Shopify Balanceతో నిధులను బదిలీ చేయడం
మీరు మీ Shopify Balance ఖాతాల మధ్య, కనెక్ట్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి మీ Shopify Balance ఖాతాలకు, అలాగే మీ Shopify Balance ఖాతా నుంచి బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేయవచ్చు. కనెక్ట్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ చేసిన నిధులు మీ Shopify Balance ఖాతాలోకి చేరడానికి గరిష్ఠంగా 6 పని రోజులు పట్టవచ్చు. మీ Shopify Balance ఖాతా నుంచి కనెక్ట్ చేసిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసిన నిధులు చాలా సందర్భాల్లో అదే రోజు లేదా తర్వాతి పని రోజున చేరతాయి.
ఈ పేజీలో
మీ Shopify Balance ఖాతాల మధ్య నిధుల బదిలీ
మీరు ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువ Shopify Balance ఖాతాలను సెటప్ చేసి ఉంటే, వాటి మధ్య నిధులను బదిలీ చేయవచ్చు.
అదనపు Shopify Balance ఖాతాలను సెటప్ చేయడానికి, ఒకటి కంటే ఎక్కువ Shopify Balance ఖాతాలను సృష్టించడం గురించి మరింత తెలుసుకోండి.
దశలు:
Shopify అడ్మిన్లోని ఫైనాన్స్ విభాగానికి వెళ్లండి.
నిధులను బదిలీ చేయండిపై క్లిక్ చేయండి.
నుంచి డ్రాప్-డౌన్ మెను నుంచి, మీరు నిధులను బదిలీ చేయాలనుకుంటున్న మూల Shopify Balance ఖాతాను ఎంచుకోండి.
కు డ్రాప్-డౌన్ మెను నుంచి, మీరు నిధులను బదిలీ చేయాలనుకుంటున్న Shopify Balance ఖాతాను ఎంచుకోండి.
మీరు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.
వివరాలను సమీక్షించండి క్లిక్ చేయండి.
నిధులను బదిలీ చేయండిపై క్లిక్ చేయండి.
మీ Shopify Balance ఖాతా, కనెక్ట్ చేసిన బ్యాంక్ ఖాతా మధ్య నిధులను బదిలీ చేయడం
మీరు కనెక్ట్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి మీ Shopify Balance ఖాతాకు, అలాగే మీ Shopify Balance ఖాతా నుంచి బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేయవచ్చు. మీ Shopify Balance ఖాతాలోకి నిధులు చేరడానికి గరిష్ఠంగా 6 పని రోజులు పట్టవచ్చు. బదిలీని రద్దు చేయాలనుకుంటే, దానికి అనుమతి ఇచ్చిన తర్వాత మొదటి 2 రోజుల్లోనే రద్దు చేయాలి. మీరు మీ Shopify Balance ఖాతాకు లేదా ఆ ఖాతా నుంచి నిధులను బదిలీ చేయవచ్చు.
మీ Shopify Balance ఖాతాకు నిధులను బదిలీ చేయడం
మీ Shopify Balance ఖాతా వివరాలను ఉపయోగించి బ్యాంక్ ఖాతా నుంచి మీ Shopify Balance ఖాతాకు డబ్బు బదిలీ చేయవచ్చు.
దశలు:
Shopify అడ్మిన్లోని ఫైనాన్స్ విభాగానికి వెళ్లండి.
ప్రధాన క్లిక్ చేయండి.
మీరు డబ్బు జోడించాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.
మీ Shopify Balance ఖాతా వివరాలను కాపీ చేయడానికి, ఈ చర్యలను పూర్తి చేయండి:
- ఖాతా సెట్టింగ్లుపై క్లిక్ చేసి, ఆపై వివరాలను చూపండిపై క్లిక్ చేయండి.
- క్లిప్‌బోర్డ్ ఐకాన్‌ను క్లిక్ చేయండి.
మీరు డబ్బు తీసుకోవాలనుకుంటున్న మీ ప్రస్తుత వ్యాపార లేదా సాధారణ బ్యాంక్ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
మీ Shopify Balance ఖాతా వివరాలను ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు బదిలీ చేయడానికి, మీ బ్యాంక్ సాధారణ ప్రక్రియను అనుసరించండి.
మీ Shopify Balance ఖాతా నుంచి నిధులను బదిలీ చేయడం
మీరు మీ Shopify Balance ఖాతా నుంచి కనెక్ట్ చేసిన బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేయవచ్చు. మధ్యాహ్నం 1:00 (Eastern Time) కంటే ముందు సమర్పించిన బదిలీల్లో చాలా వరకు అదే రోజున నిధులు చేరతాయి. మధ్యాహ్నం 1:00 (Eastern Time) తర్వాత లేదా వారాంతాలు, సెలవు రోజుల్లో సమర్పించిన బదిలీలు తర్వాతి పని రోజున ప్రాసెస్ అవుతాయి.
భద్రతా కారణాల వల్ల, మీ ఖాతాను మళ్లీ ప్రామాణీకరించమని మీకు సూచన రావచ్చు.
దశలు:
డెస్క్‌టాప్
Shopify అడ్మిన్లోని ఫైనాన్స్ విభాగానికి వెళ్లండి.
నిధులను బదిలీ చేయండిపై క్లిక్ చేయండి.
నుంచి డ్రాప్-డౌన్ మెను నుంచి, మీరు నిధులను బదిలీ చేయాలనుకుంటున్న మూల Shopify Balance ఖాతాను ఎంచుకోండి.
కు డ్రాప్-డౌన్ మెను నుంచి, మీరు నిధులను బదిలీ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.
మీరు ఇంకా బ్యాంక్ ఖాతాను కనెక్ట్ చేయకపోతే, ఈ దశలను పూర్తి చేయండి:
- బ్యాంక్ ఖాతాను కనెక్ట్ చేయండి క్లిక్ చేయండి.
- మీరు లింక్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోవడానికి మీ బ్యాంక్‌లో లాగిన్ అవ్వండి.
- ఖాతాను కనెక్ట్ చేయండి క్లిక్ చేయండి.
మీరు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.
ఐచ్ఛికం: వివరణను నమోదు చేయండి. ఈ వివరణ గ్రహీత ఖాతాలో కనిపిస్తుంది.
వివరాలను సమీక్షించండి క్లిక్ చేయండి.
వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకుని, ఆపై బదిలీకి అనుమతించండిపై క్లిక్ చేయండి.
Shopify Balance మొబైల్ యాప్
- Shopify Balance మొబైల్ యాప్‌లో
ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
ఐకాన్‌ను ట్యాప్ చేసి, ఆపై బదిలీ చేయండి ట్యాప్ చేయండి.
- మీరు ఏ Shopify Balance ఖాతా నుంచి నిధులను బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ఖాతాను ఎంచుకోండి.
- నిధులను బదిలీ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి. మీరు ఇంకా బ్యాంక్ ఖాతాను కనెక్ట్ చేయకపోతే, ఖాతాను కనెక్ట్ చేయండిపై ట్యాప్ చేసి, సూచనలను అనుసరించండి.
- మీరు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.
- సమీక్షించండి ట్యాప్ చేయండి.
- వివరాలను నిర్ధారించి, ఆపై పంపండి ట్యాప్ చేయండి.
మీ Shopify Balance ఖాతా నుంచి కనెక్ట్ చేసిన బ్యాంక్ ఖాతాను తొలగించడం
మీ Shopify Balanceకు కనెక్ట్ చేసిన బ్యాంక్ ఖాతా ఇక అవసరం లేకపోతే, మీ Shopify అడ్మిన్‌లో దాన్ని తొలగించవచ్చు.
దశలు:
Shopify అడ్మిన్లోని ఫైనాన్స్ విభాగానికి వెళ్లండి.
మరిన్ని చర్యలు > కనెక్ట్ చేసిన బ్యాంక్ ఖాతాలు క్లిక్ చేయండి.
మీరు తొలగించాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాకు సంబంధించిన
క్లిక్ చేయండి.
ఖాతాను తొలగించండిపై క్లిక్ చేయండి.
గ్రహీతకు డబ్బు పంపడం
మీరు గ్రహీతగా సేవ్ చేసిన వ్యక్తికి లేదా వ్యాపారానికి మీ Shopify Balance ఖాతా నుంచి డబ్బు పంపవచ్చు. మరింత సమాచారం కోసం, Shopify Balance నుంచి డబ్బు పంపడం చూడండి.
మీ Shopify Balance ఖాతాల మధ్య ఆటోమేటిక్ బదిలీలు
ప్రతి Shopify Payments పేఅవుట్లో కొంత శాతాన్ని మీ Shopify Balance ఖాతాలకు మరియు కనెక్ట్ చేసిన బాహ్య బ్యాంక్ ఖాతాలకు ఆటోమేటిక్‌గా పంపిణీ చేయడానికి ఆటోమేటిక్ బదిలీ నియమాలను ఉపయోగించవచ్చు. మరింత సమాచారం కోసం, Shopify Balance కోసం ఆటోమేటిక్ బదిలీ నియమాలను సెట్ చేయడం చూడండి.
Plaidలో మీ బ్యాంక్ అందుబాటులో లేదు
Plaidలో మీ బ్యాంక్ అందుబాటులో లేకపోతే, మీకు ఈ ఎంపికలు ఉన్నాయి:
- గ్రహీత వివరాల్లో మీ బ్యాంక్ ఖాతాను సేవ్ చేసి, మీకు మీరే డబ్బు పంపుకోండి.
- మీ బ్యాంక్ ఖాతాలోకి లాగిన్ అయ్యి, మీ Shopify Balance ఖాతాకు చెందిన రూటింగ్ మరియు ఖాతా నంబర్లను ఉపయోగించి నిధులను బదిలీ చేయండి. ఈ రూటింగ్ మరియు ఖాతా నంబర్లతో బదిలీ చేసిన నిధులు మీ Shopify Balance ఖాతాలో అందుబాటులోకి రావడానికి గరిష్ఠంగా 3 పని రోజులు పట్టవచ్చు.