చెక్‌అవుట్‌లో సుంకాలు మరియు దిగుమతి పన్నులను వసూలు చేయడానికి అదనపు టాస్క్‌లు

చెక్‌అవుట్ వద్ద సుంకాలు మరియు దిగుమతి పన్నులను వసూలు చేయడం యాక్టివేట్ చేసిన తర్వాత, సుంకాలు మరియు దిగుమతి పన్నులను కస్టమర్ ఇప్పటికే చెల్లించారని సూచించడానికి, మీరు డెలివర్డ్ డ్యూటీ పెయిడ్ (DDP) షిప్పింగ్ లేబుల్‌లను ప్రింట్ చేయాలి. మీ స్టోర్ ఆధారంగా, మీరు మీ స్టోర్‌కు సంబంధించిన కొంత సమాచారాన్ని అప్‌డేట్ చేయాల్సి రావచ్చు, ఫ్లాష్ సేల్స్ కోసం సిద్ధం కావాల్సి ఉంటుంది లేదా రీఫండ్‌లకు సంబంధించిన విధానాలను డెవలప్ చేయాల్సి ఉంటుంది. మీరు అంతర్జాతీయంగా రవాణా చేసే ముందు, కింది టాస్క్‌లను రివ్యూ చేయండి.

DDP షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేయండి మరియు ఉపయోగించండి

చెక్‌అవుట్‌లో మీరు సుంకాలు, దిగుమతి పన్నులు వసూలు చేయడం ప్రారంభించిన తర్వాత, మీ అంతర్జాతీయ ఆర్డర్‌ల కోసం ప్రామాణిక షిప్పింగ్ లేబుల్‌లకు బదులుగా మీరు DDP షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేసి, ఉపయోగించాలి. చెక్‌అవుట్‌లో మీరు సుంకాలు వసూలు చేసి కూడా ప్రామాణిక షిప్పింగ్ లేబుల్‌ను ఉపయోగిస్తే, మీ కస్టమర్‌కు డెలివరీ సమయంలో కూడా సుంకాలు, దిగుమతి పన్నులు విధించబడతాయి. అటువంటప్పుడు, మీ కస్టమర్ సుంకాలు, దిగుమతి పన్నుల కోసం రెండు సార్లు చెల్లించాల్సి వస్తుంది.

అంతర్జాతీయ ఆర్డర్‌పై సుంకాలు వసూలు చేసినప్పుడు, ఆ ఆర్డర్ వివరాలలో సుంకాలు అనే లైన్ ఐటెమ్ చేర్చబడుతుంది. మీరు DDP లేబుల్‌ను కొనుగోలు చేసే ముందు, ప్రతి అంతర్జాతీయ ఆర్డర్‌పై సుంకాలు, దిగుమతి పన్నులు వసూలు చేశారో లేదో నిర్ధారించుకోండి. మీరు $0 సుంకంతో ఆర్డర్‌ను రవాణా చేసినట్లయితే, మీ కస్టమర్‌లు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ధారించడానికి, మీరు DDP షిప్పింగ్ లేబుల్‌లను ఉపయోగించవచ్చు. చెక్‌అవుట్‌లో ఏదైనా ఎర్రర్ ఏర్పడితే, సుంకాలు, దిగుమతి పన్నులు వసూలు చేయబడకపోయి ఉండవచ్చు మరియు ఆ ఆర్డర్ కోసం మీరు ప్రామాణిక షిప్పింగ్ లేబుల్‌ను ఉపయోగించాలి.

క్యారియర్ నుండి మీరు మీ మొదటి ఇన్‌వాయిస్‌ను అందుకున్న తర్వాత, సుంకాలు, దిగుమతి పన్నులు సరిగ్గా వసూలు చేయబడుతున్నాయో లేదో నిర్ధారించుకోవడానికి, షిప్పింగ్ గమ్యస్థానం వద్ద విధించిన కస్టమ్స్ ఛార్జీలతో చెక్‌అవుట్ ఛార్జీలను పోల్చి చూడండి. క్రమానుగతంగా ఈ ప్రాసెస్‌ని పునరావృతం చేయండి. చెక్‌అవుట్‌లో వసూలు చేయబడిన సుంకాలు, దిగుమతి పన్నులకు మరియు కస్టమ్స్ అధికారులచే వసూలు చేయబడిన మొత్తానికి మధ్య గణనీయమైన వ్యత్యాసాలను మీరు గమనించినట్లయితే, మీ సుంకాలు, దిగుమతి పన్నులు వీలైనంత కచ్చితంగా లెక్కించబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి మీ సెటప్‌ను రివ్యూ చేయండి.

కమర్షియల్ ఇన్‌వాయిస్‌లను సృష్టించడం

ప్రతి అంతర్జాతీయ ఆర్డర్‌కు కమర్షియల్ ఇన్‌వాయిస్ అవసరం. క్యారియర్ వెబ్‌సైట్‌లో క్యారియర్ అందించే డిజిటల్ కమర్షియల్ ఇన్‌వాయిస్‌లను మీరు పూర్తి చేయవచ్చు. ఆర్డర్‌ను బట్టి, మీరు కింది మార్గాలలో ఒకదాని ద్వారా కమర్షియల్ ఇన్‌వాయిస్‌ను సృష్టించాలి:

  • ఆర్డర్‌పై సుంకాలు, దిగుమతి పన్నులు చెల్లించినట్లయితే, సుంకాలు, దిగుమతి పన్నులు చెల్లించినట్లు సూచించడానికి కమర్షియల్ ఇన్‌వాయిస్‌లో డెలివరీ నియమనిబంధనలను DDPగా మార్క్ చేయండి.
  • ఆర్డర్‌పై సుంకాలు, దిగుమతి పన్నులు చెల్లించనట్లయితే, సుంకాలు, దిగుమతి పన్నులు ఇంకా చెల్లించబడలేదని సూచించడానికి కమర్షియల్ ఇన్‌వాయిస్‌లో డెలివరీ నియమనిబంధనలను DAP (డెలివర్డ్ ఎట్ ప్లేస్)గా మార్క్ చేయండి.

మీరు కస్టమర్‌కు విధించే సుంకాలు, దిగుమతి పన్నుకి మరియు కస్టమ్స్ ఏజెన్సీలు వసూలు చేసే మొత్తానికి మధ్య వ్యత్యాసాలను తగ్గించడానికి, మీ కమర్షియల్ ఇన్‌వాయిస్‌లో కచ్చితమైన సమాచారాన్ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. మీరు ఇన్‌వాయిస్‌ను సృష్టించినప్పుడు, కమర్షియల్ ఇన్‌వాయిస్‌లో మరియు మీ Shopify అడ్మిన్‌లోని ఆర్డర్‌లో కింద పేర్కొన్నవి ఒకేలా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి:

  • హార్మోనైజ్డ్ సిస్టమ్ (HS) కోడ్
  • మూల దేశం లేదా ప్రాంతం
  • తగ్గింపుల తర్వాతి ధర
  • పరిమాణం
  • వసూలు చేసిన సుంకాలు మరియు దిగుమతి పన్ను
  • మీరు తక్కువ విలువ గల వస్తువుల పన్నును వసూలు చేస్తుంటే, మీ స్థానిక పన్ను రిజిస్ట్రేషన్ నంబర్

మీ షిప్పింగ్ విధానం మరియు నోటిఫికేషన్‌లను అప్‌డేట్ చేయండి

చెక్‌అవుట్ వద్ద సుంకాలు మరియు దిగుమతి పన్నులను ఛార్జ్ చేయడాన్ని మీరు యాక్టివేట్ చేసిన తర్వాత, మీ షిప్పింగ్ విధానంను, అలాగే నోటిఫికేషన్ టెంప్లేట్‌లను అప్‌డేట్ చేయండి, తద్వారా మీ కస్టమర్‌లు అంతర్జాతీయ విక్రయాల కోసం మీ విధానాలు మరియు ఛార్జీల గురించి తెలుసుకుంటారు.

మీ Shopify అడ్మిన్‌లో సెట్టింగ్‌లు > విధానాల (Policies)కు వెళ్లడం ద్వారా మీ షిప్పింగ్ విధానాన్ని అప్‌డేట్ చేయండి.

మీరు డిఫాల్ట్ ఆర్డర్ నిర్ధారణ మరియు ఆర్డర్ రీఫండ్ ఇమెయిల్ టెంప్లేట్‌లను ఉపయోగిస్తుంటే, సుంకాల లైన్ ఐటెమ్‌ను చేర్చడానికి మీ ఇమెయిల్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి, మీరు ఎలాంటి మార్పులూ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆర్డర్ నిర్ధారణ మరియు ఆర్డర్ రీఫండ్ ఇమెయిల్ టెంప్లేట్‌లను అనుకూలీకరించి ఉంటే, సుంకాల లైన్‌ను చేర్చడానికి మీరు మీ నోటిఫికేషన్ టెంప్లేట్‌లకు కోడ్‌ను జోడించవచ్చు.

ఫ్లాష్ సేల్స్ కోసం సిద్ధం కావడం

మీరు ఫ్లాష్ సేల్స్ రన్ చేస్తుంటే, మీ సేల్ పూర్తయ్యే వరకు చెక్‌అవుట్ వద్ద సుంకాలు మరియు దిగుమతి పన్నుల వసూలును డిజేబుల్ చేయడాన్ని పరిగణించండి. మీ సేల్ సమయంలో మీరు చెక్‌అవుట్ వద్ద సుంకాలు మరియు దిగుమతి పన్నులను వసూలు చేయాలని నిర్ణయించుకుంటే, మీ సేల్ ఉత్పత్తులకు HS కోడ్‌లు, మూలానికి చెందిన దేశం లేదా ప్రాంతం మరియు ఉత్పత్తి వర్గం పేర్కొన్నట్లుగా నిర్ధారించుకోవడానికి వాటిని రివ్యూ చేయండి. మీ సేల్ ఉత్పత్తులలో మీరు ఈ ఫీల్డ్‌లను పూరించినట్లు నిర్ధారించుకోవడం ద్వారా సుంకాలు మరియు దిగుమతి పన్నుల ఖర్చులను అంచనా వేయడంలో సహాయపడుతుంది.

రీఫండ్‌లను మేనేజ్ చేయడం

సుంకాలు మరియు దిగుమతి పన్నుల కోసం మీరు రీఫండ్‌లను ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారనేది మీ ఇష్టం. మీరు సుంకాలు మరియు దిగుమతి పన్నులకు రీఫండ్‌లను అందించాలని నిర్ణయించుకుంటే, ఈ కింది వాటిని పరిగణించండి:

  • ఇంకా నెరవేర్చబడని ఆర్డర్‌కు మీరు రీఫండ్ ఇస్తే, మీరు కస్టమర్‌కు సుంకాలు మరియు దిగుమతి పన్నులను రీఫండ్ చేయవచ్చు.
  • ఇప్పటికే నెరవేర్చబడిన ఆర్డర్‌కు మీరు రీఫండ్ ఇస్తే, మీరు కస్టమర్‌కు సుంకాలు మరియు దిగుమతి పన్నులను రీఫండ్ చేయవచ్చు. అయితే, DDP లేబుల్‌లను కొనుగోలు చేయడానికి మీరు ఉపయోగించిన ఎలాంటి ఫండ్‌లనూ క్యారియర్ మీకు తిరిగి చెల్లించరు.

దిగుమతి పన్ను చెల్లించబడిన ఆర్డర్‌కు మీరు రీఫండ్ చేసినప్పుడు, ఇతర కస్టమ్స్ ఫీజుల నుండి విడిగా పన్నును రీఫండ్ చేయాలా వద్దా అని మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు రెమిట్ చేసిన ఫండ్‌లను కస్టమ్స్ ఏజెన్సీ నుండి రికవర్ చేయలేకపోతే మరియు మీ కస్టమర్ తరపున ఆ ఖర్చును భరించకూడదనుకుంటే, మీరు దిగుమతి పన్ను రీఫండ్‌లను నిలిపివేయవచ్చు.

కస్టమర్ తమ పేమెంట్ ప్రొవైడర్‌తో ఆర్డర్‌పై డిస్ప్యూట్ చేయకుండా నిరోధించడానికి ఆర్డర్‌ను పూర్తిగా రీఫండ్ చేయడం మాత్రమే ఏకైక మార్గం అని గుర్తుంచుకోండి.