Shopify ద్వారా నిర్వహించబడే డొమైన్‌లను మరొక స్టోర్ లేదా డొమైన్ ప్రొవైడర్‌కు బదిలీ చేయడం
మీకు Shopify ద్వారా నిర్వహించబడే డొమైన్ ఉండి, మీరు ఇకపై దాన్ని మీ Shopify స్టోర్‌తో ఉపయోగించకూడదనుకుంటే, మీరు మీ డొమైన్‌ను మరొక Shopify స్టోర్ లేదా డొమైన్ ప్రొవైడర్‌కు బదిలీ చేయవచ్చు. ఒకవేళ మీరు మీ Shopify స్టోర్‌ను డీయాక్టివేట్ చేయాలని ప్లాన్ చేస్తూ, మీ Shopify ద్వారా నిర్వహించబడే డొమైన్‌ని ఉపయోగించడాన్ని కొనసాగించాలనుకుంటే, మీరు మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేసే ముందే మీ డొమైన్‌ను బదిలీ చేయండి. మీ స్టోర్ ఇప్పటికే పాజ్ చేయబడినా, డీయాక్టివేట్ చేయబడినా, లేదా స్తంభింపజేయబడినా సరే, మీరు ఇప్పటికీ క్రియారహిత స్టోర్ నుండి మీ డొమైన్‌ను బదిలీ చేయవచ్చు.
ఈ పేజీలో
మీ Shopify ద్వారా నిర్వహించబడే డొమైన్‌ను వేరే Shopify స్టోర్‌కి బదిలీ చేయండి
మీరు డొమైన్‌ల పేజీ నుండి Shopify ద్వారా నిర్వహించబడే డొమైన్‌ను ఒక స్టోర్ నుండి వేరే Shopify స్టోర్‌కి బదిలీ చేయవచ్చు. మీరు మీ డొమైన్‌ను బదిలీ చేసినప్పుడు, డొమైన్‌తో పాటు మీ ఇమెయిల్ ఫార్వార్డింగ్ చిరునామాలు, DNS రికార్డ్‌లు, మరియు సబ్‌డొమైన్‌లు బదిలీ అవుతాయి.
స్టోర్ యజమాని మరియు మరొక Shopify స్టోర్‌కి డొమైన్‌ను బదిలీ చేయండి అనుమతి గల సిబ్బంది మాత్రమే Shopify ద్వారా నిర్వహించబడే డొమైన్‌ను బదిలీ చేయగలరు. బదిలీ లింక్ మీ స్టోర్ ఇమెయిల్ చిరునామాకు పంపబడుతుంది, బదిలీని ప్రారంభించే వ్యక్తికి కాదు. వేరే చిరునామాలో బదిలీ ఇమెయిల్‌ను స్వీకరించడానికి, మీరు కొనసాగే ముందు స్టోర్ ఇమెయిల్ చిరునామాను అప్‌డేట్ చేయండి.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > డొమైన్‌లకు వెళ్లండి.
డొమైన్‌ల విభాగంలో, మీరు బదిలీ చేయాలనుకుంటున్న డొమైన్ పేరుపై క్లిక్ చేయండి.
డొమైన్ సెట్టింగ్‌లు > మరొక Shopify స్టోర్‌కు బదిలీ చేయండిపై క్లిక్ చేయండి.
స్టోర్ ఇమెయిల్ అడ్రస్ అప్‌డేట్ చేసినట్లు నిర్ధారించి, ఆపై బదిలీ లింక్ పంపండిపై క్లిక్ చేయండి.
మీరు బదిలీ ఇమెయిల్ సందేశాన్ని అందుకున్న తర్వాత, కింది వాటిలో ఒకదాన్ని చేయండి:
- మీరు మరొక స్టోర్ యజమాని లేదా మరొక Shopify స్టోర్‌కు డొమైన్‌ను బదిలీ చేయండి అనుమతి ఉన్న సిబ్బంది మెంబర్ అయితే, ఇమెయిల్ టెక్స్ట్‌లోని బదిలీ లింక్‌ను క్లిక్ చేసి, మీరు డొమైన్‌ను బదిలీ చేయాలనుకుంటున్న Shopify స్టోర్‌కు లాగిన్ అవ్వండి.
- మీరు మరొక స్టోర్ యజమాని లేదా మరొక Shopify స్టోర్‌కు డొమైన్‌ను బదిలీ చేయండి అనుమతి ఉన్న సిబ్బంది మెంబర్ కాకపోతే, ఆ స్టోర్‌కు సంబంధించి తగిన అనుమతి ఉన్న వ్యక్తికి ఇమెయిల్ సందేశాన్ని ఫార్వార్డ్ చేయండి.
డొమైన్ బదిలీ విజయవంతం కావడానికి, తగిన అనుమతి ఉన్న స్టోర్ యజమాని లేదా సిబ్బంది మెంబర్ ఇమెయిల్ సందేశంలోని బదిలీ లింక్ నుండి నేరుగా Shopify స్టోర్‌కు లాగిన్ అవ్వాలి. బదిలీ ఆమోదించబడిన తర్వాత, డొమైన్ బదిలీ పూర్తవ్వడానికి గరిష్ఠంగా 24 గంటల సమయం పట్టవచ్చు.
Shopify నిర్వహణలోని డొమైన్‌ను మరొక డొమైన్ ప్రొవైడర్‌కు బదిలీ చేయండి
మీరు మీ డొమైన్‌ను ఇకపై Shopify ద్వారా నిర్వహించకూడదనుకుంటే, Shopify నిర్వహణలోని మీ డొమైన్‌ను మీరు వేరే డొమైన్ ప్రొవైడర్‌కు బదిలీ చేయవచ్చు.
మీరు మీ డొమైన్‌ను బదిలీ చేయడానికి ముందు
Shopify నిర్వహణలోని మీ డొమైన్‌ను మరొక డొమైన్ ప్రొవైడర్‌కు బదిలీ చేసే ముందు, కింది అంశాలను రివ్యూ చేయండి:
- స్టోర్ యజమాని మాత్రమే డొమైన్‌ను మరొక డొమైన్ ప్రొవైడర్‌కు బదిలీ చేయగలరు.
- మీ స్టోర్ పాజ్ చేయబడినా, డీయాక్టివేట్ చేయబడినా లేదా ఫ్రీజ్ చేయబడినా కూడా మీ డొమైన్‌ను బదిలీ చేయవచ్చు. దీని కోసం ముందుగా మీరు పెండింగ్ ఇన్‌వాయిస్ చెల్లించాల్సిన అవసరం లేదు. యాక్టివ్‌గా లేని స్టోర్ నుండి మీ డొమైన్‌ను బదిలీ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
- HTTPS ఉపయోగించని ప్లాట్‌ఫామ్‌కు మీ డొమైన్‌ను మీరు బదిలీ చేస్తే, ఎవరైనా మీ డొమైన్‌ను సందర్శించడానికి ప్రయత్నించినప్పుడు, తదుపరి 90 రోజుల పాటు బ్రౌజర్‌లో ఎర్రర్ సందేశం కనిపిస్తుంది. HTTP స్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ (HSTS) పాలసీ గురించి, సెక్యూరిటీ ఎర్రర్‌లను పరిష్కరించడం గురించి మరింత తెలుసుకోండి.
డొమైన్ ఎక్స్‌టెన్షన్ ఆధారిత అంశాలు
మీ డొమైన్‌లో .com, .net లేదా .org వంటి సాధారణ ఎక్స్‌టెన్షన్ ఉంటే, మీరు కింది చర్యల్లో దేనినైనా పూర్తి చేసిన 60 రోజుల వరకు, మీ డొమైన్ బదిలీకి అర్హత పొందదు:
- డొమైన్ కొనుగోలు చేయడం
- డొమైన్‌ను Shopifyకి బదిలీ చేయడం
- మీ కాంటాక్ట్ సమాచారాన్ని మార్చడం
ఈ నిరీక్షణ వ్యవధి అనేది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ICANN) సెట్ చేసిన బదిలీ పాలసీలో భాగం, కాబట్టి ఇది ప్రతి డొమైన్ ప్రొవైడర్ వద్ద వర్తిస్తుంది. .ca వంటి కంట్రీ-కోడ్ ఎక్స్‌టెన్షన్ ఉన్న డొమైన్‌లు ఆ రిజిస్ట్రీకి సంబంధించిన నియమాలను పాటిస్తాయి, వాటిల్లో భిన్నమైన నియమాలు ఉండొచ్చు. .us డొమైన్‌కు కూడా ఇదే 60-రోజుల నిరీక్షణ వ్యవధి వర్తిస్తుంది. మరింత సమాచారం కోసం, డొమైన్ పేరు కలిగిన వ్యక్తుల కోసం ICANN బదిలీ పాలసీని చూడండి.
బదిలీ చేయడానికి మీ డొమైన్ అర్హత పొందేంత వరకు, మీ డొమైన్‌ను వేరొక హోస్ట్‌కి పాయింట్ చేయడానికి మీరు మీ DNS సెట్టింగ్‌లను ఎడిట్ చేయవచ్చు. బదిలీకి ముందు మీ డొమైన్ పునరుద్ధరించబడటాన్ని ఆపడానికి, మీరు స్వయంచాలక పునరుద్ధరణను డీయాక్టివేట్ చేయవచ్చు.
మీ డొమైన్ బదిలీ విధానం అనేది దాని ఎక్స్‌టెన్షన్‌పై ఆధారపడి ఉంటుంది. చాలా ఎక్స్‌టెన్షన్స్ కోసం, డొమైన్ ఆథరైజేషన్ కోడ్‌ను ఉపయోగించడం ద్వారా మీ Shopify అడ్మిన్ నుండి డొమైన్‌ను బదిలీ చేయవచ్చు. అయితే, మీ Shopify అడ్మిన్ నుండి కింది ఎక్స్‌టెన్షన్స్ ఉన్న డొమైన్‌ను మీరు బదిలీ చేయలేరు:
| డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ | బదిలీ దశలు |
|---|---|
| డొమైన్ ఆథరైజేషన్ కోడ్‌తో బదిలీ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి Shopify సపోర్ట్‌ను సంప్రదించండి. |
| మీ కొత్త డొమైన్ ప్రొవైడర్ నుండి IPS ట్యాగ్ పొందండి. ఆపై, ఆ IPS ట్యాగ్‌తో బదిలీ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి Shopify సపోర్ట్‌ను సంప్రదించండి. |
| బదిలీని ప్రారంభించాల్సిందిగా మీ కొత్త డొమైన్ ప్రొవైడర్‌ను కోరండి, ఆపై మీకు అందే నిర్ధారణ ఇమెయిల్‌ను ఆమోదించండి. మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించాల్సిన అవసరం లేదు. .za బదిలీ పూర్తవ్వడానికి 5 నుండి 10 రోజుల సమయం పడుతుంది. |
.lu లేదా .zaతో ముగిసే డొమైన్‌లు డొమైన్ ఆథరైజేషన్ కోడ్‌ను ఉపయోగించవు, అలాగే వాటి బదిలీ ప్రాసెస్‌లో ఎక్కడ కూడా Shopify సపోర్ట్ అవసరం లేదు. మీ కొత్త డొమైన్ ప్రొవైడర్ బదిలీని ప్రారంభిస్తారు, ఆ తర్వాత మీకు అందే నిర్ధారణ ఇమెయిల్‌ను మీరు ఆమోదిస్తారు. .za బదిలీ పూర్తవ్వడానికి 5 నుండి 10 రోజుల సమయం పడుతుంది.
మీ Shopify అడ్మిన్ నుండి మీ డొమైన్‌ను బదిలీ చేయండి
మీరు బదిలీని ప్రారంభించినప్పుడు, మీ డొమైన్ ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. బదిలీని పూర్తి చేయడానికి, మీ కొత్త డొమైన్ ప్రొవైడర్‌కు డొమైన్ ఆథరైజేషన్ కోడ్‌ను ఇవ్వండి.
బదిలీ విజయవంతంగా పూర్తి కావడానికి గరిష్ఠంగా 7 రోజులు పట్టవచ్చు. మీరు 30 రోజుల్లోపు డొమైన్ బదిలీని పూర్తి చేయకుంటే, మీ డొమైన్ మళ్లీ లాక్ అవుతుంది. 30 రోజుల తర్వాత బదిలీని పూర్తి చేయడానికి, మీరు ప్రస్తుతం ఉన్న బదిలీని రద్దు చేసి, బదిలీ ప్రాసెస్‌ను మళ్లీ ప్రారంభించాలి.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > డొమైన్‌లకు వెళ్లండి.
డొమైన్‌ల విభాగంలో, మీరు బదిలీ చేయాలనుకుంటున్న డొమైన్ పేరుపై క్లిక్ చేయండి.
డొమైన్ సెట్టింగ్‌లు > మరొక ప్రొవైడర్‌కు బదిలీ చేయండిపై క్లిక్ చేయండి.
సమాచారాన్ని రివ్యూ చేసి, ఆపై నిర్ధారించండిపై క్లిక్ చేయండి. మీ డొమైన్ సమాచార పేజీలో డొమైన్ ఆథరైజేషన్ కోడ్ డిస్‌ప్లే అవుతుంది.
బదిలీని వెరిఫై చేయడానికి మీ కొత్త డొమైన్ ప్రొవైడర్‌కు డొమైన్ ఆథరైజేషన్ కోడ్‌ను ఇవ్వండి.
యాక్టివ్‌గా లేని స్టోర్ నుండి మీ డొమైన్‌ను బదిలీ చేయండి
మీ స్టోర్ పాజ్ చేయబడినా, డీయాక్టివేట్ చేయబడినా లేదా ఫ్రీజ్ చేయబడినా, మీ Shopify అడ్మిన్ పరిమిత పేజీలను మాత్రమే డిస్‌ప్లే చేస్తుంది, వాటిల్లో డొమైన్‌ల పేజీ ఉండదు. అయినప్పటికీ, నేరుగా డొమైన్‌ల పేజీకి చెందిన పరిమిత వెర్షన్‌ను తెరవడం ద్వారా మీరు Shopify నిర్వహణలోని డొమైన్‌ను మరొక డొమైన్ ప్రొవైడర్‌కు బదిలీ చేయవచ్చు. ముందుగా మీరు మీ స్టోర్‌ను మళ్లీ యాక్టివేట్ చేయాల్సిన, లేదా పెండింగ్ ఇన్‌వాయిస్ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ పేజీకి చెందిన వెర్షన్, మీ డొమైన్‌లను చూడటానికి, Shopify నిర్వహణలోని మీ డొమైన్‌లను బదిలీ చేయడానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
మీ డొమైన్‌లో మీ Shopify అడ్మిన్ నుండి బదిలీ చేయలేని ఎక్స్‌టెన్షన్స్లో ఒకటి ఉన్నా లేదా ఈ పేజీలో మీ డొమైన్ లిస్ట్ చేయబడకపోయినా, ఈ దశలను అనుసరించడానికి బదులుగా Shopify సపోర్ట్‌ను సంప్రదించండి. ఒకవేళ మీ డొమైన్ .lu లేదా .za ఎక్స్‌టెన్షన్స్‌తో ముగిసినట్లయితే, దానికి బదులుగా బదిలీని ప్రారంభించాల్సిందిగా మీ కొత్త డొమైన్ ప్రొవైడర్‌ను కోరండి.
మీరు డొమైన్ బదిలీని 30 రోజులలోపు పూర్తి చేయకపోతే, మీ డొమైన్ మళ్లీ లాక్ చేయబడుతుంది. 30 రోజుల తర్వాత బదిలీని పూర్తి చేయడానికి, మీరు ఇప్పటికే ఉన్న బదిలీని రద్దు చేసి, బదిలీ ప్రాసెస్‌ను మళ్లీ ప్రారంభించాలి. విజయవంతంగా బదిలీ పూర్తి కావడానికి 7 రోజుల వరకు సమయం పట్టవచ్చు.
దశలు:
- మీ Shopify అడ్మిన్‌లోకి లాగిన్ అవ్వండి. మీ స్టోర్ ఇన్‌యాక్టివ్‌గా ఉంది కాబట్టి, మీరు
/access_accountని కలిగి ఉన్న URL పేజీకి మళ్లించబడతారు. - మీ బ్రౌజర్ అడ్రస్ బార్‌లో,
/access_accountని, అలాగే దాని తర్వాత ఉన్నదంతటినీ/access_account/domainsతో భర్తీ చేయండి, ఆపై Enter నొక్కండి. - డొమైన్‌ల విభాగంలో, మీరు బదిలీ చేయాలనుకుంటున్న డొమైన్ పేరుపై క్లిక్ చేయండి.
- డొమైన్ సెట్టింగ్‌లు > మరొక ప్రొవైడర్‌కు బదిలీ చేయండిపై క్లిక్ చేయండి.
- సమాచారాన్ని రివ్యూ చేసి, ఆపై నిర్ధారించండిపై క్లిక్ చేయండి. మీ డొమైన్ సమాచార పేజీలో డొమైన్ ఆథరైజేషన్ కోడ్ డిస్‌ప్లే అవుతుంది.
- బదిలీని వెరిఫై చేయడానికి మీ కొత్త డొమైన్ ప్రొవైడర్‌కు డొమైన్ ఆథరైజేషన్ కోడ్‌ను ఇవ్వండి.
మీ డొమైన్‌ను Shopify సపోర్ట్‌తో బదిలీ చేయండి
మీ డొమైన్ .lu లేదా .zaతో ముగిస్తే తప్ప, మీ Shopify అడ్మిన్ నుండి బదిలీ చేయలేని ఎక్స్‌టెన్షన్ మీ డొమైన్‌కు ఉంటే, ఆ బదిలీని ప్రారంభించడానికి Shopify సపోర్ట్‌ను సంప్రదించండి. మీరు సంప్రదించడానికి ముందు, డొమైన్‌ను అంగీకరించడానికి వారికి ఏమి కావాలని మీ కొత్త డొమైన్ ప్రొవైడర్‌ను అడగండి.
.co.uk వలె .ukతో ముగిసే డొమైన్, డొమైన్ ఆథరైజేషన్ కోడ్‌ని ఉపయోగించదు. దానికి బదులుగా, ఇది డొమైన్‌ను నిర్వహించే డొమైన్ ప్రొవైడర్‌ను గుర్తించే ఇంటర్నెట్ ప్రొవైడర్ సెక్యూరిటీ (IPS) ట్యాగ్ను ఉపయోగిస్తుంది. .uk డొమైన్‌ను బదిలీ చేయడానికి, మీ కొత్త డొమైన్ ప్రొవైడర్‌ను వారి IPS ట్యాగ్ కోసం అడగండి, ఆపై ఆ ట్యాగ్‌ని Shopify సపోర్ట్‌కు ఇవ్వండి.
HTTP Strict Transport Security (HSTS)
HTTP Strict Transport Security (HSTS) అనేది మీ ఆన్‌లైన్ స్టోర్‌కు బ్రౌజర్‌లు సురక్షిత HTTPS కనెక్షన్ ద్వారా మాత్రమే కనెక్ట్ అయ్యేలా నిర్ధారించే వెబ్ సెక్యూరిటీ విధానం. సురక్షిత కనెక్షన్‌ను ఉపయోగించడం వలన నిర్దిష్ట రకాల నెట్‌వర్క్ దాడులు నిరోధించబడతాయి, ఇంకా మీ డేటా మరియు మీ కస్టమర్‌ల డేటా భద్రతను నిర్ధారించడంలో కూడా సహాయపడుతుంది. మీ డొమైన్, మీ Shopify స్టోర్‌కు కనెక్ట్ చేయబడినంత కాలం HSTS మీ డొమైన్‌లో యాక్టివ్‌గా ఉంటుంది.
మీరు డొమైన్‌ను తీసివేసినా లేదా పూర్తిగా Shopify నుండి నిష్క్రమించినా కూడా, అదనంగా 90 రోజుల పాటు Shopifyకు చెందిన HSTS పాలసీ మీ డొమైన్‌పై అమలులో ఉంటుంది. మీరు మీ డొమైన్‌ను HTTPSని ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌కు బదిలీ చేస్తే, మీరు అదనపు విధానాలేవైనా చేయాల్సిన అవసరం లేదు.
మీరు మీ డొమైన్‌ను HTTPSని ఉపయోగించని ప్లాట్‌ఫారమ్‌కు బదిలీ చేసినట్లయితే, తర్వాత 90 రోజుల పాటు, ఎవరైనా మీ డొమైన్‌ను సందర్శించడానికి ప్రయత్నించినప్పుడు బ్రౌజర్‌లో ఎర్రర్ మెసేజ్ ప్రదర్శించబడుతుంది. ఆ సైట్ విశ్వసించదగినది కాదని లేదా సర్టిఫికెట్ చెల్లదని ఎర్రర్ మెసేజ్ పేర్కొనవచ్చు. ఆ సందర్భంలో, మీరు ఈ ఆప్షన్‌లలో ఒకదానిని ఎంచుకోవచ్చు:
- 90-రోజుల గడువు ముగిసే వరకు వేచి ఉండండి.
- కొత్త TLS సర్టిఫికెట్‌ను అందించే ప్లాట్‌ఫారమ్‌కు మీ డొమైన్‌ను బదిలీ చేయండి.
- సర్టిఫికెట్ అథారిటీ నుండి TLS సర్టిఫికెట్‌ను కొనుగోలు చేయండి.
మీకు HSTS గురించి ఏవైనా సందేహాలు ఉంటే, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.