మీ షిప్పింగ్ ఉద్గారాలను లెక్కించడం
ఈ పేజీలో
మీ షిప్పింగ్ ఉద్గారాలను అంచనా వేయడం
మీ ఉద్గారాలను అంచనా వేయడానికి, Planet షిప్‌మెంట్ ట్రాకింగ్ నంబర్‌తో అనుబంధించబడిన ఆర్డర్ ట్రాకింగ్ డేటాపై ఆధారపడుతుంది. ఈ డేటా ఉద్గారాల యొక్క మరింత ఖచ్చితమైన గణనను అనుమతిస్తుంది. అయితే, ట్రాకింగ్ నంబర్ అందుబాటులో లేకుంటే లేదా షిప్పింగ్ క్యారియర్‌కు సపోర్ట్ లేకుంటే, అప్పుడు Planet అంచనా వేసిన ఉద్గారాలను అన్‌సర్టెనిటీ ఫ్యాక్టర్ (అనిశ్చితి కారకం) 3తో గుణిస్తుంది. డేటా అస్థిరంగా ఉన్నా లేదా మిస్ అయినా సరే, అన్ని ఉద్గారాలు పరిగణించబడేలా అన్‌సర్టెనిటీ ఫ్యాక్టర్ చూసుకుంటుంది.
ఉదాహరణ: మీ షిప్పింగ్ ఉద్గారాలను లెక్కించడానికి అన్‌సర్టెనిటీ ఫ్యాక్టర్‌ని ఉపయోగించడం
ఈ ప్రాసెస్‌ను వివరించడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. మీరు బోస్టన్ నుండి న్యూయార్క్‌కు ఒక ప్యాకేజీని రవాణా చేస్తున్నారని అనుకుందాం. రెండు నగరాల మధ్య సరళ రేఖ దూరం సుమారు 305 కిమీ ఉంటుంది, కానీ అతి తక్కువ దూరం గల రోడ్డు మార్గం సుమారు 350 కిమీ ఉంటుంది. ట్రాకింగ్ డేటా అందుబాటులో ఉంటే, Planet లెక్కించడానికి ప్రయాణించిన ఖచ్చితమైన దూరాన్ని ఉపయోగిస్తుంది.
ట్రాకింగ్ డేటా అందుబాటులో లేని సందర్భాల్లో, మూల మరియు గమ్యస్థాన చిరునామాల మధ్య దూరాన్ని లెక్కించడానికి Planet హావర్సైన్ (Haversine) ఫార్ములాను ఉపయోగిస్తుంది. హావర్సైన్ దూరం అనేది గోళం యొక్క ఉపరితలంపై రెండు పాయింట్ల మధ్య కోణీయ దూరాన్ని సూచిస్తుంది. ఇది ప్రతి పాయింట్ యొక్క అక్షాంశం, రేఖాంశ కోఆర్డినేట్‌లను పరిగణనలోకి తీసుకుంటుంది, ఇవి రేడియన్లలో సూచించబడతాయి. ఈ ఫార్ములా ద్వారా ట్రాకింగ్ డేటా లేకుండా కూడా Planet దూరాన్ని ఖచ్చితంగా అంచనా వేస్తుంది. ఫలిత ఉద్గారాలు రూట్‌లోని వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకోవడానికి 3తో గుణించబడతాయి, అంటే పోస్ట్ ఆఫీస్‌లు మరియు పంపిణీ కేంద్రాల నుండి ప్రయాణించిన దూరాలు, అలాగే ప్యాకేజీని మీ కస్టమర్ ఇంటి వద్దకు చేర్చడానికి కొరియర్ తీసుకున్న రూట్ లాంటివి అన్నమాట.
Planet షిప్పింగ్ ఉద్గారాలను ఎలా అంచనా వేస్తుందనే దానిపై అదనపు పరిశీలనలు
Planet మోడల్‌లు మరియు అంచనాలు డేటా ఇన్‌పుట్‌పై ఆధారపడి ఉంటాయి మరియు కొన్ని సందర్భాల్లో, డేటా అందుబాటులో ఉండకపోవచ్చు. దీన్ని పరిష్కరించడానికి, డేటా మిస్ అయిన సందర్భాలలో కూడా తగినంత కార్బన్ తొలగింపును కొనుగోలు చేయడానికి Planet ఉద్దేశపూర్వకంగా కార్బన్ ఉద్గారాలను ఎక్కువగా అంచనా వేస్తుంది. రవాణా కోసం శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల వాతావరణ ప్రభావంలో కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాల వాటా 95% ఉంటుంది. అంచనా వేసిన ఉద్గారాలు రవాణా సమయంలో ఇతర గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను పరిగణనలోకి తీసుకోవు.
సముద్ర రవాణా కోసం, ఈ పద్ధతిని ఉపయోగించి రవాణా చేయబడిన ఆర్డర్‌ల ద్వారా ఉద్గారాలను ఖచ్చితంగా లెక్కించడానికి అవసరమైన డేటా రూపొందించబడదు. అటువంటి సందర్భాలలో, ఉద్గారాలను అంచనా వేయడానికి పరిశ్రమ-ఆమోదిత ప్రత్యామ్నాయ పద్ధతులు ఉపయోగించబడతాయి.
షిప్పింగ్ ఉద్గారాలను నిర్ణయించడానికి ఉపయోగించే ప్రాథమిక కారకాలు
షిప్పింగ్ ఉద్గారాలను నిర్ణయించడానికి, Planet మూడు ప్రాథమిక కారకాలను పరిగణనలోకి తీసుకుంటుంది: బరువు, దూరం మరియు రవాణా రకం.
- బరువు: షిప్‌మెంట్ బరువు అనేది గణనలో ఉపయోగించే ప్రాథమిక విలువ. ఒకవేళ బరువు అందుబాటులో లేకుంటే, అప్పుడు Planet సగటు షిప్‌మెంట్ బరువును ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంది.
- దూరం: ట్రాకింగ్ డేటా అందుబాటులో ఉంటే, అప్పుడు Planet ట్రాకింగ్ సమాచారంలో రికార్డ్ చేయబడిన దూరాన్ని ఉపయోగిస్తుంది. ట్రాకింగ్ డేటా అందుబాటులో లేని సందర్భాల్లో, మూల మరియు గమ్యస్థాన చిరునామాల మధ్య దూరాన్ని లెక్కించడానికి Planet హావర్సైన్ ఫార్ములాను ఉపయోగిస్తుంది. హావర్సైన్ దూరం గోళం యొక్క ఉపరితలంపై రెండు పాయింట్ల మధ్య కోణీయ దూరాన్ని సూచిస్తుంది. రూట్‌లోని అనిశ్చితిని పరిగణనలోకి తీసుకోవడానికి, ఈ దూరాన్ని అన్‌సర్టెనిటీ ఫ్యాక్టర్ 3తో గుణిస్తుంది.
- రవాణా రకం: Planet విమానం మరియు భూ రవాణాతో అనుబంధించబడిన తగిన కార్బన్-ఇంటెన్సిటీని కేటాయించడానికి వేగం మరియు ప్రయాణించిన దూరం ఆధారంగా రవాణా విధానాన్ని నిర్ణయిస్తుంది.