యాప్ సహాయంతో ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ సేవను ఉపయోగించి ఆర్డర్‌లను నెరవేర్చడం
మీరు యాప్ ద్వారా Shopifyతో ఏకీకృతమయ్యే ఫుల్‌ఫిల్‌మెంట్ సేవను ఉపయోగించినప్పుడు, మీరు మీ Shopify అడ్మిన్ నుండి మీ పూర్తి ఫుల్‌ఫిల్‌మెంట్ వర్క్‌ఫ్లోను నిర్వహించవచ్చు. మీరు ఫుల్‌ఫిల్‌మెంట్‌లను అభ్యర్థించవచ్చు, ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రోగ్రెస్‌ను ట్రాక్ చేయవచ్చు, ఆర్డర్ టైమ్‌లైన్ ద్వారా మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవతో కమ్యూనికేట్ చేయవచ్చు, ఫుల్‌ఫిల్‌మెంట్‌లను రద్దు చేయవచ్చు, అలాగే అవసరమైనప్పుడు ఆర్డర్‌లను మునుపటి స్థితికి తిరిగి మార్చవచ్చు.
మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ఆర్డర్‌లను ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేటస్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవను ఉపయోగించే బదులు మీకు మీరే ఆర్డర్‌లను నెరవేర్చవలసి వచ్చినప్పుడు, మీరు ఆర్డర్ లొకేషన్‌ను మార్చవచ్చు, అలాగే దాన్ని మాన్యువల్‌గా నెరవేర్చవచ్చు.
ఈ పేజీలో
- ఫుల్‌ఫిల్‌మెంట్ యాప్‌ల రకాలు
- మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ నుండి ఫుల్‌ఫిల్‌మెంట్‌ను అభ్యర్థించండి
- ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రోగ్రెస్‌ను ట్రాక్ చేయడం
- ట్రాకింగ్ సమాచారాన్ని జోడించడం లేదా అప్‌డేట్ చేయడం
- ఫుల్‌ఫిల్‌మెంట్‌లను రద్దు చేయడం
- ఆర్డర్‌ను నెరవేర్చబడని స్థితికి తిరిగి మార్చండి
- మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవను ఉపయోగించే బదులు మీకు మీరే ఆర్డర్‌లను నెరవేర్చడం
ఫుల్‌ఫిల్‌మెంట్ యాప్‌ల రకాలు
ఫుల్‌ఫిల్‌మెంట్ యాప్‌లు మీ Shopify అడ్మిన్‌తో సింక్ అవుతాయి, తద్వారా ఫుల్‌ఫిల్‌మెంట్ కొనసాగుతున్నప్పుడు మీ ఆర్డర్‌లు అప్‌డేట్ చేయబడతాయి. మీకు అందే అప్‌డేట్‌లు యాప్‌పై ఆధారపడి ఉంటాయి:
- సాధారణ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవలు: మీ స్టోర్ తరపున ఆర్డర్‌లను స్టాక్ చేస్తాయి, నెరవేరుస్తాయి, అలాగే రవాణా చేస్తాయి.
- డ్రాప్‌షిప్పింగ్ యాప్‌లు: కొన్ని యాప్‌లు ఆర్డర్‌ను రవాణా చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఐటెమ్‌లు నెరవేర్చబడినట్లుగా గుర్తిస్తాయి. ఇతర యాప్‌లలో మీరు కస్టమర్ ఐటెమ్‌లను యాప్‌లో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అత్యుత్తమ వర్క్‌ఫ్లోను నిర్ధారించడానికి మీ యాప్ డెవలపర్‌ను సంప్రదించండి.
- ప్రింట్-ఆన్-డిమాండ్ యాప్‌లు: చాలా వరకు యాప్‌లు ఆర్డర్ రవాణా చేయబడినప్పుడు ఆటోమేటిక్‌గా ఐటెమ్‌లు నెరవేర్చబడినట్లుగా గుర్తిస్తాయి. సిఫార్సు చేయబడిన సెట్టింగ్‌లు మరియు వర్క్‌ఫ్లో కోసం మీ యాప్ డెవలపర్‌తో చెక్ చేయండి.
మీరు ప్రతి ఉత్పత్తికి ఫుల్‌ఫిల్‌మెంట్ పద్ధతిని ఎంచుకుంటారు, కాబట్టి ఒకే ఆర్డర్ వేర్వేరు ఐటెమ్‌ల కోసం వేర్వేరు ఫుల్‌ఫిల్‌మెంట్ పద్ధతులను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఒక కస్టమర్ డ్రాప్‌షిప్ చేయబడిన ఉత్పత్తిని మరియు మీరు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తిని ఆర్డర్ చేస్తే, డ్రాప్‌షిప్పర్ మొదటి ఐటెమ్‌ను నెరవేరుస్తారు, అలాగే మీరు రెండవదాన్ని నెరవేరుస్తారు.
కొన్ని ఫుల్‌ఫిల్‌మెంట్ యాప్‌లు వాటి స్వంత షిప్పింగ్ క్యారియర్ ఖాతాలను కనెక్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి, కాబట్టి యాప్ మీకు ఎంత ఛార్జ్ చేస్తుందో మీ కస్టమర్‌లకు కూడా సరిగ్గా అంతే ఛార్జ్ చేయవచ్చు. వారు ఈ ఆప్షన్‌ను అందిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవతో చెక్ చేయండి. మీ షిప్పింగ్ సెట్టింగ్‌లు సాధారణ షిప్పింగ్ ప్రొఫైల్‌ను మాత్రమే ఉపయోగిస్తే, అలాగే ప్రతి లొకేషన్‌కు వేర్వేరు రేట్‌లు లేకుంటే, ఏదైనా ఫుల్‌ఫిల్‌మెంట్ యాప్ మీ షిప్పింగ్ సెట్టింగ్‌లకు ఆటోమేటిక్‌గా జోడించబడుతుంది. లేకుంటే, మీరు యాప్‌ను మీ షిప్పింగ్ సెట్టింగ్‌లకు మాన్యువల్‌గా జోడించాలి.
మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ నుండి ఫుల్‌ఫిల్‌మెంట్‌ను అభ్యర్థించండి
మీరు ఫుల్‌ఫిల్‌మెంట్‌ను అభ్యర్థించినప్పుడు, మీ ఆర్డర్‌ను పిక్ చేయడం, ప్యాక్ చేయడం, అలాగే రవాణా చేయడం ప్రారంభించడానికి మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవకు మెసేజ్ పంపబడుతుంది. ఒకవేళ మీరు ఆటోమేటిక్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ను ఉపయోగిస్తే, ఆర్డర్ కోసం పేమెంట్ పూర్తయినప్పుడు ఆటోమేటిక్‌గా ఫుల్‌ఫిల్‌మెంట్ అభ్యర్థించబడుతుంది, అలాగే మీరు ఈ దశలను పూర్తి చేయాల్సిన అవసరం లేదు.
మీరు ఫుల్‌ఫిల్‌మెంట్‌ను అభ్యర్థించినప్పుడు, ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేటస్ పురోగతిలో ఉందికి మారుతుంది, అలాగే మీరు మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ నుండి ప్రతిస్పందన కోసం వేచి ఉండాలి. ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ఫుల్‌ఫిల్‌మెంట్‌ను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు, అలాగే ఫలితం ఆర్డర్ టైమ్‌లైన్‌లో గమనించబడుతుంది. ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ అభ్యర్థనను తిరస్కరిస్తే, ఆర్డర్ స్టేటస్ నెరవేర్చబడని స్థితికి తిరిగి మారుతుంది, ఫుల్‌ఫిల్‌మెంట్ ఎందుకు తిరస్కరించబడిందో వివరించడానికి మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ఒక గమనికను చేర్చవచ్చు.
ఒకవేళ ఆర్డర్‌లోని ఐటెమ్‌లు వేర్వేరు సేవల ద్వారా నెరవేర్చబడినా లేదా ప్రత్యేక ప్యాకేజీలలో రవాణా చేయబడినా, కొన్ని ఐటెమ్‌లు మిగతా వాటికంటే ముందుగానే మీ కస్టమర్‌లకు డెలివరీ చేయబడవచ్చు. అన్ని ఐటెమ్‌లు రవాణా చేయబడిన తర్వాత మాత్రమే ఆర్డర్ నెరవేర్చబడింది అనే స్టేటస్‌ను ప్రదర్శిస్తుంది.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లుకు వెళ్లండి.
మీరు నెరవేర్చాలనుకుంటున్న ఆర్డర్‌ను క్లిక్ చేయండి.
ఫుల్‌ఫిల్‌మెంట్‌ను అభ్యర్థించండిని క్లిక్ చేయండి.
ఆప్షనల్: గమనికల ఫీల్డ్‌లో, మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ కోసం మెసేజ్‌ను ఎంటర్ చేయండి. ఈ మెసేజ్ మీ కస్టమర్‌కు పంపబడదు.
ఆప్షనల్: ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ద్వారా ఆర్డర్ నెరవేర్చబడినప్పుడు మీ కస్టమర్‌కు నోటిఫికేషన్ పంపడానికి, ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ఆర్డర్‌ను నెరవేర్చినప్పుడు కస్టమర్‌కు నోటిఫికేషన్ పంపండిని ఎంచుకోండి.
ఫుల్‌ఫిల్‌మెంట్ అభ్యర్థనను పంపండిని క్లిక్ చేయండి.
మొబైల్
- Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి .
- మీరు నెరవేర్చాలనుకుంటున్న ఆర్డర్‌ను ట్యాప్ చేయండి.
- ఫుల్‌ఫిల్‌మెంట్‌ను అభ్యర్థించండిని ట్యాప్ చేయండి.
- ఆప్షనల్: ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ద్వారా ఆర్డర్ నెరవేర్చబడినప్పుడు మీ కస్టమర్‌కు నోటిఫికేషన్ పంపడానికి, ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ఆర్డర్‌ను నెరవేర్చినప్పుడు కస్టమర్‌కు నోటిఫికేషన్ పంపండిని ఎంచుకోండి.
- ఫుల్‌ఫిల్‌మెంట్‌ను అభ్యర్థించండిని ట్యాప్ చేయండి.
ఫుల్‌ఫిల్‌మెంట్ పురోగతిని ట్రాక్ చేయడం
మీరు ఫుల్‌ఫిల్‌మెంట్‌ను అభ్యర్థించిన తర్వాత, ఆర్డర్‌ను తెరిచినప్పుడు మీరు రెండు లొకేషన్‌లలో ఫుల్‌ఫిల్‌మెంట్ సమాచారాన్ని ట్రాక్ చేయవచ్చు:
- ప్రోగ్రెస్‌లో ఉన్న ఫుల్‌ఫిల్‌మెంట్ విభాగం, ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేటస్ మరియు ఫుల్‌ఫిల్‌మెంట్ పురోగతికి సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణకు, ఒక ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేటస్ ప్రోగ్రెస్‌లో ఉంది అని ఉంటే, వివరణాత్మక స్టేటస్ మీకు ఫుల్‌ఫిల్‌మెంట్ అభ్యర్థించబడింది లేదా అంగీకరించబడింది అని తెలియజేస్తుంది.
- ఫుల్‌ఫిల్‌మెంట్‌లో ఏవైనా మార్పులు ఉంటే, ఆర్డర్ టైమ్‌లైన్ విభాగం అప్‌డేట్ అవుతుంది. మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ద్వారా పంపబడిన మెసేజ్‌లను చదవడానికి, ఆర్డర్ టైమ్‌లైన్‌ను ఉపయోగించండి.
ట్రాకింగ్ సమాచారాన్ని జోడించడం లేదా అప్‌డేట్ చేయడం
ఫుల్‌ఫిల్‌మెంట్‌ను ఎవరు సృష్టించారనే దానితో సంబంధం లేకుండా, మీరు ఆర్డర్‌కు ఎప్పుడైనా ట్రాకింగ్ సమాచారాన్ని జోడించవచ్చు లేదా అప్‌డేట్ చేయవచ్చు. మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ట్రాకింగ్ సమాచారాన్ని అందించినట్లయితే, అది ఆటోమేటిక్‌గా ఆర్డర్‌కు జోడించబడుతుంది. మీరు ట్రాకింగ్ సమాచారాన్ని మ్యాన్యువల్‌గా కూడా జోడించవచ్చు లేదా అప్‌డేట్ చేయవచ్చు.
నెరవేర్చబడిన ఆర్డర్‌కి ట్రాకింగ్ నంబర్‌ను జోడించడం గురించి మరింత తెలుసుకోండి.
ఫుల్‌ఫిల్‌మెంట్‌లను రద్దు చేయడం
మీ కస్టమర్ ఆర్డర్‌ను రద్దు చేయాలనుకున్నప్పుడు లేదా మార్పులు చేయాలనుకున్నప్పుడు లేదా ఆర్డర్‌ను మ్యాన్యువల్‌గా నెరవేర్చాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు, మీరు ఫుల్‌ఫిల్‌మెంట్ అభ్యర్థనను రద్దు చేయాల్సి రావచ్చు. ఫుల్‌ఫిల్‌మెంట్‌ను రద్దు చేయడానికి సంబంధించిన దశలు, ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేటస్పై ఆధారపడి ఉంటాయి.
అభ్యర్థించిన ఫుల్‌ఫిల్‌మెంట్‌ను రద్దు చేయండి
ఒకవేళ ఫుల్‌ఫిల్‌మెంట్ అభ్యర్థించబడి, ఇంకా అంగీకరించబడనట్లయితే, మీరు దాన్ని నేరుగా మీ Shopify అడ్మిన్ నుండి రద్దు చేయవచ్చు. రద్దు వివరాలు ఆర్డర్ టైమ్‌లైన్‌లో నమోదు అవుతాయి మరియు ఆర్డర్ స్టేటస్ నెరవేర్చబడనిగా మారుతుంది.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లుకు వెళ్లండి.
మీరు దేనికైతే ఫుల్‌ఫిల్‌మెంట్‌ను రద్దు చేయాలనుకుంటున్నారో ఆ ఆర్డర్‌ను క్లిక్ చేయండి.
అభ్యర్థనను రద్దు చేయండిని క్లిక్ చేయండి.
అంగీకరించిన ఫుల్‌ఫిల్‌మెంట్‌ను రద్దు చేయండి
ఒకవేళ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ మీ ఫుల్‌ఫిల్‌మెంట్‌ను అంగీకరించి, మీరు ఫుల్‌ఫిల్‌మెంట్‌ను రద్దు చేయాల్సి వస్తే, మీరు మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవకు రద్దు అభ్యర్థనను పంపి ప్రతిస్పందన కోసం వేచి ఉండాలి. మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ మీ రద్దు అభ్యర్థనను అంగీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది.
రద్దు అభ్యర్థనను అంగీకరించినప్పుడు లేదా తిరస్కరించినప్పుడు ఆర్డర్‌పై బ్యానర్ ప్రదర్శించబడుతుంది:
- రద్దు అభ్యర్థన అంగీకరించబడింది: రద్దు వివరాలు టైమ్‌లైన్‌లో నమోదు అవుతాయి మరియు ఆర్డర్ స్టేటస్ తిరిగి నెరవేర్చబడనికి మారుతుంది.
- రద్దు అభ్యర్థన తిరస్కరించబడింది: ఆర్డర్ టైమ్‌లైన్‌లో తిరస్కరణ వివరాలు నమోదు అవుతాయి మరియు ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రాసెస్‌ను కొనసాగిస్తుంది. రద్దు అభ్యర్థనను ఎందుకు తిరస్కరించారో వివరించడానికి మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ మెసేజ్‌ను కూడా చేర్చవచ్చు.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లుకు వెళ్లండి.
మీరు దేనికైతే ఫుల్‌ఫిల్‌మెంట్‌ను రద్దు చేయాలనుకుంటున్నారో ఆ ఆర్డర్‌ను క్లిక్ చేయండి.
…ని క్లిక్ చేయండి.
రద్దు చేయాలని అభ్యర్థించండిని క్లిక్ చేయండి.
ఆప్షనల్: గమనికల ఫీల్డ్‌లో, మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ కోసం మెసేజ్‌ను ఎంటర్ చేయండి. ఈ మెసేజ్ మీ కస్టమర్‌కు పంపబడదు.
రద్దు చేయాలని అభ్యర్థించండిని క్లిక్ చేయండి.
ఆర్డర్ టైమ్‌లైన్‌లో రద్దు అభ్యర్థన నమోదు అవుతుంది మరియు వివరణాత్మక ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేటస్ రద్దు కోసం అభ్యర్థించబడింది అని మారుతుంది.
ఆర్డర్‌ను నెరవేర్చబడని స్థితికి మార్చండి
మీరు ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం రద్దు అభ్యర్థన చేసినప్పుడు, మీరు మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ నుండి వచ్చే ప్రతిస్పందన కోసం వేచి ఉండాలి. ఒకవేళ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ఫుల్‌ఫిల్‌మెంట్‌ను రద్దు చేసి, Shopifyలో ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేటస్‌ను అప్‌డేట్ చేయలేకపోతే, మీరు మ్యాన్యువల్‌గా ఆర్డర్ స్టేటస్‌ను నెరవేర్చబడనిగా మార్చవచ్చు. ఈ దశను పూర్తి చేయడానికి, ఫుల్‌ఫిల్‌మెంట్ రద్దు అయిందని నిర్ధారించుకోవడానికి మీరు మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవను సంప్రదించాలి.
ఆర్డర్ లేదా లైన్ ఐటెమ్‌ను నెరవేర్చబడని స్థితికి మార్చిన తర్వాత, మీ ఇన్వెంటరీ పరిమాణం ఖచ్చితంగా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి దాన్ని చెక్ చేయండి.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లుకు వెళ్లండి.
మీరు నెరవేర్చబడని స్థితికి మార్చాలనుకుంటున్న ఆర్డర్‌ను క్లిక్ చేయండి.
…ని క్లిక్ చేయండి.
నెరవేర్చబడని స్థితికి మార్చండిని క్లిక్ చేయండి.
ఫుల్‌ఫిల్‌మెంట్ సేవను ఉపయోగించకుండా మీకు మీరే ఆర్డర్‌లను నెరవేర్చడం
మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ద్వారా కాకుండా ఆర్డర్‌ను మీరే నెరవేర్చాల్సిన అవసరం ఉన్నప్పుడు, మీరు ఐటెమ్‌ల లొకేషన్‌ను మీరు మేనేజ్ చేసే లొకేషన్‌కు మార్చాలి, ఆ తర్వాత కొత్త లొకేషన్ నుండి ఆర్డర్‌ను నెరవేర్చాలి. ఇది ఖచ్చితమైన ఇన్వెంటరీ ట్రాకింగ్‌ను నిర్వహిస్తుంది మరియు మీ Shopify అడ్మిన్‌కు, మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవకు మధ్య ఉన్న వ్యత్యాసాలను నిరోధిస్తుంది.
ఇది కింది సందర్భాలలో ఉపయోగకరంగా ఉండవచ్చు:
- మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ తాత్కాలికంగా అందుబాటులో లేదు.
- మీరు మీ స్వంత ఇన్వెంటరీ నుండి తక్షణమే ఆర్డర్‌ను నెరవేర్చాలి.
- మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ఇన్వెంటరీ సింక్ అవ్వలేదు మరియు మీరు ఆర్డర్‌ను మ్యాన్యువల్‌గా నెరవేర్చబడినట్లుగా మార్క్ చేయాలి.
- మీరు ఒక ప్రత్యేక ఆర్డర్‌ను వ్యక్తిగతంగా నిర్వహించాలనుకుంటున్నారు.
మీరు తరచుగా ఆర్డర్‌లను మీరే నెరవేర్చాల్సిన అవసరం ఉంటే, మీ ఇన్వెంటరీని ఆర్గనైజ్ చేయడానికి మీకు రెండు ఎంపికలు ఉంటాయి:
- మీ స్వంత లొకేషన్‌లలో స్టాక్ ఇన్వెంటరీ (మ్యాన్యువల్ కంట్రోల్ కోసం సిఫార్సు చేయబడింది): మీ రిటైల్ స్టోర్ లేదా గిడ్డంగి లాంటి మీరు కంట్రోల్ చేసే లొకేషన్‌కు ఇన్వెంటరీని తరలించండి. ఇది Shopify అడ్మిన్‌లో ఆర్డర్‌లను నెరవేర్చినట్లు మార్క్ చేయడానికి, మీ నాణ్యత హామీ ప్రాసెస్‌ను రన్ చేయడానికి మరియు ఫుల్‌ఫిల్‌మెంట్‌లను సృష్టించడానికి ఏదైనా యాప్‌ను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. బహుళ స్థానాలలో ఇన్వెంటరీని మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
- మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవతో కలిసి పని చేయండి: మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ప్రొవైడర్‌ను సంప్రదించండి మరియు నేరుగా ఫుల్‌ఫిల్‌మెంట్‌లను సృష్టించేందుకు వారు సెటప్ అయ్యారో లేదో నిర్ధారించుకోండి. వారు ఫుల్‌ఫిల్‌మెంట్‌ను సృష్టించిన తర్వాత కూడా, మీరు ట్రాకింగ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
మీరు ఆర్డర్ లొకేషన్‌ను మార్చే ముందు, ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేటస్‌ను రివ్యూ చేయండి:
- ఫుల్‌ఫిల్‌మెంట్ ఇంకా అభ్యర్థించబడకపోతే, మీరు నేరుగా లొకేషన్‌ను మార్చవచ్చు.
- ఒకవేళ ఫుల్‌ఫిల్‌మెంట్ అభ్యర్థించబడి, అంగీకరించబడకపోతే, ముందుగా ఫుల్‌ఫిల్‌మెంట్ అభ్యర్థనను రద్దు చేయండి, ఆపై లొకేషన్‌ను మార్చండి.
- ఫుల్‌ఫిల్‌మెంట్ అంగీకరించబడినట్లయితే, లొకేషన్‌ను మార్చే ముందు రద్దు చేయాలని అభ్యర్థించండి మరియు మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ అంగీకరించే వరకు వేచి ఉండండి.