షిప్పింగ్ లేబుల్‌లను అర్థం చేసుకోవడం

మీ స్వంత ప్యాకేజీలను రవాణా చేయడానికి మీరు షిప్పింగ్ లేబుల్‌లను ఉపయోగించవచ్చు. షిప్పింగ్ లేబుల్‌లు ఎలా పని చేస్తాయి, షిప్పింగ్ లేబుల్‌లలోని రకాలు మరియు నిర్దిష్ట దేశాలకు షిప్పింగ్ చేయడానికి పరిగణనల గురించి మరింత తెలుసుకోండి.

మీరు మీ ఐటెమ్‌లను ప్యాకేజీ చేసి, మీ ప్యాకేజీకి షిప్పింగ్ లేబుల్‌ను అటాచ్ చేసిన తర్వాత, మీరు ఉపయోగించే షిప్పింగ్ క్యారియర్‌ను బట్టి స్థానిక పోస్ట్ ఆఫీస్ లేదా డ్రాప్-ఆఫ్ లొకేషన్‌లో మీ ప్యాకేజీని డ్రాప్ చేయవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో క్యారియర్ పికప్‌ని షెడ్యూల్ చేయడానికి కూడా ఎంచుకోవచ్చు, కాబట్టి షిప్పింగ్ క్యారియర్ మీ వద్దకు వచ్చి మీ ప్యాకేజీని పికప్ చేస్తుంది.

షిప్పింగ్ లేబుల్ అవలోకనం

షిప్‌మెంట్ ప్యాకేజింగ్‌కు షిప్పింగ్ లేబుల్‌లు అటాచ్ చేయబడతాయి. షిప్‌మెంట్ సరిగ్గా బట్వాడా చేయబడిందని నిర్ధారించుకోవడానికి షిప్పింగ్ క్యారియర్‌లు ఉపయోగించే సమాచారాన్ని అవి ప్రదర్శిస్తాయి. చాలా లేబుల్‌లు కింది సమాచారాన్ని కలిగి ఉంటాయి:

స్వీకర్త వివరాలు, పంపినవారి వివరాలు, బార్‌కోడ్‌తో సహా సాధారణ షిప్పింగ్ లేబుల్ సమాచారం వివరణలు.
లేబుల్ సమాచారంవివరణ
స్వీకర్త పేరు, అడ్రస్ అలాగే ఫోన్ నంబర్షిప్‌మెంట్‌ను ఎక్కడ బట్వాడా చేయాలో క్యారియర్‌కి తెలియజేస్తుంది అలాగే అవసరమైతే స్వీకర్తను సంప్రదించడానికి మార్గాన్ని అందిస్తుంది
పంపేవారి చిరునామాఒకవేళ షిప్‌మెంట్‌ను స్వీకరించేవారి చిరునామాకు డెలివరీ చేయడం సాధ్యం కాకపోతే, దాన్ని ఎక్కడికి వాపసు చేయాలో క్యారియర్‌కు తెలియజేస్తుంది
ఒక బార్‌కోడ్షిప్‌మెంట్ పురోగతిని ట్రాక్ చేయడంలో క్యారియర్‌కు సహాయపడుతుంది. ఉదాహరణకు, బార్‌కోడ్‌లు క్యారియర్ సదుపాయంలోకి ప్రవేశించినప్పుడు లేదా బయటకు వెళ్లిన ప్రతిసారీ స్కాన్ చేయబడతాయి

షిప్పింగ్ లేబుల్‌లలో ఈ కింది అదనపు సమాచారం కూడా ఉండవచ్చు:

  • షిప్‌మెంట్ ఆర్డర్ నంబర్
  • ట్రాకింగ్ నంబర్
  • ఆర్డర్ షిప్ చేసిన తేదీ
  • కొనుగోలు చేసిన షిప్పింగ్ సేవ రకం
  • షిప్పింగ్ క్యారియర్ సమాచారం

మీరు ఒక షిప్‌మెంట్‌ను షిప్పింగ్ క్యారియర్‌కు ఇచ్చే ముందు, మీరు తప్పనిసరిగా షిప్పింగ్ లేబుల్‌ని కొనుగోలు చేసి, దానిని మీ షిప్‌మెంట్ ప్యాకేజింగ్‌కు అతికించాలి.

షిప్పింగ్ లేబుల్‌ల రకాలు

షిప్పింగ్ లేబుల్ రకాల మధ్య ప్రధాన వ్యత్యాసం డెలివరీ వేగం. ఉదాహరణకు, 2 రోజులలోపు డెలివరీకి హామీ ఇచ్చే షిప్పింగ్ లేబుల్ అనేది 7-10 రోజులలోపు డెలివరీ చేసే లేబుల్ కంటే చాలా ఖరీదైనది. చాలా షిప్పింగ్ క్యారియర్‌లు ప్రామాణిక డెలివరీ (నెమ్మది), వేగవంతమైన డెలివరీ (వేగంగా) మరియు ఓవర్‌నైట్ డెలివరీ (అతి వేగంగా) వంటి అనేక రకాల వేగాలతో తమ సేవలను అందిస్తాయి. కొన్ని డెలివరీ వేగాలు అన్ని లొకేషన్‌లకూ అందుబాటులో ఉండవు.

మీరు మీ షిప్పింగ్‌ను సెటప్ చేసేటప్పుడు, మీరు అందించాలనుకుంటున్న రవాణా సమయం ఆధారంగా మీ షిప్పింగ్ ధరలను సెట్ చేయాలి. ఉదాహరణకు, మీరు మీ కస్టమర్‌లకు 2-రోజుల షిప్పింగ్‌ను అందించాలనుకుంటే, మీరు 7–10 రోజుల డెలివరీని ఆఫర్ చేసినప్పుడు వసూలు చేసే దానికంటే, మీ షిప్పింగ్ ఖర్చులను పూడ్చుకోవడానికి కస్టమర్‌ల నుండి అధిక ఛార్జీ వసూలు చేయాలి.

మీ షిప్‌మెంట్ దెబ్బతిన్నా లేదా తప్పిపోయినా లేబుల్‌లు కొంత మేర లయబిలిటీ రక్షణను కూడా అందిస్తాయి. ఎక్కువ ఖరీదైన లేబుల్‌లు సాధారణంగా అధిక లయబిలిటీ రక్షణను కలిగి ఉంటాయి. మీరు యునైటెడ్ స్టేట్స్‌లో ఉండి, Shopifyలో షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేస్తే, మీరు అదనంగా షిప్పింగ్ బీమాని కొనుగోలు చేయవచ్చు.

కొన్ని లేబుల్‌లపై, మీరు మీ షిప్పింగ్ లేబుల్‌ల కోసం అదనపు సేవలను కూడా కొనుగోలు చేయవచ్చు:

  • ట్రాకింగ్ నంబర్: ఇది మీ ప్యాకేజీ డెలివరీలో ఉన్నప్పుడు అది ఎక్కడ ఉందో ట్రాక్ చేయడానికి మీరు ఉపయోగించగల ఒక నంబర్‌ను అందిస్తుంది. కస్టమర్‌లకు వారి ప్యాకేజీ ఎప్పుడు డెలివరీ అవుతుందో నిర్ధారించుకోవడానికి మీరు ఈ నంబర్‌ను వారికి అందించవచ్చు. చాలా వేగవంతమైన షిప్పింగ్ ఎంపికలు ట్రాకింగ్ నంబర్‌తో వస్తాయి, కానీ కొన్నిసార్లు ఫీజు చెల్లించి నెమ్మదిగా ఉండే పద్ధతులకు కూడా దీన్ని జోడించవచ్చు.
  • సంతకం నిర్ధారణ: షిప్‌మెంట్ డెలివరీ అయినప్పుడు కస్టమర్ నుండి సంతకాన్ని అభ్యర్థించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది సరైన వ్యక్తికి షిప్‌మెంట్ డెలివరీ అయిందని నిర్ధారించుకోవడంలో సహాయపడుతుంది.
  • వయస్సు రుజువు: మీరు ఆల్కహాల్ వంటి వయస్సు పరిమితి ఉన్న వస్తువులను పంపుతుంటే, దాన్ని స్వీకరించే వ్యక్తి IDని తనిఖీ చేయమని మీరు షిప్పింగ్ కొరియర్‌ను అభ్యర్థించవచ్చు.

కొన్ని షిప్పింగ్ లేబుల్‌లకు కొన్ని సేవలు అందుబాటులో ఉండవు. మీకు నిర్దిష్ట సేవ అవసరమైతే, ఆ సేవను అందించే షిప్పింగ్ లేబుల్‌ని మీరు కొనుగోలు చేశారని నిర్ధారించుకోండి.

షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేయడానికి ఎంపికలు

మీ ప్రాంతం, మీ Shopify ప్లాన్, మరియు మీరు ఉపయోగించే క్యారియర్‌లు లేదా యాప్‌ల ఆధారంగా షిప్పింగ్ లేబుల్‌ను కొనుగోలు చేయడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి. మీ వ్యాపారానికి ఉత్తమంగా పని చేసేదాన్ని ఎంచుకోవడానికి ఈ కింది ఎంపికలను పరిశీలించండి:

ట్రాకింగ్ నంబర్‌లు

మీ ఆర్డర్ పురోగతిని ట్రాక్ చేయడానికి కొన్ని లేబుల్‌లు ట్రాకింగ్ నంబర్‌తో వస్తాయి. మీరు ఈ ట్రాకింగ్ నంబర్‌ను మీ కస్టమర్‌లకు అందించవచ్చు, తద్వారా వారు కూడా వారి ప్యాకేజీని ట్రాక్ చేయగలరు. చాలా మంది కస్టమర్‌లు ట్రాకింగ్ నంబర్‌ను స్వీకరించడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ప్యాకేజీ ఎప్పుడు వస్తుందో అంచనా వేసిన తేదీని ఇది వారికి అందిస్తుంది మరియు వారు తమ ఆర్డర్‌ను అందుకుంటారనే నమ్మకాన్ని ఇస్తుంది.

ట్రాకింగ్ సమాచారంతో వచ్చే షిప్పింగ్ లేబుల్‌లు సాధారణంగా అది లేని వాటి కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి. మీరు మీ కస్టమర్‌లకు ట్రాకింగ్‌తో కూడిన షిప్పింగ్ లేబుల్‌లను అందించాలనుకుంటే, మీరు మీ షిప్పింగ్ ధరలను సెట్ చేసేటప్పుడు అధిక షిప్పింగ్ ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నారని నిర్ధారించుకోండి.

మీ సరఫరాదారు షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేస్తుంటే, వారు ఏ రకాన్ని కొనుగోలు చేస్తున్నారో మీకు తెలుసని నిర్ధారించుకోండి.

మీరు షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందో లేదో నిర్ణయించండి

మీ వ్యాపారం ఎలా సెటప్ చేయబడింది అనేదాని ఆధారంగా, మీరు లేదా మీ సరఫరాదారు షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేస్తారు. సాధారణంగా, షిప్పింగ్ క్యారియర్‌కు షిప్‌మెంట్‌ను ఎవరు అందజేస్తారో వారే షిప్పింగ్ లేబుల్‌ను కొనుగోలు చేస్తారు. మీ సరఫరాదారు షిప్‌మెంట్ కోసం లేబుల్‌ను కొనుగోలు చేస్తే, వారు సాధారణంగా ఆ ఖర్చును మీ నుండి వసూలు చేస్తారు.

అంతర్జాతీయ పరిగణనలు

కొన్ని దేశాలలో ప్రత్యేకమైన షిప్పింగ్ నిబంధనలు ఉన్నాయి, మీ షిప్‌మెంట్‌లు మీ కస్టమర్‌లను చేరుకోవడానికి మీరు వాటిని తప్పనిసరిగా పాటించాలి. ఈ నిబంధనలను పాటించకపోతే షిప్‌మెంట్ ఆలస్యం అవ్వడం, వాపసు అవ్వడం లేదా ధ్వంసం చేయబడడం జరగవచ్చు.

నిర్దిష్ట దేశాలు మరియు ప్రాంతాలలో అవసరమైన అదనపు ఫీల్డ్‌ల గురించి మరింత తెలుసుకోండి.

బ్రెజిల్‌కు షిప్పింగ్

బ్రెజిల్‌లోని కస్టమర్‌లకు విక్రయించే వ్యాపారుల కోసం, చెక్‌అవుట్ ప్రక్రియలోని చెల్లింపు పేజీలో అదనపు సమాచారం అని లేబుల్ చేయబడిన ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ ఆన్‌లైన్ స్టోర్‌లోని చెక్‌అవుట్ ప్రక్రియలో చెల్లింపు పేజీలో మాత్రమే కనిపిస్తుంది. ఇది Shopify POS లేదా మొబైల్ యాప్‌లో కనిపించదు.

బ్రెజిల్ వెలుపల మరియు లోపలి నుండి షిప్‌మెంట్‌లను స్వీకరించే కస్టమర్‌లు ఈ ఫీల్డ్‌లో తమ Cadastro de Pessoas Físicas (CPF) లేదా Cadastro Nacional da Pessoa Jurídica (CNPJ) నంబర్‌ను నమోదు చేస్తారు. కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత, వారి ఆర్డర్ వివరాల పేజీలో మీరు వారి CPF/CNPJ నంబర్‌ను కనుగొనవచ్చు.

మీరు బ్రెజిల్‌లో ఉన్నట్లయితే, కస్టమర్ కోసం ప్రభుత్వ ఇన్‌వాయిస్‌ను జారీ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా CPF/CNPJ నంబర్‌ను ఉపయోగించాలి. మీరు బ్రెజిల్ వెలుపల ఉన్నట్లయితే, మీరు తప్పనిసరిగా షిప్పింగ్ లేబుల్‌కు కస్టమర్ CPF/CNPJ నంబర్‌ను జోడించాలి. షిప్పింగ్ లేబుల్‌పై CPF/CNPJ నంబర్ లేని ప్యాకేజీలు నాశనం చేయబడవచ్చు లేదా వాపసు చేయబడవచ్చు. Shopifyలో కొనుగోలు చేసిన షిప్పింగ్ లేబుల్‌లకు CPF/CNPJ నంబర్‌లు జోడించబడవు మరియు ప్రింట్ చేసిన తర్వాత భౌతిక లేబుల్‌పై రాసి ఉండాలి. మీరు థర్డ్-పార్టీ షిప్పింగ్ క్యారియర్ ద్వారా షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేసినట్లయితే, CPF/CNPJ నంబర్‌ను ఎలా జోడించాలో తెలుసుకోవడానికి మీ క్యారియర్‌ను సంప్రదించండి.

ఒకవేళ సరఫరాదారు మీ తరపున లేబుల్‌లను కొనుగోలు చేసినట్లయితే, వారు షిప్పింగ్ లేబుల్‌లకు CPF/CNPJ నంబర్‌ను జోడించారో లేదో నిర్ధారించుకోండి.

చైనాకు షిప్పింగ్

చైనాలోని కస్టమర్‌లకు విక్రయించే వ్యాపారుల కోసం, చెక్‌అవుట్ ప్రక్రియలోని చెల్లింపు పేజీలో అదనపు సమాచారం అని లేబుల్ చేయబడిన ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ ఆన్‌లైన్ స్టోర్‌లోని చెక్‌అవుట్ ప్రక్రియలో చెల్లింపు పేజీలో మాత్రమే కనిపిస్తుంది. ఇది Shopify POS లేదా మొబైల్ యాప్‌లో కనిపించదు. మీ కస్టమర్ రెసిడెంట్ ID నంబర్ లేని విదేశీ జాతీయులైతే, వారు ఈ ఫీల్డ్‌లో వారి పాస్‌పోర్ట్ నంబర్‌ను నమోదు చేయవచ్చు.

చైనా వెలుపలి నుండి షిప్‌మెంట్‌లను స్వీకరించే కస్టమర్‌లు ఈ ఫీల్డ్‌లో వారి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రెసిడెంట్ ఐడెంటిటీ కార్డ్ (రెసిడెంట్ ID)ని నమోదు చేస్తారు. కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత, వారి ఆర్డర్ వివరాల పేజీలో మీరు వారి రెసిడెంట్ ID నంబర్‌ను కనుగొనవచ్చు.

మీరు చైనా వెలుపల ఉన్నట్లయితే, మీరు షిప్పింగ్ లేబుల్‌కు కస్టమర్ రెసిడెంట్ IDని తప్పనిసరిగా జోడించాలి. షిప్పింగ్ లేబుల్ మీద రెసిడెంట్ ID లేని ప్యాకేజీలు ధ్వంసం కావచ్చు లేదా తిరిగి రావచ్చు. Shopifyలో కొనుగోలు చేసిన షిప్పింగ్ లేబుల్‌లకు రెసిడెంట్ ID నంబర్‌లు జోడించబడవు, వీటిని ప్రింట్ చేసిన తర్వాత భౌతిక లేబుల్ మీద రాయాల్సి ఉంటుంది. మీరు థర్డ్-పార్టీ షిప్పింగ్ క్యారియర్ ద్వారా షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేస్తే, రెసిడెంట్ ID నంబర్‌ను ఎలా జోడించాలో తెలుసుకోవడానికి మీ క్యారియర్‌ను సంప్రదించండి.

మీ తరఫున ఒక సరఫరాదారు లేబుల్‌లను కొనుగోలు చేసినట్లయితే, వారు షిప్పింగ్ లేబుల్‌లకు రెసిడెంట్ ID నంబర్‌ను జోడించేలా చూసుకోండి.

ఇటలీకి షిప్పింగ్ చేయడం

ఇటలీలోని కస్టమర్‌లకు విక్రయించే ఇటలీకి చెందిన వ్యాపారుల కోసం, చెక్‌అవుట్ ప్రక్రియలో చెల్లింపు పేజీ మీద అదనపు సమాచారం (Additional information) అని లేబుల్ చేసిన రెండు ఫీల్డ్‌లు ఉంటాయి. ఆన్‌లైన్ స్టోర్‌లోని చెక్‌అవుట్ ప్రక్రియలో చెల్లింపు పేజీ మీద మాత్రమే ఈ ఫీల్డ్‌లు కనిపిస్తాయి. అవి Shopify POS లేదా మొబైల్ యాప్‌లో కనిపించవు.

ఇటలీలోని కస్టమర్‌లు తమ Codice Fiscale (CF), Posta Elettronica Certificata (PEC)ను ఈ ఫీల్డ్‌లలో నమోదు చేస్తారు. కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత, మీరు వారి ఆర్డర్ వివరాల పేజీలో వారి CF నంబర్, PECను కనుగొనవచ్చు.

అదనపు సమాచారం ఫీల్డ్‌లు తప్పనిసరి కావు, ఎందుకంటే ప్రతి లావాదేవీకి ఇన్‌వాయిస్ అవసరం ఉండదు. మీరు ఇటలీలో ఉండి, మీ కస్టమర్ ఈ ఫీల్డ్‌లలో సమాచారాన్ని నమోదు చేసినట్లయితే, పన్ను నిబంధనలు, నియంత్రణ కోసం మీరు మీ కస్టమర్‌కు తప్పనిసరిగా ఇన్‌వాయిస్ జారీ చేయాలి. చెక్‌అవుట్ వద్ద ఫీల్డ్‌లను పూరించినట్లయితే, ఆర్డర్ వివరాల పేజీలో ఒక బ్యానర్ కనిపిస్తుంది.

దక్షిణ కొరియాకు షిప్పింగ్ చేయడం

దక్షిణ కొరియాలోని కస్టమర్‌లకు విక్రయించి, దక్షిణ కొరియా వెలుపలి నుండి తమ ఉత్పత్తులను షిప్పింగ్ చేసే వ్యాపారుల కోసం, చెక్‌అవుట్ ప్రక్రియలో చెల్లింపు పేజీ మీద అదనపు సమాచారం (Additional information) అనే లేబుల్‌తో ఒక ఫీల్డ్ ఉంటుంది. ఆన్‌లైన్ స్టోర్‌లోని చెక్‌అవుట్ ప్రక్రియలో చెల్లింపు పేజీ మీద మాత్రమే ఈ ఫీల్డ్ కనిపిస్తుంది. ఇది Shopify POS లేదా మొబైల్ యాప్‌లో కనిపించదు.

దక్షిణ కొరియా వెలుపలి నుండి షిప్‌మెంట్‌లను స్వీకరించే కస్టమర్‌లు తమ Personal Customs Clearance Code (PCCC)ను ఈ ఫీల్డ్‌లో నమోదు చేస్తారు. కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత, మీరు వారి ఆర్డర్ వివరాల పేజీలో వారి PCCC నంబర్‌ను కనుగొనవచ్చు. ఒకవేళ మీ కస్టమర్ PCCC నంబర్ లేని విదేశీ జాతీయులు అయితే, వారు ఈ ఫీల్డ్‌లో తమ పాస్‌పోర్ట్ నంబర్‌ను నమోదు చేయవచ్చు.

మీరు దక్షిణ కొరియా వెలుపల ఉన్నట్లయితే, మీరు షిప్పింగ్ లేబుల్‌కు కస్టమర్ PCCC నంబర్‌ను తప్పనిసరిగా జోడించాలి. షిప్పింగ్ లేబుల్ మీద PCCC నంబర్ లేని ప్యాకేజీలు ధ్వంసం కావచ్చు లేదా తిరిగి రావచ్చు. Shopify ద్వారా కొనుగోలు చేసిన షిప్పింగ్ లేబుల్‌లకు PCCC నంబర్‌లు జోడించబడవు, ప్రింట్ చేసిన తర్వాత భౌతిక లేబుల్ మీద రాయాల్సి ఉంటుంది. మీరు థర్డ్-పార్టీ షిప్పింగ్ క్యారియర్ ద్వారా షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేస్తే, PCCC నంబర్‌ను ఎలా జోడించాలో తెలుసుకోవడానికి మీ క్యారియర్‌ను సంప్రదించండి.

మీ తరఫున ఒక సరఫరాదారు లేబుల్‌లను కొనుగోలు చేసినట్లయితే, వారు షిప్పింగ్ లేబుల్‌లకు PCCC నంబర్‌ను జోడించేలా చూసుకోండి.