ్-పార్టీకి చెందినదా అనే దానిపై బదిలీ దశలు ఆధారపడి ఉంటాయి. Shopifyచే నిర్వహించబడే డొమైన్‌ను బదిలీ చేయడానికి, Shopifyచే నిర్వహించబడే డొమైన్‌లను మరొక స్టోర్ లేదా డొమైన్ ప్రొవైడర్‌కు బదిలీ చేయడంని చూడండి. థర్డ్-పార్టీ డొమైన్‌ను బదిలీ చేయడానికి, Shopify స్టోర్‌ల మధ్య థర్డ్-పార్టీ డొమైన్‌ను బదిలీ చేయడానికి యాజమాన్యాన్ని వెరిఫై చేయడంని చూడండి.

ఆ డొమైన్ మీదేనా అని మీకు ఖచ్చితంగా తెలియకపోతే లేదా డొమైన్ కొనుగోలు కోసం అందుబాటులో ఉండాలని మీరు భావిస్తే, అదనపు సహాయం కోసం మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించవచ్చు.

దశ 3: సపోర్ట్‌ను సంప్రదించండి

మీరు ట్రబుల్షూటింగ్ దశలను పూర్తి చేసినా, రేట్ పరిమితి ఎర్రర్‌ల కోసం 24 గంటల తర్వాత కూడా మీ డొమైన్‌ను కొనుగోలు చేయలేకపోతే, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.

డొమైన్‌ను కొనుగోలు చేసి రిజిస్టర్ చేసిన తర్వాత మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, Shopifyకి కనెక్ట్ చేసిన డొమైన్‌లతో ఉన్న సమస్యలను ట్రబుల్షూట్ చేయండిని చూడండి.

మీ రిజిస్ట్రేషన్ సమాచారాన్ని వెరిఫై చేయడం

మీరు Shopify ద్వారా డొమైన్‌ను కొనుగోలు చేసినప్పుడు, కొన్ని నిర్దిష్ట-దేశం డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లకు మీరు తీర్చవలసిన నిర్దిష్ట రెసిడెన్సీ లేదా వ్యాపార రిజిస్ట్రేషన్ అవసరాలు ఉంటాయి.

కొన్ని డొమైన్ ఎక్స్‌టెన్షన్‌ల రిజిస్ట్రేషన్‌లను నిర్వహించే నిర్దిష్ట రిజిస్ట్రీ ఆర్గనైజేషన్‌లు కూడా ఉన్నాయి. మీరే డొమైన్ యజమాని అయితే, వారి రెసిడెన్సీ లేదా వ్యాపార రిజిస్ట్రేషన్ అవసరాలను మీరు తీరుస్తున్నారో లేదో వెరిఫై చేయడానికి ఈ రిజిస్ట్రీ ఆర్గనైజేషన్‌లు మిమ్మల్ని కాలానుగుణంగా సంప్రదించవచ్చు.

మీరు Shopify ద్వారా డొమైన్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీ డొమైన్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి మీ స్టోర్ సమాచారం ఆటోమేటిక్‌గా ఉపయోగించబడుతుంది. ఈ సమాచారంలో మీ వ్యాపారం పేరు, మీ పేరు, అడ్రస్, అలాగే ఫోన్ నంబర్ ఉంటాయి.

మీ డొమైన్‌ను వెరిఫై చేయడానికి ఏదైనా రిజిస్ట్రీ ఆర్గనైజేషన్ మిమ్మల్ని సంప్రదిస్తే, మీరు మీ రిజిస్ట్రేషన్ సమాచారానికి సంబంధించిన రుజువును అందించాలి. పాస్‌పోర్ట్, వ్యాపార బిల్లులు లేదా వ్యాపార చిరునామా రుజువు వంటి ఏ రకమైన డాక్యుమెంటేషన్‌ను మీరు అందించవచ్చనే దానికి సంబంధించి ప్రతి రిజిస్ట్రీ ఆర్గనైజేషన్ వేర్వేరు అవసరాలను కలిగి ఉంటుంది. మీరు మీ వ్యాపార చిరునామాను మార్చుకున్నా లేదా మీ రిజిస్ట్రేషన్ సమాచారాన్ని నిరూపించడంలో ఇబ్బంది పడుతున్నా, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.

నిర్దిష్ట దేశాల కోసం డొమైన్ రిజిస్ట్రేషన్ ఆవశ్యకతల గురించి తెలుసుకోవడానికి కింది వివరాలను రివ్యూ చేయండి:

.be డొమైన్‌ల కోసం బెల్జియం డొమైన్ రిజిస్ట్రేషన్ ఆవశ్యకతలు

మీరు .be డొమైన్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు బెల్జియం డొమైన్‌ల రిజిస్ట్రార్, DNS Belgiumతో మీ సంప్రదింపు సమాచారాన్ని నిర్ధారించుకోవాలి.

మీరు మీ డొమైన్‌ను కొనుగోలు చేసిన తర్వాత, ధ్రువీకరణ మరియు నిర్ధారణ కోసం మీరు DNS Belgium నుండి ఇమెయిల్ పొందవచ్చు. అలాగే, మీరు ఆ ఇమెయిల్‌లో ఉన్న సూచనలను పాటించాలి.

.be డొమైన్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి మీరు బెల్జియంలో నివాసి లేదా బిజినెస్ ఆపరేటర్ అయి ఉండాల్సిన అవసరం లేదు.

.be టాప్-లెవెల్ డొమైన్ (TLD)ని మినహాయించి, డొమైన్ పేర్లు 3 నుండి 63 అక్షరాల వరకు ఎంత పొడవైనా ఉండవచ్చు.

.be డొమైన్‌ను రిజిస్టర్ చేయడంలో, అలాగే ధ్రువీకరించడంలో మీకు ఏవైనా సమస్యలు ఉంటే, అప్పుడు DNS Belgiumని సంప్రదించండి.

.ca డొమైన్‌ల కోసం కెనడా డొమైన్ రిజిస్ట్రేషన్ ఆవశ్యకతలు

మీరు .ca డొమైన్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు CIRA (Canadian Internet Registration Authority) నుండి ఒక రిజిస్ట్రేషన్ ఒప్పందాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

మీరు మీ డొమైన్‌ను కొనుగోలు చేసిన తర్వాత, మీకు రిజిస్ట్రేషన్ ఒప్పందానికి సంబంధించిన లింక్‌తో ఒక ఇమెయిల్ వస్తుంది. మీరు దాన్ని రివ్యూ చేసి, ఆ ఒప్పంద నిబంధనలను అంగీకరించాలి.

రిజిస్ట్రెంట్‌లు తప్పనిసరిగా నిర్దిష్ట Canadian Presence Requirements (CPR)కి అనుగుణంగా ఉండాలి. డొమైన్ రిజిస్ట్రేషన్ సమయంలో, మీరు అర్హత కలిగిన కింది కేటగిరీల నుండి మీకు వర్తించే CPR కేటగిరీని ఎంచుకోవాలి:

  • కెనడా పౌరులు
  • కెనడాలోని కార్పొరేషన్‌లు
  • కెనడియన్ విద్యా సంస్థలు
  • కెనడాకు చెందిన ఆదిమ వాసులు
  • కెనడాలోని ప్రభుత్వ సంస్థలు

.ca డొమైన్‌ల రిజిస్ట్రెంట్ సంప్రదింపు సమాచారం కోసం తప్పనిసరిగా పూరించాల్సిన ఫీల్డ్‌లలో మీ పేరు, ఇంటిపేరు, ఇమెయిల్ అడ్రస్, సంస్థ పేరు (వ్యక్తులు కానివారికి), ఫోన్ నంబర్, అలాగే అడ్రస్ ఉంటాయి.

డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం కెనడియన్ ఉనికిని నిర్ధారించడానికి CIRA రిజిస్ట్రెంట్ ఇన్ఫర్మేషన్ వాలిడేషన్ (RIV)ను నిర్వహించవచ్చు, అప్పుడు మీరు కెనడియన్ పాస్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్‌లను అందించాల్సి ఉంటుంది.

.ca టాప్-లెవెల్ డొమైన్ (TLD)ని మినహాయించి, డొమైన్ పేర్లు గరిష్టంగా 63 అక్షరాల పొడవు వరకు ఉండవచ్చు.

.fr డొమైన్‌ల కోసం ఫ్రాన్స్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఆవశ్యకతలు

మీరు .fr డొమైన్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు AFNIC (Association française pour le nommage Internet en coopération) రిజిస్ట్రీ డొమైన్ రిజిస్ట్రేషన్ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి.

.fr డొమైన్‌ను రిజిస్టర్ చేసుకోవడం కోసం ప్రాంతీయ ఉనికి ఆవశ్యకతలను సంతృప్తి పరచడానికి, వ్యక్తులు అలాగే సంస్థలు యూరోపియన్ యూనియన్, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్ లేదా లైచెన్‌స్టీన్‌లో ఉండాలి.

మీరు యజమాని అయ్యే విధంగా ఒక సంస్థ కోసం .fr డొమైన్‌ను రిజిస్టర్ చేస్తుంటే, ఆ సంస్థ VAT నంబర్, ట్రేడ్‌మార్క్ నంబర్ అలాగే SIREN/SIRET నంబర్‌ను అందించడం ద్వారా రిజిస్ట్రేషన్‌ను వేగంగా ధ్రువీకరించవచ్చు.

.fr డొమైన్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు పేరు, ఇంటి పేరు ఫీల్డ్‌లలో మీరు ప్రత్యేక అక్షరాలను ఉంచకూడదు. ఆమోదించదగిన అక్షరాలలో లాటిన్ అక్షరాలు, హైఫన్‌లు, అపోస్ట్రఫీలు అలాగే స్పేస్‌లు ఉంటాయి.

.it డొమైన్‌ల కోసం ఇటలీ డొమైన్ రిజిస్ట్రేషన్ ఆవశ్యకతలు

మీరు .it డొమైన్‌ను కొనుగోలు చేసినప్పుడు, వ్యక్తిగత రిజిస్ట్రెంట్‌గా మీరు మీ ఇటాలియన్ ఫిస్కల్ కోడ్ (Codice fiscale)ను లేదా ఇటలీలోని సంస్థ ఈ డొమైన్‌ను రిజిస్టర్ చేస్తున్నట్లయితే, దానికి సంబంధించిన VAT నంబర్‌ను సమర్పించాలి.

మీకు పౌరసత్వం లేదా నివాసం లేదా యూరోపియన్ ఆర్థిక ప్రాంతం (EEA) లేదా వాటికన్, శాన్ మారినో రిపబ్లిక్ ఇంకా స్విట్జర్లాండ్ దేశాలలో రిజిస్టర్ అయిన వ్యాపార కార్యాలయం ఉంటే మాత్రమే మీరు .it డొమైన్‌ను రిజిస్టర్ చేయగలరు.

మీరు ఇటలీ వెలుపల నుండి .it డొమైన్‌ను రిజిస్టర్ చేస్తుంటే, మీరు ఉన్న దేశం నుండి మీ వ్యక్తిగత ID నంబర్‌ను అందించాలి.

.se డొమైన్‌ల కోసం స్వీడన్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఆవశ్యకతలు

మీరు .se డొమైన్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు మీ జాతీయ గుర్తింపు కార్డ్ నుండి మీ స్వీడిష్ వ్యక్తిగత గుర్తింపు నంబర్‌ను సమర్పించాలి. మీరు కేవలం వ్యక్తిగతంగా మాత్రమే Shopify ద్వారా .se డొమైన్‌ను రిజిస్టర్ చేయగలరు, సంస్థలాగా చేయలేరు.

.se డొమైన్ రిజిస్ట్రేషన్‌లో, కింది ఉదాహరణలతో సహా నిర్దిష్ట సమాచారం ఫార్మాటింగ్ సరైనదిగా ఉండటం ముఖ్యం:

  • మీరు మీ సమాచారాన్ని ఇన్‌పుట్ చేసినప్పుడు A, Oలను ఉపయోగించండి, Å, Ä లేదా Öలను ఉపయోగించవద్దు.
  • స్వీడిష్ వ్యక్తిగత గుర్తింపు నంబర్‌ను తప్పనిసరిగా YYMMDD-XXXX ఫార్మాట్‌లో సమర్పించాలి.
  • పోస్టల్ కోడ్‌లో ఎలాంటి స్పేస్‌లు ఉండకూడదు.

WHOIS మినహాయింపులు

మీరు Shopify ద్వారా కింది డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లను కొనుగోలు చేసినప్పుడు వాటిలో WHOIS గోప్యత చేర్చబడి ఉండదు. మీరు ఈ డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లలో ఒకదాన్ని కలిగి ఉంటే, మీ వ్యక్తిగత సంప్రదింపు సమాచారం పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రేషన్ రికార్డ్‌లలో అందుబాటులో ఉంటుంది.

WHOIS గోప్యత చేర్చబడని టాప్-లెవల్ డొమైన్ ఎక్స్‌టెన్షన్‌ల లిస్ట్.
.abogado.ac.ae.aero.africa
.ag.ai.alsace.am.ar
.archi.as.asia.at.au
.auto.barcelona.bayern.be.berlin
.br.brussels.bzh.cat.cd
.ch.cl.cm.cologne.coop
.corsica.cx.cz.de.ec
.es.feedback.fi.fm.fr
.frl.gd.gg.gl.gr
.gs.gy.hamburg.hk.hm
.hn.hr.ht.hu.il
.im.in.io.is.je
.jobs.jp.kg.ki.kr
.la.law.lc.li.lt
.lu.lv.ly.ma.md
.melbourne.mn.ms.mu.mx
.my.nl.no.nrw.nu
.nyc.nz.paris.pe.ph
.pl.pm.pr.pro.pt
.pw.qa.quebec.re.rio
.ro.ru.ruhr.sb.sc
.scot.se.sg.sh.si
.so.sr.srl.st.sx
.sydney.tc.tf.tk.tl
.tm.to.travel.tw.ua
.us.uy.vc.ve.vg
.vlaanderen.vote.voto.wf.wien
.yt.za

కొనుగోలుకు అందుబాటులో ఉన్న TLDలు

కింది ఎక్స్‌టెన్షన్‌లు ఉన్న డొమైన్‌లను Shopify ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Shopify ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్న టాప్-లెవల్ డొమైన్ ఎక్స్‌టెన్షన్‌ల లిస్ట్.
.ac.academy.accountant.accountants.actor
.adult.africa.ag.agency.airforce
.alsace.am.apartments.archi.army
.art.associates.attorney.auction.auto
.band.bar.barcelona.bargains.bayern
.be.beer.berlin.best.bet
.bid.bike.bingo.biz.biz.ki
.biz.pl.black.blog.boston.boutique
.brussels.builders.business.buzz.bz
.bzh.ca.cab.cafe.camera
.camp.capetown.capital.car.cards
.care.careers.cars.casa.cash
.casino.cat.catering.cc.center
.ceo.charity.chat.cheap.christmas
.church.city.claims.cleaning.click
.clinic.clothing.cloud.club.cm
.co.co.ag.co.cm.co.gg.co.gl
.co.gy.co.im.co.in.co.je.co.kr
.co.lc.co.ma.co.nz.co.uk.co.ve
.co.za.coach.codes.coffee.college
.cologne.com.com.ag.com.cm.com.co
.com.ec.com.gl.com.gy.com.hn.com.ht
.com.im.com.ki.com.lc.com.mx.com.pe
.com.ph.com.pl.com.pr.com.sb.com.sc
.com.so.com.tw.community.company.computer
.condos.construction.consulting.contractors.cooking
.cool.corsica.country.coupons.courses
.credit.creditcard.cricket.cruises.cx
.cymru.dance.date.dating.deals
.degree.delivery.democrat.dental.dentist
.desi.design.diamonds.digital.direct
.directory.discount.doctor.dog.domains
.download.durban.earth.ec.edu.pl
.education.email.energy.engineer.engineering
.enterprises.equipment.es.estate.eu
.events.exchange.expert.exposed.express
.fail.faith.family.fans.farm
.fashion.feedback.film.finance.financial
.firm.in.fish.fishing.fit.fitness
.flights.florist.fm.football.forsale
.foundation.fr.frl.fun.fund
.furniture.futbol.fyi.gallery.game
.games.garden.gd.gen.in.gg
.gift.gifts.gives.gl.glass
.global.gmbh.gold.golf.graphics
.gratis.green.gripe.group.gs
.guide.guru.gy.hamburg.haus
.healthcare.help.hiv.hn.hockey
.holdings.holiday.horse.hospital.host
.hosting.house.how.ht.idv.tw
.im.immo.immobilien.in.ind.in
.industries.info.info.ec.info.ht.info.ki
.info.pl.ink.institute.insure.international
.investments.io.irish.ist.istanbul
.it.je.jetzt.jewelry.joburg
.juegos.kaufen.kitchen.kiwi.koeln
.kr.l.lc.la.land.lawyer
.lc.lease.legal.lgbt.li
.life.lighting.limited.limo.link
.live.llc.loan.loans.lol
.london.love.ltd.ltda.lu
.maison.management.market.marketing.mba
.md.me.me.uk.med.ec.media
.melbourne.memorial.men.miami.mn
.mobi.mobi.ki.moda.moe.mom
.money.mortgage.movie.ms.mu
.mx.nagoya.name.name.my.navy
.net.net.ag.net.ai.net.cm.net.cn
.net.co.net.ec.net.gg.net.gl.net.gy
.net.hn.net.ht.net.im.net.in.net.ki
.net.lc.net.my.net.nz.net.pe.net.ph
.net.pl.net.sb.net.sc.net.so.net.za
.network.news.ngo.ninja.nl
.nom.ag.nom.co.nom.pl.nrw.nz
.observer.off.ai.one.online.org
.or.at.org.ag.org.ai.org.cn.org.gg
.org.gl.org.hn.org.ht.org.im.org.in
.org.lc.org.my.org.nz.org.ph.org.pl
.org.sb.org.sc.org.so.org.tw.org.uk
.org.za.organic.p.lc.page.paris
.partners.parts.party.pe.pet
.ph.photo.photography.photos.physio
.pics.pictures.pizza.pl.place
.plumbing.plus.pm.poker.porn
.press.pro.ec.productions.promo.properties
.protection.pub.pw.quebec.racing
.re.realty.recipes.rehab.reise
.reisen.rent.rentals.repair.report
.republican.rest.restaurant.review.reviews
.rio.rip.rocks.rodeo.ruhr
.run.sale.salon.sarl.sc
.school.schule.science.scot.se
.security.services.sex.sexy.sh
.shiksha.shoes.shop.shop.pl.shopping
.show.singles.site.ski.so
.soccer.social.software.solar.solutions
.soy.space.srl.st.store
.stream.studio.study.style.sucks
.supplies.supply.support.surf.surgery
.sx.sydney.systems.tattoo.tax
.taxi.team.tech.technology.tel
.tel.ki.tennis.tf.theater.theatre
.tienda.tips.tires.tirol.today
.tokyo.tools.top.tours.town
.toys.trade.training.tube.tv
.tw.university.uno.us.vacations
.vegas.ventures.vet.viajes.video
.villas.vin.vip.vision.vlaanderen
.vodka.vote.voto.voyage.wales
.watch.waw.pl.web.za.webcam.website
.wedding.wf.wien.wiki.win
.wine.work.works.world.ws
.wtf.xxx.xyz.yoga.yokohama
.yt.zone