స్థానిక డెలివరీ ఆర్డర్‌లను నెరవేర్చడం

మీరు మీ Shopify అడ్మిన్ నుండి స్థానిక డెలివరీ ఆర్డర్‌లను నిర్వహించవచ్చు, డెలివరీ కోసం వాటిని సిద్ధం చేయవచ్చు, అలాగే వాటి ఆర్డర్ స్టేటస్‌లను అప్‌డేట్ చేయవచ్చు.

స్థానిక డెలివరీ ఆర్డర్ వర్క్‌ఫ్లో మరియు స్టేటస్‌లు

మీరు మీ స్థానిక డెలివరీ ఆర్డర్‌లను నెరవేర్చుతున్నప్పుడు, అవి కింది ఆర్డర్ స్టేటస్‌ల గుండా పురోగమిస్తాయి:

  1. నెరవేర్చబడని: ఆర్డర్ తయారీ, ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రారంభం కాలేదు. మీ తదుపరి దశ, ఐటెమ్‌లను పిక్ చేసి, ప్యాక్ చేయడం ద్వారా ఆర్డర్‌ను డెలివరీ కోసం సిద్ధం చేయడం. ఆర్డర్‌తో చేర్చడానికి మీరు ప్యాకింగ్ స్లిప్‌లను ప్రింట్ చేయడాన్ని కూడా ఎంచుకోవచ్చు. పూర్తి చేయడానికి, ఆర్డర్‌ను డెలివరీకి సిద్ధంగా ఉంది అని మార్క్ చేయండి.
  2. డెలివరీకి సిద్ధంగా ఉంది: ఆర్డర్ డెలివరీ కావడానికి సిద్ధంగా ఉంది లేదా డెలివరీ కోసం బయలుదేరింది. డెలివరీ చేయడానికి ప్రయత్నించి, ఆర్డర్ విజయవంతంగా డెలివరీ కాకపోతే ఆర్డర్‌లు కూడా ఈ స్టేటస్‌ను కలిగి ఉండవచ్చు. ఆర్డర్ డెలివరీ చేయబడిన తర్వాత, దానిని డెలివరీ చేయబడినట్లుగా మార్క్ చేయడం మీ తదుపరి దశ.
  3. డెలివరీ చేయబడింది: మీరు ఆర్డర్‌ను డెలివరీ చేయబడినట్లుగా మార్క్ చేసిన తర్వాత, ఆర్డర్ స్టేటస్ నెరవేర్చబడిందికి మారుతుంది, అలాగే ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రాసెస్ పూర్తవుతుంది.

స్థానిక డెలివరీ ఆర్డర్‌ల కోసం కస్టమర్ నోటిఫికేషన్‌లు

మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లలోని డెలివరీ కోసం బయలుదేరింది మరియు డెలివరీ చేయబడింది నోటిఫికేషన్‌లు క్యారియర్ ట్రాకింగ్ ఈవెంట్‌ల ద్వారా ట్రిగ్గర్ చేయబడతాయి. Shopifyలో స్థానిక డెలివరీ ఆర్డర్‌లు క్యారియర్ ట్రాకింగ్ ఈవెంట్‌లను రూపొందించవు, కాబట్టి ఈ నోటిఫికేషన్‌లు స్థానిక డెలివరీకి వర్తించవు.

మీరు స్థానిక డెలివరీ ఆర్డర్‌ను డెలివరీ చేయబడినట్లుగా మార్క్ చేసినప్పుడు, మీ కస్టమర్ ఆటోమెటిక్‌గా డెలివరీ నిర్ధారణ ఇమెయిల్‌ను అందుకుంటారు. మీరు ఆర్డర్‌ను డెలివరీ చేయబడినట్లుగా మార్క్ చేయకుంటే, కస్టమర్‌కు ఎలాంటి ఆటోమేటిక్ డెలివరీ నోటిఫికేషన్ పంపబడదు.

స్థానిక డెలివరీ ఆర్డర్‌లను క్రమబద్ధీకరించడం, ఫిల్టర్ చేయడం

ఆర్డర్‌ల పేజీలో స్థానిక డెలివరీ ఆర్డర్‌లను మాత్రమే చూడటానికి మీరు ఆర్డర్‌లను ఫిల్టర్ చేయవచ్చు.

నెరవేర్చబడని మరియు డెలివరీకి సిద్ధంగా ఉన్న స్థానిక డెలివరీ ఆర్డర్‌ల జాబితా కోసం మీ ఆర్డర్‌ల జాబితా ఎగువన ఉన్న స్థానిక డెలివరీ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. డెలివరీ కోసం ఆర్డర్‌లను సిద్ధం చేయడానికి మీరు ఈ జాబితాను ఉపయోగించవచ్చు.

స్థానిక డెలివరీ ఆర్డర్ కోసం డెలివరీ సూచనలను చూడండి

మీ కస్టమర్‌లు చెక్‌అవుట్ వద్ద ఆర్డర్‌లకు డెలివరీ సూచనలను జోడించే ఎంపికను కలిగి ఉంటారు. డెలివరీ లొకేషన్‌లను కనుగొనడంలో, అలాగే ప్యాకేజీని ఎక్కడ ఉంచాలి అనే దాని గురించి మీకు అదనపు సమాచారాన్ని అందించడంలో ఈ సూచనలు సహాయపడతాయి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లకు వెళ్లండి.

  2. మీరు ఏ స్థానిక డెలివరీ ఆర్డర్ డెలివరీ సూచనలను చూడాలనుకుంటున్నారో, ఆ ఆర్డర్‌పై క్లిక్ చేయండి.

  3. డెలివరీ సూచనలు విభాగంలో, చెక్‌అవుట్ వద్ద మీ కస్టమర్ అందించిన ఏవైనా సూచనలను చూడండి.

స్థానిక డెలివరీ ఆర్డర్‌ను డెలివరీ కోసం సిద్ధం చేయండి

మీరు ఆర్డర్‌ను సిద్ధం చేసిన తర్వాత, మీరు దానిని డెలివరీకి సిద్ధంగా ఉన్నట్లుగా మార్క్ చేయాలి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లకు వెళ్లండి.

  2. మీరు నెరవేర్చాలనుకుంటున్న ఆర్డర్‌పై క్లిక్ చేయండి.

  3. డెలివరీని సిద్ధం చేయండిపై క్లిక్ చేయండి.

  4. ఆప్షనల్: ప్యాకింగ్ స్లిప్‌ను ప్రింట్ చేయడానికి, ప్యాకింగ్ స్లిప్‌ను ప్రింట్ చేయండిపై క్లిక్ చేయండి.

  5. డెలివరీ కోసం ఐటెమ్‌లను పిక్ చేసి, ప్యాక్ చేయండి.

  6. డెలివరీకి సిద్ధంగా ఉందని మార్క్ చేయండిపై క్లిక్ చేయండి.

స్థానిక డెలివరీ ఆర్డర్‌ను డెలివరీ చేయబడినట్లుగా మార్క్ చేయండి

ఆర్డర్ డెలివరీ చేయబడినప్పుడు, మీరు మీ Shopify అడ్మిన్‌లో ఆర్డర్‌ను డెలివరీ చేయబడినట్లుగా మార్క్ చేయాలి. ఇది ఆర్డర్ స్టేటస్‌ను మారుస్తుంది, అలాగే ఆర్డర్ డెలివరీ చేయబడిందని, తదుపరి చర్య అవసరం లేదని మీకు, మీ సిబ్బందికి సూచిస్తుంది.

ఆర్డర్‌ను డెలివరీ చేయబడినట్లుగా మార్క్ చేయడం వలన మీ కస్టమర్‌కు నోటిఫికేషన్ కూడా పంపబడుతుంది, తద్వారా ఆర్డర్ చేరుకుందని వారు తెలుసుకుంటారు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లకు వెళ్లండి.

  2. మీరు డెలివరీ చేయబడినట్లుగా మార్క్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌పై క్లిక్ చేయండి.

  3. డెలివరీ చేయబడిందని మార్క్ చేయండిపై క్లిక్ చేయండి.

స్థానిక డెలివరీ ఆర్డర్‌ను రద్దు చేయండి

మీరు డెలివరీని రద్దు చేసినప్పుడు, ఆర్డర్ స్టేటస్ డెలివరీకి సిద్ధంగా ఉంది నుండి నెరవేర్చబడనికి మారుతుంది.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లకు వెళ్లండి.

  2. మీరు రద్దు చేయాలనుకుంటున్న స్థానిక డెలివరీ ఆర్డర్‌పై క్లిక్ చేయండి

  3. ...పై క్లిక్ చేసి, ఆపై డెలివరీని రద్దు చేయండిపై క్లిక్ చేయండి.