మీ Shopify అడ్మిన్‌లో చిరునామాలను ధృవీకరించడం

మీ Shopify అడ్మిన్‌లో సంభావ్య చెల్లని చిరునామా ఎంటర్ చేయబడినప్పుడు, ఒక హెచ్చరిక ప్రదర్శించబడుతుంది మరియు చిరునామా వివరాలను అప్‌డేట్ చేయడంలో మీకు సహాయపడటానికి సూచనలు అందించబడతాయి. ఉద్దేశించిన చిరునామా వివరాలపై అధిక నమ్మకం ఉన్నప్పుడు చిరునామా ధృవీకరణ సూచనలు అందించబడతాయి. సంభావ్య చెల్లని చిరునామాలు ఉన్న ఆర్డర్‌లను తగ్గించడంలో మరియు ఆలస్యమైన లేదా విఫలమైన డెలివరీలను తగ్గించడంలో ఇది మీకు సహాయపడుతుంది.

మీ ఆన్‌లైన్ ఆర్డర్‌ల కోసం ఆటోమేటిక్‌గా చిరునామా ధృవీకరణ జరుగుతుంది మరియు మీరు నిర్దిష్ట చర్యలను చేసినప్పుడు కూడా ఇది ట్రిగ్గర్ చేయబడుతుంది. కింది సందర్భాలలో చిరునామా ధృవీకరణ జరుగుతుంది:

మీరు Shopify Plusకు సబ్‌స్క్రయిబ్ చేసినట్లయితే, కింది సందర్భాలలో కూడా చిరునామా ధృవీకరణ ట్రిగ్గర్ చేయబడుతుంది:

చిరునామా ధృవీకరణకు అర్హత

చిరునామా ధృవీకరణ ఏ ప్లాన్‌లో ఉన్న వ్యాపారులకైనా అందుబాటులో ఉంటుంది మరియు మీ స్టోర్‌లో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. డెస్క్‌టాప్‌లోని మీ Shopify అడ్మిన్ మరియు Shopify మొబైల్ యాప్, రెండింటి నుండి మీరు చిరునామా ధృవీకరణ సమస్యలను రివ్యూ చేయవచ్చు మరియు పరిష్కరించవచ్చు.

కింది దేశాల్లోని షిప్పింగ్ చిరునామాలకు చిరునామా ధృవీకరణ ఫీచర్ అందుబాటులో ఉంది:

  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • బెల్జియం
  • బెర్ముడా
  • కెనడా
  • చెకియా
  • డెన్మార్క్
  • ఫారో దీవులు
  • ఫ్రాన్స్
  • గ్వెర్న్సే
  • ఇటలీ
  • లీచ్టెన్‌స్టెయిన్
  • లక్సెంబర్గ్
  • నెదర్లాండ్స్
  • పోలాండ్
  • పోర్చుగల్
  • స్లోవేనియా
  • దక్షిణ కొరియా
  • స్విట్జర్లాండ్
  • యునైటెడ్ స్టేట్స్

మద్దతు లేని దేశాల నుండి వచ్చే ఆర్డర్‌లకు సంబంధించిన చిరునామాలు తనిఖీ చేయబడినప్పటికీ, మద్దతు ఉన్న దేశాల నుండి వచ్చే ఆర్డర్‌ల వలె ఇవి ఎక్కువ నిర్దిష్ట చిరునామా ధృవీకరణ సూచనలను అందించకపోవచ్చు.

చిరునామా ధృవీకరణ సమస్యల రకాలు

చిరునామా ధృవీకరణ సమస్యలలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి:

  • హెచ్చరికలు: పసుపు రంగు ఐకాన్ ద్వారా సూచించబడే హెచ్చరిక, డెలివరీ ఆలస్యమవడానికి లేదా విఫలమవడానికి దారితీయవచ్చు మరియు దీన్ని అప్‌డేట్ చేయాలి.
  • ఎర్రర్‌లు: ఎరుపు రంగు ఐకాన్ ద్వారా సూచించబడే ఎర్రర్ వల్ల, డెలివరీ ఆలస్యమవడానికి లేదా విఫలమవడానికి చాలా అవకాశం ఉంది మరియు దీన్ని అప్‌డేట్ చేయాలి. ఆర్డర్‌ల మీద ఉన్న చిరునామాను చెల్లుబాటు అయ్యేదిగా మార్క్ చేయకుండా ఎర్రర్‌లు మిమ్మల్ని నిరోధిస్తాయి.

ఆర్డర్ మీద ఫ్లాగ్ చేయబడిన చిరునామాను ఎప్పుడు చెల్లుబాటు అయ్యేదిగా మార్క్ చేయాలో నిర్ధారించడానికి మీ విచక్షణను ఉపయోగించండి. హెచ్చరికలు లేదా ఎర్రర్‌లను పరిష్కరించకుండా ఆర్డర్‌లను నెరవేర్చడం వల్ల, మీ కస్టమర్‌కు ఆర్డర్ డెలివరీలు అందడంలో ఆలస్యం కావచ్చు లేదా విఫలం కావచ్చు.

చిరునామా ధృవీకరణ స్టేటస్ ఆధారంగా ఆర్డర్‌లను ఫిల్టర్ చేయడం

చిరునామా ధృవీకరణ స్టేటస్ ఆధారంగా ఆర్డర్‌లను ప్రదర్శించడానికి, మీరు మీ ఆర్డర్‌ల జాబితాను ఫిల్టర్ చేయవచ్చు. ఆర్డర్ ఫిల్టర్‌గా చిరునామా ధృవీకరణని ఎంచుకుని, మీ ఆర్డర్ వీక్షణకు ఏ ఫిల్టర్‌లను అప్లై చేయాలో ఎంచుకోండి:

  • ధృవీకరించబడలేదు: చిరునామా ధృవీకరణ మినహాయించబడిన ఆర్డర్‌లను ప్రదర్శిస్తుంది. వీటిలో షిప్పింగ్ చిరునామాలు లేని ఆర్డర్‌లు ఉండవచ్చు.
  • సమస్యలు ఉన్నాయి: చిరునామా ధృవీకరణ హెచ్చరికలు లేదా ఎర్రర్‌లు ఉన్న ఆర్డర్‌లను ప్రదర్శిస్తుంది.
  • సమస్యలు లేవు: విజయవంతంగా ధృవీకరించబడిన ఆర్డర్‌లను ప్రదర్శిస్తుంది.

ఆర్డర్‌లను ఫిల్టర్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

చిరునామాలతో ఉన్న సమస్యలను పరిష్కరించండి

మీ ఆర్డర్‌ల జాబితాలో, ఫుల్‌ఫిల్‌మెంట్‌కి ముందు ఎప్పుడైనా మీరు చిరునామా సమస్యను పరిష్కరించడానికి వీలుగా, ప్రతి ఆర్డర్‌కు సంబంధించిన చిరునామా ధృవీకరణ సేవ్ చేయబడుతుంది. ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్ చిరునామాను మీరు జోడించినప్పుడు లేదా ఎడిట్ చేసినప్పుడు, అలాగే మీ అడ్మిన్‌లో చిరునామా ధృవీకరణ జరిగే ఇతర ప్రదేశాల్లో, మీరు చిరునామా ఫీల్డ్‌లో చిరునామాను ఎంటర్ చేసినప్పుడు ధృవీకరణ ట్రిగ్గర్ అవుతుంది. ధృవీకరణ ఎర్రర్ ఫ్లాగ్ చేయబడిన సమయంలోనే ఈ సమస్యలను పరిష్కరించండి.

ఆర్డర్ షిప్పింగ్ చిరునామాపై హెచ్చరిక లేదా ఎర్రర్ గుర్తించబడినప్పుడు, షిప్పింగ్ చిరునామాను ఎడిట్ చేయండి డైలాగ్, మీరు ఎంటర్ చేసిన చిరునామాను సారాంశం కార్డ్‌తో కలిపి ప్రదర్శిస్తుంది. సారాంశం కార్డ్ 2 స్టేట్‌లను కలిగి ఉంటుంది:

  • సూచించిన చిరునామా: సూచించబడిన చెల్లుబాటు అయ్యే చిరునామాతో ఉన్న పసుపు రంగు హెచ్చరిక స్టేట్. మీరు సూచనను అంగీకరించవచ్చు, అసలైన చిరునామాను అలాగే ఉంచవచ్చు లేదా చిరునామాను మాన్యువల్‌గా ఎడిట్ చేయవచ్చు.
  • చిరునామా సమస్య: చిరునామాకు డెలివరీ చేయడం సాధ్యం కానప్పుడు వచ్చే ఎరుపు రంగు ఎర్రర్ స్టేట్. మీరు ఆర్డర్‌ను నెరవేర్చడానికి ముందు చిరునామాను అప్‌డేట్ చేయాలి.

షిప్పింగ్ చిరునామాలో ఎర్రర్ ఉంటే, అప్పుడు మీరు చిరునామాను చెల్లుబాటు అయ్యేదిగా మార్క్ చేయలేరు. డెలివరీలు ఆలస్యం కావడాన్ని లేదా విఫలం కావడాన్ని తగ్గించడానికి, చిరునామా ధృవీకరణ హెచ్చరికలు లేదా ఎర్రర్‌లు ఫ్లాగ్ చేయబడిన వెంటనే వాటిని పరిష్కరించండి. కస్టమర్ చిరునామాతో ఉన్న ధృవీకరణ సమస్యను ఎలా పరిష్కరించాలో మీకు కచ్చితంగా తెలియనట్లయితే, ఫుల్‌ఫిల్‌మెంట్‌కి ముందు వారి చిరునామాను నిర్ధారించడానికి కస్టమర్‌ను సంప్రదించండి.

దశలు:

ఆర్డర్‌లు
  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లకు వెళ్లండి.

  2. మీరు పరిష్కరించాలనుకుంటున్న షిప్పింగ్ చిరునామా ధృవీకరణ సమస్య గల ఆర్డర్‌పై క్లిక్ చేయండి. అలాగే మీరు, ఆర్డర్‌ల జాబితా నుండి నేరుగా షిప్పింగ్ చిరునామాను ఎడిట్ చేయండి డైలాగ్‌ను తెరవడానికి, ఆర్డర్ నంబర్ పక్కన ఉన్న చిరునామా ధృవీకరణ ఐకాన్‌ను కూడా క్లిక్ చేయవచ్చు.

  3. కస్టమర్ విభాగంలో, షిప్పింగ్ చిరునామా కింద, చిరునామా సమస్యలను రివ్యూ చేయండిని క్లిక్ చేయండి.

  4. షిప్పింగ్ చిరునామాను ఎడిట్ చేయండి డైలాగ్‌లో, షిప్పింగ్ చిరునామా ఫీల్డ్‌ల పక్కనే ఉన్న సారాంశం కార్డ్‌ను రివ్యూ చేసి, ఆపై కింది వాటిలో ఒకదానిని చేయడం ద్వారా సమస్యను పరిష్కరించండి:

    • సూచించిన చిరునామాను అంగీకరించడానికి, సూచనను ఉపయోగించండిని క్లిక్ చేయండి.
    • మార్పులు లేకుండా ఇప్పటికే ఉన్న చిరునామాను అలాగే ఉంచడానికి, చెల్లుబాటు అయ్యేదిగా మార్క్ చేయండిని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ ఎర్రర్‌లకు కాకుండా కేవలం హెచ్చరికలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
    • చిరునామాను మాన్యువల్‌గా అప్‌డేట్ చేయడానికి, చిరునామా ఫీల్డ్‌లను ఎడిట్ చేసి, ఆపై సేవ్ చేయండిని క్లిక్ చేయండి.
  5. ఆప్షనల్: మార్పులు చేసే ముందు కస్టమర్‌తో చిరునామాను నిర్ధారించడానికి, కస్టమర్‌కు ఇమెయిల్ చేయండిని క్లిక్ చేయండి. ఇమెయిల్ ముందుగానే ఆర్డర్ #XXXX కోసం షిప్పింగ్ చిరునామాను నిర్ధారించండి అనే సబ్జెక్ట్‌తో నింపబడి ఉంటుంది. కస్టమర్‌ను వారి ఆర్డర్ గురించి సంప్రదించడం గురించి మరింత తెలుసుకోండి.

  6. ఆప్షనల్: చిరునామాకు సంబంధించిన పూర్తి ధృవీకరణ వివరాలను రివ్యూ చేయడానికి, చిరునామా చెకర్‌ను చూడండిని క్లిక్ చేయండి.

ఇతరాలు
  1. మీ Shopify అడ్మిన్‌లో, డ్రాఫ్ట్ ఆర్డర్ లేదా ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్‌లో చిరునామాను జోడించడం లేదా ఎడిట్ చేయడం లాంటి చిరునామా ధృవీకరణ జరిగే ఒక చర్యను పూర్తి చేయండి. చిరునామాతో ఏదైనా సమస్య ఉంటే, అప్పుడు ఒక హెచ్చరిక లేదా ఎర్రర్ ప్రదర్శించబడుతుంది.
  2. ​ చిరునామాను ఎడిట్ చేయండి డైలాగ్‌లో, చిరునామా ఫీల్డ్‌ల పక్కనే ఉన్న సారాంశం కార్డ్‌ను రివ్యూ చేసి, ఆపై కింది వాటిలో ఒకదానిని చేయడం ద్వారా సమస్యను పరిష్కరించండి:
    • సూచించిన చిరునామాను అంగీకరించడానికి, సూచనను ఉపయోగించండిని క్లిక్ చేయండి.
    • మార్పులు లేకుండా ఇప్పటికే ఉన్న చిరునామాను అలాగే ఉంచడానికి, చెల్లుబాటు అయ్యేదిగా మార్క్ చేయండిని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ ఎర్రర్‌లకు కాకుండా కేవలం హెచ్చరికలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
    • చిరునామాను మాన్యువల్‌గా అప్‌డేట్ చేయడానికి, చిరునామా ఫీల్డ్‌లను ఎడిట్ చేసి, ఆపై సేవ్ చేయండిని క్లిక్ చేయండి.