ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాన్ని అర్థం చేసుకోవడం
కస్టమర్ ఆర్డర్ చేసినప్పటి నుండి మరియు ఆ వ్యాపారం ఆర్డర్‌ను నెరవేర్చే వరకు మధ్య గల సమయాన్ని ఫుల్‌ఫిల్‌మెంట్ సమయం అంటారు. వ్యాపారం షిప్పింగ్ క్యారియర్ సర్వీస్‌కు షిప్‌మెంట్‌ను అప్పగించినప్పుడు, షిప్పింగ్ అవసరమైన ఆర్డర్‌లు నెరవేర్చబడినట్లుగా పరిగణించబడతాయి.
ఆర్డర్‌ను రివ్యూ చేయడం, షిప్పింగ్ లేబుల్‌లను ప్రింట్ చేయడం, ఉత్పత్తులను ప్యాకేజింగ్ చేయడం, షిప్పింగ్ క్యారియర్‌కు షిప్‌మెంట్‌లను అప్పగించడం వంటివన్నీ ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాన్ని ప్రభావితం చేస్తాయి.

మీ వ్యాపారాన్ని బట్టి, మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సమయంపై మీకు వేర్వేరు స్థాయిలో నియంత్రణ ఉంటుంది. మీరు డ్రాప్‌షిప్ చేస్తుంటే, ఏ సరఫరాదారులతో పని చేయాలి, వారికి ఎంత త్వరగా ఆర్డర్‌లు అందించాలి అనే దానిపై మాత్రమే మీకు నియంత్రణ ఉంటుంది. ఉత్పత్తులను మీరే రవాణా చేస్తే, మీరు ఉత్పత్తిని ఎంత త్వరగా ప్యాకేజీ చేస్తారు అనే దాని దగ్గరి నుండి, మీ షిప్పింగ్ క్యారియర్‌లకు షిప్‌మెంట్‌లను ఎప్పుడు డ్రాప్ ఆఫ్ చేస్తారనే దాని వరకు అన్నీ మీ నియంత్రణలో ఉంటాయి.
మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సమయం, ఆర్డర్‌ల ఇండెక్స్ మరియు ఆర్డర్ వివరాల పేజీలో ప్రదర్శించబడే దీనిలోపు నెరవేర్చండి తేదీని కూడా నిర్ణయిస్తుంది.
ఈ పేజీలో
ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాల ప్రభావం
వేగవంతమైన ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాలు ఈ కింది ప్రయోజనాలను అందించగలవు:
- తక్కువ ఖర్చుతో కూడిన షిప్పింగ్ - మీరు నెమ్మదైన షిప్పింగ్ ఎంపికలను ఎంచుకుని కూడా సహేతుకమైన సమయ పరిధులలో షిప్‌మెంట్‌లను చేర్చే ఎంపికను కలిగి ఉండవచ్చు.
- అత్యధిక కస్టమర్ సంతృప్తి - కస్టమర్ ఆర్డర్‌ను త్వరగా అందుకున్నప్పుడు, అది మీ వ్యాపారంపై వారి నమ్మకాన్ని పెంచుతుంది, అలాగే సానుకూల అనుభవాన్ని అందిస్తుంది. దీని వలన కస్టమర్ మళ్లీ మీ వద్ద ఆర్డర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- వేగవంతమైన ఇన్వెంటరీ కదలిక - మీరు మీ ఉత్పత్తులను గిడ్డంగులలో నిల్వ చేస్తే, మీ ఉత్పత్తులు షెల్ఫ్‌లలో తక్కువ సమయం ఉంచడం వలన గిడ్డంగుల ఖర్చులు తగ్గవచ్చు.
- మరింత సమర్థవంతమైన ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రాసెస్ - మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాన్ని మెరుగుపరచడం ద్వారా, మీ ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని మరియు అనవసరమైన లేబర్ ఖర్చులు లేవని మీరు నిర్ధారించుకోవచ్చు.
నెమ్మదైన ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాల వలన కింది సమస్యలు తలెత్తవచ్చు:
- సపోర్ట్ డెట్ - కస్టమర్‌లు తమ ఆర్డర్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లను పొందడానికి మిమ్మల్ని సంప్రదించవచ్చు, వారికి రిప్లయి ఇవ్వడానికి చాలా సమయం పట్టవచ్చు.
- నెరవేరని అంచనాలు - కొంతమంది కస్టమర్‌లు ఆర్డర్‌లు కొద్ది రోజుల్లోనే వస్తాయని ఆశించవచ్చు. ఒక వ్యాపారం వారి అంచనాలను అందుకోలేకపోతే, ఆ కస్టమర్ బహుశా ఆ వ్యాపారం నుండి మళ్లీ ఆర్డర్ చేయకపోవచ్చు.
- అధిక ఖర్చులు - అసమర్థమైన ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాల వలన ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేయడం, గిడ్డంగి షెల్ఫ్‌లపై ఉత్పత్తులు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం వంటివి జరగవచ్చు, వీటన్నింటికీ వ్యాపారంలో ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది.
మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాలను అర్థం చేసుకోండి
మీరు ఆర్డర్‌ను ప్రాసెస్ చేయడానికి తీసుకునే ప్రతి దశను అర్థం చేసుకున్నప్పుడు, మీ ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రాసెస్‌ను మరింత సమర్థవంతంగా చేయడానికి మార్గాలను కనుగొనవచ్చు. అనవసరమైన దశలను తీసివేయడం, రెండు దశలను ఒకటిగా కలపడం లేదా రెండు టాస్క్‌లు ఒకేసారి జరిగేలా చేయడం వల్ల మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సమయం తగ్గుతుంది.
దశ 1 - మీ ఉత్పత్తులను సమూహంగా చేయండి
మీరు విక్రయించే ప్రతి ఉత్పత్తి ప్రాసెసింగ్ దశలను పరిగణించండి. ఏవైనా ఉత్పత్తులు ఒకే విధమైన దశలను కలిగి ఉంటే, వాటిని సమూహంగా చేయండి.
ఉదాహరణకు, మీరు T-షర్టులు, టోపీలు, ఆభరణాలను విక్రయిస్తున్నారనుకుందాం. టోపీలు, T-షర్టుల ఆర్డర్‌లను ప్రాసెస్ చేయడానికి, మీరు వాటిని ఒక ప్యాడెడ్ ఎన్వలప్‌లో ఉంచి, షిప్పింగ్ లేబుల్‌ను ప్రింట్ చేసి, మీ షిప్పింగ్ క్యారియర్‌కు ఆ ఎన్వలప్‌ను డెలివరీ చేస్తే సరిపోతుంది. అయితే, ఆభరణాల ఆర్డర్‌లను ప్రాసెస్ చేయడానికి, మీరు ఉత్పత్తికి ఫైనల్ పాలిష్ చేసి, చిన్న ఆభరణాల పెట్టెలో ఉంచి, దాన్ని అలంకరించి, డెలివరీ బాక్స్‌లో పెట్టి, లేబుల్‌ను ప్రింట్ చేసిన తర్వాత మీ షిప్పింగ్ క్యారియర్‌కు డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో, మీరు రెండు రకాల ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రాసెసింగ్ సమూహాలను కలిగి ఉంటారు.
దశ 2 - ప్రతి ఉత్పత్తుల సమూహం కోసం ప్రాసెసింగ్ దశల జాబితాను సృష్టించండి
ప్రతి ఉత్పత్తుల సమూహంలోని ఉత్పత్తి ఆర్డర్‌ను ప్రాసెస్ చేయడానికి మీరు తీసుకునే ప్రతి దశను జాబితా చేయండి.
ఉదాహరణకు, మీరు మీ ఆర్ట్‌వర్క్ ప్రింట్‌లను విక్రయిస్తూ, వాటిని స్థానిక ప్రింటింగ్ కంపెనీ ద్వారా ఆన్-డిమాండ్‌తో ప్రింట్ చేస్తున్నారనుకుందాం. మీ ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రాసెస్ ఈ కింది విధంగా ఉండవచ్చు:
- ఆర్డర్ ఈమెయిల్‌ను తెరవండి.
- రిక్వెస్ట్ చేసిన ప్రింట్‌ను రివ్యూ చేసి, ఆ తర్వాత మీ ఈమెయిల్ క్లయింట్‌ని తెరిచి, స్థానిక ప్రింటింగ్ కంపెనీకి ఈమెయిల్ పంపడం ప్రారంభించండి.
- ఈమెయిల్‌కు ప్రింట్ ఫైల్‌ను అప్‌లోడ్ చేసి, ఆపై ఈమెయిల్ పంపండి.
- ప్రింట్ సిద్ధంగా ఉందని ప్రింటింగ్ కంపెనీ నుండి వచ్చే ఈమెయిల్ నిర్ధారణ కోసం వేచి ఉండండి.
- ప్రింటింగ్ కంపెనీకి వెళ్లి, ప్రింట్ కోసం చెల్లించి, ఆ తర్వాత ప్రింట్‌ను తీసుకోండి.
- ఇంటికి వెళ్లండి.
- ప్రింట్‌ను ప్యాకేజీ చేయండి.
- షిప్పింగ్ లేబుల్‌ను కొనుగోలు చేసి, ప్రింట్ తీసి ప్యాకేజీకి జత చేయండి.
- షిప్పింగ్ క్యారియర్ డ్రాప్-ఆఫ్ లొకేషన్‌కు వెళ్లండి.
- ప్యాకేజీని డ్రాప్ ఆఫ్ చేయండి.
3వ దశ - ప్రతి దశకు అదనపు వివరాలను ఇవ్వండి
దశలకు కిందివాటి లాంటి అదనపు వివరాలను జోడించండి:
- ప్రతి దశకు పట్టే సమయం
- మీ నుండి అవసరమయ్యే అదనపు చర్యలు ఏమైనా ఉంటే
- ఆ దశకు అవసరమయ్యే అదనపు మెటీరియల్ ఏమైనా ఉంటే
4వ దశ - వివిధ సమూహాలకు చెందిన ఉత్పత్తులను కలిగి ఉన్న ఆర్డర్‌ల కోసం ప్రాసెసింగ్ దశలను సృష్టించండి
ఉదాహరణకు, 1వ దశలో ఉన్న హ్యాట్, టీ-షర్ట్ మరియు జ్యువెలరీ స్టోర్ పరిస్థితిని పరిగణించండి. హ్యాట్ మరియు ఒక ఆభరణం రెండింటి ప్యాకింగ్ ఉన్న ఆర్డర్‌ల కోసం మీకు ప్రత్యేక దశల సెట్ అవసరం.
మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాలను మెరుగుపరచండి
ఆర్డర్‌ను ప్రాసెస్ చేయడానికి గల దశలను మీరు అర్థం చేసుకున్న తర్వాత, ప్రతి ప్రాసెస్‌ను మెరుగుపరచడానికి కింది విధానాన్ని పరిగణించండి:
- ముందుగానే సిద్ధం చేయగల ఏవైనా దశలు ఉంటే వాటిని హైలైట్ చేయండి. ఉదాహరణకు, బాక్స్‌ను సిద్ధం చేయడం లేదా స్టాక్‌రూమ్ నుండి షిప్పింగ్ స్టేషన్‌కు స్టాక్‌ను తరలించడం.
- మాన్యువల్ టాస్క్‌లను వీలైనంత వరకు ఆటోమేట్ చేయండి.
- మీరు షిప్పింగ్ లేబుల్‌లను ఉపయోగిస్తే, షిప్పింగ్ లేబుల్‌లను బల్క్‌లో కొనుగోలు చేయండి.
- ఒకే సమయంలో చేయగల ఏవైనా దశలను కనుగొనండి. ఉదాహరణకు, ఒక దశ కోసం మీరు 15 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తే, ఆ సమయంలో ఏదైనా తర్వాతి దశను చేయగలరేమో పరిశీలించండి.
- అవసరం లేని దశలను తీసివేయండి.
ఉదాహరణకు, మీరు 2వ దశలోని ఆర్ట్ ప్రింట్ ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రాసెస్‌ను కింది మార్గాల్లో మెరుగుపరచవచ్చు:
1-3 దశలను కలపవచ్చు - Google Drive లేదా Dropbox లాంటి క్లౌడ్ ఆధారిత ఫైల్ స్టోరేజ్ సర్వీస్‌కు మీ ప్రింట్‌లన్నింటినీ అప్‌లోడ్ చేయండి. స్థానిక ప్రింటింగ్ కంపెనీకి ప్రింట్‌ల యాక్సెస్‌ను ఇవ్వండి. మీ స్థానిక ప్రింటింగ్ కంపెనీని మీ Shopify అడ్మిన్‌లో కస్టమ్ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ లాగా సెటప్ చేయండి. చివరగా, ఆర్డర్‌లను ఆటోమేటిక్‌గా నెరవేర్చడానికి మీ Shopify సెట్టింగ్‌లను సర్దుబాటు చేయండి.
ఈ సెటప్‌తో, మీ స్టోర్‌లో ఆర్డర్ ప్లేస్ అయినప్పుడు, మీ స్థానిక ప్రింటింగ్ కంపెనీకి తక్షణమే అన్ని వివరాలతో ఇమెయిల్ అందుతుంది, ఇంకా వారు క్లౌడ్ ఆధారిత ఫైల్ స్టోరేజ్ సర్వీస్ ద్వారా ప్రింట్‌ను యాక్సెస్ చేయవచ్చు.
8వ దశను 4వ దశ జరిగేటప్పుడు చేయవచ్చు - మీ ప్రింటింగ్ కంపెనీ నుండి ఇమెయిల్ నిర్ధారణ కోసం వేచి చూసే సమయంలో, షిప్పింగ్ లేబుల్‌ను ప్రింట్ చేసి ప్యాకేజీకి అతికించడం ద్వారా ప్యాకేజీని సిద్ధం చేయండి.
6వ దశను తీసివేయవచ్చు - మీరు ప్రింట్‌ను పికప్ చేసుకోవడానికి ముందు ప్యాకేజీని మరియు లేబుల్‌ను సిద్ధం చేసుకుంటే, మీకు ప్రింట్ అందిన వెంటనే ప్యాక్ చేసి, నేరుగా షిప్పింగ్ క్యారియర్ డ్రాప్-ఆఫ్ లొకేషన్‌కు వెళ్లవచ్చు.
పైన పేర్కొన్న మార్పులు చేసిన తర్వాత, మీ ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రాసెస్ కింది విధంగా ఉంటుంది:
- ఆర్డర్ ఈమెయిల్‌ను తెరవండి.
- షిప్పింగ్ లేబుల్‌ను కొనుగోలు చేసి, ప్రింట్ తీసి ప్యాకేజీకి జత చేయండి.
- ప్రింట్ సిద్ధంగా ఉందని ప్రింటింగ్ కంపెనీ నుండి వచ్చే ఈమెయిల్ నిర్ధారణ కోసం వేచి ఉండండి.
- ప్యాకేజింగ్‌తో పాటు ప్రింటింగ్ కంపెనీకి వెళ్లి, ప్రింట్‌కి పే చేసి, దాన్ని తీసుకోండి.
- ఉత్పత్తిని ప్యాక్ చేయడం పూర్తి చేయండి.
- షిప్పింగ్ క్యారియర్ డ్రాప్-ఆఫ్ లొకేషన్‌కు వెళ్లండి.
- ప్యాకేజీని డ్రాప్ ఆఫ్ చేయండి.
మీ ప్రాసెస్‌లను ఆటోమేట్ చేసే ఇతర మార్గాలను అన్వేషించడానికి కింది లిస్ట్‌ను చూడండి:
ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రం ఆప్షన్‌లను అన్వేషించండి
మీకు మీరే ఆర్డర్‌లను ప్రాసెస్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంటే, ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రంతో పని చేయడాన్ని పరిగణించండి. ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలు మీ తరపున ఆర్డర్‌లను ప్రాసెస్ చేస్తాయి మరియు రవాణా చేస్తాయి, దీనివల్ల మీరు మీ వ్యాపారంలోని ఇతర అంశాలపై దృష్టి పెట్టడానికి సమయం ఆదా అవుతుంది.
కింది ఆప్షన్‌లను అన్వేషించడాన్ని పరిశీలించండి:
- Shopify Fulfillment Network
- స్థానిక గిడ్డంగులను అన్వేషించడం
ముందుగా ప్లాన్ చేయండి
మీరు ఏదైనా సేల్ ప్లాన్ చేస్తున్నా లేదా సంవత్సర కాలంతో ఎక్కువగా ప్రభావితమయ్యే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా, మీ వ్యాపారం ఎక్కువ సంఖ్యలో వచ్చే ఆర్డర్‌లకు సిద్ధంగా ఉండేలా చూసుకోండి.
మీరు సిద్ధం కావడానికి కొన్ని మార్గాలు కింద ఉన్నాయి:
- మీకు తగినంత సహాయం ఉండేలా చూసుకోండి.
- ఈవెంట్‌లకు కొద్ది రోజుల ముందే మీ ఉత్పత్తులను సిద్ధం చేయండి.
- మీ దగ్గర బాక్స్‌లు, టేప్, మెయిలర్‌లు, ప్రింటర్ పేపర్, ఇంక్ మరియు లేబుల్‌లు వంటి షిప్పింగ్ మరియు ప్యాకింగ్ మెటీరియల్స్ తగినంత ఉండేలా చూసుకోండి.
- మీ ప్రధాన షిప్పింగ్ క్యారియర్ కట్-ఆఫ్ సమయాన్ని తెలుసుకోండి మరియు ఈ సమయాలకు అనుగుణంగా ప్లాన్ చేయండి. ఉదాహరణకు, మీ క్యారియర్ సాయంత్రం 4:00 తర్వాత షిప్‌మెంట్‌లను అంగీకరించకపోతే, మీ ఆర్డర్‌లన్నింటినీ మధ్యాహ్నం 3:30 కల్లా పూర్తి చేయండి.
భవిష్యత్తు ఈవెంట్‌ల కోసం ప్లాన్ చేయడంలో మీకు సహాయపడటానికి, మీకు అయిపోయిన వస్తువులు లేదా ఎక్కువ సమయం తీసుకున్న దశలను నోట్ చేసుకోండి. ఎక్కువ మంది సిబ్బంది మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాన్ని తగ్గించి ఉండే వారేమో లేదా ఎక్కువ సమయం పట్టే మాన్యువల్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడానికి మార్గాలు ఉన్నాయేమో పరిశీలించండి.