మీ EU డొమైన్ రిజిస్ట్రేషన్ సమాచారాన్ని వెరిఫై చేయడం
డొమైన్ రిజిస్ట్రేషన్ డేటాకు సంబంధించిన NIS2 (నెట్‌వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డైరెక్టివ్ 2) ఆవశ్యకతలకు అనుగుణంగా, నిర్దిష్ట EU డొమైన్‌లకు యజమాని సమాచారం వెరిఫికేషన్ అవసరం. ఈ ఆర్టికల్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను, దాన్ని ఎలా పూర్తి చేయాలి, అలాగే సాధారణ సమస్యలను ఎలా ట్రబుల్షూట్ చేయాలో వివరిస్తుంది.
ఈ పేజీలో
- EU డొమైన్ వెరిఫికేషన్‌ను అర్థం చేసుకోవడం
- NIS2 సమ్మతి ఆవశ్యకతలు
- వెరిఫికేషన్ అవసరమయ్యే డొమైన్‌లు
- వెరిఫికేషన్ కోసం టైమ్‌లైన్
- వెరిఫికేషన్ ప్రాసెస్ ఓవర్‌వ్యూ
- మీ డొమైన్ సమాచారాన్ని గుర్తించడం
- అసంపూర్ణ వెరిఫికేషన్ పరిణామాలు
- సాధారణ సమస్యల ట్రబుల్షూటింగ్
- విజయవంతమైన వెరిఫికేషన్ కోసం చిట్కాలు
- తరచుగా అడిగే ప్రశ్నలు
- గోప్యత, భద్రత
- సంబంధిత అంశాలు
EU డొమైన్ వెరిఫికేషన్‌ను అర్థం చేసుకోవడం
డొమైన్ వెరిఫికేషన్ అనేది మీ డొమైన్‌కు రిజిస్టర్ అయిన సమాచారం కచ్చితంగా, తాజాగా ఉందని నిర్ధారించడానికి EU సమ్మతి చట్టం ద్వారా అవసరమైన ప్రాసెస్. యూరోపియన్ నిబంధనలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి నిర్దిష్ట డొమైన్ రిజిస్ట్రీలు (జర్మనీకి .DE, ఇటలీకి .IT వంటివి) ఈ ఆవశ్యకతను అడుగుతాయి.
NIS2 సమ్మతి ఆవశ్యకతలు
కచ్చితమైన రిజిస్ట్రేషన్ డేటాను నిర్వహించాల్సిన అవసరం యూరోపియన్ యూనియన్‌లోని డొమైన్ రిజిస్ట్రీలకు ఉందని NIS2 నిర్దేశిస్తుంది. డొమైన్ హోల్డర్‌ల గుర్తింపును నిర్ధారించడం ద్వారా యూరప్ అంతటా డొమైన్ రిజిస్ట్రేషన్‌ల భద్రత, సమగ్రతను కచ్చితం చేయడానికి ఇది సహాయపడుతుంది.
వెరిఫికేషన్ అవసరమయ్యే డొమైన్‌లు
అన్ని డొమైన్‌లకు వెరిఫికేషన్ అవసరం లేదు. డొమైన్ రిజిస్ట్రీ ప్రత్యేకంగా దాన్ని అభ్యర్థించినప్పుడు, అలాగే మీరు Shopify నుండి వెరిఫికేషన్ అభ్యర్థనను అందుకున్నప్పుడు, మీరు మీ డొమైన్ సమాచారాన్ని వెరిఫై చేయాలి.
కింది EU డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లకు సాధారణంగా వెరిఫికేషన్ అవసరం:
| డొమైన్ ఎక్స్టెన్షన్ | దేశం | వెరిఫికేషన్ వివరాలు |
|---|---|---|
| .DE | జర్మనీ | సంప్రదింపు సమాచారం కచ్చితత్వానికి సంబంధించిన వెరిఫికేషన్ అవసరం |
| .IT | ఇటలీ | Registro Imprese ద్వారా వెరిఫికేషన్ అవసరం |
| .EU | యూరోపియన్ యూనియన్ | EURid ద్వారా వెరిఫికేషన్ అవసరం కావచ్చు |
| .BE | బెల్జియం | DNSBelgium ద్వారా వెరిఫికేషన్ అవసరం కావచ్చు |
| .NL | నెదర్లాండ్స్ | SIDN ద్వారా వెరిఫికేషన్ అవసరం కావచ్చు |
వెరిఫికేషన్ కోసం టైమ్‌లైన్
ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి వెరిఫికేషన్ అభ్యర్థనలు సాధారణంగా 14 క్యాలెండర్ రోజుల గడువును కలిగి ఉంటాయి. అయితే, నిర్దిష్ట డొమైన్ రిజిస్ట్రీని బట్టి టైమ్‌లైన్ మారవచ్చు.
వెరిఫికేషన్ ప్రాసెస్ ఈ దశలను అనుసరిస్తుంది:
- రోజు 1: మీరు వెరిఫికేషన్ అభ్యర్థనను పొందుతారు.
- రోజులు 1-14: మీ సమాచారాన్ని సమీక్షించి, అవసరమైన డాక్యుమెంట్‌లను సమర్పించండి.
- డాక్యుమెంట్ సమర్పణ తర్వాత: రిజిస్ట్రీ మీ డాక్యుమెంట్‌లను సమీక్షిస్తుంది (సమీక్షా సమయాలు రిజిస్ట్రీని బట్టి మారుతాయి).
- వెరిఫికేషన్ పూర్తయింది: డొమైన్ అన్‌లాక్ చేయబడి, పూర్తిగా పని చేస్తుంది.
వెరిఫికేషన్ ప్రాసెస్ ఓవర్‌వ్యూ
నోటిఫికేషన్‌ను పొందండి
మీరు వెరిఫికేషన్ అభ్యర్థనను, నోటిఫికేషన్‌ను రెండు విధాలుగా పొందుతారు:
- ఇమెయిల్ నోటిఫికేషన్: "చర్య అవసరం: [మీ డొమైన్ పేరు] కోసం వెరిఫికేషన్" అనే సబ్జెక్ట్ లైన్‌తో మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌కి పంపబడింది
- అడ్మిన్ నోటిఫికేషన్: మీ Shopify అడ్మిన్ డాష్‌బోర్డ్‌లో ఒక నోటీసు ప్రదర్శించబడుతుంది
మీ వెరిఫికేషన్ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయడానికి సురక్షితమైన లింక్ ఇమెయిల్‌లో ఉంటుంది. ఈ లింక్ మీ వెరిఫికేషన్ అభ్యర్థనకు మాత్రమే ప్రత్యేకమైనది.
మీ డొమైన్ సమాచారాన్ని రివ్యూ చేయండి
వెరిఫికేషన్ ఇమెయిల్‌లో మీ ప్రస్తుత రిజిస్టర్డ్ సమాచారం ఉంటుంది:
- సంస్థ పేరు
- కాంటాక్ట్ పేరు
- వీధి చిరునామా
- నగరం మరియు పోస్టల్ కోడ్
- దేశం
ఈ సమాచారాన్ని జాగ్రత్తగా రివ్యూ చేయండి. ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి ముందు మీరు మీ డొమైన్ కాంటాక్ట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి. అప్‌లోడ్ చేసిన మీ డాక్యుమెంట్‌లు రిజిస్టర్ చేసిన సమాచారంతో కచ్చితంగా సరిపోలాలి.
అవసరమైన డాక్యుమెంట్‌లను సమర్పించండి
మీ గుర్తింపును వెరిఫై చేయడానికి లేదా అప్‌డేట్ చేయడానికి, ఇమెయిల్‌లో అందించిన సురక్షిత లింక్ ద్వారా ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపును అప్‌లోడ్ చేయండి.
వ్యక్తిగత రిజిస్ట్రేషన్‌ల కోసం:
- పాస్‌పోర్ట్, లేదా
- డ్రైవింగ్ లైసెన్స్
వ్యాపార రిజిస్ట్రేషన్‌ల కోసం:
- ఓనర్ యొక్క ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ID, మరియు
- వ్యాపార రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
డాక్యుమెంట్ ఆవశ్యకతలు
మీ డాక్యుమెంట్‌లు కింది ఆవశ్యకతలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోండి:
- ఫైల్ ఫార్మాట్: JPEG, PNG లేదా PDF
- ఫైల్ పరిమాణం: ప్రతి ఫైల్ 8 MB లేదా అంతకంటే తక్కువ
- ఇమేజ్ క్వాలిటీ: స్పష్టమైనది, చదవడానికి వీలుగా ఉండేది మరియు రంగులో ఉండాలి (గ్రేస్కేల్ కాదు)
- పూర్తి విజిబిలిటీ: డాక్యుమెంట్ అంచులన్నీ స్పష్టంగా కనిపించాలి
- మార్పులు చేయరాదు: ఏ సమాచారాన్ని కవర్ చేయకండి, బ్లర్ చేయకండి లేదా రిడాక్ట్ చేయకండి
- ప్రస్తుత చెల్లుబాటు: గడువు ముగిసిన డాక్యుమెంట్‌లు అంగీకరించబడవు
- అసలైన ఫోటోగ్రాఫ్‌లు: కెమెరాతో తీసిన అసలైన ఫోటోలను సమర్పించండి, స్కాన్‌లు లేదా ఫోటోకాపీలు కాదు
డాక్యుమెంట్‌లను సురక్షితంగా అప్‌లోడ్ చేయండి
దశలు:
- మీ వెరిఫికేషన్ ఇమెయిల్ లేదా అడ్మిన్ నోటిఫికేషన్‌లో అందించిన సురక్షిత అప్‌లోడ్ లింక్‌ను క్లిక్ చేయండి.
- మీరు అప్‌లోడ్ చేస్తున్న డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోండి.
- మీ డాక్యుమెంట్‌ల యొక్క స్పష్టమైన ఫోటోలు లేదా స్కాన్‌లను అప్‌లోడ్ చేయండి.
- అప్‌లోడ్ చేసిన ఫైల్‌లలోని మొత్తం సమాచారం చదవడానికి వీలుగా ఉందని నిర్ధారించుకోండి.
- గడువుకు ముందు మీ డాక్యుమెంట్‌లను సమర్పించండి.
మీ డొమైన్ సమాచారాన్ని గుర్తించడం
మీ Shopify అడ్మిన్‌లో మీ డొమైన్ పేరును కనుగొనండి
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > డొమైన్‌లుకి వెళ్లండి.
మీ డొమైన్ పేర్లు డొమైన్‌ల పేజీలోని లిస్ట్‌లో ప్రదర్శించబడతాయి. వెరిఫికేషన్ అవసరమైన డొమైన్‌లో చర్య అవసరం బ్యాడ్జ్ ప్రదర్శించబడుతుంది.
మీ వెరిఫికేషన్ ఇమెయిల్‌ను గుర్తించండి
మీకు వెరిఫికేషన్ ఇమెయిల్ కనబడకపోతే, కింది లొకేషన్‌లను చెక్ చేయండి:
- స్పామ్ లేదా జంక్ ఫోల్డర్: కొన్నిసార్లు వెరిఫికేషన్ ఇమెయిల్‌లు ఫిల్టర్ చేయబడతాయి
- ప్రమోషన్‌లు లేదా అప్‌డేట్‌ల ట్యాబ్: మీరు Gmailను ఉపయోగిస్తుంటే, ఈ ట్యాబ్‌లను చెక్ చేయండి
- రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్: మీరు మీ డొమైన్ రిజిస్ట్రేషన్‌తో అనుబంధించబడిన ఇమెయిల్ అడ్రస్‌ను చెక్ చేస్తున్నారని నిర్ధారించుకోండి
మీ డొమైన్‌కు ఏ ఇమెయిల్ అడ్రస్ రిజిస్టర్ చేయబడిందో నిర్ధారించడానికి:
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > డొమైన్‌లుకి వెళ్లండి.
వెరిఫికేషన్ అవసరమైన డొమైన్ పేరును క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ వివరాలు సెక్షన్‌లో, కాంటాక్ట్ సమాచారం పక్కన ఉన్న ఎడిట్ ఐకాన్‌ను క్లిక్ చేయండి.
రిజిస్టర్డ్ అడ్రస్‌ను నిర్ధారించడానికి ఇమెయిల్ ఫీల్డ్‌ను రివ్యూ చేయండి.
అసంపూర్ణమైన వెరిఫికేషన్ యొక్క పర్యవసానాలు
గడువులోపు వెరిఫికేషన్ పూర్తికాకపోతే:
- మీ డొమైన్ లాక్ చేయబడిన స్టేటస్‌లో ఉంటుంది
- మీరు డొమైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేరు
- ఇమెయిల్ మరియు వెబ్‌సైట్ పనితీరుతో సహా డొమైన్ సర్వీస్‌లకు అంతరాయం కలగవచ్చు
- మీ డొమైన్‌ను రిజిస్ట్రీ చివరికి సస్పెండ్ చేయవచ్చు
సాధారణ సమస్యల ట్రబుల్షూటింగ్
వెరిఫికేషన్ ఇమెయిల్ అందకపోతే ట్రబుల్షూట్ చేయండి
మీకు వెరిఫికేషన్ ఇమెయిల్ అందకపోతే, కింది దశలను ప్రయత్నించండి:
దశలు:
- మీ స్పామ్, జంక్ లేదా ప్రమోషన్‌ల ఫోల్డర్‌లను చెక్ చేయండి.
- Shopify నుండి వచ్చిన "చర్య అవసరం" లేదా "వెరిఫికేషన్" కోసం మీ ఇన్‌బాక్స్‌లో సెర్చ్ చేయండి.
- మీరు మీ డొమైన్‌కు రిజిస్టర్ చేయబడిన ఇమెయిల్ అడ్రస్‌ను చెక్ చేస్తున్నారని నిర్ధారించండి. మీరు మీ Shopify అడ్మిన్‌లో మీ రిజిస్టర్డ్ ఇమెయిల్‌ను వీక్షించవచ్చు.
- భవిష్యత్తులో ఫిల్టర్ చేయబడకుండా నిరోధించడానికి మీ సురక్షిత పంపినవారి లిస్ట్‌కి Shopify ఇమెయిల్ అడ్రస్‌లను జోడించండి.
- ఇమెయిల్ ఇంకా కనబడకపోతే, కొత్త వెరిఫికేషన్ ఇమెయిల్‌ను అభ్యర్థించడానికి Shopify సపోర్ట్ను సంప్రదించండి.
వెరిఫికేషన్ లింక్ గడువు ముగిసినట్లయితే ట్రబుల్షూట్ చేయండి
ఒకవేళ మీ వెరిఫికేషన్ లింక్ గడువు ముగిసినట్లయితే, మీరు కొత్త దానిని అభ్యర్థించాలి.
దశలు:
- గడువు ముగిసిన లింక్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే అది పని చేయదు.
- Shopify సపోర్ట్ను సంప్రదించి, మీ వెరిఫికేషన్ లింక్ గడువు ముగిసిందని వివరించండి.
- మీ డొమైన్ పేరు, అలాగే డొమైన్‌తో అనుబంధించబడిన ఇమెయిల్ అడ్రస్‌ను అందించండి.
- కొత్త వెరిఫికేషన్ లింక్‌ను రూపొందించడంలో Shopify సపోర్ట్ మీకు సహాయం చేయగలదు.
డాక్యుమెంట్‌లు అంగీకరించబడనట్లయితే ట్రబుల్షూట్ చేయండి
ఒకవేళ మీ డాక్యుమెంట్‌లు అంగీకరించబడనట్లయితే, కింది సాధారణ సమస్యలను రివ్యూ చేయండి:
- పేరు సరిపోలకపోవడం: మీ IDలోని పేరు కచ్చితంగా మీ డొమైన్ రిజిస్ట్రేషన్‌లోని పేరుతో సరిపోలాలి. అవి సరిపోలకపోతే, ముందుగా మీ డొమైన్ కాంటాక్ట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
- పేలవమైన ఇమేజ్ క్వాలిటీ: మీ ఫోటోలు స్పష్టంగా, మంచి వెలుతురులో ఉండేలా మరియు మొత్తం టెక్స్ట్ చదవడానికి వీలుగా ఉండేలా చూసుకోండి.
- అసంపూర్ణ డాక్యుమెంట్‌లు: డాక్యుమెంట్ అంచులన్నీ స్పష్టంగా కనిపించాలి. ఏ భాగాన్ని క్రాప్ చేయకండి లేదా కట్ చేయకండి.
- గడువు ముగిసిన ID: ప్రస్తుతం వాడుకలో ఉన్న, చెల్లుబాటు అయ్యే IDలు మాత్రమే అంగీకరించబడతాయి.
- తప్పు డాక్యుమెంట్ రకం: మీ రిజిస్ట్రేషన్ రకానికి (వ్యక్తిగత లేదా వ్యాపార) సరైన డాక్యుమెంట్‌లను సమర్పిస్తున్నారని నిర్ధారించుకోండి.
- ఫైల్ ఫార్మాట్ సమస్యలు: డాక్యుమెంట్‌లను 8 MB లోపు సైజు ఉన్న JPEG, PNG లేదా PDF ఫైల్‌లుగా సమర్పించండి.
మీ డాక్యుమెంట్‌లు తిరస్కరించబడినట్లయితే, తిరస్కరణ నోటీసులో పేర్కొన్న నిర్దిష్ట సమస్యలను పరిష్కరించే కొత్త డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
వెరిఫికేషన్ తర్వాత "చర్య అవసరం" అని చూపుతున్న డొమైన్ ట్రబుల్షూటింగ్
మీరు మీ వెరిఫికేషన్ డాక్యుమెంట్‌లను సమర్పించిన తర్వాత కూడా మీ డొమైన్ చర్య అవసరం అని చూపిస్తుంటే, రిజిస్ట్రీ ఇప్పటికీ మీ సమర్పణను సమీక్షిస్తూ ఉండవచ్చు. రిజిస్ట్రీని బట్టి సమీక్షా సమయాలు మారుతూ ఉంటాయి.
మీరు ఆశించిన దాని కంటే ఎక్కువ సమయం వేచి ఉన్నట్లయితే, మీ వెరిఫికేషన్ స్టేటస్‌ను చెక్ చేయడానికి Shopify సపోర్ట్ను సంప్రదించండి.
డాక్యుమెంట్‌లపై ఉన్న సమాచారం రిజిస్ట్రేషన్‌తో సరిపోలకపోవడానికి సంబంధించిన ట్రబుల్షూటింగ్
మీ వెరిఫికేషన్ డాక్యుమెంట్‌లలోని సమాచారం మీ ప్రస్తుత డొమైన్ రిజిస్ట్రేషన్‌తో సరిపోలకపోతే, మీరు ఈ వ్యత్యాసాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది:
ఆప్షన్ 1: మీ డొమైన్ రిజిస్ట్రేషన్‌ను అప్‌డేట్ చేయండి
మీ డాక్యుమెంట్‌లు ప్రస్తుతమైనవి, అలాగే ఖచ్చితమైనవి అయితే, వెరిఫికేషన్‌ను మళ్లీ సమర్పించే ముందు మీ డాక్యుమెంట్‌లతో సరిపోలేలా మీ డొమైన్ సంప్రదింపు సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
ఆప్షన్ 2: వేరే డాక్యుమెంట్‌లను ఉపయోగించండి
మీ డొమైన్ రిజిస్ట్రేషన్ సరైనదే అయినప్పటికీ మీ డాక్యుమెంట్‌లు పాత సమాచారాన్ని (పాత చిరునామా వంటివి) ప్రదర్శిస్తుంటే, మీ ప్రస్తుత రిజిస్ట్రేషన్ వివరాలతో సరిపోలే ప్రత్యామ్నాయ డాక్యుమెంట్‌ను ఉపయోగించండి.
విజయవంతమైన వెరిఫికేషన్ కోసం చిట్కాలు
- మీ ఇమెయిల్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయండి: వెరిఫికేషన్ అభ్యర్థనలు సమయానికి లోబడి ఉంటాయి మరియు వీటికి ఖచ్చితమైన గడువులు ఉంటాయి.
- డాక్యుమెంట్‌లు ప్రస్తుతమైనవని నిర్ధారించుకోండి: గడువు ముగిసిన IDలు అంగీకరించబడవు.
- స్పష్టమైన చిత్రాలను అప్‌లోడ్ చేయండి: బ్లర్ అయిన లేదా పాక్షికంగా కనిపించే డాక్యుమెంట్‌ల వల్ల వెరిఫికేషన్ ఆలస్యం కావచ్చు.
- నమోదిత సమాచారాన్ని సరిపోల్చండి: మీ ID తప్పనిసరిగా డొమైన్ రిజిస్ట్రేషన్‌లోని పేరుతో ఖచ్చితంగా సరిపోలాలి.
- వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వండి: మీరు సమాచారాన్ని అప్‌డేట్ చేయాల్సి ఉంటే, గడువును కోల్పోకుండా ఉండేందుకు ఇమెయిల్‌కు త్వరగా ప్రతిస్పందించండి.
- వెరిఫికేషన్ ఇమెయిల్‌ను భద్రపరచండి: మీరు ఎప్పుడైనా Shopify సపోర్ట్‌ను సంప్రదించాల్సి వస్తే రెఫరెన్స్ కోసం దాన్ని సేవ్ చేసుకోండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
ఒకవేళ నా డొమైన్ ఇప్పటికే సస్పెండ్ చేయబడితే ఏమి చేయాలి?
వెరిఫికేషన్‌ను మిస్ అయినందున మీ డొమైన్ సస్పెండ్ చేయబడి ఉంటే, వెంటనే Shopify సపోర్ట్ను సంప్రదించండి. ఎక్కువ కాలం పాటు సస్పెండ్ చేయబడిన డొమైన్‌ల కోసం, మీరు వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి ముందు రిజిస్ట్రార్ మ్యాన్యువల్‌గా ఆ సస్పెన్షన్‌ను తీసివేయాల్సి రావచ్చు.
నా తరఫున వేరొకరు వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చా?
లేదు. డొమైన్ రిజిస్ట్రెంట్‌గా జాబితా చేయబడిన వ్యక్తి, తమ స్వంత గుర్తింపు డాక్యుమెంట్‌లను ఉపయోగించి వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి. డాక్యుమెంట్‌లు తప్పనిసరిగా నమోదిత సంప్రదింపు సమాచారంతో ఖచ్చితంగా సరిపోలాలి.
ఒకవేళ నా డాక్యుమెంట్‌లు నా డొమైన్ రిజిస్ట్రేషన్‌తో సరిపోలకపోతే ఏమి చేయాలి?
మీ డాక్యుమెంట్‌లు మీ డొమైన్ రిజిస్ట్రేషన్‌తో సరిపోలకపోతే, మీకు రెండు ఆప్షన్‌లు ఉంటాయి:
- మీ డొమైన్ రిజిస్ట్రేషన్‌ను అప్‌డేట్ చేయండి: వెరిఫికేషన్‌ను మళ్లీ సమర్పించే ముందు మీ డాక్యుమెంట్‌లతో సరిపోలేలా మీ డొమైన్ సంప్రదింపు సమాచారాన్ని ఎడిట్ చేయండి.
- వేరే డాక్యుమెంట్‌లను ఉపయోగించండి: మీ డొమైన్ రిజిస్ట్రేషన్ సరైనదే అయితే, మీ ప్రస్తుత రిజిస్ట్రేషన్ వివరాలతో సరిపోలే ప్రత్యామ్నాయ డాక్యుమెంట్‌ను ఉపయోగించండి.
డాక్యుమెంట్‌లను సమర్పిస్తున్నప్పుడు, మీ డాక్యుమెంట్‌లతో సరిపోలడానికి ఏ సంప్రదింపు సమాచారాన్ని అప్‌డేట్ చేయాలో పేర్కొనడానికి Shopify సపోర్ట్ను సంప్రదించండి.
గోప్యత మరియు భద్రత
మీ డాక్యుమెంట్‌లు సురక్షితమైన, ఎన్‌క్రిప్ట్ చేయబడిన లింక్ ద్వారా అప్‌లోడ్ చేయబడతాయి అలాగే వాటిని డొమైన్ వెరిఫికేషన్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు.
Shopify ఖచ్చితమైన భద్రతా చర్యలతో మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని రక్షిస్తుంది. వెరిఫికేషన్ సమయంలో మీరు అందించే ప్రభుత్వ-జారీ చేసిన IDల లాంటి డేటా, మీ గుర్తింపును నిర్ధారించడానికి మరియు డొమైన్ రిజిస్ట్రీ నిబంధనలకు కట్టుబడి ఉండటానికి మాత్రమే ఉపయోగించబడుతుంది.
Shopify సపోర్ట్‌ను సంప్రదించేటప్పుడు సిద్ధంగా ఉంచుకోవాల్సిన సమాచారం
Shopify సపోర్ట్ను సంప్రదించడానికి ముందుగా, మీ వెరిఫికేషన్ సమస్యను మరింత వేగంగా పరిష్కరించడంలో సహాయపడటానికి కింది సమాచారాన్ని సేకరించండి:
- మీ డొమైన్ పేరు (ఉదాహరణకు, yourdomain.de)
- మీరు పొందిన అసలు వెరిఫికేషన్ ఇమెయిల్ (అందుబాటులో ఉంటే)
- మీ డొమైన్‌కు నమోదైన ఇమెయిల్ అడ్రస్
- మీరు ఎదుర్కొన్న ఏవైనా ఎర్రర్ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లు
- మీరు వెరిఫికేషన్ అభ్యర్థనను పొందిన తేదీ
- పైన ఉన్న ట్రబుల్షూటింగ్ విభాగం నుండి మీరు ఇప్పటికే ప్రయత్నించిన దశలు
ఈ సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా మీకు మరింత సమర్థవంతంగా సహాయం చేయడానికి Shopify సపోర్ట్‌కు వీలవుతుంది.