Managed Markets ఆర్డర్‌లను నెరవేర్చడం మరియు మేనేజ్ చేయడం

కింది ఎంపికలలో దేనినైనా ఉపయోగించి, మీరు మీ అంతర్జాతీయ ఆర్డర్‌లను Managed Marketsతో నెరవేర్చవచ్చు:

  • నేరుగా మీ Shopify అడ్మిన్‌లో షిప్పింగ్ లేబుల్స్‌ను కొనుగోలు చేసి, ప్రింట్ చేయండి.
  • మీ థర్డ్-పార్టీ ఫుల్‌ఫిల్‌మెంట్ భాగస్వామి నుండి సపోర్ట్ చేయబడిన షిప్పింగ్ లేబుల్స్‌ను ఉపయోగించి ఆర్డర్‌లను ప్రింట్ చేయండి, నెరవేర్చండి మరియు రవాణా చేయండి.

మీరు Managed Markets ఆర్డర్‌లను రీఫండ్ చేయవచ్చు, అలాగే వాపసు చేయవచ్చు.

ఈ సేవలో Global-e ఎలాంటి పాత్ర పోషించినప్పటికీ, Managed Marketsకు సంబంధించిన సందేహాలన్నింటికీ Shopify సపోర్ట్ సమాధానం ఇస్తుంది. Global-e అనేది మీ మర్చంట్ ఆఫ్ రికార్డ్ మరియు ఇది మీ Managed Markets ఆర్డర్‌లకు సంబంధించి సుంకాలు, పన్నుల రెమిటెన్స్, కమర్షియల్ ఇన్‌వాయిస్‌లు, క్యారియర్ ఏర్పాట్లు మొదలైన వాటిని ఆపరేట్ చేస్తుంది. మీ ఆర్డర్‌లు, పేఅవుట్‌లు, షిప్పింగ్ లేబుల్స్, రిటర్న్‌లు, పన్ను లేదా కస్టమ్స్ డాక్యుమెంట్‌లకు సంబంధించిన అభ్యర్థనలు నేరుగా Global-eకి వెళ్లవు, అవి ఇప్పటికీ Shopify సపోర్ట్ ద్వారానే జరుగుతాయి.

Global-e స్టాండ్‌లోన్ థర్డ్-పార్టీ యాప్‌ను కూడా కలిగి ఉంది, ఇది Managed Markets కంటే భిన్నమైనది. మీరు Managed Marketsకు బదులుగా స్టాండ్‌లోన్ Global-e యాప్‌ను ఉపయోగిస్తే, Global-e నేరుగా మీకు మద్దతు ఇస్తుంది. మీరు Managed Markets మరియు Global-e యాప్‌ను ఒకే సమయంలో ఉపయోగించలేరు.

Managed Markets షిప్పింగ్ లేబుల్స్‌ను కొనుగోలు చేయడానికి సంబంధించిన పరిగణనలు

మీ అంతర్జాతీయ ఆర్డర్‌ల కోసం షిప్పింగ్ లేబుల్స్‌ను కొనుగోలు చేసే ముందు, కింది పరిగణనలను రివ్యూ చేయండి.

ప్యాకేజీ మరియు క్యారియర్ లభ్యత

  • క్యారియర్ ప్యాకేజీలకు Managed Markets మద్దతు ఇవ్వదు. ఒకవేళ మీరు Shopify నుండి నెరవేరుస్తున్నట్లయితే, మీ అడ్మిన్‌లోని షిప్పింగ్ మరియు డెలివరీ సెట్టింగ్‌ల నుండి మీరు తప్పనిసరిగా కస్టమ్ ప్యాకేజీలను ఉపయోగించాలి. మీరు థర్డ్-పార్టీ ఫుల్‌ఫిల్‌మెంట్ భాగస్వామిని ఉపయోగించి నెరవేరుస్తున్నట్లయితే, ఆ యాప్ లేదా ప్లాట్‌ఫారమ్‌లో సెటప్ చేసిన ప్యాకేజీలను తప్పనిసరిగా ఉపయోగించాలి.
  • అందుబాటులో ఉండే షిప్పింగ్ లేబుల్స్ మీ వ్యాపార లొకేషన్‌పై ఆధారపడి ఉంటాయి.
    • యునైటెడ్ స్టేట్స్‌లో, మీరు DHL Express, DHL eCommerce, UPS మరియు FedEx షిప్పింగ్ లేబుల్స్‌ను కొనుగోలు చేయవచ్చు.
    • యునైటెడ్ కింగ్‌డమ్ మరియు కెనడాలో, మీరు కేవలం DHL Express మరియు FedEx షిప్పింగ్ లేబుల్స్‌ను మాత్రమే కొనుగోలు చేయగలరు.

సుంకాలు మరియు గమ్యం వివరాలు

  • డెలివర్డ్ డ్యూటీ పెయిడ్ (DDP)కు మద్దతు లేని దేశాలు మరియు ప్రాంతాలలో మాత్రమే డెలివర్డ్ డ్యూటీ అన్‌పెయిడ్ (DDU) షిప్పింగ్ లేబుల్స్ అందుబాటులో ఉంటాయి.
  • ఏదేని మొత్తం కోసం సుంకాలు లెక్కించబడిన ఆర్డర్‌లపై లేదా మర్చంట్ ఆఫ్ రికార్డ్‌గా Managed Markets సెట్ చేయబడిన ఆర్డర్‌లపై మీరు DDU షిప్పింగ్ లేబుల్స్‌ను కొనుగోలు చేయలేరు. ఇందులో $0.00 మొత్తానికి సంబంధించిన సుంకాలు కూడా కలిసి ఉంటాయి.
  • సుంకాల లెక్కింపును ఖచ్చితంగా ఉంచడానికి, కింది రకాల ఆర్డర్‌ల కోసం మీరు షిప్పింగ్ దేశం, రాష్ట్రం లేదా ప్రావిన్స్‌ను ఎడిట్ చేయలేరు:
    • ప్రీపెయిడ్ సుంకాల ఆర్డర్‌లు
    • కెనడా, യുనైటెడ్ స్టేట్స్ లేదా బ్రెజిల్‌కు రవాణా అయ్యే ఆర్డర్‌లు
  • అంతర్జాతీయ షిప్‌మెంట్‌ల కోసం డిక్లేర్ చేసిన గరిష్ట విలువ $25,000 USD.

ఉత్పత్తి మరియు కస్టమర్ సమాచారం

  • కస్టమ్ లైన్ ఐటెమ్‌లకు Managed Marketsతో మద్దతు లేదు. కస్టమ్ లైన్ ఐటెమ్‌లను రవాణా చేయడానికి, మీరు డ్రాఫ్ట్ ఆర్డర్‌ను సృష్టించాలి అలాగే ఆర్డర్‌పై మర్చంట్ ఆఫ్ రికార్డ్‌ను Managed Markets నుండి మీకు మార్చాలి.
  • కస్టమర్ షిప్పింగ్ వివరాలలో కస్టమర్ మొదటి పేరు లేదా చివరి పేరు సింగిల్ లెటర్‌లో ఉండకూడదు. ఉదాహరణకు, J Doe మరియు John D రెండూ చెల్లని కస్టమర్ పేరు ఫార్మాట్‌లు.
  • ఉచిత ఐటెమ్‌లను కలిగి ఉన్న ఆర్డర్‌లు ఏవైనా ఉచిత ఐటెమ్‌ల కోసం కమర్షియల్ ఇన్‌వాయిస్‌లలో $1.00 USD విలువను డిస్‌ప్లే చేస్తాయి. దీని అర్థం షిప్‌మెంట్ విజయవంతంగా కస్టమ్స్‌ను దాటుతుందని గ్యారెంటీ కాదు, అలాగే ఉచిత ఐటెమ్ విలువను మాన్యువల్‌గా డిక్లేర్ చేయడానికి ఎలాంటి మార్గం లేదు.

షిప్పింగ్ లేబుల్ మరియు ఆర్డర్ పరిమితులు

  • ఒకే ఉత్పత్తిని బహుళ షిప్‌మెంట్‌లుగా విభజించడానికి Managed Markets మద్దతు ఇవ్వదు. ప్రతి ఆర్డర్ కోసం ఒక్కో ఉత్పత్తికి మొత్తంగా 1 షిప్పింగ్ లేబుల్‌ను కొనుగోలు చేయవచ్చు.
  • షిప్పింగ్ క్యారియర్‌లు ప్రతి ప్యాకేజీ బరువును ఖచ్చితంగా తూకం వేసేలా వారిని ప్రాంప్ట్ చేయడానికి, Managed Markets షిప్పింగ్ లేబుల్స్ అన్ని లేబుల్స్‌కు 1 పౌండ్ బరువును చూపిస్తాయి. ఇది Managed Markets లేబుల్స్ బిల్లింగ్‌ను మార్చదు. లేబుల్‌ను క్రియేట్ చేసే సమయంలో మీరు లేదా మీ లాజిస్టిక్స్ భాగస్వామి డిక్లేర్ చేసిన బరువు మీ ప్రాథమిక లేబుల్ అంచనా కోసం ఉపయోగించబడుతుంది, అలాగే క్యారియర్ లేబుల్ ఇన్‌వాయిస్‌తో లేబుల్ అంచనాను సరిపోల్చే ఉద్దేశ్యం కోసం లేబుల్ బార్‌కోడ్‌లో స్టోర్ చేయబడుతుంది.
  • లేబుల్‌ను కొనుగోలు చేసిన తర్వాత Managed Markets ఆర్డర్‌లను ఎడిట్ చేయలేరు.
  • ప్రతి షిప్‌మెంట్ కోసం తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన షిప్పింగ్ లేబుల్ మరియు ట్రాకింగ్ నంబర్ ఉండాలి. ఒకదానికొకటి కట్టబడిన బహుళ ప్యాకేజీలకు ఒకే షిప్పింగ్ లేబుల్‌ను ఉపయోగించడం నిషేధించబడింది.

ఆటోమేటెడ్ చిరునామా సవరణ

షిప్పింగ్ చిరునామా చెల్లుబాటవుతుందో, లేదో అని నిర్ధారించుకోవడానికి, డిఫాల్ట్‌గా Managed Markets ఆర్డర్‌లు రివ్యూ చేయబడతాయి. ఒకవేళ ఆ చిరునామాలో ఎర్రర్‌లు ఉన్నట్లు అనిపిస్తే, చిరునామా ఆటోమేటిక్‌గా సవరించబడుతుంది.

ఆర్డర్ సృష్టించబడిన తర్వాత, ఆర్డర్ చిరునామా ఖచ్చితత్వం కోసం తనిఖీ చేయబడుతున్నందున, దీనికి కాసేపు హోల్డ్‌లో స్టేటస్ కేటాయించబడుతుంది. చిరునామా ఖచ్చితత్వం వెరిఫై అయిన వెంటనే, ఆర్డర్ నెరవేర్చబడనిదిగా సెట్ చేయబడుతుంది, అలాగే ఆ చిరునామా చెల్లుబాటు అయ్యేదిగా మార్క్ చేయబడినట్లు సూచించేలా ఆర్డర్ టైమ్‌లైన్‌లో ఒక ఎంట్రీ సృష్టించబడుతుంది. ఒకవేళ మీరు హోల్డ్‌ను వెంటనే తీసివేయాలనుకుంటే, ఆర్డర్ పేజీలో హోల్డ్‌లను రిలీజ్ చేయండిపై క్లిక్ చేయండి.

ఒకవేళ చిరునామా ఖచ్చితమైనది కాదని తేలితే, చిరునామా అప్‌డేట్ అయ్యేంత వరకు ఆర్డర్ హోల్డ్‌లో ఉంటుంది. ఈ ప్రాసెస్‌కు ఒక పనిదినం వరకు పడుతుంది. చిరునామా సవరించబడిన తర్వాత, ఆర్డర్ unfulfilledగా సెట్ చేయబడుతుంది, మరియు షిప్పింగ్ చిరునామాలో చేయబడిన మార్పులను సూచిస్తూ ఆర్డర్ టైమ్‌లైన్‌లో ఒక ఎంట్రీ సృష్టించబడుతుంది.

రివ్యూ చేసిన తర్వాత కూడా సరైన చిరునామాను కనుగొనలేకపోతే, ఆర్డర్ unfulfilledగా సెట్ చేయబడుతుంది, మరియు ఆర్డర్ పేజీలోని కస్టమర్ విభాగంలో ఎర్రర్ నోటిఫికేషన్ చూపబడుతుంది. మరిన్ని చిరునామా ఆప్షన్‌ల కోసం, ఎర్రర్ నోటిఫికేషన్‌పై ఉన్న రివ్యూ బటన్‌ను క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు చిరునామాను మాన్యువల్‌గా అప్‌డేట్ చేయవచ్చు, చిరునామాను నిర్ధారించడానికి మీ కస్టమర్‌ను సంప్రదించవచ్చు లేదా షిప్పింగ్ చిరునామాను రివ్యూ చేయడానికి అడ్రస్ చెకర్‌ను ఉపయోగించవచ్చు.

మీ Shopify అడ్మిన్‌లో ఆటోమేటెడ్ చిరునామా సవరణ నుండి మీరు ఆప్ట్ అవుట్ చేయవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, మార్కెట్‌లుకు వెళ్లండి.

  2. Managed Marketsను క్లిక్ చేయండి.

  3. చెల్లని షిప్పింగ్ చిరునామాలను సవరించడానికి Managed Marketsను అనుమతించండిని ఆఫ్ మోడ్‌కు టోగుల్ చేయండి.

ఆటోమేటెడ్ చిరునామా సవరణను ఆఫ్ చేసిన తర్వాత, మీ ఆర్డర్‌ల ఖచ్చితత్వం కోసం ఇకపై రివ్యూ చేయబడదు లేదా సవరించబడదు.

Managed Markets ఆర్డర్‌లను ఎడిట్ చేయండి

నెరవేర్చబడని లేదా పాక్షికంగా నెరవేర్చబడిన, మరియు షిప్పింగ్ లేబుల్ కొనుగోలు చేయబడని Managed Markets ఆర్డర్‌లను మీరు ఎడిట్ చేయవచ్చు. Managed Markets ఆర్డర్‌లను ఎడిట్ చేయడానికి కింది అంశాలను రివ్యూ చేయండి:

  • మీ స్టోర్‌లో Managed Markets డీయాక్టివేట్ చేయబడి ఉంటే, Managed Markets ఆర్డర్‌లు ఎడిట్ చేయబడవు.
  • షిప్పింగ్ చిరునామాలను వేరొక దేశం, ప్రావిన్స్ లేదా రాష్ట్రానికి మార్చలేము.
  • మీరు Managed Markets ఆర్డర్ కోసం ఫుల్‌ఫిల్‌మెంట్‌ను రద్దు చేయలేరు.
  • మీరు Managed Markets ఆర్డర్ కోసం షిప్పింగ్ రుసుమును ఎడిట్ చేయలేరు.
  • మీరు Managed Markets ఆర్డర్‌కు కస్టమ్ ఐటెమ్‌లను జోడించలేరు.
  • మీరు Managed Markets ఆర్డర్ కోసం ఉపయోగించే షిప్పింగ్ సేవను మార్చలేరు.
  • మీరు Managed Markets ఆర్డర్ కోసం మర్చంట్ ఆఫ్ రికార్డ్‌ను మార్చలేరు.

దశలు

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లుకు వెళ్లండి.

  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ఆర్డర్‌ను క్లిక్ చేయండి.

  3. మీ ఆర్డర్‌ను ఎడిట్ చేయండి.

మీరు ఆర్డర్‌ను ఎడిట్ చేసిన తర్వాత, మీరు అప్‌డేట్ చేయబడిన ఆర్డర్ మొత్తాన్ని రివ్యూ చేయాలి మరియు అది ఖచ్చితమైనదేనా అని ధృవీకరించుకోవాలి. ఆర్డర్‌ను అప్‌డేట్ చేసే వరకు సుంకాలు మరియు పన్నులు మళ్లీ లెక్కించబడవు, మరియు వాటి పక్కన (original) అని చూపబడుతుంది. మీరు అప్‌డేట్ చేసిన ఆర్డర్‌ను రివ్యూ చేసిన తర్వాత, సుంకాలు మరియు పన్నును మళ్లీ లెక్కించడానికి అప్‌డేట్‌ను క్లిక్ చేయండి. ఆర్డర్ అప్‌డేట్ చేయబడిన తర్వాత, అవసరాన్ని బట్టి మీరు మీ కస్టమర్‌కు ఇన్‌వాయిస్‌ను పంపవచ్చు, చెల్లింపును అంగీకరించవచ్చు, లేదా రీఫండ్‌ను జారీ చేయవచ్చు.

మీ Shopify అడ్మిన్‌లో నేరుగా ఆర్డర్‌లను నెరవేర్చడం

షిప్పింగ్ లేబుల్‌లను విడివిడిగా లేదా బల్క్‌గా కొనుగోలు చేయడం ద్వారా మీ Shopify అడ్మిన్‌లో నేరుగా మీ Managed Markets ఆర్డర్‌లను మీరు నెరవేర్చవచ్చు.

షిప్పింగ్ లేబుల్‌లను విడివిడిగా కొనుగోలు చేయండి మరియు ప్రింట్ చేయండి

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లుకు వెళ్లండి.

  2. నెరవేర్చబడని ఐటెమ్‌లు ఉన్న ఆర్డర్‌ను క్లిక్ చేయండి.

  3. Unfulfilled విభాగంలో, షిప్పింగ్ లేబుల్‌ను సృష్టించండిని క్లిక్ చేయండి.

  4. ఐటెమ్‌లు విభాగంలో, మీరు ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌లో చేర్చాలనుకుంటున్న ఐటెమ్‌ల సంఖ్యను నిర్ధారించండి. మీరు ఒకటి కంటే ఎక్కువ ఫుల్‌ఫిల్‌మెంట్‌లను ఉపయోగించి కస్టమర్ ఆర్డర్‌ను రవాణా చేయాలనుకుంటే, ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌లో రవాణా చేయకూడదనుకునే ప్రతి ఐటెమ్ పరిమాణాన్ని మార్చండి. మొత్తం ఆర్డర్‌ను పూర్తి చేయడానికి అవసరమయ్యే ప్రతి ఫుల్‌ఫిల్‌మెంట్‌కు మీరు అదనపు షిప్పింగ్ లేబుల్‌ను కొనుగోలు చేయవచ్చు.

  5. కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్‌ను రివ్యూ చేసి, మిస్ అయిన సమాచారం ఏదైనా ఉంటే జోడించండి:

    1. ఐటెమ్‌లు విభాగంలో, కస్టమ్స్ సమాచారాన్ని ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
    2. బరువు, పరిమాణం, విలువ మరియు వివరణ లాంటి మీ ఉత్పత్తి సమాచారాన్ని ధృవీకరించండి.
    3. సేవ్ క్లిక్ చేయండి.
  6. ప్యాకేజీ విభాగంలో, ఇప్పటికే ఉన్న ప్యాకేజీని ఎంచుకోండి లేదా కొత్త ప్యాకేజీని సృష్టించండి:

    • ఇప్పటికే ఉన్న ప్యాకేజీని ఉపయోగించడానికి, ప్యాకేజీ డ్రాప్-డౌన్ మెను నుండి ప్యాకేజీని ఎంచుకోండి.
    • కొత్త ప్యాకేజీని సృష్టించడానికి, ఈ దశలను అనుసరించండి:
      1. ప్యాకేజీ విభాగంలో, ప్యాకేజీని జోడించండిని క్లిక్ చేయండి.
      2. ప్యాకేజీని జోడించండి డైలాగ్‌లో, మీ కొత్త ప్యాకేజీకి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి.
      3. ప్యాకేజీని జోడించండిని క్లిక్ చేయండి.
  7. మొత్తం బరువు (ప్యాకేజీతో సహా) ఫీల్డ్‌లో, మీ షిప్‌మెంట్ మొత్తం బరువును నమోదు చేయండి.

  8. షిప్పింగ్ తేదీ ఫీల్డ్‌లో, షిప్పింగ్ తేదీని ఎంచుకోండి. ఆ తేదీన మీ కస్టమర్‌లకు షిప్‌మెంట్ వివరాలను ఆటోమేటిక్‌గా పంపాలనుకుంటే, అప్పుడు కస్టమర్‌లకు షిప్పింగ్ సమాచారాన్ని పంపండి ఎంచుకోండి.

  9. సారాంశం విభాగంలో మీ షిప్పింగ్ వివరాలను రివ్యూ చేసి, ఆ తర్వాత షిప్పింగ్ లేబుల్‌ను కొనుగోలు చేయండిని క్లిక్ చేయండి.

  10. మీ షిప్పింగ్ లేబుల్‌లను ఏవైనా కస్టమ్స్ ఫారమ్‌లు లేదా ప్యాకింగ్ స్లిప్‌లతో కలపాలా వద్దా అనేది నిర్ణయించుకుని, ఆ తర్వాత మీ ప్రింటింగ్ పేపర్ ఫార్మాట్‌ను ఎంచుకోండి.

  11. మీ షిప్పింగ్ లేబుల్‌లు మరియు డాక్యుమెంట్‌లను ప్రింట్ చేయండి.

షిప్పింగ్ లేబుల్‌లను బల్క్‌లో కొనుగోలు చేయండి మరియు ప్రింట్ చేయండి

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లుకు వెళ్లండి.

  2. ఆప్షనల్: నెరవేర్చాల్సిన ఆర్డర్‌లను మాత్రమే చూడటానికి, Unfulfilled ట్యాబ్‌ను క్లిక్ చేయండి.

  3. మీరు దేనికైతే షిప్పింగ్ లేబుల్‌ను సృష్టించాలనుకుంటున్నారో ఆ ఆర్డర్ పక్కన ఉన్న చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి.

  4. షిప్పింగ్ లేబుల్‌లను సృష్టించండిని క్లిక్ చేయండి. మీరు బహుళ స్థానాల నుండి ఫుల్‌ఫిల్ చేస్తే, తగిన లొకేషన్‌ను ఎంచుకుని, ఆపై కొనసాగించండిని క్లిక్ చేయండి.

  5. కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్‌ను రివ్యూ చేసి, మిస్ అయిన సమాచారం ఏదైనా ఉంటే జోడించండి:

    1. ఆర్డర్ కోసం ఐటెమ్‌లు ఫీల్డ్‌ను క్లిక్ చేయండి.
    2. కస్టమ్స్ డిక్లరేషన్‌ను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
    3. ప్రతి ఉత్పత్తికి, ఉత్పత్తి బరువు, పరిమాణం, విలువ మరియు వివరణను ధృవీకరించండి.
    4. ఆప్షనల్: ఉత్పత్తి వివరాలకు షిప్పింగ్ సమాచారాన్ని సేవ్ చేయండిని ఎంచుకోండి.
    5. కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్‌ను అప్‌డేట్ చేయండి కింద, బహుళ ఆర్డర్‌లను లేదా కేవలం ఈ ఆర్డర్‌ను అప్‌డేట్ చేయడానికి ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి.
    6. సేవ్ క్లిక్ చేయండి.
  6. షిప్పింగ్ లేబుల్‌లను సృష్టించండి పేజీలో, మీ లేబుల్‌లకు ఏవైనా మార్పులు చేయండి.

  7. రివ్యూ చేయండి మరియు కొనుగోలు చేయండిని క్లిక్ చేయండి.

  8. ఆప్షనల్: షిప్పింగ్ తేదీని మార్చండి.

  9. ఆప్షనల్: ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఇమెయిల్ మీ కస్టమర్‌లకు పంపబడుతుందో లేదో దాన్ని మార్చండి.

  10. షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేయండిని క్లిక్ చేయండి.

  11. కస్టమ్స్ ఫారమ్‌లు మరియు ప్యాకింగ్ స్లిప్‌లతో మీ షిప్పింగ్ లేబుల్‌లను కలపాలా వద్దా అని నిర్ణయించుకుని, ఆ తర్వాత మీ ప్రింటింగ్ పేపర్ ఫార్మాట్‌ను ఎంచుకోండి.

  12. మీ షిప్పింగ్ లేబుల్‌లు మరియు డాక్యుమెంట్‌లను ప్రింట్ చేయండి.

బాహ్య ఫుల్‌ఫిల్‌మెంట్ సేవలను ఉపయోగించి ఆర్డర్‌లను నెరవేర్చడం

Managed Markets ఆర్డర్‌లను కింది అనుకూల ఫుల్‌ఫిల్‌మెంట్ సేవల ద్వారా నెరవేర్చవచ్చు:

ఇంటిగ్రేషన్‌ను పూర్తి చేయడానికి, మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవకు చెందిన ఇంటిగ్రేషన్ డాక్యుమెంటేషన్‌ను చూడండి. మీరు మీ Managed Markets globally unique identifier (GUID)ని మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవతో కూడా షేర్ చేయాల్సి ఉంటుంది.

బాహ్య ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ నుండి ఇప్పటికే ఉన్న షిప్పింగ్ లేబుల్‌ను మీరు రద్దు చేయాల్సి వచ్చి, కొత్తది జారీ చేయబడాలంటే, లేబుల్‌ను రద్దు చేయండి ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆపై కొత్త లేబుల్‌ను కొనుగోలు చేయండి. షిప్పింగ్ క్యారియర్ స్కాన్ చేసిన లేబుల్‌కు మాత్రమే మీకు ఛార్జ్ చేయబడుతుంది.

బాహ్య ఫుల్‌ఫిల్‌మెంట్ సేవను ఉపయోగించడం వలన అదనపు రుసుములు పడవచ్చు. మీ సేవ అదనపు రుసుములను విధిస్తుందో లేదో మీకు కచ్చితంగా తెలియకపోతే, సమాచారం కోసం మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవను సంప్రదించండి.

మీరు ఈ లిస్ట్‌లో లేని ఫుల్‌ఫిల్‌మెంట్ సేవను ఉపయోగిస్తూ, వెంటనే ప్రారంభించాలనుకుంటే, మీరు లేదా మీ ఫుల్‌ఫిల్‌మెంట్ భాగస్వామి షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేసి, మీ Shopify అడ్మిన్ ద్వారా Managed Markets ఆర్డర్‌లను నెరవేర్చాలి. ప్రత్యామ్నాయంగా, Managed Markets లేబుల్‌లను కొనుగోలు చేయడానికి మీ ఫుల్‌ఫిల్‌మెంట్ భాగస్వామి నేరుగా Shopifyతో ఇంటిగ్రేట్ అవ్వవచ్చు.

బాహ్య ఫుల్‌ఫిల్‌మెంట్ సేవలను ఉపయోగించడం కోసం పరిగణించాల్సినవి

  • బాహ్య ఫుల్‌ఫిల్‌మెంట్ సేవల ద్వారా ఏ డెలివరీ పద్ధతులు అందుబాటులో ఉంటాయో Shopify నియంత్రించలేదు.

  • మీ లేబుళ్లపై రద్దీ సీజన్ అదనపు ఛార్జీలు మాఫీ కావాలంటే, మీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ Managed Marketsకు అనుకూలంగా ఉండాలి. Managed Marketsతో ఆ సేవ అనుసంధానం కూడా పూర్తయి ఉండాలి.

  • మీ షిప్పింగ్ సెట్టింగ్‌లను ఇంకా అప్‌డేట్ చేయనందున మీరు అనుకూలీకరించిన ఫ్లాట్ రేట్‌లను ఉపయోగిస్తుంటే, అది అందించే ఫీచర్‌ల ప్రయోజనాన్ని పొందడానికి దాన్ని అప్‌డేట్ చేయడాన్ని పరిగణించండి.

  • మీరు Shopify అడ్మిన్ వెలుపల షిప్పింగ్ లేబుల్‌ను ప్రింట్ చేస్తే, కస్టమర్ చెక్‌అవుట్ వద్ద ఎంచుకునేది ఏదైనా సరే లేబుల్‌గా బాహ్య ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రొవైడర్‌కు పంపబడుతుంది. బాహ్య ప్రొవైడర్ Managed Markets షిప్పింగ్ సేవల నుండి ఎంచుకోలేరు కాబట్టి, చెక్‌అవుట్ వద్ద ఎంచుకున్న రేట్‌లపై ఆధారపడి బాహ్య ప్రొవైడర్‌కు ఏది పంపబడుతుందో నిర్ణయించబడుతుంది. క్యారియర్ లెక్కించిన రేట్‌లు, చెక్‌అవుట్ వద్ద ఎంచుకున్న మెయిల్ తరగతిగా పంపబడతాయి. చెక్‌అవుట్ వద్ద ఎంచుకున్న దాన్ని బట్టి ఫ్లాట్ రేట్‌లు వేర్వేరుగా పంపబడతాయి:

    • Economy International: DHL eCommerce.
    • Standard International: మీ క్యారియర్ ప్రాధాన్యతను బట్టి FedEx లేదా UPS. క్యారియర్ ప్రాధాన్యత ఏదీ సెట్ చేయకపోతే, అప్పుడు Standard International ఫ్లాట్ రేట్‌లు డిఫాల్ట్‌గా FedEx ఫుల్‌ఫిల్‌మెంట్‌కు సెట్ చేయబడతాయి.
    • Express International: DHL Express.
    • అనుకూలీకరించిన ఫ్లాట్ రేటు: FedEx.
  • మీరు ఫుల్‌ఫిల్‌మెంట్ సేవ అయినా లేదా ఈ లిస్ట్‌లో లేని ఫుల్‌ఫిల్‌మెంట్ సేవను ఉపయోగించే వ్యాపారి అయినా, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.

హోల్డ్‌లో ఉన్న ఆర్డర్‌లు

Managed Markets ఆర్డర్‌లు హోల్డ్‌లో ఉంచబడతాయి, అలాగే హోల్డ్‌ను తీసివేసే వరకు వాటిని నెరవేర్చలేరు. ఆర్డర్ హోల్డ్‌లో ఉన్న సమయంలో, Managed Markets మీ ఆర్డర్‌కు సంబంధించిన మోసాల విశ్లేషణను నిర్వహిస్తుంది, మీ కస్టమర్ ఇమెయిల్ మరియు ఫోన్ నంబర్ లాంటి మీ ఆర్డర్ సమాచారాన్ని తనిఖీ చేస్తుంది, ఇంకా వర్తించే ఏవైనా సుంకాలు, అలాగే దిగుమతి పన్నులు సేకరించబడ్డాయని నిర్ధారిస్తుంది.

ఆర్డర్ హోల్డ్ సాధారణంగా ఐదు నిమిషాల్లో తీసివేయబడుతుంది. కొన్ని సందర్భాల్లో, అదనపు ఆర్డర్ స్క్రీనింగ్ కోసం Managed Markets మీ ఆర్డర్‌ను మరింత ఎక్కువ సమయం పాటు హోల్డ్‌లో ఉంచవచ్చు.

ఆర్డర్ హోల్డ్ తీసివేసిన తర్వాత, మీ ఆర్డర్ చెల్లింపు ఆటోమేటిక్‌గా క్యాప్చర్ చేయబడుతుంది లేదా మీ చెల్లింపు క్యాప్చర్ పద్ధతిపై ఆధారపడి మీరు దాన్ని మాన్యువల్‌గా క్యాప్చర్ చేయవచ్చు.

Managed Markets డ్రాఫ్ట్ ఆర్డర్‌లను నిర్వహించడం

మీరు డ్రాఫ్ట్ ఆర్డర్‌ను సృష్టించి, Managed Markets ద్వారా నిర్వహించబడే మార్కెట్‌కు చెందిన షిప్పింగ్ చిరునామా ఉన్న కస్టమర్‌ను జోడించినప్పుడు, మీ డ్రాఫ్ట్ ఆర్డర్ కోసం Managed Markets మర్చంట్ ఆఫ్ రికార్డ్ ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది.

మీ డ్రాఫ్ట్ ఆర్డర్‌కు Managed Markets షిప్పింగ్ సేవను కేటాయించడం ముఖ్యం. మీరు Managed Markets షిప్పింగ్ పద్ధతిని కేటాయించడంలో విఫలమైతే, సుంకాలు లెక్కించబడవు, అలాగే మర్చంట్ ఆఫ్ రికార్డ్‌గా Managed Markets కేటాయించబడదు.

మీరు కస్టమర్‌ను జోడించకుండా, కేవలం Managed Markets ద్వారా నిర్వహించబడే మార్కెట్‌ను ఎంచుకున్నప్పటికీ, మీ డ్రాఫ్ట్ ఆర్డర్ కోసం Managed Markets మర్చంట్ ఆఫ్ రికార్డ్ ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది.

Managed Markets ద్వారా నిర్వహించబడే డ్రాఫ్ట్ ఆర్డర్‌లకు కింది అంశాలు వర్తిస్తాయి:

మీ అంతర్జాతీయ డ్రాఫ్ట్ ఆర్డర్ కోసం మర్చంట్ ఆఫ్ రికార్డ్‌ను మార్చండి

మీరు మీ అంతర్జాతీయ డ్రాఫ్ట్ ఆర్డర్ కోసం మర్చంట్ ఆఫ్ రికార్డ్‌ను మార్చవచ్చు. మీరు మర్చంట్ ఆఫ్ రికార్డ్‌ను Managed Markets నుండి మీ స్వంత దానికి మార్చినట్లయితే, అంతర్జాతీయ విక్రయాలకు సంబంధించిన ఆర్థిక, చట్టపరమైన సంక్లిష్టతలను నిర్వహించడానికి మీరే బాధ్యత వహించాలి.

మీరు ఎంచుకునే మర్చంట్ ఆఫ్ రికార్డ్‌పై ఆధారపడి, మీరు వేర్వేరు షిప్పింగ్ లేబుల్‌లకు యాక్సెస్ పొందుతారు:

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లు > డ్రాఫ్ట్‌లు విభాగానికి వెళ్లండి.

  2. మీరు దేనికైతే మర్చంట్ ఆఫ్ రికార్డ్‌ను మార్చాలనుకుంటున్నారో ఆ డ్రాఫ్ట్ ఆర్డర్‌పై క్లిక్ చేయండి.

  3. మార్కెట్ విభాగంలో, అడ్డంగా ఉన్న మెనూ గుర్తుపై క్లిక్ చేసి, ఆపై మర్చంట్ ఆఫ్ రికార్డ్‌ను మార్చండిపై క్లిక్ చేయండి.

  4. మీ ఆర్డర్‌ను నిర్వహించడానికి మీరు ఉపయోగించాలనుకుంటున్న మర్చంట్ ఆఫ్ రికార్డ్‌ను ఎంచుకోండి.

  5. సేవ్ క్లిక్ చేయండి.

Managed Markets ఆర్డర్‌లను రీఫండ్ చేయడం మరియు రిటర్న్ చేయడం

Managed Markets ఆర్డర్‌ల కోసం Global-e అనేది మర్చంట్ ఆఫ్ రికార్డ్ అయినప్పటికీ, మీరు రిటర్న్ అభ్యర్థనలను స్వీకరించే లేదా రీఫండ్‌లను జారీ చేసే విధానం దీని వల్ల మారదు. మీ ఇతర ఆర్డర్‌ల మాదిరిగానే, Managed Markets ఆర్డర్‌లకు సంబంధించిన రిటర్న్‌లు, అలాగే రీఫండ్‌లు మీ Shopify అడ్మిన్‌లో మీ ద్వారానే నిర్వహించబడతాయి. రిటర్న్‌లు మరియు రీఫండ్‌ల నిర్వహణ గురించి మరింత సమాచారం కోసం, రిటర్న్‌లు మరియు రీఫండ్‌లను సృష్టించడం సెక్షన్‌ను చూడండి.

30 రోజుల మారకపు రేటు గ్యారెంటీ

విదేశీ కరెన్సీలో చెల్లించిన Managed Markets ఆర్డర్‌లకు 30 రోజుల పాటు విదేశీ కరెన్సీ రేట్ లాక్ వర్తింపజేయబడుతుంది. మీ ఆర్డర్ చేసిన తర్వాత 30 రోజుల పాటు అదే కరెన్సీ మారకపు రేటు వర్తించేలా ఈ 30 రోజుల మారకపు రేటు గ్యారెంటీ నిర్ధారిస్తుంది, అలాగే కరెన్సీ విలువల హెచ్చుతగ్గుల వల్ల తలెత్తే ఎలాంటి నష్టాలనైనా నివారించడంలో మీకు సహాయపడుతుంది.

దీనర్థం, మీరు గత 30 రోజుల్లోపు ప్లేస్ చేసిన ఆర్డర్‌ను రీఫండ్ చేయాల్సి వస్తే, దానికి ఆర్డర్ ప్లేస్ చేసిన సమయంలో ఉన్న మారకపు రేటే వర్తిస్తుంది.

సుంకాలు, కస్టమ్స్, అలాగే వ్యాట్ (VAT)

Managed Markets ఆర్డర్‌ను నెరవేర్చిన తర్వాత, సుంకాలు, కస్టమ్స్ రుసుములు లేదా VATకు రీఫండ్‌లు ఇవ్వరు. ఫుల్‌ఫిల్‌మెంట్‌కు ముందే ఆర్డర్‌ను పూర్తిగా రద్దు చేసి రీఫండ్ ఇస్తే, తదుపరి పేఅవుట్ తేదీన సుంకాలు, కస్టమ్స్ రుసుముల మొత్తాలను మీకు రీఫండ్ చేస్తారు.

రిటర్న్‌లు

మీ ఇతర ఆర్డర్‌ల మాదిరిగానే, మీరు మీ Shopify అడ్మిన్‌లో Managed Markets ఆర్డర్‌ల కోసం రిటర్న్‌లను స్వీకరిస్తారు మరియు మేనేజ్ చేస్తారు:

  • మీరు సెల్ఫ్-సర్వ్ రిటర్న్‌లను ఉపయోగిస్తే, మీ కస్టమర్‌లు వారి అకౌంట్ లేదా ఆర్డర్ స్టేటస్ పేజీ నుండి రిటర్న్ కోసం అభ్యర్థించవచ్చు, ఆ అభ్యర్థన మీరు రివ్యూ చేయడానికి మరియు ఆమోదించడానికి మీ అడ్మిన్‌లో కనిపిస్తుంది.
  • మీరు మీ Shopify అడ్మిన్‌లో మాన్యువల్‌గా కూడా రిటర్న్‌ను సృష్టించవచ్చు.

మీరు థర్డ్-పార్టీ ప్రొవైడర్ లేదా క్యారియర్ నుండి Managed Markets ఆర్డర్‌ల కోసం రిటర్న్ లేబుల్‌ను కొనుగోలు చేయవచ్చు. Managed Markets ఆర్డర్‌లకు రిటర్న్ లేబుల్‌ల కోసం నిర్దిష్ట ఆవశ్యకతలు ఏవీ లేవు.

EU ఉపసంహరణ హక్కు

యూరోపియన్ యూనియన్ (EU)లోని కస్టమర్‌లకు ఉపసంహరణ హక్కు ఉంటుంది. ఆన్‌లైన్ కొనుగోలును స్వీకరించిన 14 రోజులలోపు రద్దు చేయడానికి కస్టమర్‌లకు మార్గాలను అందించడం అనేది ఈ హక్కు ద్వారా వ్యాపారులకు తప్పనిసరి. EU కస్టమర్‌లకు విక్రయించిన Managed Markets ఆర్డర్‌ల కోసం, ఈ ఉపసంహరణ అభ్యర్థనలను మీరు మీ Shopify అడ్మిన్‌లో స్వీకరించి, మేనేజ్ చేస్తారు: ఇది ఇంకా షిప్ చేయని ఐటెమ్‌ల రద్దుగా లేదా డెలివరీ చేయబడిన ఐటెమ్‌ల రిటర్న్‌గా లేదా ఏదైనా ఇతర రద్దు లేదా రిటర్న్ మాదిరిగానే ఉంటుంది.

EU ఉపసంహరణ హక్కు మరియు 19 జూన్ 2026 నుండి అమల్లోకి వచ్చిన ఎలక్ట్రానిక్ ఉపసంహరణ ఫంక్షన్ ఆవశ్యకత గురించి తెలుసుకోవడానికి, EU ఉపసంహరణ హక్కు సమ్మతిని చూడండి. EU కోసం రిటర్న్ మరియు రద్దు నియమాలను సెటప్ చేయడానికి, EU ఉపసంహరణ హక్కు ఆవశ్యకతలను అందుకోవడంను చూడండి.

మార్పిడులు

ఉత్పత్తి మార్పిడి అనేది కస్టమ్స్ ద్వారా వెళ్లాల్సిన కొత్త Managed Markets ఆర్డర్‌గా పరిగణించబడుతుంది. మీరు లేదా మీ కస్టమర్ రెండవసారి సుంకాలు మరియు పన్నులను చెల్లించాల్సి ఉంటుంది.

Managed Marketsతో B2B ఆర్డర్‌లు

Managed Markets ద్వారా B2B ఆర్డర్‌లకు సపోర్ట్ లేదు. Managed Markets ద్వారా నిర్వహించబడే దేశాలు లేదా ప్రాంతాలకు మీరు B2B ఆర్డర్‌లను చేసినప్పుడు, ఆ ఆర్డర్‌ల కోసం మీరు మీ స్వంత మర్చంట్ ఆఫ్ రికార్డ్‌గా ఉండాలి. మీరు B2B ఆర్డర్‌లను డ్రాఫ్ట్ ఆర్డర్‌లుగా ప్రాసెస్ చేయవచ్చు.

మీరు Shopify B2B ఉపయోగిస్తుంటే మరియు మీ కస్టమర్ వారి కంపెనీ అకౌంట్‌కు లాగిన్ చేసి ఉంటే, మర్చంట్ ఆఫ్ రికార్డ్ అనేది ఆటోమేటిక్‌గా Managed Markets నుండి మీ స్వంత మర్చంట్ ఆఫ్ రికార్డ్‌కు మార్చబడుతుంది. మీరు B2B ఆర్డర్‌లను డ్రాఫ్ట్ ఆర్డర్‌లుగా కూడా ప్రాసెస్ చేయవచ్చు.

కొన్ని గమ్యస్థాన దేశాలలో, ఆర్డర్‌లో ఎక్కువ పరిమాణంలో ఐటెమ్‌లు ఉన్నప్పుడు లేదా ఆర్డర్ మొత్తం విలువ ఎక్కువగా ఉన్నప్పుడు సంభావ్య B2B ఆర్డర్‌గా పరిగణించబడవచ్చు. కస్టమ్స్ అధికారులు ఆర్డర్‌ను B2Bగా పరిగణిస్తే, అదనపు సమాచారం లేదా ఖర్చులు వర్తించవచ్చు, అవి Managed Markets నియంత్రణలో ఉండవు. ఈ పరిస్థితుల్లో క్యారియర్ మరియు కస్టమ్స్ అధికారుల నిర్ణయాలపై ప్రభావాన్ని Shopify మరియు Managed Markets గ్యారంటీ ఇవ్వలేవు.

Managed Marketsతో ఉచిత ఆర్డర్‌లు

Managed Markets ద్వారా ఉచిత ఆర్డర్‌లకు సపోర్ట్ లేదు. Managed Markets ద్వారా నిర్వహించబడే దేశాలు లేదా ప్రాంతాలకు సున్నా డాలర్ల విలువతో మీరు ఆర్డర్‌ను సృష్టించినప్పుడు, మీరు ఆ ఆర్డర్‌లకు మీ స్వంత మర్చంట్ ఆఫ్ రికార్డ్‌గా ఉండాలి. చెక్‌అవుట్ వద్ద, ఈ ఆర్డర్‌లు స్టోర్‌ను ఆటోమేటిక్‌గా మర్చంట్ ఆఫ్ రికార్డ్‌గా కలిగి ఉంటాయి.