| అడ్వాన్స్ చేయబడిన మొత్తం | Shopify Capital మర్చంట్ క్యాష్ అడ్వాన్స్ ద్వారా మీరు స్వీకరించే నిధులు. |
| కొల్లేటరల్ | మీ Shopify క్యాపిటల్ లోన్ కోసం భద్రతగా మీరు తాకట్టు పెట్టే ఆస్తుల సమూహమే కొల్లేటరల్. Shopify అడ్మిన్‌కు లింక్ చేయబడిన వ్యాపార బ్యాంక్ ఖాతా, ఇంకా మీరు కలిగి ఉన్న ఏవైనా ఇతర వ్యాపార ఖాతాలు లాంటి మీ వ్యాపార ఆస్తులు కొల్లేటరల్‌లో ఉంటాయి. కొల్లేటరల్‌లో మీ వ్యక్తిగత ఆస్తి లేదా ఆస్తులు ఏవీ చేర్చబడవు. |
| రోజువారీ చెల్లింపు శాతం | చెల్లింపు మొత్తం పూర్తయ్యే వరకు, మీ రోజువారీ విక్రయాల నుండి మీరు Shopify Capitalకు తిరిగి చెల్లించే శాతం. |
| డెలివరీ చేయండి | నిధులను పంపడం. |
| కారకం (ఫ్యాక్టర్) లేదా ఫ్యాక్టర్ రేటు | రెమిట్ చేయాల్సిన మొత్తాన్ని నిర్ణయించడానికి, స్వీకరించిన మొత్తాన్ని గుణించే సంఖ్య. |
| స్థిరమైన అప్పు ఖర్చు | ఫండ్స్ ఖర్చు అని కూడా పిలవబడే, Shopify క్యాపిటల్ లోన్‌ను పొందడానికి అయ్యే రుసుము. |
| నిధులు | క్యాపిటల్‌కి యాక్సెస్. |
| స్థూల రోజువారీ విక్రయాలు | ఒక నిర్దిష్ట రోజున జరిగిన మొత్తం విక్రయాల మొత్తం. ఇందులో పన్నులు మరియు షిప్పింగ్ ఉంటాయి. |
| లోన్ మొత్తం | Shopify క్యాపిటల్ లోన్ ద్వారా మీరు స్వీకరించే నిధులు. |
| స్వీకరించదగినవి (రిసీవబుల్స్) | మీ భవిష్యత్తు విక్రయాల కొనుగోలు. |
| మిగిలిన బ్యాలెన్స్ | మొత్తం రెమిట్ చేయాల్సిన మొత్తంలో, ఇంకా Shopify Capitalకు రెమిట్ చేయాల్సిన మొత్తం. |
| రెమిట్ చేయండి | రెమిట్ చేయాల్సిన మొత్తానికి జమ చేయడానికి డబ్బును చెల్లించడం. |
| రెమిటెన్స్ | రెమిట్ చేయాల్సిన మొత్తానికి జమ చేయడానికి చెల్లించే డబ్బు. |
| రెమిటెన్స్ రేట్ లేదా రోజువారీ రెమిటెన్స్ శాతం | రెమిట్ చేయాల్సిన మొత్తం పూర్తయ్యే వరకు, Shopify Capitalకు రెమిట్ చేయబడే మీ రోజువారీ విక్రయాల రాబడి శాతం. |
| సెక్యూరిటీ ఇంట్రెస్ట్ | Shopify రుణ ఒప్పందాలలో సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, ఇది డిఫాల్ట్ ఈవెంట్ జరిగే పక్షంలో వ్యాపార తాకట్టు (కొలేటరల్)పై చట్టబద్ధమైన హక్కును అందిస్తుంది. మీ రుణ పరిమాణం, అలాగే మీ వ్యాపారానికి సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులు వంటి అనేక అంశాల ఆధారంగా, మీ రుణానికి సంబంధించి యూనిఫామ్ కమర్షియల్ కోడ్-1 (UCC-1) ఫైనాన్సింగ్ స్టేట్‌మెంట్ దాఖలు చేయబడవచ్చు. |
| మొత్తం చెల్లింపు | రుణం మొత్తం, దానికి తోడు Shopify క్యాపిటల్ లోన్‌కి సంబంధించిన స్థిరమైన అప్పు ఖర్చు. తిరిగి చెల్లించాల్సిన మొత్తం. |
| రెమిట్ చేయాల్సిన మొత్తం | Shopify Capital కొనుగోలు చేసే భవిష్యత్తు విక్రయాల రాబడి మొత్తం. స్వీకరించిన మొత్తాన్ని ఫ్యాక్టర్ రేట్‌తో గుణించడం ద్వారా ఇది లెక్కించబడుతుంది. |
| UCC-1 ఫైనాన్సింగ్ స్టేట్‌మెంట్ | ఇది రుణదాత ద్వారా ఫైల్ చేయబడిన పబ్లిక్ రికార్డ్. ఒక రుణగ్రహీతకు చెందిన నిర్దిష్ట వ్యాపార తాకట్టు (కొలేటరల్)పై రుణదాతకు ఉన్న సెక్యూరిటీ ఇంట్రెస్ట్ గురించి ఇది తెలియజేస్తుంది. రుణాన్ని సురక్షితం చేయడానికి ఉపయోగించిన కొలేటరల్‌పై ప్రాధాన్యతా హక్కును UCC-1 నెలకొల్పుతుంది, అలాగే డిఫాల్ట్ ఈవెంట్ జరిగే పక్షంలో ఆ కొలేటరల్‌ను తిరిగి చెల్లింపు కింద క్లెయిమ్ చేసుకునే హక్కును Shopifyకి ఇస్తుంది. ఒక వ్యాపారం నిర్వహించబడుతున్న లేదా ఒక వ్యక్తి నివసిస్తున్న రాష్ట్ర సెక్రటరీ వద్ద UCC-1 ఫైనాన్సింగ్ స్టేట్‌మెంట్‌లు దాఖలు చేయబడతాయి. రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత, ఫైనాన్సింగ్ స్టేట్‌మెంట్‌లను పబ్లిక్ రికార్డ్ నుండి తీసివేయవచ్చు. |