ఆర్డర్‌లను రీఫండ్ చేయడం
మీరు మీ Shopify అడ్మిన్‌లోని ఆర్డర్‌లు పేజీ నుండి మొత్తం ఆర్డర్‌ని లేదా ఆర్డర్‌లోని కొంత భాగాన్ని మాత్రమే రీఫండ్ చేయవచ్చు. ఆర్డర్‌ని రీఫండ్ చేయడం వల్ల కస్టమర్‌కు చెల్లింపు తిరిగి పంపబడుతుంది, ఇది వివాదాలను పరిష్కరించడంలో, ధర నిర్ణయానికి సంబంధించిన తప్పులను సరిదిద్దడంలో లేదా మీ వాపసు విధానాన్ని గౌరవించడంలో మీకు సహాయపడుతుంది.
మీరు రిటర్న్ని సృష్టించకుండా ఆర్డర్‌ను రీఫండ్ చేయవచ్చు, కానీ రీఫండ్ జారీ చేసిన తర్వాత మీరు రిటర్న్‌ను సృష్టించలేరు. కొన్ని సందర్భాల్లో, మీరు ఆర్డర్‌ను రద్దు చేసి, ఆపై రీఫండ్‌ను జారీ చేయవచ్చు. రీఫండ్ ప్రక్రియలో భాగంగా, మీకు ఐటెమ్‌లను రీస్టాక్ చేయడానికి, అలాగే కస్టమర్‌కు నోటిఫికేషన్ ఇమెయిల్‌ను పంపే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ రీఫండ్ చేయడానికి చెల్లింపు ఏదీ లేకపోతే, అప్పుడు మీరు ఆర్డర్ నుండి ఐటెమ్‌లను రీస్టాక్ చేయవచ్చు.
మీరు ఒక కస్టమర్ అయి ఉండి, ఒక Shopify స్టోర్‌లో మీరు పెట్టిన ఆర్డర్ రీఫండ్ కోసం చూస్తున్నట్లయితే, అప్పుడు మీరు నేరుగా ఆ స్టోర్‌ని సంప్రదించాలి.
ఈ పేజీలో
- ఆర్డర్‌లను రీఫండ్ చేయడానికి పరిగణనలు
- మొత్తం ఆర్డర్‌ను రీఫండ్ చేయండి
- ఆర్డర్‌లో కొంత భాగాన్ని రీఫండ్ చేయండి
- ఆర్డర్ కోసం షిప్పింగ్‌ను రీఫండ్ చేయండి
- ఓవర్-రీఫండ్ చేయడానికి అనుమతించండి
- ఆర్డర్‌ను రీస్టాక్ చేయండి
- స్టోర్ క్రెడిట్‌ను జారీ చేసిన తర్వాత పరిమిత రీఫండ్ మొత్తం
- పాక్షికంగా రీఫండ్ చేయబడిన ఆర్డర్‌లపై ఛార్జ్‌బ్యాక్‌లను నిర్వహించడం
ఆర్డర్‌లను రీఫండ్ చేయడానికి పరిగణనలు
మీరు ఆర్డర్‌ను రీఫండ్ చేయడానికి ముందు, ఈ కింది పరిగణనలను రివ్యూ చేయండి:
- ఆర్డర్‌లను రీఫండ్ చేయడానికి, మీరు స్టోర్ యజమాని అయి ఉండాలి లేదా మీరు రీఫండ్ చేయాలనుకుంటున్న చెల్లింపు పద్ధతిని బట్టి ఈ కింది ఆర్డర్‌ల అనుమతులను కలిగి ఉండాలి: _ ఒరిజినల్ చెల్లింపు పద్ధతికి రీఫండ్ చేయండి _ ఒరిజినల్ చెల్లింపు పద్ధతికి రీఫండ్ చేయండి > గతంలో స్టోర్ క్రెడిట్‌కు రీఫండ్ చేసిన ఆర్డర్‌లను ఓవర్-రీఫండ్ చేయండి * స్టోర్ క్రెడిట్‌కు రీఫండ్ చేయండి
- మీరు ఆర్డర్‌ను రీఫండ్ చేసినప్పుడు, మీరు ఒరిజినల్ చెల్లింపు పద్ధతికి, స్టోర్ క్రెడిట్కు లేదా రెండింటికీ రీఫండ్ చేయవచ్చు. మీరు స్టోర్ క్రెడిట్‌కు రీఫండ్‌ను జారీ చేస్తే, అప్పుడు మీరు ఆప్షనల్‌గా స్టోర్ క్రెడిట్ కోసం గడువు ముగింపు తేదీని సెట్ చేయవచ్చు. స్టోర్ క్రెడిట్ గడువు ముగింపు తేదీలకు సంబంధించి వేర్వేరు దేశాలలో వేర్వేరు చట్టాలు ఉంటాయి. గడువు ముగింపు తేదీని సెట్ చేసే ముందు మీ దేశానికి సంబంధించిన చట్టాలను చెక్ చేయండి.
- ఒక ఆర్డర్‌లో అనేక లావాదేవీలు ఉండి, మీరు పాక్షిక రీఫండ్‌ను ఇస్తే, అప్పుడు ప్రతి లావాదేవీకి ఆ రీఫండ్ ఎలా వర్తిస్తుందనే దానికి సంబంధించిన సూచించబడిన విభజన ప్రదర్శించబడుతుంది. ఆర్డర్‌లో గిఫ్ట్ కార్డ్ ఉన్నట్లయితే, ఆ సూచన ముందుగా గిఫ్ట్ కార్డ్‌ను పూర్తిగా రీఫండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి చెల్లింపు పద్ధతికి అందుబాటులో ఉన్న మొత్తం వరకు మీరు ప్రతి చెల్లింపు పద్ధతి కోసం రీఫండ్ మొత్తాన్ని మాన్యువల్‌గా అడ్జస్ట్ చేయవచ్చు.
- మీరు అసలు చెల్లింపు పద్ధతికి రీఫండ్ చేస్తే, కస్టమర్‌కు ఇకపై ఆ చెల్లింపు పద్ధతికి యాక్సెస్ లేనట్లయితే, రీఫండ్‌ను పంపిన తర్వాత వారు నిధులను క్లెయిమ్ చేసుకోవడానికి అసలు చెల్లింపు పద్ధతికి సంబంధించిన బ్యాంక్ లేదా ఏజెన్సీని సంప్రదించాలి.
- కొన్ని చెల్లింపు పద్ధతులను అసలు చెల్లింపు పద్ధతికి రీఫండ్ చేయడం సాధ్యం కాదు. ఉదాహరణకు, Shopify Payments ద్వారా OXXO చెల్లింపులను అసలు చెల్లింపు పద్ధతికి రీఫండ్ చేయడం కుదరదు.
- మీరు ముందే ఆర్డర్‌ను స్టోర్ క్రెడిట్‌కు రీఫండ్ చేసి, తర్వాత కస్టమర్ తమ మనసు మార్చుకుంటే, మీరు స్టోర్ క్రెడిట్ తర్వాత అసలు చెల్లింపు పద్ధతికి రీఫండ్ చేయవచ్చు. ఇది ఇప్పటికే జారీ చేసిన స్టోర్ క్రెడిట్ రీఫండ్‌ను వెనక్కి తీసుకోదు, కాబట్టి ఇది ఆర్డర్‌ను ఓవర్-రీఫండ్ చేయడానికి కారణం కావచ్చు.
- మీరు మీ Shopify అడ్మిన్ నుండి రీఫండ్‌ను ప్రారంభించిన తర్వాత, దాన్ని రద్దు చేయలేరు లేదా వెనక్కి తీసుకోలేరు. మీరు పొరపాటున రీఫండ్‌ను ప్రారంభిస్తే, అప్పుడు మీరు కొత్త డ్రాఫ్ట్ ఆర్డర్‌ను సృష్టించవచ్చు మరియు డ్రాఫ్ట్ ఆర్డర్‌తో మళ్లీ చెల్లింపును వసూలు చేయవచ్చు.
- ఒకవేళ కస్టమర్ ఐటెమ్‌లను వెనక్కి పంపుతున్నట్లయితే, మీరు రిటర్న్ చేసిన ఐటెమ్‌లకు రీఫండ్ చేయడానికి ముందే ఒక రిటర్న్‌ను సృష్టించి, రిటర్న్ కారణాన్ని ఎంచుకోండి. రిటర్న్ లేకుండా చేసే రీఫండ్, రిటర్న్ కారణాన్ని రికార్డ్ చేయదు మరియు మీరు ఇప్పటికే రీఫండ్ చేసిన ఐటెమ్‌ల కోసం రిటర్న్‌ను సృష్టించలేరు. కారణాలతో ఎక్కువగా రిటర్న్ చేయబడిన ఉత్పత్తులు వంటి, రిటర్న్ చేసిన ఐటెమ్‌లను కారణం ఆధారంగా గ్రూప్ చేసే రిపోర్ట్‌లు, కేవలం రిటర్న్‌ల నుండి వచ్చిన కారణాలను మాత్రమే ఉపయోగిస్తాయి. రీఫండ్ కోసం కారణం విభాగంలో ఉండే టెక్స్ట్ మీకు, మీ సిబ్బందికి ఉపయోగపడే గమనిక మాత్రమే, అది రిటర్న్ కారణం కాదు.
- కస్టమర్ ఆర్డర్‌ను మీరు రీఫండ్ చేసినా లేదా రద్దు చేసినా , ఆర్డర్ నెరవేర్చబడినా లేకపోయినా సంబంధం లేకుండా, అసలు ఆర్డర్ రుసుములకు కింది సందర్భాలు వర్తిస్తాయి:
- ఆర్డర్‌ను Shopify Payments ద్వారా ప్రాసెస్ చేసినట్లయితే, మీకు ఎలాంటి క్రెడిట్ కార్డ్ రుసుములు రీఫండ్ చేయబడవు. Shopify Paymentsతో కొనుగోళ్లు మరియు రీఫండ్‌ల గురించి మరింత తెలుసుకోండి.
- ఆర్డర్‌ను థర్డ్-పార్టీ పేమెంట్ గేట్‌వే ద్వారా ప్రాసెస్ చేసినప్పటికీ, మీ స్టోర్ ఉన్న దేశంలో Shopify Payments గనక అందుబాటులో ఉంటే, మీకు ఎలాంటి లావాదేవీ రుసుములూ రీఫండ్ చేయబడవు. లావాదేవీ రుసుములు, క్రెడిట్ కార్డ్ రుసుములు రెండూ ఒకటి కాదు. క్రెడిట్ కార్డ్ రుసుములేవైనా సరే, మీరు ఉపయోగించే పేమెంట్ గేట్‌వే ద్వారా సెట్ చేయబడి, వసూలు చేయబడతాయి.
- ఒకవేళ ఆర్డర్ థర్డ్-పార్టీ పేమెంట్ గేట్‌వే ద్వారా ప్రాసెస్ చేయబడి, మీ స్టోర్ ఉన్న దేశంలో Shopify Payments అందుబాటులో లేనట్లయితే, కస్టమర్‌కు రీఫండ్ చేసిన ఆర్డర్ మొత్తానికి తగిన నిష్పత్తిలో లావాదేవీ రుసుములు కూడా రీఫండ్ చేయబడతాయి. మీరు ఆర్డర్‌ను పూర్తిగా రీఫండ్ చేసినట్లయితే, లావాదేవీ రుసుములో 100% మీ అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆర్డర్ ఖర్చులో 50% రీఫండ్ చేసినట్లయితే, లావాదేవీ రుసుములో 50% మీ అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది. మీరు మీ Shopify అడ్మిన్ ద్వారా ఆర్డర్‌ను రీఫండ్ చేసినప్పుడు మాత్రమే ఈ లావాదేవీ రుసుము క్రెడిట్ వర్తిస్తుంది. మీరు థర్డ్-పార్టీ పేమెంట్ గేట్‌వే ద్వారా ఆర్డర్‌ను రీఫండ్ చేసినట్లయితే, మీకు ఎలాంటి లావాదేవీ రుసుము క్రెడిట్ లభించదు.
- మీరు నెరవేర్చబడని ఐటెమ్‌ను రీఫండ్ చేస్తే, ఆ ఐటెమ్ ఆర్డర్ నుండి తీసివేయబడుతుంది మరియు దానిని నెరవేర్చడం సాధ్యం కాదు.
పూర్తి ఆర్డర్‌ను రీఫండ్ చేయండి
మీరు ఆర్డర్‌లోని అన్ని ఐటెమ్‌ల కోసం పూర్తి రీఫండ్‌ను జారీ చేయవచ్చు. మీరు రీఫండ్‌ను పూర్తి చేయడానికి ముందు, నేరుగా రీఫండ్ పేజీ నుండి లైన్ ఐటెమ్‌కు తగ్గింపును వర్తింపజేయవచ్చు. ఆర్డర్‌ను రీఫండ్ చేస్తున్నప్పుడు, రీస్టాకింగ్ రుసుమును మినహాయించడానికి మీరు మాన్యువల్‌గా రీఫండ్ మొత్తాన్ని ఎడిట్ చేయవచ్చు. అలాగే మీరు ఏవైనా షిప్పింగ్ రుసుములను కూడా రీఫండ్ చేయవచ్చు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లకు వెళ్లండి.
మీరు రీఫండ్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌ను క్లిక్ చేయండి.
రీఫండ్‌ను క్లిక్ చేయండి.
ఆప్షనల్: రీఫండ్ చేయడానికి ముందు లైన్ ఐటెమ్‌కు తగ్గింపును వర్తింపజేయడానికి, కింది దశలను పూర్తి చేయండి:
- మీరు దేనికైతే తగ్గింపును జోడించాలనుకుంటున్నారో, ఆ ఐటెమ్ ధరపై క్లిక్ చేయండి.
- తగ్గింపు రకం డ్రాప్-డౌన్ మెను నుండి, తగ్గింపు రకాన్ని ఎంచుకోండి.
- మీరు ఎంచుకున్న తగ్గింపు రకం ఆధారంగా, తగ్గింపు విలువ (ఒక్కో యూనిట్‌కి) లేదా తగ్గింపు విలువ ఫీల్డ్‌లో, తగ్గింపు మొత్తాన్ని ఎంటర్ చేయండి.
- ఆప్షనల్: తగ్గింపుకు కారణం ఫీల్డ్‌లో, తగ్గింపు కారణం గురించి ఒక నోట్‌ను ఎంటర్ చేయండి. ఈ నోట్ మీ కస్టమర్‌కు ప్రదర్శించబడుతుంది.
- సేవ్‌ను క్లిక్ చేయండి.
మీరు రీఫండ్ చేయాలనుకుంటున్న ఐటెమ్‌ల పరిమాణాన్ని ఎంటర్ చేయండి.
కింది ఆప్షనల్ దశల్లో దేనినైనా చేయండి:
- ఆప్షనల్: మీరు మీ ఐటెమ్‌లను మాన్యువల్‌గా రీస్టాక్ చేయాలనుకుంటే, ఐటెమ్‌లను రీస్టాక్ చేయిని డీసెలెక్ట్ చేయండి. ఈ ఎంపిక ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది, అలాగే మీరు ఆర్డర్‌లో చేర్చబడిన ఐటెమ్‌ల కోసం ఇన్వెంటరీని ట్రాక్ చేసినప్పుడు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.
- ఆప్షనల్: షిప్పింగ్‌ను రీఫండ్ చేయడానికి, షిప్పింగ్ రీఫండ్ చేయి విభాగంలో, షిప్పింగ్‌ను ఎంచుకోండి, ఆపై మీరు షిప్పింగ్ కోసం రీఫండ్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి
- ఆప్షనల్: ఒకవేళ ఆర్డర్‌లో సుంకాలు, దిగుమతి పన్నులు ఉంటే, అప్పుడు మీరు రీఫండ్ చేసిన ఐటెమ్‌లపై సుంకాలు మరియు దిగుమతి పన్నులను మరియు అదనపు రుసుములను: కస్టమ్స్ క్లియరెన్స్‌ను రీఫండ్ చేయాలా వద్దా అని ఎంచుకోండి.
- ఆప్షనల్: రీఫండ్‌కు కారణం విభాగంలో, రీఫండ్ కోసం కారణాన్ని ఎంటర్ చేయండి. ఈ రీఫండ్ కారణం మీ కస్టమర్‌కు ప్రదర్శించబడదు.
సారాంశం విభాగంలో, కింది వాటిని చేయండి:
- రీఫండ్ పద్ధతి డ్రాప్-డౌన్ మెను నుండి, ఒక రీఫండ్ పద్ధతిని ఎంచుకోండి.
- ఆప్షనల్: రీఫండ్ మొత్తం ఫీల్డ్‌లోని మొత్తాన్ని ఎడిట్ చేయండి. మీరు అసలు చెల్లింపుతో పాటు స్టోర్ క్రెడిట్ రెండింటినీ చెల్లింపు పద్ధతిగా ఎంచుకుంటే, అప్పుడు మీరు ఆ రెండు ఫీల్డ్‌లను ఎడిట్ చేయవచ్చు.
ఆప్షనల్: మీరు రీఫండ్‌ను జారీ చేసినప్పుడు, మీ కస్టమర్‌కు ఇమెయిల్ పంపకూడదనుకుంటే, అప్పుడు కస్టమర్‌కు నోటిఫికేషన్‌ను పంపును డీసెలెక్ట్ చేయండి. ఈ ఎంపిక ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది.
కస్టమర్ ఆర్డర్‌ను రీఫండ్ చేయడానికి రీఫండ్‌ను క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌పై ట్యాప్ చేయండి .
మీరు రీఫండ్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌పై ట్యాప్ చేయండి.
లేదా
ట్యాప్ చేసి, ఆపై రీఫండ్‌ను ట్యాప్ చేయండి.
ఆప్షనల్: రీఫండ్ చేయడానికి ముందు లైన్ ఐటెమ్‌కు తగ్గింపును వర్తింపజేయడానికి, కింది దశలను పూర్తి చేయండి:
- మీరు దేనికైతే తగ్గింపును జోడించాలనుకుంటున్నారో, ఆ ఐటెమ్ ధరపై ట్యాప్ చేయండి.
- తగ్గింపు రకం డ్రాప్-డౌన్ మెను నుండి, తగ్గింపు రకాన్ని ఎంచుకోండి.
- మీరు ఎంచుకున్న తగ్గింపు రకం ఆధారంగా, తగ్గింపు విలువ (ఒక్కో యూనిట్‌కి) లేదా తగ్గింపు విలువ ఫీల్డ్‌లో, తగ్గింపు మొత్తాన్ని ఎంటర్ చేయండి.
- ఆప్షనల్: తగ్గింపుకు కారణం ఫీల్డ్‌లో, తగ్గింపు కారణం గురించి ఒక నోట్‌ను ఎంటర్ చేయండి. ఈ నోట్ మీ కస్టమర్‌కు ప్రదర్శించబడుతుంది.
- సేవ్ లేదా ✓ను ట్యాప్ చేయండి.

కస్టమర్ ఆర్డర్‌ను రీఫండ్ చేయడానికి రీఫండ్‌ను ట్యాప్ చేయండి.
ఆర్డర్‌లో కొంత భాగాన్ని రీఫండ్ చేయండి
మీరు ఒక ఆర్డర్‌ను పాక్షికంగా రీఫండ్ చేయవచ్చు. రీఫండ్ చేయడానికి అందుబాటులో ఉన్న మొత్తం అంటే ఆర్డర్ అసలు మొత్తాన్ని చేరుకునే వరకు మీరు అదనపు పాక్షిక రీఫండ్‌లను జారీ చేయవచ్చు. మీరు పాక్షిక రీఫండ్‌ను జారీ చేసిన తర్వాత, మీ ఆర్డర్ స్టేటస్ అనేది పాక్షికంగా రీఫండ్ చేయబడిందిగా మారుతుంది.
ఐటెమ్‌ను పాక్షికంగా రీఫండ్ చేయడానికి, రీఫండ్‌ను పూర్తి చేయకముందే, నేరుగా రీఫండ్ పేజీ నుండి ఐటెమ్‌కు మీరు తగ్గింపును వర్తింపజేయవచ్చు.
మీరు రీఫండ్ పేజీలో తగ్గింపును వర్తింపజేసినప్పుడు, మీరు రీఫండ్ కోసం ఎంచుకునే పరిమాణంతో సంబంధం లేకుండా ఆ ఐటెమ్‌కి సంబంధించిన పూర్తి పరిమాణానికి తగ్గింపు వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ఐటెమ్ పరిమాణం 2 ఉండి, దానికి మీరు తగ్గింపును ఇస్తే, రీఫండ్ చేయాల్సిన పరిమాణం 0, 1 లేదా 2కి సెట్ చేయబడినా, ఆ రెండు యూనిట్లకు తగ్గింపు వర్తిస్తుంది.
మీరు రీఫండ్‌ను పూర్తి చేసినా చేయకపోయినా, మీరు సేవ్ ఆప్షన్‌ను క్లిక్ చేసినప్పుడు ఆర్డర్‌పై తగ్గింపు సేవ్ చేయబడుతుంది. ఒకవేళ మీరు రీఫండ్‌ను జారీ చేయకపోతే, కస్టమర్‌కు చెల్లించాల్సిన రీఫండ్‌ను ఆర్డర్ చూపిస్తుంది. కేవలం తగ్గింపును అప్లై చేసినంత మాత్రాన రీఫండ్ జారీ చేయబడదు, సారాంశం విభాగం రీఫండ్ చేయగల కొత్త బకాయి బ్యాలెన్స్‌ను చూపిస్తుంది.
గిఫ్ట్ కార్డ్‌కి రీఫండ్ చేయండి
ఒకవేళ కస్టమర్ గిఫ్ట్ కార్డ్ మరియు మరొక చెల్లింపు పద్ధతిని ఉపయోగించి కొనుగోలు చేసినట్లయితే, మీరు పాక్షిక రీఫండ్ చేసినప్పుడు, గిఫ్ట్ కార్డ్ రీఫండ్ కోసం అందుబాటులో ఉన్న పూర్తి మొత్తాన్ని చేరుకునే వరకు ఆ రీఫండ్ ముందుగా దానికి వర్తించబడుతుంది. మిగిలిన రీఫండ్ ఇతర చెల్లింపు పద్ధతులకు అప్లై అవుతుంది. ప్రతి చెల్లింపు పద్ధతికి అందుబాటులో ఉన్న మొత్తం వరకు మీరు ప్రతి చెల్లింపు పద్ధతికి సంబంధించిన రీఫండ్ మొత్తాలను మాన్యువల్‌గా సర్దుబాటు చేయవచ్చు.
ఉదాహరణకు, గిఫ్ట్ కార్డ్‌కి $50 USD పాక్షిక రీఫండ్ మొత్తం అప్లై అయి ఉండి, మీరు క్రెడిట్ కార్డ్‌కు $20 USD వరకు అప్లై చేయగలిగితే, మీరు గిఫ్ట్ కార్డ్‌కు $30 USDని, క్రెడిట్ కార్డ్‌కు $20 USDని అప్లై చేయడం ద్వారా రీఫండ్ చేయవచ్చు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లకు వెళ్లండి.
మీరు రీఫండ్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌ను క్లిక్ చేయండి.
ఆర్డర్ వివరాలు విభాగంలో, రీఫండ్‌ను క్లిక్ చేయండి.
ఆప్షనల్: రీఫండ్ చేయడానికి ముందు లైన్ ఐటెమ్‌కు తగ్గింపును వర్తింపజేయడానికి, కింది దశలను పూర్తి చేయండి:
- మీరు దేనికైతే తగ్గింపును జోడించాలనుకుంటున్నారో, ఆ ఐటెమ్ ధరపై క్లిక్ చేయండి.
- తగ్గింపు రకం డ్రాప్-డౌన్ మెను నుండి, తగ్గింపు రకాన్ని ఎంచుకోండి.
- మీరు ఎంచుకున్న తగ్గింపు రకం ఆధారంగా, తగ్గింపు విలువ (ఒక్కో యూనిట్‌కి) లేదా తగ్గింపు విలువ ఫీల్డ్‌లో, తగ్గింపు మొత్తాన్ని ఎంటర్ చేయండి.
- ఆప్షనల్: తగ్గింపుకు కారణం ఫీల్డ్‌లో, తగ్గింపు కారణం గురించి ఒక నోట్‌ను ఎంటర్ చేయండి. ఈ నోట్ మీ కస్టమర్‌కు ప్రదర్శించబడుతుంది.
- సేవ్‌ను క్లిక్ చేయండి.
మీరు రీఫండ్ చేయాలనుకుంటున్న ఐటెమ్‌ల పరిమాణాన్ని ఎంటర్ చేయండి. పరిమాణం
0కి సెట్ చేయబడిన ఏ ఉత్పత్తులూ రీఫండ్ చేయబడవు.కింది ఆప్షనల్ దశల్లో దేనినైనా చేయండి:
- ఆప్షనల్: మీరు మీ ఐటెమ్‌లను మాన్యువల్‌గా రీస్టాక్ చేయాలనుకుంటే, అప్పుడు ఐటెమ్‌లను రీస్టాక్ చేయండి ఎంపికను తీసివేయండి. ఈ ఆప్షన్ ఆటోమేటిక్‌గా ఎంపిక చేయబడి ఉంటుంది మరియు ఆర్డర్‌లో ఉన్న ఐటెమ్‌ల కోసం మీరు ఇన్వెంటరీని ట్రాక్ చేసినప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది
- ఆప్షనల్: షిప్పింగ్‌ను రీఫండ్ చేయడానికి, షిప్పింగ్ రీఫండ్ చేయండి విభాగంలో, షిప్పింగ్‌ను ఎంచుకోండి, ఆపై మీరు షిప్పింగ్ కోసం రీఫండ్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి.
- ఆప్షనల్: ఒకవేళ ఆర్డర్‌లో సుంకాలు, దిగుమతి పన్నులు ఉంటే, అప్పుడు మీరు రీఫండ్ చేసిన ఐటెమ్‌లపై సుంకాలు మరియు దిగుమతి పన్నులను మరియు అదనపు రుసుములను: కస్టమ్స్ క్లియరెన్స్‌ను రీఫండ్ చేయాలా వద్దా అని ఎంచుకోండి.
- ఆప్షనల్: రీఫండ్‌కు కారణం విభాగంలో, రీఫండ్ కోసం కారణాన్ని ఎంటర్ చేయండి. ఈ రీఫండ్ కారణం మీ కస్టమర్‌కు ప్రదర్శించబడదు.
సారాంశం విభాగంలో, కింది వాటిని చేయండి:
- రీఫండ్ పద్ధతి డ్రాప్-డౌన్ మెను నుండి, ఒక రీఫండ్ పద్ధతిని ఎంచుకోండి.
- ఆప్షనల్: రీఫండ్ మొత్తం ఫీల్డ్‌లోని మొత్తాన్ని ఎడిట్ చేయండి. మీరు అసలు చెల్లింపుతో పాటు స్టోర్ క్రెడిట్ రెండింటినీ చెల్లింపు పద్ధతిగా ఎంచుకుంటే, అప్పుడు మీరు ఆ రెండు ఫీల్డ్‌లను ఎడిట్ చేయవచ్చు.
ఆప్షనల్: మీరు రీఫండ్‌ను జారీ చేసినప్పుడు, మీ కస్టమర్‌కు ఇమెయిల్ పంపకూడదనుకుంటే, అప్పుడు కస్టమర్‌కు నోటిఫికేషన్‌ను పంపును డీసెలెక్ట్ చేయండి. ఈ ఎంపిక ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది.
మీరు ఎంచుకున్న ఐటెమ్‌లను రీఫండ్ చేయడానికి రీఫండ్‌ను క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌పై ట్యాప్ చేయండి .
మీరు రీఫండ్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌పై ట్యాప్ చేయండి.
లేదా
ట్యాప్ చేసి, ఆపై రీఫండ్‌ను ట్యాప్ చేయండి.
ఆప్షనల్: రీఫండ్ చేయడానికి ముందు లైన్ ఐటెమ్‌కు తగ్గింపును వర్తింపజేయడానికి, కింది దశలను పూర్తి చేయండి:
- మీరు దేనికైతే తగ్గింపును జోడించాలనుకుంటున్నారో, ఆ ఐటెమ్ ధరపై ట్యాప్ చేయండి.
- తగ్గింపు రకం డ్రాప్-డౌన్ మెను నుండి, తగ్గింపు రకాన్ని ఎంచుకోండి.
- మీరు ఎంచుకున్న తగ్గింపు రకం ఆధారంగా, తగ్గింపు విలువ (ఒక్కో యూనిట్‌కి) లేదా తగ్గింపు విలువ ఫీల్డ్‌లో, తగ్గింపు మొత్తాన్ని ఎంటర్ చేయండి.
- ఆప్షనల్: తగ్గింపుకు కారణం ఫీల్డ్‌లో, తగ్గింపు కారణం గురించి ఒక నోట్‌ను ఎంటర్ చేయండి. ఈ నోట్ మీ కస్టమర్‌కు ప్రదర్శించబడుతుంది.
- సేవ్ లేదా ✓ను ట్యాప్ చేయండి.
మీరు రీఫండ్ చేయాలనుకుంటున్న ఐటెమ్‌ల పరిమాణాన్ని ఎంటర్ చేయండి. పరిమాణం
0కి సెట్ చేయబడిన ఏ ఉత్పత్తులూ రీఫండ్ చేయబడవు.కింది ఆప్షనల్ దశల్లో దేనినైనా చేయండి:
- ఆప్షనల్: మీరు మీ ఐటెమ్‌లను మాన్యువల్‌గా రీస్టాక్ చేయాలనుకుంటే, అప్పుడు ఐటెమ్‌లను రీస్టాక్ చేయండి ఎంపికను తీసివేయండి. ఈ ఆప్షన్ ఆటోమేటిక్‌గా ఎంపిక చేయబడి ఉంటుంది మరియు ఆర్డర్‌లో ఉన్న ఐటెమ్‌ల కోసం మీరు ఇన్వెంటరీని ట్రాక్ చేసినప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది
- ఆప్షనల్: షిప్పింగ్‌ను రీఫండ్ చేయడానికి, షిప్పింగ్ రీఫండ్ చేయండి విభాగంలో, షిప్పింగ్‌ను ఎంచుకోండి, ఆపై మీరు షిప్పింగ్ కోసం రీఫండ్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి.
- ఆప్షనల్: ఒకవేళ ఆర్డర్‌లో సుంకాలు, దిగుమతి పన్నులు ఉంటే, అప్పుడు మీరు రీఫండ్ చేసిన ఐటెమ్‌లపై సుంకాలు మరియు దిగుమతి పన్నులను మరియు అదనపు రుసుములను: కస్టమ్స్ క్లియరెన్స్‌ను రీఫండ్ చేయాలా వద్దా అని ఎంచుకోండి.
- ఆప్షనల్: రీఫండ్‌కు కారణం విభాగంలో, రీఫండ్ కోసం కారణాన్ని ఎంటర్ చేయండి. ఈ రీఫండ్ కారణం మీ కస్టమర్‌కు ప్రదర్శించబడదు.
సారాంశం విభాగంలో, కింది వాటిని చేయండి:
- రీఫండ్ పద్ధతి డ్రాప్-డౌన్ మెను నుండి, ఒక రీఫండ్ పద్ధతిని ఎంచుకోండి.
- ఆప్షనల్: రీఫండ్ మొత్తం ఫీల్డ్‌లోని మొత్తాన్ని ఎడిట్ చేయండి. మీరు అసలు చెల్లింపుతో పాటు స్టోర్ క్రెడిట్ రెండింటినీ చెల్లింపు పద్ధతిగా ఎంచుకుంటే, అప్పుడు మీరు ఆ రెండు ఫీల్డ్‌లను ఎడిట్ చేయవచ్చు.
ఆప్షనల్: మీరు రీఫండ్‌ను జారీ చేసినప్పుడు, మీ కస్టమర్‌కు ఇమెయిల్ పంపకూడదనుకుంటే, అప్పుడు కస్టమర్‌కు నోటిఫికేషన్‌ను పంపును డీసెలెక్ట్ చేయండి. ఈ ఎంపిక ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది.
మీరు ఎంచుకున్న ఐటెమ్‌లను రీఫండ్ చేయడానికి రీఫండ్‌ను ట్యాప్ చేయండి.
ఒక ఆర్డర్ కోసం షిప్పింగ్‌ను రీఫండ్ చేయండి
మీరు ఆర్డర్ కోసం షిప్పింగ్ రుసుములను రీఫండ్ చేయవచ్చు. మీ ఆర్డర్‌కు బహుళ షిప్పింగ్ రుసుములు ఉంటే, ఆర్డర్‌ను రీఫండ్ చేసేటప్పుడు మీ షిప్పింగ్ రుసుములన్నీ ప్రదర్శించబడతాయి.
షిప్పింగ్ కోసం రీఫండ్ చేయడానికి అందుబాటులో ఉన్న మొత్తాన్ని మీరు మించలేరు. ఉదాహరణకు, మీకు షిప్పింగ్ కోసం $15 USD ఛార్జ్ చేయబడితే, మీరు షిప్పింగ్ కోసం $15 USD వరకు రీఫండ్ చేయవచ్చు.
ఆర్డర్ స్థాయి ఉచిత షిప్పింగ్ తగ్గింపు అప్లై చేయబడిన ఆర్డర్‌లకు మీరు షిప్పింగ్‌ను రీఫండ్ చేయలేరు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లకు వెళ్లండి.
మీరు షిప్పింగ్‌ను రీఫండ్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌పై క్లిక్ చేయండి.
రీఫండ్‌ను క్లిక్ చేయండి.
షిప్పింగ్ రీఫండ్ చేయండి విభాగంలో, షిప్పింగ్‌ను ఎంచుకోండి
మీరు షిప్పింగ్ కోసం రీఫండ్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి.
ఆప్షనల్: రీఫండ్‌కు కారణం విభాగంలో, రీఫండ్ కోసం కారణాన్ని ఎంటర్ చేయండి. ఈ రీఫండ్ కారణం మీ కస్టమర్‌కు ప్రదర్శించబడదు.
ఆప్షనల్: మీరు రీఫండ్‌ను జారీ చేసినప్పుడు, మీ కస్టమర్‌కు ఇమెయిల్ పంపకూడదనుకుంటే, అప్పుడు కస్టమర్‌కు నోటిఫికేషన్‌ను పంపును డీసెలెక్ట్ చేయండి. ఈ ఎంపిక ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది.
ఆర్డర్ షిప్పింగ్‌ను రీఫండ్ చేయడానికి రీఫండ్‌ను క్లిక్ చేయండి.
మొబైల్
- Shopify యాప్ నుండి,
ఐకాన్‌పై ట్యాప్ చేయండి .
- మీరు షిప్పింగ్‌ను రీఫండ్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌ను ట్యాప్ చేయండి.
లేదా
ట్యాప్ చేసి, ఆపై రీఫండ్‌ను ట్యాప్ చేయండి.
- షిప్పింగ్ రీఫండ్ చేయండి విభాగంలో, షిప్పింగ్‌ను ఎంచుకోండి
- మీరు షిప్పింగ్ కోసం రీఫండ్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి.
- ఆప్షనల్: రీఫండ్‌కు కారణం విభాగంలో, రీఫండ్ కోసం కారణాన్ని ఎంటర్ చేయండి. ఈ రీఫండ్ కారణం మీ కస్టమర్‌కు ప్రదర్శించబడదు.
- ఆప్షనల్: మీరు రీఫండ్‌ను జారీ చేసినప్పుడు, మీ కస్టమర్‌కు ఇమెయిల్ పంపకూడదనుకుంటే, అప్పుడు కస్టమర్‌కు నోటిఫికేషన్‌ను పంపును డీసెలెక్ట్ చేయండి. ఈ ఎంపిక ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది.
- ఆర్డర్ షిప్పింగ్‌ను రీఫండ్ చేయడానికి రీఫండ్‌ను ట్యాప్ చేయండి.
మీ ఆర్డర్ కోసం షిప్పింగ్‌ను రీఫండ్ చేసిన తర్వాత, మీ ఆర్డర్ ఆర్థిక సారాంశం మరియు ఆర్డర్ టైమ్‌లైన్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడతాయి.
ఓవర్-రీఫండ్ చేయడానికి అనుమతించండి
ఆర్డర్‌పై ఇంతకు ముందు స్టోర్ క్రెడిట్ జారీ చేయబడి, దానికి బదులుగా కస్టమర్ అసలు చెల్లింపు పద్ధతికి మీరు రీఫండ్ చేయాల్సి వస్తే, మీరు ఆర్డర్‌ను ఓవర్-రీఫండ్ చేయవచ్చు. ఇది ఇప్పటికే జారీ చేయబడిన స్టోర్ క్రెడిట్ రీఫండ్‌ను వెనక్కి తీసుకోదు.
Shopify Payments ద్వారా ప్రాసెస్ చేయబడిన ఆర్డర్‌లకు ఓవర్-రీఫండ్ చేయడం అందుబాటులో ఉంటుంది.
అసలు చెల్లింపు పద్ధతికి ఓవర్-రీఫండ్ చేయడానికి, మీకు అసలు చెల్లింపు పద్ధతికి రీఫండ్ చేయండి > ఇంతకుముందు స్టోర్ క్రెడిట్‌కు రీఫండ్ చేయబడిన ఆర్డర్‌లను ఓవర్-రీఫండ్ చేయండి అనుమతి అవసరం.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లకు వెళ్లండి.
ఇంతకు ముందు స్టోర్ క్రెడిట్‌కు రీఫండ్ చేయబడిన ఆర్డర్‌పై క్లిక్ చేయండి.
రీఫండ్‌ను క్లిక్ చేయండి.
రీఫండ్ మొత్తం విభాగంలో, Shopify Payments పక్కన ఉన్న లాక్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
రీఫండ్ మొత్తాన్ని ఓవర్‌రైడ్ చేయండి డైలాగ్‌లో, ఓవర్-రీఫండ్ చేయడానికి అనుమతించండిని ఎంచుకుని, ఆపై అప్లై చేయండిని క్లిక్ చేయండి.
రీఫండ్ మొత్తం ఫీల్డ్‌లో, మీరు అసలు చెల్లింపు పద్ధతికి రీఫండ్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి.
ఆప్షనల్: మీరు రీఫండ్‌ను జారీ చేసినప్పుడు, మీ కస్టమర్‌కు ఇమెయిల్ పంపకూడదనుకుంటే, అప్పుడు కస్టమర్‌కు నోటిఫికేషన్‌ను పంపును డీసెలెక్ట్ చేయండి. ఈ ఎంపిక ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది.
కస్టమర్ అసలు చెల్లింపు పద్ధతికి ఓవర్-రీఫండ్‌ను ప్రాసెస్ చేయడానికి రీఫండ్‌ను క్లిక్ చేయండి.
మొబైల్
- Shopify యాప్ నుండి,
ఐకాన్‌పై ట్యాప్ చేయండి .
- ఇంతకు ముందు స్టోర్ క్రెడిట్‌కు రీఫండ్ చేయబడిన ఆర్డర్‌ను ట్యాప్ చేయండి.
- రీఫండ్ మొత్తం విభాగంలో, Shopify Payments పక్కన ఉన్న లాక్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
- రీఫండ్ మొత్తాన్ని ఓవర్‌రైడ్ చేయండి డైలాగ్‌లో, ఓవర్-రీఫండ్ చేయడానికి అనుమతించండిని ఎంచుకుని, ఆపై అప్లై చేయండిని ట్యాప్ చేయండి.
- రీఫండ్ మొత్తం ఫీల్డ్‌లో, మీరు అసలు చెల్లింపు పద్ధతికి రీఫండ్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి.
- ఆప్షనల్: మీరు రీఫండ్‌ను జారీ చేసినప్పుడు, మీ కస్టమర్‌కు ఇమెయిల్ పంపకూడదనుకుంటే, అప్పుడు కస్టమర్‌కు నోటిఫికేషన్‌ను పంపును డీసెలెక్ట్ చేయండి. ఈ ఎంపిక ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది.
- కస్టమర్ అసలు చెల్లింపు పద్ధతికి ఓవర్-రీఫండ్‌ను ప్రాసెస్ చేయడానికి రీఫండ్‌ను ట్యాప్ చేయండి.
ఆర్డర్‌ను రీస్టాక్ చేయండి
ఒకవేళ ఆర్డర్ కోసం రీఫండ్ చేయడానికి ఎటువంటి చెల్లింపు లేకపోతే, మీరు రిటర్న్ లేదా రీఫండ్‌ను సృష్టించకుండానే ఐటెమ్‌లను రీస్టాక్ చేయవచ్చు.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లకు వెళ్లండి.
మీరు రీస్టాక్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌పై క్లిక్ చేయండి.
రీస్టాక్‌ను క్లిక్ చేయండి.
రీస్టాక్ చేయడానికి ఆర్డర్‌లోని ఐటెమ్‌ల పరిమాణాన్ని ఎంటర్ చేయండి.
ఐటెమ్‌లను రీస్టాక్ చేయండిని క్లిక్ చేయండి.
స్టోర్ క్రెడిట్ జారీ చేసిన తర్వాత పరిమిత రీఫండ్ మొత్తం
ఇంతకు ముందు ఆర్డర్‌పై స్టోర్ క్రెడిట్ రీఫండ్ జారీ చేయబడినప్పుడు, రీఫండ్ స్క్రీన్‌పై అసలు చెల్లింపు పద్ధతి లాక్ చేయబడుతుంది, వాపసు చేయదగిన మొత్తాన్ని ఇది పరిమితం చేస్తుంది (ఉదాహరణకు, కేవలం షిప్పింగ్ ఖర్చులకు మాత్రమే). అసలు చెల్లింపు పద్ధతికి రీఫండ్ చేయడానికి, మీరు ఇంతకుముందు స్టోర్ క్రెడిట్‌కు రీఫండ్ చేయబడిన ఆర్డర్‌లను ఓవర్-రీఫండ్ చేయండి అనుమతిని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి మరియు ఆ తర్వాత ఆర్డర్‌ను ఓవర్-రీఫండ్ చేయడానికి అనుమతించండి.
పాక్షికంగా రీఫండ్ చేయబడిన ఆర్డర్‌లపై ఛార్జ్‌బ్యాక్‌లను నిర్వహించడం
మీరు ఒక ఆర్డర్‌కు పాక్షికంగా రీఫండ్ చేసినప్పుడు కూడా, కస్టమర్ ఆర్డర్ పూర్తి విలువకు ఛార్జ్‌బ్యాక్‌ను ప్రారంభించగలరు. ఇలా జరిగితే, మీరు పాక్షిక రీఫండ్ జారీ చేసినప్పటికీ, పూర్తి ఆర్డర్ మొత్తం మీ ఖాతా నుండి డెబిట్ చేయబడుతుంది.
దీనిని పరిష్కరించడానికి, పాక్షిక రీఫండ్‌కు సంబంధించిన ఆధారాలను అందించడం ద్వారా మీరు ఛార్జ్‌బ్యాక్‌ను డిస్ప్యూట్ చేయాలి. కస్టమర్ బ్యాంక్‌తో కమ్యూనికేట్ చేయడానికి, ఆధారాలను సమర్పించే గడువు వ్యవధి మాత్రమే మీకు ఉన్న ఏకైక అవకాశం. Shopify అడ్మిన్ ద్వారా మీరు ఆధారాలను సమర్పించిన తర్వాత, అది మార్చబడదు.
డిస్ప్యూట్‌లో గెలిచే అవకాశాలను పెంచుకోవడానికి, వీలైనన్ని ఎక్కువ ఆధారాలను అందించండి:
- ఆర్డర్ లింక్
- డిస్ప్యూట్ చేయబడిన మొత్తం మరియు డిస్ప్యూట్ తేదీ
- రీఫండ్ చేసిన మొత్తం మరియు రీఫండ్ తేదీ
- రీఫండ్‌కు అనుబంధించబడిన అక్వైరర్ రిఫరెన్స్ నంబర్ (ARN)
- రీఫండ్‌ను నిర్ధారించే ఇమెయిల్‌లు లేదా స్క్రీన్‌షాట్‌ల లాంటి కస్టమర్‌తో జరిగిన ఏదైనా కమ్యూనికేషన్