ఆర్డర్‌లను అంచనా వేయడం
తదుపరి కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలో మీ వ్యాపారానికి ఎన్ని ఆర్డర్‌లు వస్తాయో అంచనా వేయడాన్ని డిమాండ్ అంచనా అంటారు. దీనిని ఏవైనా ప్రమోషన్‌లు లేదా సేల్స్, ఏదైనా కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు, ఉత్పత్తి నిలిపివేతలను పరిగణనలోకి తీసుకుని అంచనా వేయాలి. మీ సగటు ఆర్డర్‌లలో ఏవైనా వ్యత్యాసాలకు సిద్ధంగా ఉండటం వల్ల మీరు డబ్బు ఆదా చేయవచ్చు, సానుకూల కస్టమర్ అనుభవాన్ని నిర్వహించవచ్చు, ఆర్డర్ పరిమాణంలో మార్పుల కోసం సిద్ధంగా ఉండటానికి మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవలకు సహాయపడుతుంది.
ఉదాహరణకు, మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ సాధారణంగా మీ వ్యాపారం కోసం వారానికి 100 ఆర్డర్‌లను నెరవేర్చుతుందని అనుకుందాం. మీరు మీ ప్రొవైడర్‌కు తెలియజేయకుండానే 500 ఆర్డర్‌లు తెచ్చిపెట్టే మార్కెటింగ్ ప్రచారాన్ని రన్ చేసినట్లయితే, అప్పుడు మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ అదనపు ఆర్డర్‌లను హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా లేకపోవచ్చు, ఇది మీ కస్టమర్‌ల కోసం ప్రాసెసింగ్, షిప్పింగ్ ఆలస్యానికి దారితీస్తుంది. అంతేకాకుండా, మీరు ఫుల్‌ఫిల్‌మెంట్ సేవకు తగినంత ఇన్వెంటరీ పంపి ఉండకపోవచ్చు. మీ డిమాండ్‌ను అంచనా వేయడం, ఫుల్‌ఫిల్‌మెంట్ సేవకు తెలియజేయడం ద్వారా, మీరు, మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ఇద్దరూ ఆర్డర్‌లలో ఊహించిన పెరుగుదలకు సిద్ధంగా ఉన్నారని మీరు నిర్ధారించుకోవచ్చు.
ఈ పేజీలో
డిమాండ్ అంచనా వల్ల ప్రయోజనాలు
డిమాండ్ అంచనా వల్ల కలిగే ప్రయోజనాలు అనేవి మీ సగటు విక్రయాల స్థాయిలలో మార్పులకు సిద్ధంగా ఉండటం ద్వారా వస్తాయి. ముఖ్యంగా, డిమాండ్ అంచనా కింద ఉన్న ప్రయోజనాలను అందిస్తుంది:
- మొత్తం ఆర్డర్ పరిమాణాలపై మీ ప్రమోషన్‌లు లేదా కొత్త ఉత్పత్తుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది
- మీరు రాబడిని కోల్పోకుండా చూసుకోవడానికి బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే సేల్స్ వంటి ముఖ్యమైన విక్రయ ఈవెంట్‌ల కోసం ప్లాన్ చేయడానికి మీకు సహాయపడుతుంది
- ఉత్పత్తి స్టాక్‌లో ఉండటం వల్ల, అలాగే ఆర్డర్‌ను త్వరగా ప్రాసెస్ చేయడానికి ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ వద్ద వనరులు అందుబాటులో ఉండటం వల్ల, వేగవంతమైన డెలివరీ సమయాలతో మీ కస్టమర్‌లకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవం అందేలా నిర్ధారిస్తుంది
- మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవకు ఎప్పుడు ఎక్కువ పంపాలి వంటి ఇన్వెంటరీ గురించి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది
- మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవకు ఎక్కువ ఇన్వెంటరీ పంపడాన్ని నివారించడంలో మీకు సహాయపడటం ద్వారా డబ్బును ఆదా చేస్తుంది, ఇది ఇన్వెంటరీ క్యారీయింగ్, హోల్డింగ్ ఖర్చులకు దారితీయవచ్చు
డిమాండ్ అంచనాను ఉపయోగించడం ప్రారంభించడం
అన్ని వ్యాపారాలు డిమాండ్ అంచనాలో విలువను పొందగలిగినప్పటికీ, పని చేయడానికి మీ వద్ద కొంత చారిత్రక డేటా ఉన్నప్పుడు ఇది అత్యంత విలువైనదిగా ఉంటుంది. విక్రయాల చరిత్ర లేని వ్యాపారం కోసం, మీ మార్కెటింగ్ ప్రయత్నాల ప్రభావం గురించి ఆలోచించడం, మీ ఆర్డర్ ప్రాసెసింగ్‌లో అంతరాయాలు ఎక్కడ సంభవించవచ్చో ఆలోచించడం వ్యాపార ప్రారంభ నిర్ణయాలను నిర్దేశించడంలో సహాయపడతాయి. కొంత విక్రయాల చరిత్ర ఉన్న వ్యాపారం కోసం, మీరు కేవలం 8 వారాల నిరంతర వారపు ఆర్డర్‌లతో డిమాండ్ అంచనాను ఉపయోగించి మీ వ్యాపారాన్ని ప్లాన్ చేయడం ప్రారంభించవచ్చు. ఒక సంవత్సరం ఆర్డర్‌ల తర్వాత, సేల్స్ ఎక్కువగా, తక్కువగా ఉండే నెలల వంటి సీజనాలిటీ కోసం మీరు అంచనా వేయడం ప్రారంభించవచ్చు.
మీరు మీ డిమాండ్‌ను అంచనా వేయడం ప్రారంభించడానికి ముందు, మీ వ్యాపారం గురించిన కింది సమాచారాన్ని మీకు సాధ్యమైనంత ఎక్కువగా సేకరించండి:
- చారిత్రక డిమాండ్‌ల గురించి సమాచారం
- ప్రతి రోజు, వారం, నెలకు మీ సగటు విక్రయాల మొత్తం ఎంత?
- మీ వ్యాపారం ఎలాంటి కాలానుగుణ ప్రభావాలను ఎదుర్కొంటుంది?
- రాబోయే ప్రమోషన్‌ల కోసం ప్లాన్
- మీరు రాబోయే మూడు నెలల్లో ఏ ప్రమోషన్‌లను రన్ చేస్తున్నారు?
- గతంలో మీ ప్రమోషన్‌ల ఫలితాలు ఎలా ఉన్నాయి?
- రాబోయే ఉత్పత్తి లాంచ్‌లు లేదా నిలిపివేతలకు సంబంధించిన ప్లాన్
ఉదాహరణకు, మీది కొత్త వ్యాపారం అయితే, మీకు ఈ క్రింది విషయాలు మాత్రమే తెలిసి ఉండవచ్చు:
- సగటు రోజువారీ విక్రయాలు: 25
- సగటు వారంవారీ విక్రయాలు: 178
- సగటు నెలవారీ విక్రయాలు: 706
- సగటు ప్రమోషన్ కారణంగా విక్రయాల్లో 15% పెరుగుదల ఉంటుంది
- సగటు ప్రమోషన్‌ల కంటే మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్‌తో, వారాంతంలో రెండు రోజుల పాటు ఉండే కొత్త ప్రమోషన్ మూడు వారాల్లో ప్రారంభమవుతుంది
- ఏడు వారాల్లో ఉత్పత్తిని నిలిపివేయడం
పై ఉదాహరణలో, మూడు వారాల్లో విక్రయాలలో 50% పెరుగుదల ఉండవచ్చని లేదా సాధారణంగా ఉండే 50కి బదులుగా రెండు రోజుల్లో దాదాపు 75 ఆర్డర్‌లు రానున్నాయని మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవకు తెలియజేయాల్సి రావచ్చు. 25 విక్రయాల పెరుగుదల గురించి మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా, ఒకే వారాంతంలో వారి వ్యాపారాలు 50 వరకు ఒకేసారి సేల్ నిర్వహిస్తే, వారు అదనంగా 1,250 ఆర్డర్‌లను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి దీని కోసం వారు ముందుగానే సిద్ధపడాలి.
ఇంకా, ఏడు వారాలలో ఉత్పత్తి నిలిపివేతపై మీ ప్రమోషన్ ప్రభావం ఎలా ఉంటుంది? మీరు దీన్ని నిలిపివేస్తున్నప్పటికీ, ఈ ప్రమోషన్ సమయంలో కూడా, మొత్తం ఏడు వారాలకు సరిపడేంత ఇన్వెంటరీ మీ వద్ద ఉందా?
మీ డిమాండ్ అంచనాను మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవకు తెలియజేయడం వల్ల వారితో మెరుగైన సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు, అలాగే డిమాండ్ పెరిగినప్పుడు ముందుగానే సిద్ధంగా ఉండటానికి, మీ ఉత్పత్తి శ్రేణిలో సులభంగా మార్పులు చేయడానికి మీ ఇద్దరికీ వీలవుతుంది.
Shopify ఎలా సహాయపడుతుంది?
విక్రయాల మొత్తాలను, ఆర్డర్ ట్రెండ్‌లను ట్రాక్ చేయడానికి మీ Shopify స్టోర్‌లో అందుబాటులో ఉన్న వివిధ విక్రయాలు, ఇన్వెంటరీ, మరియు మార్కెటింగ్ నివేదికలను మీరు ఉపయోగించవచ్చు. మీ స్టోర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆధారంగా, మీకు ఆర్డర్ ద్వారా మొత్తం విక్రయాల నివేదిక, కాలక్రమేణా విక్రయాలు, ఉత్పత్తి ద్వారా రోజువారీగా విక్రయించబడిన ఇన్వెంటరీ మరియు మార్కెటింగ్‌కు ఆపాదించబడిన విక్రయాలు వంటి నివేదికలకు యాక్సెస్ ఉంటుంది.
మీరు మీ వ్యాపారం గురించి ఇన్‌సైట్‌లను పొందేందుకు మీ స్టోర్ అనలిటిక్స్ పేజీని కూడా ఉపయోగించవచ్చు.
మీ వ్యాపారం ఇప్పుడే ప్రారంభమవుతున్నట్లయితే, ఎక్కువ లెక్కలు చేయాల్సిన అవసరం లేకుండానే మీ విక్రయాల సంఖ్యలపై మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది కాబట్టి, మీకు బహుశా అన్ని Shopify నివేదికలు అవసరం ఉండకపోవచ్చు. అయితే, మీ వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పుడు, మీ స్టోర్ సగటులను లెక్కించడంలో ఈ నివేదికలు మీ సమయాన్ని ఆదా చేస్తాయి.
మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవతో కలిసి పని చేయడం ఎలా
మీ డిమాండ్ అంచనాకు సంబంధించిన వాస్తవిక ప్లాన్‌ను వారికి అందించడం ద్వారా, మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్‌కు మీ ఆర్డర్‌లను వేగంగా, సమర్థవంతంగా నెరవేర్చడానికి అవసరమైన కార్మికులు, వనరులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవచ్చు. మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి, మీరు ఈ సమాచారాన్ని వారికి ఏ విధంగా, ఎంత తరచుగా ఇవ్వవచ్చో అడగండి. కొన్ని వ్యాపారాలు దీన్ని ప్రతివారం చేయడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తాయి, మరికొన్ని చిన్న వ్యాపారాలు అధిక ప్రభావం చూపే మార్పు జరిగినప్పుడు మాత్రమే వారి ఫుల్‌ఫిల్‌మెంట్ సేవను సంప్రదిస్తాయి.
పండుగల సమయాల్లో, చాలా వ్యాపారాలలో విక్రయాలు పెరుగుతాయి కాబట్టి దాన్ని ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ నిర్వహించాల్సి ఉంటుంది, అటువంటప్పుడు మీ అంచనాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ఉత్తమం. ఈ సమయంలో, ప్రతి రెండు వారాలకు మీ ఫలితాలను అంచనా వేయండి మరియు వాటిని మీ వాస్తవ విక్రయాల సంఖ్యలతో పోల్చండి.
మీ వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పుడు, మీ ఆశించిన ఆర్డర్‌లలో జరిగే ఏవైనా మార్పులను తెలియజేయడం చాలా ముఖ్యం, అవి కింద ఇవ్వబడ్డాయి:
- మీ ఇమెయిల్ మార్కెటింగ్‌ను ప్రారంభించడం, మార్చడం లేదా ముగించడం
- ప్రకటనలపై మీ ఖర్చును పెంచడం లేదా తగ్గించడం
- ప్రధాన విక్రయాల ఈవెంట్‌లు
మీ అంచనాలు తప్పుగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది?
దాదాపు అన్ని అంచనాలు తప్పుగానే ఉంటాయి. మీ ఆర్డర్‌లను సమర్ధవంతంగా నెరవేర్చడానికి తగినంత ఇన్వెంటరీ, వనరులు అందుబాటులో ఉండేలా దగ్గరగా అంచనా వేయడమే దీని ముఖ్యోద్దేశం, ఇది కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. సాధారణంగా, సంవత్సరంలో ప్రతివారం 10-15% మార్జిన్ లోపంతో అంచనా వేయడానికి ప్రయత్నించండి. మీరు ఎంత ఎక్కువగా అంచనా వేస్తే, మీకు అంత ఎక్కువగా ట్రెండ్‌లు తెలుస్తాయి. మీరు విక్రయాలు తక్కువగా ఉంటాయని పదేపదే అంచనా వేస్తుంటే, తర్వాతిసారి అంచనాను అదే మార్జిన్‌తో పెంచుకోవాలని మీకు అర్థమవుతుంది.
మీ అంచనాలలో సాధ్యమైనంత వరకు వాస్తవికతకు దగ్గరగా ఉండటం వల్ల వాటి ఖచ్చితత్వాన్ని మెరుగుపరచవచ్చు. మీ వ్యాపార పరిమాణానికి సరైన సాధనాన్ని ఉపయోగించడం కూడా సహాయపడుతుంది. మీ ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రొవైడర్ కోసం అంచనా వేయడం ప్రారంభించినప్పుడు స్ప్రెడ్‌షీట్ బాగా పనిచేస్తుంది. మీరు స్కేల్ పెంచుతున్నప్పుడు, మీ వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పుడు, మీ Shopify స్టోర్‌లోని నివేదికలు విక్రయాల ట్రెండ్‌లను భారీ స్థాయిలో వీక్షించడానికి, విశ్లేషించడానికి సహాయపడతాయి.