చిరునామా ఫార్మాట్లను రివ్యూ చేయడం
Shopifyలో షిప్పింగ్ లేబుల్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు, షిప్పింగ్ చిరునామా ఫార్మాట్ గురించి ప్రతి షిప్పింగ్ క్యారియర్‌కు విభిన్న అంచనాలు ఉంటాయి.
షిప్పింగ్ చిరునామా చెకర్లు
మీ షిప్పింగ్ చిరునామాలను ధృవీకరించడానికి ఈ కింది సాధనాలను ఉపయోగించండి.
| క్యారియర్ | సాధనం |
|---|---|
| USPS | USPS చిరునామా చెకర్ |
| కెనడా పోస్ట్ | కెనడా పోస్ట్ చిరునామా చెకర్ |
| DHL | DHL చిరునామా చెకర్ |
| DPD UK | DPD పోస్ట్‌కోడ్ మరియు చిరునామా ఫైండర్ |
| Colissimo | Colissimo చిరునామా చెకర్ |
చిరునామా గుర్తింపు
మీరు షిప్పింగ్ లేబుల్ కోసం షిప్పింగ్ చిరునామాను నమోదు చేసినప్పుడు, ఆ చిరునామా షిప్పింగ్ క్యారియర్ డేటాబేస్‌తో తనిఖీ చేయబడుతుంది. అది మ్యాచ్ అయితే, షిప్పింగ్ క్యారియర్ ఆ చిరునామాను గుర్తిస్తుందని హామీ ఇవ్వబడుతుంది. ఒకవేళ మ్యాచ్ కాకపోతే, ఆ చిరునామా గుర్తించబడుతుందనే గ్యారెంటీ ఉండదు, ఇది షిప్పింగ్‌లో ఎర్రర్లు లేదా జాప్యాలకు దారితీయవచ్చు.
గుర్తించిన చిరునామాలు
ఒకవేళ చిరునామా చెల్లుబాటు అయ్యే ఫార్మాట్లో ఉండి, క్యారియర్ డేటాబేస్‌తో మ్యాచ్ అయితే, అది గుర్తించబడుతుందని హామీ ఇవ్వబడుతుంది. దీని అర్థం, క్యారియర్ లేబుల్‌ను అంగీకరిస్తుంది మరియు లేబుల్‌ను చదవడంలో వచ్చే ఎర్రర్ల వల్ల ఎలాంటి జాప్యాలు జరగవు.
పసుపు రంగు బ్యానర్ ఎర్రర్
పసుపు రంగు బ్యానర్లో షిప్పింగ్ చిరునామా ఎర్రర్ మెసేజ్ ఉంటే, ఆ చిరునామా సరైన ఆకృతిలోనే ఉన్నప్పటికీ, క్యారియర్ డేటాబేస్‌లో సరిపోలలేదని అర్థం. అంటే సాధారణంగా, చిరునామాను ఎంటర్ చేసిన విధానంలో ఎర్రర్ ఉందని అర్థం. షిప్పింగ్ క్యారియర్ ఉపయోగించే చిరునామాను కనుగొనడానికి, మీరు క్యారియర్ అందించే షిప్పింగ్ చిరునామా చెకర్ను ఉపయోగించవచ్చు.
గుర్తించబడని చిరునామాలను కూడా మీరు ఉపయోగించవచ్చు, అలాగే ఇది డెలివరీపై ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చు. ఒకవేళ ఆ చిరునామా సరైనదేనని మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు మీ లేబుల్‌పై ఈ గుర్తించబడని చిరునామాను ఉపయోగించవచ్చు.
మీ షిప్పింగ్ చిరునామాలతో మీకు సహాయం కావాలంటే, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
ఎరుపు రంగు బ్యానర్ ఎర్రర్
ఒకవేళ ఎరుపు రంగు బ్యానర్లో షిప్పింగ్ చిరునామా ఎర్రర్ మెసేజ్ ఉంటే, ఆ చిరునామా సరైన ఆకృతిలో లేదని, అలాగే మీరు దానికి లేబుల్‌ను కొనుగోలు చేయలేరని అర్థం. షిప్పింగ్ క్యారియర్ ఉపయోగించే ఆకృతిని కనుగొనడానికి, మీరు క్యారియర్ అందించే షిప్పింగ్ చిరునామా చెకర్ను ఉపయోగించవచ్చు.
మీ షిప్పింగ్ చిరునామాలతో మీకు సహాయం కావాలంటే, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
US మిలిటరీ షిప్పింగ్ చిరునామాలు
USలోని మిలిటరీ మెయిలింగ్ చిరునామాలకు ఒక ప్రత్యేకమైన ఆకృతి ఉంటుంది, దానిని ఒక నిర్దిష్ట పద్ధతిలోనే ఎంటర్ చేయాలి. ఒకవేళ చిరునామాను తప్పుగా ఎంటర్ చేసినట్లయితే, ఆర్డర్ ఉద్దేశించిన గ్రహీతకు చేరకపోవచ్చు. 3 విభిన్న రకాల US మిలిటరీ చిరునామాలు ఉన్నాయి:
- Army/Air Post Office (APO)
- Fleet Post Office (FPO)
- Diplomatic Post Office (DPO)
ఒకవేళ మీకు US మిలిటరీ షిప్పింగ్ చిరునామాతో ఏదైనా ఆర్డర్ వస్తే, ఆర్డర్‌ను రవాణా చేయడానికి ముందు ఆ చిరునామా కరెక్ట్‌గా ఎంటర్ చేయబడిందో లేదో నిర్ధారించుకోండి. ఒకవేళ కస్టమర్ షిప్పింగ్ చిరునామాను కరెక్ట్‌గా ఎంటర్ చేయకపోయి ఉంటే, ఈ కింది మార్గదర్శకాలను ఉపయోగించి కస్టమర్ చిరునామాను ఎడిట్ చేయండి:
- గ్రహీతల పేరును తప్పనిసరిగా పేరు ఫీల్డ్‌లలో ఎంటర్ చేయాలి, అయితే వారి ర్యాంక్‌ను ఎంటర్ చేయడం అనేది ఆప్షనల్.
- AP చిరునామాల కోసం PSC, BOX నంబర్లు లేదా FPO మరియు DPO చిరునామాల కోసం UNIT, BOX నంబర్లు, ఈ రెండూ తప్పనిసరిగా చిరునామా ఫీల్డ్‌లో ఉండాలి.
- నగరం ఫీల్డ్‌లో APO, FPO లేదా DPO మాత్రమే ఉండాలి. నగరం పేరును ఎంటర్ చేయవద్దు.
- దేశం/ప్రాంతం ఫీల్డ్‌లో United States ఎంచుకోబడి ఉండాలి.
- రాష్ట్రం ఫీల్డ్‌లో Armed Forces Americas, Armed Forces Europe లేదా Armed Forces Pacificను ఎంచుకోవాలి. ఈ లొకేషన్లను మీ కస్టమర్ Armed Forces America (AA), Armed Forces Europe (AE), లేదా Armed Forces Pacific (AP) అని కుదించబడిన రూపంలో కూడా ఎంటర్ చేయవచ్చు.
చిరునామా సమాచారం గురించి మీకు ఖచ్చితంగా తెలియనట్లయితే, మరింత స్పష్టత కోసం ఆర్డర్ చేసిన కస్టమర్‌ను సంప్రదించండి.