మీ Shopify స్టోర్‌కు సురక్షిత కనెక్షన్‌లను ఎనేబుల్ చేయడం
మీ Shopify స్టోర్‌కు సురక్షిత కనెక్షన్‌లను ఎనేబుల్ చేయడం వల్ల, మీ కస్టమర్‌లు ఎంటర్ చేసే డేటా గోప్యంగా మరియు సురక్షితంగా ఉంటుందని నిర్ధారించబడుతుంది. ఇది TLS (ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ) సర్టిఫికెట్, దీనిని కొన్నిసార్లు SSL (సెక్యూర్ సాకెట్స్ లేయర్) సర్టిఫికెట్ అని కూడా అంటారు, దీన్ని ఉపయోగించి సాధించబడుతుంది. ఇది మీ స్టోర్ మరియు బాహ్య కంటెంట్ మధ్య కమ్యూనికేషన్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది మరియు కంటెంట్‌ను HTTPకి బదులుగా HTTPS ఉపయోగించి సురక్షితంగా ప్రచురిస్తుంది.
ఉదాహరణకు, మీ స్టోర్ URL గనక http://www.example.com అయితే, TLS సర్టిఫికెట్ జారీ చేసినప్పుడు URL https://www.example.comగా మారుతుంది. మీ కస్టమర్‌లు అసలు URLని ఉపయోగిస్తే, వారు ఆటోమేటిక్‌గా ఎన్‌క్రిప్ట్ చేసిన ఆన్‌లైన్ స్టోర్‌కు దారి మళ్లించబడతారు.
TLS సర్టిఫికెట్‌లతో మీ ఆన్‌లైన్ స్టోర్‌కు కింది ప్రయోజనాలు ఉన్నాయి:
- ఇవి కస్టమర్ డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా భద్రతను ఒక లేయర్ మేర పెంచుతాయి.
- ఇవి మీ ఆన్‌లైన్ స్టోర్ URL పక్కన ప్యాడ్‌లాక్ ఐకాన్‌ను చూపడం ద్వారా మీ కస్టమర్‌ల నమ్మకాన్ని పెంచడంలో సహాయపడతాయి.

ఈ పేజీలో
TLS సర్టిఫికెట్‌ను పొందడం
Shopifyకి జోడించిన అన్ని డొమైన్‌లకు TLS సర్టిఫికెట్‌లు ఉచితంగా అందించబడతాయి. కింది సందర్భాలలో TLS సర్టిఫికెట్ ఆటోమేటిక్‌గా జారీ చేయబడుతుంది:
.myshopify.comడొమైన్లో హోస్ట్ చేసిన ఏవైనా అసెట్ల కోసం.- మీరు Shopify ద్వారా కస్టమ్ డొమైన్‌ను కొనుగోలు చేసినప్పుడు లేదా ఒక డొమైన్‌ను Shopifyకి బదిలీ చేసినప్పుడు.
- Shopifyని సూచించేలా మీ A రికార్డ్ మరియు CNAME రికార్డ్‌ను మార్చడం ద్వారా మీరు మీ థర్డ్-పార్టీ డొమైన్‌ను Shopifyకి కనెక్ట్ చేసినప్పుడు. ఈ సందర్భంలో, TLS సర్టిఫికెట్‌ను జారీ చేయడానికి గరిష్ఠంగా 48 గంటల సమయం పట్టవచ్చు. ఆ సమయంలో, మీ Shopify అడ్మిన్ డొమైన్ సెట్టింగ్‌లలో TLS లేదా SSL పెండింగ్ అనేది కనిపించవచ్చు. 48 గంటల తర్వాత, మీ TLS విఫలమైతే, మీ Shopify అడ్మిన్ డొమైన్ సెట్టింగ్‌లలో TLS లేదా SSL అందుబాటులో లేదు అనే మెసేజ్ కనిపించవచ్చు. 48 గంటల తర్వాత మీ స్టోర్‌ఫ్రంట్‌లో
Your connection is unsecure(మీ కనెక్షన్ సురక్షితం కాదు) అనే ఎర్రర్ మెసేజ్ లాంటిది కనిపిస్తే, ట్రబుల్షూటింగ్ దశలను ప్రయత్నించండి. ఆ దశలతో TLS సమస్యలు పరిష్కారం కాకపోతే, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
డొమైన్‌ల పేజీలో డొమైన్ స్టేటస్ Connected (కనెక్ట్ చేయబడింది) అని ఉందో లేదో నిర్ధారించుకోవడం ద్వారా మీ TLS సర్టిఫికెట్ జారీ చేయబడిందని మీరు నిర్ధారించుకోవచ్చు. దానికి తోడు, మీరు మీ స్టోర్‌ఫ్రంట్‌ను చూసినప్పుడు అడ్రస్ బార్‌లోని మీ ఆన్‌లైన్ స్టోర్ URL పక్కన ప్యాడ్‌లాక్ ఐకాన్ కనిపిస్తుంది.
మీ అసెట్‌లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం
మీ ఆన్‌లైన్ స్టోర్‌లో ఇమేజ్‌లు, వీడియోలు, వెబ్‌ఫాంట్‌లు లేదా Shopifyలో కాకుండా మరెక్కడైనా హోస్ట్ చేయబడిన ఇతర అసెట్‌లు ఉంటే, అవి ఖచ్చితంగా HTTPS ద్వారా డెలివరీ చేయబడాలి. మీ Shopify ఆన్‌లైన్ స్టోర్‌లోని ఏ పేజీలోనైనా HTTPS ద్వారా డెలివరీ చేయబడని అసెట్ ఉన్నట్లయితే, అది అసురక్షితంగా పరిగణించబడుతుంది.
మీ అసెట్‌లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఉత్తమ ఎంపిక ఏంటంటే, మీ ఆన్‌లైన్ స్టోర్ అసెట్‌లన్నింటినీ Shopifyలో హోస్ట్ చేయడం.
మీరు మీ అసెట్‌లను Shopify బయట హోస్ట్ చేయాల్సి వస్తే, మీరు కింది వాటిని తప్పక చేశారని నిర్ధారించుకోండి:
- HTTPS ద్వారా ప్రచురించే సర్వర్‌పై మీ అసెట్‌లను హోస్ట్ చేయండి. మీ Shopify అడ్మిన్‌కు ఫైల్‌లను అప్లోడ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
- HTTPS ద్వారా ప్రచురించే సర్వీస్‌పై మీ వీడియో కంటెంట్‌ను హోస్ట్ చేయండి.
- మీరు వెబ్ఫాంట్లను ఉపయోగించినప్పుడు, అవి వాటి సోర్స్ నుండి HTTPS ద్వారా ప్రచురించబడతాయని నిర్ధారించుకోండి.
సర్టిఫికేషన్ అథారిటీ ఆథరైజేషన్ (CAA) రికార్డులు
డొమైన్ కోసం సర్టిఫికెట్‌లను జారీ చేయడానికి ఏ సర్టిఫికెట్ అథారిటీలకు అనుమతి ఉందో పేర్కొనడానికి సర్టిఫికేషన్ అథారిటీ ఆథరైజేషన్ (CAA) రికార్డ్ ఉపయోగించబడుతుంది. సర్టిఫికెట్ అథారిటీ (CA) అనేది ఇంటర్నెట్‌లో ఒక డిజిటల్ ఎంటిటీ గుర్తింపును వెరిఫై చేసే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్‌లను జారీ చేసే విశ్వసనీయ ఎంటిటీ.
మీ స్టోర్ కోసం మీకు CAA రికార్డులు అవసరం లేదు. అయినప్పటికీ, మీరు తప్పనిసరిగా CAA రికార్డులను ఉపయోగించాల్సి వస్తే, మీరు మీ డొమైన్‌ను Shopifyకి కనెక్ట్ చేసే సమయంలోనే ప్రతి CAA రికార్డ్‌కు కింది సర్టిఫికెట్ అథారిటీలు (CA) జోడించబడాలి:
మీ థర్డ్-పార్టీ డొమైన్ కోసం భద్రతా ఎర్రర్‌ల ట్రబుల్షూటింగ్
మీ డొమైన్ కనెక్ట్ చేసిన తర్వాత "SSL pending", "SSL unavailable" లేదా "Your connection is unsecure" లాంటి మెసేజ్‌లతో TLS లేదా SSL ఎర్రర్‌లు వస్తే, అప్పుడు DNS వెరిఫికేషన్, CAA రికార్డ్ అవసరాలు, అలాగే DNSSEC పరిశీలనలతో సహా దశలవారీ పరిష్కారం కోసం డొమైన్‌ల సమస్యల ట్రబుల్షూటింగ్ను చూడండి.