షిప్పింగ్ జోన్‌లు, రేట్‌లను సెటప్ చేయడం

మీరు మీ ఉత్పత్తులను ఎక్కడికి రవాణా చేస్తారు, షిప్పింగ్ కోసం మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అనేవి షిప్పింగ్ జోన్‌లు, రేట్‌లు నిర్దేశిస్తాయి. షిప్పింగ్ జోన్ అనేది యూరప్ లేదా ఉత్తర అమెరికా వంటి దేశాలు లేదా ప్రాంతాల సమూహం. ప్రతి జోన్‌లో, కస్టమర్‌లు చెక్‌అవుట్ వద్ద షిప్పింగ్ కోసం ఎంత చెల్లిస్తారో నిర్ణయించే షిప్పింగ్ రేట్‌లను మీరు సృష్టించవచ్చు.

మీరు కింది రకాల షిప్పింగ్ రేట్‌లను సెటప్ చేయవచ్చు:

  • ఫ్లాట్ రేట్‌లు: మీరు ధరను సెట్ చేయవచ్చు అలాగే విభిన్న రేట్ ఆప్షన్‌లను అందించవచ్చు:
    • ఫ్లాట్: అన్ని ఆర్డర్‌లకు సాధారణ ఫ్లాట్ రేట్.
    • ఆర్డర్ మొత్తం: ఆర్డర్ విలువపై షరతులతో కూడిన ధర ఆధారిత రేట్‌లు.
    • బరువు: ఐటెమ్ బరువు ఆధారంగా షరతులతో కూడిన బరువు ఆధారిత రేట్‌లు.
  • క్యారియర్ లేదా యాప్ ద్వారా లెక్కింపబడిన రేట్‌లు: బరువు, కొలతలు, గమ్యం వంటి ఆర్డర్ వివరాల ఆధారంగా UPS లేదా FedEx లాంటి షిప్పింగ్ క్యారియర్‌లు షిప్పింగ్ ఖర్చును నిర్ణయిస్తాయి.

మీరు సెటప్ చేసే ఏ షిప్పింగ్ రేట్‌లకైనా మీరు ఉచిత షిప్పింగ్‌ను కూడా అందించవచ్చు.

మీరు ప్రారంభించడానికి ముందు

మీరు షిప్పింగ్ జోన్‌లు, రేట్‌లను సెటప్ చేయడానికి ముందు, కింది సమాచారాన్ని రివ్యూ చేయండి:

  • షిప్పింగ్ ప్రొఫైల్‌లు: షిప్పింగ్ ప్రొఫైల్‌ల గురించి తెలుసుకోండి. నిర్దిష్ట ఉత్పత్తులు అలాగే లొకేషన్‌ల కోసం విభిన్న షిప్పింగ్ నియమాలను సృష్టించడానికి షిప్పింగ్ ప్రొఫైల్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ పేజీలోని సూచనలు షిప్పింగ్ ప్రొఫైల్ లోపల జోన్‌లు అలాగే రేట్‌లను సెటప్ చేయడానికి వర్తిస్తాయి.
  • మార్కెట్‌లు: మీరు ఏదైనా నిర్దిష్ట దేశంలోని కస్టమర్‌లకు విక్రయించాలనుకుంటే, ఆ దేశం తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉన్న మార్కెట్‌లో ఉండాలి. కొత్త దేశానికి షిప్పింగ్ జోన్‌ను జోడించడానికి, ముందుగా ఆ దేశంతో సహా మార్కెట్‌ను జోడించండి, ఆపై మార్కెట్‌ను యాక్టివేట్ చేసి, మీ రేట్‌లను సెటప్ చేయండి. యాక్టివ్‌గా లేని మార్కెట్‌లలోని కస్టమర్‌ల దేశం అందుబాటులో ఉన్న రేట్‌లను కలిగి ఉన్న షిప్పింగ్ జోన్‌లో ఉన్నప్పటికీ, వారు ఆర్డర్‌లను చేయలేరు. షిప్పింగ్ జోన్‌లు అలాగే మార్కెట్‌ల గురించి మరింత తెలుసుకోండి.
  • షిప్పింగ్ జోన్ నిర్మాణం: ఒక షిప్పింగ్ ప్రొఫైల్‌లోని లొకేషన్‌ల సమూహంలో, ఒక దేశం లేదా ప్రాంతం కేవలం ఒక షిప్పింగ్ జోన్‌లో మాత్రమే ఉంటుంది. ఒక దేశం లేదా ప్రాంతాన్ని మరొక దానికి జోడించే ముందు, దాన్ని మీరు ఒక షిప్పింగ్ జోన్ నుండి తప్పక తొలగించాలి.
  • ఉత్పత్తి బరువులు: మీరు బరువు ఆధారిత షిప్పింగ్ రేట్‌లను ఉపయోగించాలని ప్లాన్ చేస్తే, మీ అన్ని ఉత్పత్తులు బరువు విలువలను కలిగి ఉన్నాయని నిర్ధారించుకోండి. ఖచ్చితమైన బరువు సమాచారం లేకుండా, చెక్‌అవుట్ వద్ద షిప్పింగ్ రేట్‌లు సరిగ్గా లెక్కించబడవు.
  • క్యారియర్ లేదా యాప్ ద్వారా లెక్కింపబడిన రేట్‌లు: మీరు యునైటెడ్ స్టేట్స్‌లోని USPS లేదా కెనడాలోని Canada Post వంటి అన్ని ప్లాన్‌లలో అందుబాటులో ఉన్న అంతర్నిర్మిత క్యారియర్ ఇంటిగ్రేషన్‌లను ఉపయోగించవచ్చు. మీరు UPS, FedEx లేదా USPS లాంటి క్యారియర్‌లతో మీ స్వంత క్యారియర్ ఖాతాలను కనెక్ట్ చేయాలనుకుంటే, దానికి నిర్దిష్ట Shopify ప్లాన్‌లు లేదా మీ Shopify ఖాతాలో అదనపు నెలవారీ రుసుము అవసరమయ్యే థర్డ్-పార్టీ క్యారియర్ ద్వారా లెక్కింపబడిన షిప్పింగ్‌ను యాక్టివేట్ చేయాలి.

ఫ్లాట్ షిప్పింగ్ రేట్‌లను సెటప్ చేయడం

ఫ్లాట్ రేట్ షిప్పింగ్ అనేది ఆర్డర్‌ల కోసం షిప్పింగ్ ఖర్చును సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు స్థిర మొత్తాన్ని ఛార్జ్ చేయవచ్చు, ఉచిత షిప్పింగ్‌ను అందించవచ్చు లేదా ఆర్డర్ విలువ లేదా బరువు ఆధారంగా ధరను మార్చవచ్చు. ఉదాహరణకు, మీరు అన్ని ఆర్డర్‌లకు $10 USD, $50 USDకి పైబడిన ఆర్డర్‌లకు $5 USDని ఛార్జ్ చేయవచ్చు లేదా $100 USDకి పైబడిన ఆర్డర్‌లకు ఉచిత షిప్పింగ్‌ను అందించవచ్చు.

ఫ్లాట్ షిప్పింగ్ రేట్‌లను సెటప్ చేయండి

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > షిప్పింగ్ మరియు డెలివరీకి వెళ్లండి.

  2. షిప్పింగ్ ప్రొఫైల్‌లు విభాగంలో, మీరు షిప్పింగ్ రేట్‌లను జోడించాలనుకుంటున్న షిప్పింగ్ ప్రొఫైల్‌ను క్లిక్ చేయండి.

  3. ఐచ్ఛికం: కొత్త షిప్పింగ్ జోన్‌ను జోడించడానికి, ఈ కింది దశలను పూర్తి చేయండి:

    1. షిప్పింగ్ జోన్‌ల విభాగంలో, జోన్‌ను జోడించండిపై క్లిక్ చేయండి.
    2. జోన్ పేరు ఫీల్డ్‌లో, మీ షిప్పింగ్ జోన్ కోసం ఒక పేరును ఎంటర్ చేయండి.
    3. ప్రాంతాల విభాగంలో, జోన్‌లో భాగంగా ఉన్న దేశాలు, ప్రాంతాలను ఎంచుకుని, ఆపై పూర్తయిందిపై క్లిక్ చేయండి.
  4. మీరు షిప్పింగ్ ఆప్షన్‌ను జోడించాలనుకుంటున్న షిప్పింగ్ జోన్ కోసం, షిప్పింగ్ ఆప్షన్‌ను జోడించండిపై క్లిక్ చేసి, ఆపై షిప్పింగ్ రేట్‌లను జోడించండి:

    1. పేరు ఫీల్డ్‌లో, మీ షిప్పింగ్ ఆప్షన్ కోసం పేరును ఎంటర్ చేయండి. చెక్‌అవుట్ వద్ద మీ కస్టమర్‌లకు ఈ పేరు డిస్‌ప్లే అవుతుంది.
    2. ఐచ్ఛికం: మీ షిప్పింగ్ ఆప్షన్‌ కోసం ట్రాక్ చేయబడిన షిప్పింగ్ లాంటి డెలివరీ వివరాలను జోడించడానికి, డెలివరీ వివరాలను జోడించండిపై క్లిక్ చేసి, ఆపై వివరాలను ఎంటర్ చేయండి. చెక్‌అవుట్ వద్ద మీ కస్టమర్‌లకు డెలివరీ వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
    3. రేటు రకం డ్రాప్-డౌన్ మెను నుండి, ఫ్లాట్‌ను ఎంచుకోండి.
    4. ధర ఫీల్డ్‌లో, ఈ షిప్పింగ్ ఆప్షన్ కోసం మీరు మీ కస్టమర్‌ల నుండి వసూలు చేసే మొత్తాన్ని ఎంటర్ చేయండి. షిప్పింగ్ రేటును ఉచితం చేయడానికి, ఈ ఫీల్డ్‌ను ఖాళీగా ఉంచండి లేదా 0ని ఎంటర్ చేయండి.
    5. ఐచ్ఛికం: చెక్‌అవుట్ వద్ద మీ కస్టమర్‌లకు రవాణా సమయాన్ని డిస్‌ప్లే చేయడానికి, ఈ కింది దశలను పూర్తి చేయండి:
      1. రవాణా సమయం డ్రాప్-డౌన్ మెను నుండి, సూచించబడిన రవాణా సమయాన్ని ఎంచుకోండి లేదా అనుకూల రవాణా సమయాన్ని ఎంటర్ చేయండి
      2. మీరు అనుకూల రవాణా సమయాన్ని ఎంచుకుంటే, మీ రవాణా సమయం కోసం 3-5 రోజులు లేదా 3 రోజులు లాంటి అనుకూల పరిధి లేదా ఒకే విలువను ఎంటర్ చేసి, ఆపై పూర్తయిందిని క్లిక్ చేయండి.
    6. ఐచ్ఛికం: ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయడానికి, ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయండి ఎంచుకుని, ఆపై ఆర్డర్ ఉచిత షిప్పింగ్‌కు అర్హత పొందడానికి కావాల్సిన కనీస మొత్తాన్ని ఎంటర్ చేయండి.
  5. పూర్తయిందిపై క్లిక్ చేయండి.

  6. సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.

ఆర్డర్ మొత్తం-ఆధారిత రేట్‌లను సెటప్ చేయండి

ఆర్డర్ మొత్తం-ఆధారిత షిప్పింగ్ రేట్‌లను, ధర-ఆధారిత రేట్‌లు అని కూడా అంటారు, ఆర్డర్ మొత్తం విలువ ఆధారంగా వేర్వేరు షిప్పింగ్ ధరలను వసూలు చేయడానికి ఇవి మిమ్మల్ని అనుమతిస్తాయి.

ఉదాహరణకు, మీరు $0 USD నుండి $100 USD వరకు ఉన్న ఆర్డర్‌లకు $24.99 USD షిప్పింగ్‌ను, $100.01 USD నుండి $200 USD వరకు ఉన్న ఆర్డర్‌లకు $9.99 USD షిప్పింగ్‌ను వసూలు చేయవచ్చు మరియు $200.01 USDకి పైబడిన ఆర్డర్‌లకు ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయవచ్చు. ధర-ఆధారిత రేట్‌ల ఉదాహరణలను డిస్‌ప్లే చేసే ఈ కింది పట్టికను రివ్యూ చేయండి:

ధర-ఆధారిత షిప్పింగ్ రేట్‌ల ఉదాహరణ
ఆర్డర్ విలువషిప్పింగ్ రేటు ధర
$0 USD - $100.00 USD$24.99 USD
$100.01 USD - $200.00 USD$9.99 USD
$200.01 USD మరియు అంతకంటే ఎక్కువ$0 USD (ఉచితం)

ఒక ఆర్డర్ అనేది, బహుళ షిప్పింగ్ ప్రొఫైల్‌లకు చెందిన ఉత్పత్తులను కలిగి ఉన్నప్పుడు, వర్తించే ధర-ఆధారిత రేట్‌లను Shopify కలుపుతుంది. ఉదాహరణకు, $50 USDకి పైబడిన ఆర్డర్‌ల కోసం రెండు ప్రొఫైల్‌లలో $5 USD రాయితీ గల షిప్పింగ్ రేటు యాక్టివ్‌గా ఉంటే, రెండు ప్రొఫైల్‌ల ఉత్పత్తులతో కలిపి $55 USD ఉన్న ఆర్డర్, చెక్‌అవుట్ వద్ద $10 USDల ఉమ్మడి షిప్పింగ్ రేటును డిస్‌ప్లే చేస్తుంది.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > షిప్పింగ్ మరియు డెలివరీకి వెళ్లండి.

  2. షిప్పింగ్ ప్రొఫైల్‌లు విభాగంలో, మీరు షిప్పింగ్ రేట్‌లను జోడించాలనుకుంటున్న షిప్పింగ్ ప్రొఫైల్‌ను క్లిక్ చేయండి.

  3. ఐచ్ఛికం: కొత్త షిప్పింగ్ జోన్‌ను జోడించడానికి, ఈ కింది దశలను పూర్తి చేయండి:

    1. షిప్పింగ్ జోన్‌ల విభాగంలో, జోన్‌ను జోడించండిపై క్లిక్ చేయండి.
    2. జోన్ పేరు ఫీల్డ్‌లో, మీ షిప్పింగ్ జోన్ కోసం ఒక పేరును ఎంటర్ చేయండి.
    3. ప్రాంతాల విభాగంలో, జోన్‌లో భాగంగా ఉన్న దేశాలు, ప్రాంతాలను ఎంచుకుని, ఆపై పూర్తయిందిపై క్లిక్ చేయండి.
  4. మీరు షిప్పింగ్ ఆప్షన్‌ను జోడించాలనుకుంటున్న షిప్పింగ్ జోన్ కోసం, షిప్పింగ్ ఆప్షన్‌ను జోడించండిపై క్లిక్ చేసి, ఆపై షిప్పింగ్ రేట్‌లను జోడించండి:

    1. పేరు ఫీల్డ్‌లో, మీ షిప్పింగ్ ఆప్షన్ కోసం పేరును ఎంటర్ చేయండి. చెక్‌అవుట్ వద్ద మీ కస్టమర్‌లకు ఈ పేరు డిస్‌ప్లే అవుతుంది.
    2. ఐచ్ఛికం: మీ షిప్పింగ్ ఆప్షన్‌ కోసం ట్రాక్ చేయబడిన షిప్పింగ్ లాంటి డెలివరీ వివరాలను జోడించడానికి, డెలివరీ వివరాలను జోడించండిపై క్లిక్ చేసి, ఆపై వివరాలను ఎంటర్ చేయండి. చెక్‌అవుట్ వద్ద మీ కస్టమర్‌లకు డెలివరీ వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
    3. రేటు రకం డ్రాప్-డౌన్ మెను నుండి, ఆర్డర్ మొత్తంను ఎంచుకోండి.
    4. ప్రతి శ్రేణి కోసం ఈ కింది సమాచారాన్ని ఎంటర్ చేయడం ద్వారా మీ ధరల శ్రేణులను సెటప్ చేయండి:
      1. కనీస ఫీల్డ్‌లో, ఈ రేటు కోసం కనీస ఆర్డర్ విలువను ఎంటర్ చేయండి.
      2. గరిష్ట ఫీల్డ్‌లో, ఈ రేటు కోసం గరిష్ట ఆర్డర్ విలువను ఎంటర్ చేయండి. మీకు గరిష్ట పరిమితి వద్దనుకుంటే, ఈ ఫీల్డ్‌ను ఖాళీగా ఉంచండి.
      3. ధర ఫీల్డ్‌లో, ఈ షిప్పింగ్ రేటు కోసం మీ కస్టమర్‌ల నుండి మీరు వసూలు చేసే మొత్తాన్ని ఎంటర్ చేయండి. షిప్పింగ్ రేటును ఉచితం చేయడానికి, ఈ ఫీల్డ్‌ను ఖాళీగా ఉంచండి లేదా 0ని ఎంటర్ చేయండి.
      4. ఐచ్ఛికం: రవాణా సమయం డ్రాప్-డౌన్ మెను నుండి, సూచించబడిన రవాణా సమయాన్ని ఎంచుకోండి. మీరు అనుకూల రవాణా సమయాన్ని ఎంచుకుంటే, మీ రవాణా సమయం కోసం 3-5 రోజులు లేదా 3 రోజులు లాంటి అనుకూల పరిధి లేదా ఒకే విలువను ఎంటర్ చేసి, పూర్తయిందిపై క్లిక్ చేయండి.
    5. అదనపు ధరల శ్రేణులను జోడించడానికి, Plus icon ఐకాన్‌పై క్లిక్ చేయండి.
    6. ఐచ్ఛికం: ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయడానికి, ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయండి ఎంచుకుని, ఆపై ఆర్డర్ ఉచిత షిప్పింగ్‌కు అర్హత పొందడానికి కావాల్సిన కనీస మొత్తాన్ని ఎంటర్ చేయండి.
  5. పూర్తయిందిపై క్లిక్ చేయండి.

  6. సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.

బరువు-ఆధారిత రేట్‌లను సెటప్ చేయండి

ఒకే షిప్పింగ్ ఆప్షన్‌తో ఒకే లొకేషన్ నుండి షిప్పింగ్ చేయబడే ఐటెమ్‌ల ఉమ్మడి బరువు ఆధారంగా వేర్వేరు షిప్పింగ్ ధరలను వసూలు చేయడానికి బరువు-ఆధారిత రేట్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి. బరువు-ఆధారిత రేట్‌లను సెటప్ చేసే ముందు మీ ఉత్పత్తులన్నింటికీ ఖచ్చితమైన బరువు డేటా ఉందని నిర్ధారించుకోండి. ఉత్పత్తులలో బరువు సమాచారం మిస్ అయినట్లయితే, చెక్‌అవుట్ వద్ద షిప్పింగ్ రేట్‌లు సరిగ్గా లెక్కించబడవు.

ఉదాహరణకు, మీరు 0 lb నుండి 0.99 lbల ఆర్డర్‌ల కోసం $4.99 USD షిప్పింగ్‌ను, 1 lb నుండి 4.99 lbల ఆర్డర్‌ల కోసం $9.99 USD షిప్పింగ్‌ను మరియు 5 lb నుండి 9.99 lbల ఆర్డర్‌ల కోసం $19.99 USD షిప్పింగ్‌ను వసూలు చేయవచ్చు. బరువు-ఆధారిత రేట్‌ల ఉదాహరణలను డిస్‌ప్లే చేసే ఈ కింది పట్టికను రివ్యూ చేయండి:

బరువు-ఆధారిత షిప్పింగ్ రేట్‌ల ఉదాహరణ
ఆర్డర్ మొత్తం బరువుషిప్పింగ్ రేటు ధర
0 lb - 0.99 lb$4.99 USD
1 lb - 4.99 lb$9.99 USD
5 lb - 9.99 lb$19.99 USD

బరువు-ఆధారిత షిప్పింగ్ రేట్‌లను కలిపేటప్పుడు, ప్రతి ఉత్పత్తికి మీ స్టోర్ డిఫాల్ట్ ప్యాకేజీ బరువును జోడించి, వ్యక్తిగత ఉత్పత్తుల బరువులకు వర్తించే రేట్‌లను Shopify కలుపుతుంది. కలిపిన షిప్పింగ్ రేట్‌ల గురించి మరింత తెలుసుకోండి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > షిప్పింగ్ మరియు డెలివరీకి వెళ్లండి.

  2. షిప్పింగ్ ప్రొఫైల్‌లు విభాగంలో, మీరు షిప్పింగ్ రేట్‌లను జోడించాలనుకుంటున్న షిప్పింగ్ ప్రొఫైల్‌ను క్లిక్ చేయండి.

  3. ఐచ్ఛికం: కొత్త షిప్పింగ్ జోన్‌ను జోడించడానికి, ఈ కింది దశలను పూర్తి చేయండి:

    1. షిప్పింగ్ జోన్‌ల విభాగంలో, జోన్‌ను జోడించండిపై క్లిక్ చేయండి.
    2. జోన్ పేరు ఫీల్డ్‌లో, మీ షిప్పింగ్ జోన్ కోసం ఒక పేరును ఎంటర్ చేయండి.
    3. ప్రాంతాల విభాగంలో, జోన్‌లో భాగంగా ఉన్న దేశాలు, ప్రాంతాలను ఎంచుకుని, ఆపై పూర్తయిందిపై క్లిక్ చేయండి.
  4. మీరు షిప్పింగ్ ఆప్షన్‌ను జోడించాలనుకుంటున్న షిప్పింగ్ జోన్ కోసం, షిప్పింగ్ ఆప్షన్‌ను జోడించండిపై క్లిక్ చేసి, ఆపై షిప్పింగ్ రేట్‌లను జోడించండి:

    1. పేరు ఫీల్డ్‌లో, మీ షిప్పింగ్ ఆప్షన్ కోసం పేరును ఎంటర్ చేయండి. చెక్‌అవుట్ వద్ద మీ కస్టమర్‌లకు ఈ పేరు డిస్‌ప్లే అవుతుంది.
    2. ఐచ్ఛికం: మీ షిప్పింగ్ ఆప్షన్‌ కోసం ట్రాక్ చేయబడిన షిప్పింగ్ లాంటి డెలివరీ వివరాలను జోడించడానికి, డెలివరీ వివరాలను జోడించండిపై క్లిక్ చేసి, ఆపై వివరాలను ఎంటర్ చేయండి. చెక్‌అవుట్ వద్ద మీ కస్టమర్‌లకు డెలివరీ వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
    3. రేటు రకం డ్రాప్-డౌన్ మెను నుండి, బరువును ఎంచుకోండి.
    4. ప్రతి శ్రేణి కోసం ఈ కింది సమాచారాన్ని ఎంటర్ చేయడం ద్వారా మీ బరువు శ్రేణులను సెటప్ చేయండి:
      1. కనీస ఫీల్డ్‌లో, ఈ రేటు కోసం కనీస ఆర్డర్ బరువును ఎంటర్ చేయండి.
      2. గరిష్ట ఫీల్డ్‌లో, ఈ రేటు కోసం గరిష్ట ఆర్డర్ బరువును ఎంటర్ చేయండి. మీకు గరిష్ట పరిమితి వద్దనుకుంటే, ఈ ఫీల్డ్‌ను ఖాళీగా ఉంచండి.
      3. ధర ఫీల్డ్‌లో, ఈ షిప్పింగ్ రేటు కోసం మీ కస్టమర్‌ల నుండి మీరు వసూలు చేసే మొత్తాన్ని ఎంటర్ చేయండి. షిప్పింగ్ రేటును ఉచితం చేయడానికి, ఈ ఫీల్డ్‌ను ఖాళీగా ఉంచండి లేదా 0ని ఎంటర్ చేయండి.
      4. ఐచ్ఛికం: రవాణా సమయం డ్రాప్-డౌన్ మెను నుండి, సూచించబడిన రవాణా సమయాన్ని ఎంచుకోండి. మీరు అనుకూల రవాణా సమయాన్ని ఎంచుకుంటే, మీ రవాణా సమయం కోసం 3-5 రోజులు లేదా 3 రోజులు లాంటి అనుకూల పరిధి లేదా ఒకే విలువను ఎంటర్ చేసి, పూర్తయిందిపై క్లిక్ చేయండి.
    5. అదనపు బరువు శ్రేణులను జోడించడానికి, Plus icon ఐకాన్‌పై క్లిక్ చేయండి.
    6. ఐచ్ఛికం: ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయడానికి, ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయండి ఎంచుకుని, ఆపై ఆర్డర్ ఉచిత షిప్పింగ్‌కు అర్హత పొందడానికి కావాల్సిన కనీస మొత్తాన్ని ఎంటర్ చేయండి.
  5. పూర్తయిందిపై క్లిక్ చేయండి.

  6. సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.

స్థానిక కరెన్సీలలో ఫ్లాట్ రేట్‌లను సృష్టించడం

మీరు వేర్వేరు మార్కెట్‌లకు చెందిన కస్టమర్‌ల కోసం స్థానిక కరెన్సీలలో ఫ్లాట్ రేట్‌లను సృష్టించవచ్చు. ఉదాహరణకు, మీరు యునైటెడ్ స్టేట్స్‌లోని కస్టమర్‌ల కోసం $10 USDల ఫ్లాట్ రేటు షిప్పింగ్‌ను ఆఫర్ చేయవచ్చు, కానీ ఐరోపా‌లోని కస్టమర్‌ల కోసం €15 EURల ఫ్లాట్ రేటు షిప్పింగ్‌ను ఆఫర్ చేయవచ్చు.

మీరు మీ మార్కెట్ కోసం స్థానిక కరెన్సీలను యాక్టివేట్ చేసినప్పుడు షిప్పింగ్ రేట్లు ఆటోమేటిక్‌గా కస్టమర్ స్థానిక కరెన్సీలో ప్రదర్శించబడతాయి. మీరు ఆటోమేటిక్ కన్వర్షన్‌పై ఆధారపడే బదులు వేర్వేరు ప్రాంతాలకు నిర్దిష్ట స్థిర రేట్లను సెట్ చేయాలనుకుంటే, ప్రతి ప్రాంతానికి ప్రత్యేక షిప్పింగ్ జోన్‌లను సృష్టించండి. ఉదాహరణకు, మీ Europe మార్కెట్‌లో ఫ్రాన్స్, జర్మనీ మరియు స్వీడన్ ఉన్నట్లయితే, ఆటోమేటిక్ కన్వర్షన్ స్వీడిష్ కస్టమర్‌ల కోసం మీ €10 EUR రేటును దాదాపు 120 SEKగా ప్రదర్శిస్తుంది. మీరు స్వీడన్‌కు (కన్వర్ట్ చేయబడిన మొత్తానికి బదులు) ఖచ్చితంగా 120 SEKను ఛార్జీ చేయాలనుకుంటే, ప్రత్యేక జోన్‌లను సృష్టించండి: €10 EUR రేటుతో యూరో దేశాలకు (ఫ్రాన్స్ మరియు జర్మనీ) ఒకటి మరియు 120 SEK రేటుతో స్వీడన్ కోసం మరొకటి.

క్యారియర్ లేదా యాప్ ద్వారా లెక్కింపబడిన షిప్పింగ్ రేట్లను సెటప్ చేయడం

చెక్‌అవుట్‌లో UPS, FedEx లేదా USPS లాంటి క్యారియర్‌ల నుండి క్యారియర్-లెక్కింపబడిన షిప్పింగ్ రేట్లు ప్రదర్శించబడతాయి. బరువు, డైమెన్షన్‌లు మరియు గమ్యస్థానంతో సహా ఆర్డర్ వివరాల ఆధారంగా క్యారియర్‌లు రేట్‌లను నిర్ణయిస్తాయి. మీరు షిప్పింగ్ లేబుల్‌ను కొనుగోలు చేసినప్పుడు షిప్పింగ్ క్యారియర్ మీకు ఎంత ఛార్జీ చేస్తుందో మీ కస్టమర్‌లకు కచ్చితంగా ఆ మొత్తాన్నే ఛార్జీ చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది.

షిప్పింగ్ కోసం ఎంత ఛార్జీ చేయాలనేది నిర్ణయించేటప్పుడు షిప్పింగ్ క్యారియర్‌లు కింది అంశాలను ఉపయోగిస్తాయి:

  • షిప్పింగ్ మూలం
  • షిప్పింగ్ గమ్యం
  • షిప్‌మెంట్ బరువు
  • షిప్‌మెంట్ విలువ
  • షిప్‌మెంట్ బాక్స్ డైమెన్షన్‌లు
  • డైమెన్షనల్ బరువు
  • డెలివరీ అభ్యర్థిత వేగం

చెక్‌అవుట్ వద్ద కచ్చితమైన క్యారియర్-లెక్కింపబడిన రేట్లను నిర్ధారించడానికి, మీరు కచ్చితమైన ఉత్పత్తి బరువులను నమోదు చేయాలి. ఈ రేట్లు అంచనా వేయబడిన రవాణా సమయాన్ని ప్రదర్శిస్తాయి, కానీ అవి మీ ప్రాసెసింగ్ సమయాన్ని చేర్చవు. ప్రాసెసింగ్ మరియు రవాణా సమయం రెండింటినీ కలిపి డెలివరీ తేదీలను ప్రదర్శించడానికి, డెలివరీ తేదీలను సెటప్ చేయడాన్ని చూడండి.

క్యారియర్-లెక్కింపబడిన రేట్ల లభ్యత

క్యారియర్-లెక్కింపబడిన రేట్లు నిర్దిష్ట సందర్భాలలో అందుబాటులో ఉంటాయి. క్యారియర్-లెక్కింపబడిన రేట్లు మరియు వివిధ ప్రాంతాలలో వాటి లభ్యత గురించి మరింత తెలుసుకోవడానికి కింది పట్టికను రివ్యూ చేయండి:

ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్ వారీగా క్యారియర్-లెక్కింపబడిన రేట్ల లభ్యత
ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్అందుబాటులో ఉన్న క్యారియర్-లెక్కింపబడిన రేట్లు
యునైటెడ్ స్టేట్స్USPS, DHL మరియు UPS
కెనడాకెనడా పోస్ట్ మరియు Purolator
యునైటెడ్ కింగ్‌డమ్DPD UK, InPost UK మరియు Royal Mail
ఇటలీBRT
జర్మనీDHL Paket
స్పెయిన్Seur

క్యారియర్-లెక్కింపబడిన రేట్లను సెటప్ చేయండి

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > షిప్పింగ్ మరియు డెలివరీకి వెళ్లండి.

  2. షిప్పింగ్ ప్రొఫైల్‌లు విభాగంలో, మీరు షిప్పింగ్ రేట్‌లను జోడించాలనుకుంటున్న షిప్పింగ్ ప్రొఫైల్‌ను క్లిక్ చేయండి.

  3. ఐచ్ఛికం: కొత్త షిప్పింగ్ జోన్‌ను జోడించడానికి, ఈ కింది దశలను పూర్తి చేయండి:

    1. షిప్పింగ్ జోన్‌ల విభాగంలో, జోన్‌ను జోడించండిపై క్లిక్ చేయండి.
    2. జోన్ పేరు ఫీల్డ్‌లో, మీ షిప్పింగ్ జోన్ కోసం ఒక పేరును ఎంటర్ చేయండి.
    3. ప్రాంతాల విభాగంలో, జోన్‌లో భాగంగా ఉన్న దేశాలు, ప్రాంతాలను ఎంచుకుని, ఆపై పూర్తయిందిపై క్లిక్ చేయండి.
  4. మీరు షిప్పింగ్ ఆప్షన్‌ను జోడించాలనుకుంటున్న షిప్పింగ్ జోన్ కోసం, షిప్పింగ్ ఆప్షన్‌ను జోడించండిపై క్లిక్ చేసి, ఆపై షిప్పింగ్ రేట్‌లను జోడించండి:

    1. ఐచ్ఛికం: మీ షిప్పింగ్ ఆప్షన్‌ కోసం ట్రాక్ చేయబడిన షిప్పింగ్ లాంటి డెలివరీ వివరాలను జోడించడానికి, డెలివరీ వివరాలను జోడించండిపై క్లిక్ చేసి, ఆపై వివరాలను ఎంటర్ చేయండి. చెక్‌అవుట్ వద్ద మీ కస్టమర్‌లకు డెలివరీ వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
    2. రేటు రకం డ్రాప్-డౌన్ మెనూ నుండి, క్యారియర్ లేదా యాప్‌ల ద్వారా లెక్కింపబడినవిని ఎంచుకోండి.
    3. క్లిక్ చేయండి: క్యారియర్ మరియు యాప్‌లను ఎంచుకోండి, ఆపై కింది దశలను పూర్తి చేయండి:
      1. క్యారియర్ లేదా యాప్ డ్రాప్-డౌన్ మెనూ నుండి, షిప్పింగ్ క్యారియర్ లేదా యాప్‌ను ఎంచుకోండి.
      2. చెక్‌అవుట్ వద్ద మీ కస్టమర్‌లకు మీరు ప్రదర్శించాలనుకుంటున్న షిప్పింగ్ సేవలను ఎంచుకోండి. ఎంచుకోవడానికి ఎటువంటి సేవలు అందుబాటులో లేకుంటే, క్యారియర్ లేదా యాప్ ద్వారా రేట్లు ఆటోమేటిక్‌గా ప్రదర్శించబడతాయి.
      3. ఐచ్ఛికం: కొత్త షిప్పింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా వాటిని చేర్చడానికి, కొత్త సేవలు అందుబాటులోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా చేర్చండిని ఎంచుకోండి.
      4. ఐచ్ఛికం: నిర్వహణ రుసుము విభాగంలో, క్యారియర్ రేటుకు జోడించడానికి శాతం లేదా స్థిర మొత్తాన్ని నమోదు చేయండి. ప్యాకేజింగ్ మరియు నిర్వహణ ఖర్చుల కోసం మీరు దీనిని ఉపయోగించవచ్చు.
      5. పూర్తయిందిపై క్లిక్ చేయండి.
    4. ఐచ్ఛికం: ఆర్డర్‌లు కనీస విలువకు చేరుకున్నప్పుడు ఉచిత షిప్పింగ్‌ను అందించడానికి, ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయండిని ఎంచుకోండి, ఆపై ఉచిత షిప్పింగ్‌కు అర్హత పొందడం కోసం ఆర్డర్‌కు కనీస మొత్తాన్ని నమోదు చేయండి.
  5. పూర్తయిందిపై క్లిక్ చేయండి.

  6. సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.

క్యారియర్-లెక్కింపబడిన రేట్లను మార్కప్ చేయండి లేదా తగ్గింపు ఇవ్వండి

చెక్‌అవుట్ వద్ద మీ కస్టమర్‌లకు ప్రదర్శించబడే రేట్లను మార్కప్ చేయడానికి లేదా తగ్గించడానికి క్యారియర్-లెక్కింపబడిన షిప్పింగ్ రేట్లను మీరు సర్దుబాటు చేయవచ్చు. ఉదాహరణకు, కస్టమర్‌లను ఆకర్షించడానికి రేటు చాలా ఎక్కువగా ఉంటే, విక్రయాలను పెంచడానికి మీరు దానికి కొంత శాతం తగ్గింపు ఇవ్వవచ్చు. బదులుగా, మీ ప్యాకేజింగ్ మరియు నిర్వహణ ఖర్చులను కవర్ చేయడానికి రేటు చాలా తక్కువగా ఉంటే, మీరు దానిని పెంచవచ్చు.

మీరు క్యారియర్-లెక్కింపబడిన రేట్లను అదనపు ఫ్లాట్ రుసుము ద్వారా లేదా మొత్తం షిప్పింగ్ రేటు శాతంతో మార్కప్ చేయవచ్చు. అదనపు ఫ్లాట్ రుసుము మరియు శాతం మార్కప్ రెండింటినీ చేర్చడానికి మీరు క్యారియర్-లెక్కింపబడిన రేటును సర్దుబాటు చేస్తే, అప్పుడు ఫ్లాట్ రుసుమును జోడించే ముందు ఆ శాతం లెక్కించబడుతుంది. ఉదాహరణకు, 50% మార్కప్ మరియు $1.00 USD ఫ్లాట్ రుసుముతో కూడిన $5.00 USD రేటు కోసం కస్టమర్ $8.50 USD ఖర్చు చేస్తారు, $9.00 USD కాదు.

మీరు తగ్గింపుతో కూడిన షిప్పింగ్‌ను అందించాలనుకుంటే, -5% లేదా $-2.50 లాంటి నెగిటివ్ విలువను నమోదు చేయండి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > షిప్పింగ్ మరియు డెలివరీకి వెళ్లండి.

  2. షిప్పింగ్ ప్రొఫైల్‌లు విభాగంలో, మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న షిప్పింగ్ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.

  3. మీరు సర్దుబాటు చేయాలనుకుంటున్న క్యారియర్-లెక్కింపబడిన రేటు పక్కన, Horizontal menu క్లిక్ చేసి, ఆపై షిప్పింగ్ ఆప్షన్‌ను ఎడిట్ చేయండిపై క్లిక్ చేయండి.

  4. నిర్వహణ రుసుము విభాగంలో, రేటు సర్దుబాటులను సెట్ చేయండి.

  5. పూర్తయింది క్లిక్ చేసి, ఆపై సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.

మీ ఇప్పటికే ఉన్న షిప్పింగ్ ఆప్షన్‌కు ఉచిత షిప్పింగ్‌ను జోడించండి

ఇప్పటికే ఉన్న మీ షిప్పింగ్ ఆప్షన్ కోసం మీరు ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయవచ్చు. ఉచిత షిప్పింగ్‌కు అర్హత పొందడం కోసం ఆర్డర్‌కు మీరు కనీస మొత్తాన్ని నమోదు చేయాలి. ఉదాహరణకు, మీరు మీ కనీస మొత్తంగా $50 USDని నమోదు చేయవచ్చు. అంటే $50 USD లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లు ఉచిత షిప్పింగ్‌కు అర్హత పొందుతాయి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > షిప్పింగ్ మరియు డెలివరీకి వెళ్లండి.

  2. షిప్పింగ్ ప్రొఫైల్‌లు విభాగంలో, మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న షిప్పింగ్ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.

  3. షిప్పింగ్ జోన్‌లు విభాగంలో, మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న షిప్పింగ్ ఆప్షన్ కోసం Horizontal menu క్లిక్ చేసి, ఆపై షిప్పింగ్ ఆప్షన్‌ను ఎడిట్ చేయండిపై క్లిక్ చేయండి.

  4. ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయండి ఎంచుకోండి, ఆపై ఉచిత షిప్పింగ్‌కు అర్హత పొందడం కోసం ఆర్డర్‌కు కనీస మొత్తాన్ని నమోదు చేయండి.

  5. పూర్తయిందిపై క్లిక్ చేయండి.

  6. సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.

షరతులతో కూడిన రేట్లు మరియు ఉచిత షిప్పింగ్ కవరేజ్

మీరు ఏ రేటు రకం పైనైనా ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయవచ్చు. ఉచిత షిప్పింగ్ ఎలా వర్తిస్తుంది అనేది ఆ రేటుకు షరతులు ఉన్నాయా లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది:

  • ఎలాంటి షరతులు లేని రేట్లు: ఈ రేటు కవర్ చేసే ప్రతి ఆర్డర్‌కు ఉచిత షిప్పింగ్ వర్తిస్తుంది.
  • ఆర్డర్ మొత్తం-ఆధారిత లేదా బరువు ఆధారిత రేట్లు: ఆర్డర్ దాని మొత్తం లేదా బరువును కవర్ చేసే టైర్ పరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే ఉచిత షిప్పింగ్ వర్తిస్తుంది.

మీరు ఆర్డర్ మొత్తం-ఆధారిత లేదా బరువు ఆధారిత టైర్‌లను ఉపయోగించినప్పుడు, మీ టైర్‌లు ఆర్డర్ మొత్తాలు లేదా బరువుల పూర్తి శ్రేణిని కవర్ చేసేలా చూసుకోండి.

నిర్దిష్ట ఉత్పత్తులు లేదా నిర్దిష్ట కస్టమర్‌ల కోసం ఉచిత షిప్పింగ్‌ను జోడించడం

మీరు నిర్దిష్ట ఉత్పత్తులు లేదా నిర్దిష్ట కస్టమర్‌ల కోసం ఉచిత షిప్పింగ్‌ను జోడించవచ్చు:

  • నిర్దిష్ట ఉత్పత్తులపై మాత్రమే ఉచిత షిప్పింగ్‌ను అందించడానికి, మీరు కస్టమ్ షిప్పింగ్ ప్రొఫైల్‌ను సృష్టించాలి మరియు సంబంధిత ఉత్పత్తులను చేర్చాలి, ఆపై ఉచిత షిప్పింగ్‌ను అందించే ఫ్లాట్ రేటును సృష్టించాలి.
  • నిర్దిష్ట కస్టమర్‌లకు ఉచిత షిప్పింగ్‌ను అందించడానికి, మీరు ఉచిత షిప్పింగ్ తగ్గింపును సృష్టించాలి. తగ్గింపుకు అర్హత ఉన్న కస్టమర్‌లు చెక్‌అవుట్ సమయంలో డిస్కౌంట్ కోడ్‌ను నమోదు చేయవచ్చు, ఆపై వారి ఆర్డర్‌కు ఉచిత షిప్పింగ్ వర్తించబడుతుంది. కస్టమర్ ద్రవ్య తగ్గింపు మరియు ఉచిత షిప్పింగ్ తగ్గింపు రెండింటినీ స్వీకరించాలని మీరు కోరుకుంటే, మీ కస్టమర్ కోసం డ్రాఫ్ట్ ఆర్డర్‌ని సృష్టించండి.

షిప్పింగ్ జోన్‌లు మరియు రేట్లను ఎడిట్ చేయండి

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > షిప్పింగ్ మరియు డెలివరీకి వెళ్లండి.

  2. షిప్పింగ్ ప్రొఫైల్‌లు విభాగంలో, మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న షిప్పింగ్ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.

  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న షిప్పింగ్ జోన్ లేదా రేటు పక్కన, Horizontal menuను క్లిక్ చేయండి.

  4. జోన్‌ను ఎడిట్ చేయండి లేదా షిప్పింగ్ ఆప్షన్‌ను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.

  5. ఏవైనా మార్పులు చేయండి, ఆపై పూర్తయిందిని క్లిక్ చేయండి.

  6. సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.

షిప్పింగ్ జోన్‌లు మరియు రేట్లను తొలగించండి

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > షిప్పింగ్ మరియు డెలివరీకి వెళ్లండి.

  2. షిప్పింగ్ ప్రొఫైల్‌లు విభాగంలో, మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న షిప్పింగ్ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.

  3. మీరు తొలగించాలనుకుంటున్న షిప్పింగ్ జోన్ లేదా రేటు పక్కన, Horizontal menuను క్లిక్ చేయండి.

  4. తొలగించండిని క్లిక్ చేయండి.

  5. సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.

షిప్పింగ్ రేట్లను ఎంచుకునే కస్టమర్ అనుభవం

చెక్‌అవుట్‌లో కస్టమర్‌లకు ఏ రేట్లు ప్రదర్శించబడాలో మీ షిప్పింగ్ సెట్టింగ్‌లు నిర్ధారిస్తాయి. మీరు మీ షిప్పింగ్ రేట్లను సెటప్ చేసిన తర్వాత, మీ కస్టమర్‌లు ఎంచుకోగల రేట్లను ధృవీకరించడానికి మీరు పరీక్ష ఆర్డర్‌ను చేయవచ్చు. షిప్పింగ్ రేట్ల ట్రబుల్షూటింగ్ మరియు పరీక్షించడం గురించి మరింత తెలుసుకోండి.

కస్టమర్‌లు డెలివరీ చిరునామాను నమోదు చేసే వరకు వారికి ఎలాంటి షిప్పింగ్ రేట్లు అందించబడవు. ఒక కస్టమర్ చెక్‌అవుట్‌లో షిప్పింగ్ చిరునామాను నమోదు చేసిన తర్వాత, వర్తించే షిప్పింగ్ రేట్లు ప్రదర్శించబడతాయి. ప్రతి కస్టమర్‌కు వారి ఆర్డర్‌కు వర్తించే రేట్లు మాత్రమే అందించబడతాయి మరియు అత్యంత చవకైన రేటు డిఫాల్ట్‌గా ప్రదర్శించబడుతుంది. కస్టమర్ చెక్‌అవుట్‌కు చేరుకున్న తర్వాత వారి ఆర్డర్ కంటెంట్‌లను మార్చినట్లయితే, వారు తుది కొనుగోలు దశకు కొనసాగినప్పుడు షిప్పింగ్ రేట్లు మళ్లీ లెక్కించబడతాయి.

మీ షిప్పింగ్ జోన్‌లలో చేర్చబడని ప్రాంతంలో షిప్పింగ్ చిరునామాను నమోదు చేసే కస్టమర్‌లు తమ ప్రాంతానికి ఎలాంటి షిప్పింగ్ రేటు అందుబాటులో లేదని నోటీసును అందుకుంటారు.