ఆర్డర్‌లను నిర్వహించడం

మీరు మీ Shopify అడ్మిన్‌లోని ఆర్డర్‌లు పేజీ నుండి మీ ఆర్డర్‌లను నిర్వహించవచ్చు. కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు, మీకు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే కస్టమర్‌కు ఆర్డర్ నిర్ధారణ ఇమెయిల్ వస్తుంది. చాలా ఆర్డర్‌లు ఈ 2 ప్రధాన దశల గుండా వెళ్తాయి:

మీ వ్యాపారం పని చేసే విధానాన్ని బట్టి మీరు ఈ దశలను ఆటోమేట్ చేయవచ్చు. ఆర్డర్‌ల నిర్వహణలో ఆర్డర్‌లను వీక్షించడం, ట్రాక్ చేయడం, చెల్లింపులను ప్రాసెస్ చేయడం, ఆర్డర్‌లలో మార్పులు చేయడం, అలాగే రిటర్న్‌లు, రీఫండ్‌లను హ్యాండిల్ చేయడం ఉంటాయి.

ఆర్డర్‌లను వీక్షించడం, సృష్టించడం

ఆర్డర్ నంబర్, కస్టమర్ పేరు లేదా ఉత్పత్తి వివరాల ద్వారా ఆర్డర్‌ల కోసం వెతకండి. ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేటస్, చెల్లింపు పద్ధతి లేదా తేదీ పరిధి ఆధారంగా ఆర్డర్‌లను ఫిల్టర్ చేయండి. మీరు ఫోన్, వ్యక్తిగత లేదా ఇమెయిల్ సేల్స్ కోసం కస్టమర్‌ల తరపున ఆర్డర్‌లను సృష్టించవచ్చు. డ్రాఫ్ట్ ఆర్డర్‌ల ద్వారా మీరు ఉత్పత్తులను జోడించవచ్చు, డిస్కౌంట్‌లను వర్తింపజేయవచ్చు మరియు సురక్షితమైన చెక్‌అవుట్ లింక్‌లతో ఇన్‌వాయిస్‌లను పంపవచ్చు.

ఆర్డర్‌లను ప్రాసెస్ చేయడం, ఎడిట్ చేయడం

చెల్లింపులను ఆటోమేటిక్‌గా లేదా మాన్యువల్‌గా క్యాప్చర్ చేయండి, ఆర్డర్ వివరాలను సమీక్షించండి మరియు ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం ఆర్డర్‌లను సిద్ధం చేయండి. ఉత్పత్తులను జోడించడానికి లేదా తీసివేయడానికి, పరిమాణాలను సర్దుబాటు చేయడానికి, షిప్పింగ్ రుసుములను అప్‌డేట్ చేయడానికి లేదా డిస్కౌంట్‌లను వర్తింపజేయడానికి మీరు ఆర్డర్‌లను ఎడిట్ చేయవచ్చు. షిప్‌మెంట్‌లతో చేర్చడానికి ప్యాకింగ్ స్లిప్‌లను, ఇన్‌వాయిస్‌లను ప్రింట్ చేయండి.

రిటర్న్‌లను, మోసాలను నిర్వహించడం

కస్టమర్‌లు ఐటెమ్‌లను వాపసు పంపాలనుకున్నప్పుడు రిటర్న్‌లను సృష్టించండి, అలాగే వర్తించే చోట ఎక్స్ఛేంజ్ ఐటెమ్‌లను జోడించండి. పూర్తి లేదా పాక్షిక రీఫండ్‌లను జారీ చేయండి, లేదంటే ఆర్డర్‌లను పూర్తిగా రద్దు చేయండి. కస్టమర్‌లు తమ ఆర్డర్ స్టేటస్ పేజీ నుండి నేరుగా రిటర్న్ అభ్యర్థనలను సమర్పించేలా మీరు రిటర్న్ నియమాలను సెటప్ చేసి, సెల్ఫ్-సర్వ్ రిటర్న్‌లను యాక్టివేట్ చేయవచ్చు. ఆర్డర్‌లను నెరవేర్చడానికి ముందు Shopify వారి మోసాల విశ్లేషణను ఉపయోగించి అధిక-రిస్క్ ఆర్డర్‌లను సమీక్షించండి, అలాగే మోసపూరిత ఆర్డర్‌లు అయ్యుండే అవకాశం ఉన్నవాటిని హ్యాండిల్ చేయడాన్ని ఆటోమేట్ చేయడానికి Shopify Flowను ఉపయోగించండి.

ఈ విభాగంలో