మీ షిప్పింగ్ లేబుల్‌ల కోసం షిప్పింగ్ బీమా
మీరు యునైటెడ్ స్టేట్స్ నుండి ఆర్డర్లను రవాణా చేస్తే మరియు షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేస్తే, గరిష్టంగా $5,000 USD బీమా కవరేజ్ ఉన్న షిప్పింగ్ బీమాను కొనుగోలు చేయడం ద్వారా మీ ఆర్డర్లను సురక్షితం చేయవచ్చు. తప్పిపోవడం, దొంగతనం లేదా నష్టం జరగడం నుండి షిప్పింగ్ బీమా మీ షిప్మెంట్లకు రక్షణ కల్పిస్తుంది.
మీరు షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేసేటప్పుడు మీ షిప్‌మెంట్‌కు బీమా చేయవచ్చు, అలాగే నేరుగా Shopify అడ్మిన్ నుండి మీ క్లెయిమ్‌లను సమర్పించవచ్చు. మీరు Shopify ద్వారా కొనుగోలు చేసే కవరేజ్ కోసం Shipsurance అనేది బీమా అడ్మినిస్ట్రేటర్‌గా ఉంటుంది.
తప్పిపోయిన లేదా పాడైన షిప్మెంట్ల కోసం షిప్పింగ్ క్యారియర్ క్లెయిమ్‌లను ఫైల్ చేయడానికి సంబంధించిన సమాచారం కోసం, షిప్పింగ్ క్యారియర్ క్లెయిమ్‌లను చూడండి.
ఈ పేజీలో
షిప్పింగ్ బీమాకు అర్హత
షిప్పింగ్ బీమాకు అర్హత పొందడానికి, మీరు కింది ఆవశ్యకతలను తప్పక తీర్చాలి:
- మీ షిప్మెంట్ యునైటెడ్ స్టేట్స్ నుండి రవాణా చేయబడాలి.
- మీరు షిప్పింగ్ లేబుల్‌లలో ఒక షిప్పింగ్ లేబుల్‌ను కొనుగోలు చేయాలి.
- మీ ఉత్పత్తులు Shipsurance సేవా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
ఎటువంటి ఖర్చు లేకుండా ప్రతి అర్హత గల లేబుల్‌పై గరిష్టంగా $200 USD వరకు చేర్చబడిన షిప్పింగ్ బీమాను పొందడానికి, మీరు ఈ కింది ఆవశ్యకతలను కూడా తీర్చాలి:
- మీ స్టోర్‌లో Shopify Paymentsను యాక్టివేట్ చేసి ఉంచాలి.
- Shopifyలో కొనుగోలు చేసిన లేబుల్లపై చేర్చబడిన షిప్పింగ్ బీమాను పొందడానికి, మీ స్టోర్ తప్పనిసరిగా Grow, Advanced లేదా Plus ప్లాన్‌లో ఉండాలి.
- Managed Markets ద్వారా కొనుగోలు చేసిన లేబుల్లపై చేర్చబడిన షిప్పింగ్ బీమాను పొందడానికి, మీ స్టోర్ తప్పనిసరిగా Grow, Advanced లేదా Plus ప్లాన్‌లో ఉండాలి, అలాగే Managed Markets యాక్టివేట్ చేయబడి ఉండాలి.
చేర్చబడిన షిప్పింగ్ బీమా
మీరు Shopify Paymentsను యాక్టివేట్ చేసి ఉండి, మీ స్టోర్ Grow, Advanced లేదా Plus ప్లాన్‌లో ఉంటే, మీరు Shopifyలో కొనుగోలు చేసే ప్రతి అర్హత గల లేబుల్‌పై గరిష్టంగా $200 USD వరకు షిప్పింగ్ బీమా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఆటోమేటిక్‌గా చేర్చబడుతుంది.
మీరు Managed Marketsను ఉపయోగిస్తుండి, మీ స్టోర్ Grow, Advanced లేదా Plus ప్లాన్‌లో ఉంటే, మీరు Managed Markets ఆర్డర్ల కోసం కొనుగోలు చేసే లేబుల్‌లలో కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా $200 USD వరకు షిప్పింగ్ బీమా చేర్చబడుతుంది. మీరు Managed Marketsను ఉపయోగిస్తుండి, మీ స్టోర్ Basic ప్లాన్‌లో ఉంటే, బీమా చేర్చబడదు, కానీ మీరు మీ ఆర్డర్ల కోసం షిప్పింగ్ బీమాను కొనుగోలు చేయవచ్చు.
చేర్చబడిన షిప్పింగ్ బీమా వేర్వేరు సర్వీసులలో స్టాక్ అవ్వదు లేదా కంబైన్ అవ్వదు. ప్రతి అర్హత గల షిప్‌మెంట్‌కు మొత్తం చేర్చబడిన బీమాలో గరిష్టంగా $200 USD వరకు కవరేజ్ అందించబడుతుంది.
మీరు షిప్పింగ్ లేబుల్‌ను కొనుగోలు చేసినప్పుడు, చేర్చబడిన షిప్పింగ్ బీమా SHIPPING INSURANCE (షిప్పింగ్ బీమా) విభాగంలో కనిపిస్తుంది. మీ ఆర్డర్ విలువ $200 USD కంటే ఎక్కువగా ఉంటే, మీరు పూర్తి షిప్మెంట్ విలువకు బీమాను కొనుగోలు చేయవచ్చు లేదా కస్టమ్ మొత్తాన్ని జోడించవచ్చు.
షిప్పింగ్ లేబుల్‌లో బీమా చేర్చబడిందని నిర్ధారించండి
- మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్లును క్లిక్ చేయండి.
- మీరు ఏ ఆర్డర్ కోసం షిప్పింగ్ లేబుల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఆ ఆర్డర్‌ను క్లిక్ చేయండి.
- నెరవేర్చబడని విభాగంలో, షిప్పింగ్ లేబుల్‌ను సృష్టించండిని క్లిక్ చేయండి.
- SHIPPING INSURANCE (షిప్పింగ్ బీమా) విభాగంలో, షిప్పింగ్ బీమా చేర్చబడిందని నిర్ధారించండి.
- ఆప్షనల్: మీరు అదనపు బీమాను కొనుగోలు చేయాలనుకుంటే, Insure full shipment value (పూర్తి షిప్మెంట్ విలువకు బీమా చేయండి) లేదా Insure custom amount (కస్టమ్ మొత్తానికి బీమా చేయండి)ని ఎంచుకోండి. షిప్పింగ్ బీమా ప్రీమియం రేట్ల గురించి మరింత తెలుసుకోండి.
షిప్పింగ్ బీమాను కొనుగోలు చేయడం
మీకు చేర్చబడిన షిప్పింగ్ బీమాకు అర్హత లేకపోతే, మీరు మీ షిప్‌మెంట్‌కు జోడించాలనుకుంటున్న షిప్పింగ్ బీమా కవరేజ్ మొత్తాన్ని SHIPPING INSURANCE (షిప్పింగ్ బీమా) విభాగంలో నమోదు చేయవచ్చు. మీరు షిప్పింగ్ బీమాను కొనుగోలు చేసే ముందు, కింది అంశాలను రివ్యూ చేయండి:
- మీరు షిప్పింగ్ బీమాను $100 USD ఇంక్రిమెంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, మీరు మొత్తం $250 USD విలువైన మీ ఐటెమ్‌లకు బీమా చేయాలనుకుంటే, అలాగే $20.50 USD ఖర్చయ్యే అంతర్జాతీయ షిప్పింగ్‌ను ఉపయోగిస్తుంటే, మీరు మీ షిప్పింగ్ లేబుల్‌కు $270.50 USDకి బీమాను జోడించవచ్చు. బీమా ప్రీమియం ఖర్చు $1.29 USD x 3 (ప్రతి $100 USD కవరేజీకి), కాబట్టి మొత్తం $3.87 USD అవుతుంది.
- Shopify అడ్మిన్లోని బిల్లింగ్ పేజీలో మీ షిప్పింగ్ బీమా అలాగే షిప్పింగ్ లేబుల్ ఛార్జీలు వేరువేరుగా లిస్ట్ చేయబడతాయి.
- లేబుల్ కొనుగోలు చేసిన తర్వాత గరిష్టంగా 30 రోజుల వరకు ఉపయోగించని షిప్పింగ్ లేబుల్‌ను రద్దు చేయడం ద్వారా మీరు షిప్పింగ్ బీమాను రద్దు చేయవచ్చు. మీరు బీమాను రద్దు చేసిన తర్వాత, మీరు ఇకపై క్లెయిమ్‌ను సమర్పించలేరు అలాగే మీరు షిప్పింగ్ బీమా ప్రీమియం క్రెడిట్‌ను అందుకుంటారు. ఈ క్రెడిట్‌ను భవిష్యత్తులో చేసే షిప్పింగ్ బీమా కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించవచ్చు.
- USPS First Class Mail షిప్పింగ్ సేవ బీమాకు అర్హత పొందదు.
- పోర్టో రికోలోని గమ్యస్థానాలకు UPS సేవలను ఉపయోగించి పంపిన షిప్మెంట్లు బీమాకు అర్హత పొందవు.
షిప్పింగ్ బీమా ప్రీమియం రేట్లు
బీమా ప్రీమియం రేట్ల గురించి తెలుసుకోవడానికి కింది పట్టికను పరిశీలించండి:
| షిప్మెంట్ రకం | బీమా రేటు |
|---|---|
| దేశీయ షిప్మెంట్లు | $100 USD కవరేజీకి $0.89 USD |
| అంతర్జాతీయ షిప్మెంట్లు | $100 USD కవరేజీకి $1.29 USD |
షిప్పింగ్ బీమాను కొనుగోలు చేయండి
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్లుకి వెళ్లండి.
మీరు ఏ ఆర్డర్ కోసం షిప్పింగ్ లేబుల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఆ ఆర్డర్‌ను క్లిక్ చేయండి.
నెరవేర్చబడని విభాగంలో, షిప్పింగ్ లేబుల్‌ను సృష్టించండిని క్లిక్ చేయండి.
షిప్పింగ్ బీమా విభాగంలో, బీమా కవరేజ్ మొత్తాన్ని ఎంటర్ చేయండి.
షిప్పింగ్ బీమా క్లెయిమ్‌ను సమర్పించడం
మీరు కోల్పోయిన, దెబ్బతిన్న మరియు దొంగిలించబడిన షిప్మెంట్ల కోసం నేరుగా మీ Shopify అడ్మిన్‌లో షిప్పింగ్ బీమా క్లెయిమ్‌ను సమర్పించవచ్చు. మీరు షిప్పింగ్ బీమా క్లెయిమ్‌ను సమర్పించే ముందు, కింది అంశాలను పరిశీలించండి:
- క్యారియర్ అందించే కవరేజీ కూడా ఉండే షిప్పింగ్ లేబుల్ కోసం షిప్పింగ్ బీమా కొనుగోలు చేసినా లేదా దానికి జోడించినా సరే, కోల్పోయిన, దెబ్బతిన్న లేదా దొంగిలించబడిన షిప్మెంట్ల కోసం చేసే ఏవైనా క్లెయిమ్‌లను క్యారియర్‌తో కాకుండా Shipsuranceతో ఫైల్ చేయాలి.
- షిప్పింగ్ లేబుల్ కోసం అదనపు షిప్పింగ్ బీమాను చేర్చినా లేదా విడిగా కొనుగోలు చేసినా, క్యారియర్ అందించే కవరేజీతో అది స్టాక్ చేయబడదు లేదా కలపబడదు.
- చాలా వరకు షిప్మెంట్ల కోసం, మీరు ఆర్డర్ రవాణా చేయబడిన 24 గంటల తర్వాత అలాగే షిప్పింగ్ తేదీ నుండి 120 రోజుల వరకు బీమా క్లెయిమ్‌ను సమర్పించవచ్చు.
క్లెయిమ్‌ను సమర్పించండి
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్లుకి వెళ్లండి.
మీరు ఏ ఆర్డర్ కోసం బీమా క్లెయిమ్‌ను సమర్పించాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి.
… బటన్‌ను క్లిక్ చేసి, ఆపై క్లెయిమ్ ఫైల్ చేయండిని క్లిక్ చేయండి.
క్లెయిమ్ వివరాలు విభాగంలో, కింది సమాచారాన్ని ఎంచుకోండి:
- క్లెయిమ్ రకం
- మీ దెబ్బతిన్న లేదా కోల్పోయిన ప్యాకేజీని గుర్తించిన తేదీ
- క్లెయిమ్ కారణం
క్లెయిమ్ మొత్తం విభాగంలో, మీరు క్లెయిమ్ చేయాలనుకుంటున్న డబ్బు మొత్తాన్ని ఎంటర్ చేయండి. మీరు చెల్లించిన కవరేజ్ మొత్తం కంటే ఎక్కువ మీరు క్లెయిమ్ చేయలేరు.
పేఅవుట్ వివరాలులో, మీరు Shipsurance నుండి మీ బీమా పేఅవుట్‌ను ఏ విధంగా స్వీకరించాలనుకుంటున్నారో ఎంచుకోండి, ఆపై మీ పేఅవుట్ రకాన్ని బట్టి మీ కాంటాక్ట్ లేదా అడ్రస్ వివరాలను జోడించండి.
సంప్రదింపు సమాచారం విభాగంలో, మీ ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి. మీ క్లెయిమ్ గురించి వారికి అదనపు సమాచారం అవసరమైతే మిమ్మల్ని సంప్రదించడానికి Shipsurance ఉపయోగించే ఇమెయిల్ ఇదే.
నేను పై డిస్క్లైమర్ను చదివాను, అర్థం చేసుకున్నాను ఎంచుకుని, ఆపై క్లెయిమ్ ఫైల్ చేయండిని క్లిక్ చేయండి.
మొబైల్
- Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి .
- మీరు ఏ ఆర్డర్ కోసం బీమా క్లెయిమ్‌ను సమర్పించాలనుకుంటున్నారో దాన్ని ట్యాప్ చేయండి.
- … లేదా ⋮ను ట్యాప్ చేసి, ఆపై క్లెయిమ్ ఫైల్ చేయండిని ట్యాప్ చేయండి.
- ఈ క్లెయిమ్ వివరాలు విభాగంలో, కింది సమాచారాన్ని ఎంచుకోండి:
- క్లెయిమ్ రకం
- మీ దెబ్బతిన్న లేదా కోల్పోయిన ప్యాకేజీని గుర్తించిన తేదీ
- క్లెయిమ్ కారణం
- క్లెయిమ్ మొత్తం విభాగంలో, మీరు క్లెయిమ్ చేయాలనుకుంటున్న డబ్బు మొత్తాన్ని ఎంటర్ చేయండి. మీరు చెల్లించిన కవరేజ్ మొత్తం కంటే ఎక్కువ మీరు క్లెయిమ్ చేయలేరు.
- పేఅవుట్ వివరాలులో, మీరు Shipsurance నుండి మీ బీమా పేఅవుట్‌ను ఏ విధంగా స్వీకరించాలనుకుంటున్నారో ఎంచుకోండి, ఆపై మీ పేఅవుట్ రకాన్ని బట్టి మీ కాంటాక్ట్ లేదా అడ్రస్ వివరాలను జోడించండి.
- సంప్రదింపు సమాచారం విభాగంలో, మీ ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి. మీ క్లెయిమ్ గురించి వారికి అదనపు సమాచారం అవసరమైతే మిమ్మల్ని సంప్రదించడానికి Shipsurance ఉపయోగించే ఇమెయిల్ ఇదే.
- నేను పై డిస్క్లైమర్ను చదివాను, అర్థం చేసుకున్నాను ఎంచుకుని, ఆపై క్లెయిమ్ ఫైల్ చేయండిని ట్యాప్ చేయండి.
మీరు క్లెయిమ్‌ను సమర్పించిన తర్వాత, క్లెయిమ్ ID, Shipsurance బీమా పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి లింక్‌తో కూడిన ఇమెయిల్‌ను మీరు అందుకుంటారు. మీ క్లెయిమ్ స్టేటస్‌ను చెక్ చేయడానికి మీరు ఆ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. ఆర్డర్‌పై ఉన్న క్లెయిమ్ సమాచారాన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు స్టేటస్‌ను చెక్ చేయవచ్చు.
ఓపెన్ క్లెయిమ్ కోసం మద్దతు పొందడం
Shopify బీమా క్లెయిమ్‌లకు మద్దతు ఇవ్వదు. మీరు షిప్పింగ్ బీమాను కొనుగోలు చేసి, మీకు ఏదైనా సహాయం కావాలంటే, మీరు నేరుగా Shipsurance సపోర్ట్‌ని సంప్రదించాలి:
- shopifyclaims@shipsurance.comలో ఇమెయిల్ ద్వారా
- 1-866-852-9956కు ఫోన్ చేయడం ద్వారా