Managed Marketsలో నిషేధిత మరియు పరిమితం చేయబడిన ఐటెమ్‌లు

ఆ దేశంలోకి ఏ రకమైన వస్తువులను షిప్పింగ్ చేయవచ్చు అనే దానికి సంబంధించి ప్రతి దేశానికి సొంత పరిమితులు ఉంటాయి. షిప్పింగ్ క్యారియర్‌లు మరియు చెల్లింపు ప్రాసెసర్‌లకు కూడా సొంత పరిమితులు ఉంటాయి.

మీరు గమ్యస్థాన దేశంలో నిషేధించబడిన ఉత్పత్తిని విక్రయిస్తే, ఆ దేశంలోని కస్టమర్‌ల కోసం Managed Markets కేటలాగ్ నుండి ఆ ఉత్పత్తిని దాచుతుంది. మీ Shopify అడ్మిన్‌లో నిషేధిత ఉత్పత్తులను రివ్యూ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

కింది దేశాల ఆర్డర్‌లు గరిష్ఠంగా సూచించిన విలువ వరకే పరిమితం చేయబడ్డాయి:

  • అర్జెంటీనా: $1,000 USD
  • బ్రెజిల్: $2,999 USD
  • చైనా: ¥10,000 CNY
  • ఇండోనేషియా: $1,500 USD
  • మెక్సికో: $1,000 USD

మీ కేటలాగ్‌ ప్రధానంగా సపోర్ట్ చేయని ఐటెమ్‌లను విక్రయిస్తున్నట్లయితే, మీరు Managed Marketsను ఉపయోగించడానికి అనర్హులు కావచ్చు. మీరు Managed Marketsను ఉపయోగించడానికి ముందు, ఏయే ఉత్పత్తులు మరియు ఉత్పత్తి కేటగిరీలు పరిమితం చేయబడ్డాయో కింద రివ్యూ చేయండి. మీరు పరిమితం చేయబడిన ఐటెమ్‌లను కలిగి ఉన్న షిప్‌మెంట్‌ను పంపితే, మీ ప్యాకేజీ డెలివరీ చేయలేనిదిగా పరిగణించబడవచ్చు.

నిషేధించబడిన ఐటెమ్ కేటగిరీలు

నిషేధించబడిన ఐటెమ్‌ల గురించి మరింత సమాచారం కోసం కింది టేబుల్‌ను చూడండి.

Managed Markets కోసం నిషేధించబడిన ఐటెమ్ కేటగిరీల జాబితా
ఆల్కహాలిక్ పానీయాలు మరియు ఉత్పత్తులుజంతువులు, పెంపుడు జంతువులకు సంబంధించిన సామాగ్రిఆర్ట్‌వర్క్
ఆటోమోటివ్ మరియు పవర్‌స్పోర్ట్స్బ్యాటరీలు మరియు ఎలక్ట్రానిక్స్అందం మరియు సౌందర్య సాధనాలు
వ్యాపారం మరియు పారిశ్రామికంCBD ఉత్పత్తులుఛారిటీలు మరియు లాభాపేక్ష లేనివి
వినియోగదారు భద్రతడిజిటల్ ఉత్పత్తులు లేదా వస్తువులుమత్తుమందులు, మత్తుమందులకు సంబంధించిన సామగ్రి
పేలుడు పదార్థాలు, ఆయుధాలు మరియు సంబంధిత ఐటెమ్‌లుఎగుమతి ద్వారా నియంత్రించబడే ఐటెమ్‌లువ్యవసాయం
మండే మరియు పీడనానికి గురైన వస్తువులుఆహారం మరియు పానీయాలుతినదగినవి, వెల్‌నెస్, అలాగే వైద్య పరికరాలు
హోమ్ మరియు గార్డెన్ ఉత్పత్తులుమనిషి జుట్టునిష్క్రియ ఉత్పత్తులు
నగలు మరియు విలువైన రత్నాలుకత్తులుచట్టవిరుద్ధమైన చర్యలను వర్ణించే మెటీరియల్స్
చెల్లింపు కోసం ఉపయోగించే డబ్బు లేదా ద్రవ్య సంబంధిత ఐటెమ్‌లుమిస్టరీ ఐటెమ్‌లు లేదా సరిగ్గా వివరించని ఉత్పత్తులుతాకట్టు దుకాణాలు
మొక్క, చెక్క మరియు విత్తన ఉత్పత్తులుఅద్దె ఉత్పత్తులుసెక్స్, లైంగిక ఉత్పత్తులు
ప్రత్యేక దుస్తులుసబ్‌స్క్రిప్షన్ ఉత్పత్తులుపొగాకు మరియు పొగాకు సంబంధిత ఉత్పత్తులు
వారంటీలు, సర్వీస్ ప్లాన్‌లు, ఒప్పందాలు మరియు గ్యారెంటీలువాచీలు

ఆల్కహాలిక్ పానీయాలు మరియు ఉత్పత్తులు

మద్య పానీయాలు, స్పిరిట్స్, వెనిగర్ మరియు త్రాగునీరు, ఎరేటెడ్ లిక్విడ్స్, సోడా వంటి నాన్-ఆల్కహాలిక్ పానీయాల ఉత్పత్తులు నిషేధించబడ్డాయి. ఈ ఉత్పత్తులు లైసెన్సింగ్, వయస్సు ధృవీకరణ, పన్నులు, లేబులింగ్ మరియు దిగుమతి నియంత్రణలను కలిగి ఉండే నియంత్రణ ఆవశ్యకతలకు లోబడి ఉంటాయి. వీటికి Managed Markets మద్దతు ఇవ్వని ప్రత్యేకమైన సమ్మతి ప్రాసెస్‌లు కూడా అవసరం కావచ్చు.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • వైన్
  • స్పిరిట్స్
  • హార్డ్ లిక్కర్
  • వైన్-తయారీ కిట్‌లు
  • బాట్లింగ్ ఐటెమ్‌లు

జంతువులు, పెంపుడు జంతువులకు సంబంధించిన సామాగ్రి

కొన్ని జంతువులు, పెంపుడు జంతువులకు సంబంధించిన సామాగ్రి పరిమితం చేయబడింది.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • జంతువులు (సజీవ లేదా మరణించినవి)
  • పెంపుడు జంతువుల ఆహారం, ట్రీట్‌లు
  • పెంపుడు జంతువుల విటమిన్‌లు, సప్లిమెంట్‌లు

ఆర్ట్‌వర్క్

ఏదైనా కాపీరైట్ లేదా ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించే ఆర్ట్‌వర్క్ Managed Marketsలో పరిమితం చేయబడింది. డిజిటల్ ఆర్ట్‌వర్క్ మరియు $2,000 USD కంటే ఎక్కువ విలువైన ఆర్ట్ కూడా పరిమితం చేయబడింది.

ఆటోమోటివ్ మరియు పవర్‌స్పోర్ట్స్

ఆటోమోటివ్, పవర్‌స్పోర్ట్స్ ఉత్పత్తులు ప్రమాదకరమైన వస్తువులుగా పరిగణించబడతాయి, కాబట్టి వాటికి Managed Markets నుండి ముందస్తు ఆమోదం అవసరం.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • యాంప్లిఫైయర్‌లు
  • పార్కింగ్ కెమెరాలు
  • కార్పెట్ మరియు అప్‌హోల్స్టరీ
  • ఇంజన్ భాగాలు
  • రిమ్‌లు మరియు చక్రాలు
  • టైర్ యాక్సెసరీలు
  • కార్ వాష్ యాక్సెసరీలు
  • అలారాలు, లాక్‌లు
  • వాటర్‌క్రాఫ్ట్ భాగాలు, వాటి సంరక్షణ

బ్యాటరీలు మరియు ఎలక్ట్రానిక్స్

బ్యాటరీలను కలిగి ఉండే లేదా బ్యాటరీలు అటాచ్ చేసి ఉండే లేదా నేరుగా విద్యుత్ ప్రవాహానికి ప్లగ్ చేసే అన్ని బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, విద్యుత్ సంబంధిత ఐటెమ్‌లు పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఎలక్ట్రికల్ ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • వీడియో గేమ్ కన్సోల్‌లు
  • DVD, బ్లూ-రే ప్లేయర్‌లు
  • ప్రొజెక్టర్ స్క్రీన్‌లు, మౌంట్‌లు
  • కంప్యూటర్ మానిటర్‌లు
  • టెలివిజన్‌లు
  • GPS నావిగేషన్ సిస్టమ్‌లు, యాక్సెసరీలు
  • కీబోర్డ్‌లు, మౌస్‌లు మరియు ట్రాక్‌బాల్స్
  • కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు
  • ఎక్స్‌టెన్షన్ కార్డ్‌లు
  • సోలార్ ఎనర్జీ కిట్‌లు
  • ఎలక్ట్రికల్ మోటార్లు

అందం మరియు సౌందర్య సాధనాలు

సమ్మతి కారణాలు లేదా ప్రమాదకరమైన మెటీరియల్స్ కారణంగా కొన్ని సౌందర్య సాధనాలు, అందానికి సంబంధించిన ఐటెమ్‌లు పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • పెర్‌ఫ్యూమ్‌లు
  • కొలోన్
  • ఓ డి టాయిలెట్
  • ఆల్కహాల్‌ను కలిగి ఉండే ఫ్రాగ్రెన్స్ స్ప్రే
  • నెయిల్ పాలిష్
  • బ్లీచ్‌ను కలిగి ఉండే జుట్టుకు సంబంధించిన ఉత్పత్తులు
  • ఏరోసోల్స్
  • హ్యాండ్ శానిటైజర్
  • లాష్ అడెసివ్
  • ఇంట్లో తయారు చేసిన టాపికల్ ఐటెమ్‌లు
  • వైప్స్

కొన్ని బ్యూటీ, సౌందర్య సాధనాలు మరియు కేశ ఉత్పత్తులు నిర్దిష్ట ప్రాంతాలలో పరిమితం చేయబడ్డాయి. నిర్దిష్ట ప్రాంతాలలో (మెక్సికో, స్పెయిన్, ఇటలీ మరియు గ్రీస్ వంటివి) పరిమితం చేయబడే అవకాశం ఉన్న ఐటెమ్‌ల యొక్క కొన్ని ఉదాహరణలు కింది వాటిని కలిగి ఉంటాయి, అయితే వీటికి మాత్రమే పరిమితం కావు:

  • సబ్బులు
  • షాంపులు
  • లోషన్‌లు మరియు క్రీమ్‌లు
  • మాయిశ్చరైజర్

వ్యాపారం మరియు పరిశ్రమ

కొన్ని వ్యాపార మరియు పారిశ్రామిక ఉత్పత్తులు పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • వాణిజ్య ప్రదర్శన కౌంటర్‌లు/డిస్‌ప్లేలు
  • ఆటోమేషన్ కంట్రోల్ కాంపోనెంట్‌లు
  • ట్రాఫిక్ కోన్‌లు మరియు బారెల్స్
  • దంత వైద్య పరికరాలు
  • ఫుడ్ సర్వీస్ ఐటెమ్‌లు
  • భారీ యంత్రాలు
  • వెండింగ్ మెషీన్‌లు
  • సైనేజ్
  • ప్రయోగశాల పరికరాలు
  • పియర్సింగ్ మరియు టాటూయింగ్ సామాగ్రి
  • ప్లంబింగ్ సామాగ్రి

CBD ఉత్పత్తులు

ఏ రూపంలోనైనా కన్నబిడియోల్ (CBD) ఉన్న ఉత్పత్తులు పరిమితం చేయబడ్డాయి. గంజాయి మొక్కలలో కనిపించే అనేక కన్నబినాయిడ్‌లలో CBD ఒకటి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • తినదగినవి, క్యాప్సూల్స్ లేదా లాజెంజెస్
  • ఇ-లిక్విడ్‌లు
  • స్ప్రేలు
  • CBD, THC లేదా ఇతర కన్నబినాయిడ్‌లను కలిగి ఉండే నూనెలు

ఛారిటీలు మరియు లాభాపేక్షలేని సంస్థలు

ఛారిటీలు మరియు లాభాపేక్ష లేని సంస్థలకు ఇచ్చే విరాళాలు పరిమితం చేయబడ్డాయి.

వినియోగదారు భద్రత

Managed Markets‌లో కట్టుదిట్టంగా నియంత్రించబడే వస్తువులు మరియు ఆక్యుపేషనల్ భద్రతా పరికరాలు అన్ని ప్రాంతాలలోనూ పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • కార్ సీట్లు
  • పిల్లల కుర్చీలు
  • హెల్మెట్‌లు
  • స్ట్రోలర్‌లు
  • నిర్మాణ రంగంలో వాడే హార్డ్ హ్యాట్‌లు మరియు హార్నెస్‌లు

డిజిటల్ ఉత్పత్తులు లేదా వస్తువులు

Managed Markets‌లో డిజిటల్ ఉత్పత్తులను విక్రయించడం సాధ్యమవుతుంది, అయితే మీరు కింది నిర్దిష్ట ఆవశ్యకతలు మరియు పరిగణనలను రివ్యూ చేయవచ్చు:

  • ఆర్డర్ ఆవశ్యకతలు: ఒక ఆర్డర్ Managed Markets‌లో అర్హత పొందాలంటే, దానిలో తప్పనిసరిగా డిజిటల్ ఉత్పత్తి మరియు భౌతిక ఉత్పత్తి రెండూ ఉండాలి. మీ ఆర్డర్‌లో కేవలం డిజిటల్ ఉత్పత్తులు మాత్రమే ఉంటే, మీరు ఆటోమేటిక్‌గా ఆ ఆర్డర్‌కు మర్చంట్ ఆఫ్ రికార్డ్ అవుతారు.
  • డ్రాఫ్ట్ ఆర్డర్‌లు: డిజిటల్ ఉత్పత్తులను డ్రాఫ్ట్ ఆర్డర్‌లలో చేర్చడం సాధ్యపడదు. డిజిటల్ మరియు భౌతిక ఉత్పత్తులు రెండింటినీ చేర్చే ఆర్డర్‌ను సృష్టించడానికి, చెక్‌అవుట్ ప్రక్రియ సమయంలో చెల్లింపును వసూలు చేయడానికి మీరు తప్పనిసరిగా ఇన్‌వాయిస్‌ను పంపాలి.

Managed Markets‌లో విక్రయించగల డిజిటల్ ఉత్పత్తుల ఉదాహరణలలో కింది ఉత్పత్తులు ఉంటాయి, అయితే వీటికి మాత్రమే పరిమితం కావు:

  • డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌లు (మీ స్వంత స్టోర్ కోసం)
  • ఆన్‌లైన్ కోర్సులు
  • పాడ్‌కాస్ట్‌లు
  • సౌండ్ ఎఫెక్ట్‌లు మరియు మ్యూజిక్

మాదకద్రవ్యాలు మరియు సంబంధిత సామాగ్రి

Managed Markets‌లో మాదకద్రవ్యాలు మరియు డ్రగ్‌కి సంబంధించిన ఐటెమ్‌లు పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • మాదకద్రవ్యాలను సూచించే దుస్తులు
  • మాదకద్రవ్యాల సాగు లేదా వినియోగం గురించిన పుస్తకాలు
  • మాదకద్రవ్యాల సాగు లేదా వినియోగం కోసం ఉపయోగించే పరికరాలు
  • నియంత్రిత పదార్థాలను కలిగి ఉన్న ఉత్పత్తులు

పేలుడు పదార్థాలు, ఆయుధాలు మరియు సంబంధిత ఐటెమ్‌లు

Managed Markets‌లో పేలుడు పదార్థాలు, ఆయుధాలు మరియు సంబంధిత ఐటెమ్‌లు పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • తుపాకులు మరియు తుపాకీ విడిభాగాలు (ఎయిర్‌సాఫ్ట్ తుపాకులతో సహా)
  • కత్తులు (కత్తుల కోసం దేశ-స్థాయి పరిమితులను రివ్యూ చేయండి)
  • వ్యూహాత్మక కేటగిరీ కిందకు వచ్చే ఐటెమ్‌లు
  • ఆయుధ యాక్సెసరీలు మరియు సామగ్రి (మందుగుండు, కేస్‌లు, తొడుగులు, క్లీనింగ్ కిట్‌లు, లాక్‌లు, స్కోప్‌లు, అటాచ్‌మెంట్‌లు మరియు మాడిఫికేషన్‌లు)

ఎగుమతి నియంత్రిత ఐటెమ్‌లు

ఎగుమతి అడ్మినిస్ట్రేషన్ నిబంధనల (EAR)కు లోబడి ఉండే ఐటెమ్‌లు మరియు ద్వంద్వ-వినియోగం (వాటికి సైనిక మరియు పౌర ప్రయోజనాలు రెండూ ఉంటాయి) ఉన్నవిగా పరిగణించబడే ఐటెమ్‌లను EAR కింద యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ (DOC) నియంత్రించవచ్చు. ఎగుమతి లైసెన్స్ లేదా యునైటెడ్ స్టేట్స్ DOC నుండి మరొక ఆమోదం అవసరమైన ఐటెమ్‌లు Managed Markets‌లో విక్రయించబడకుండా పరిమితం చేయబడతాయి.

కొన్ని ఆయుధాలు రక్షణ సామాగ్రిగా పరిగణించబడతాయి మరియు అంతర్జాతీయ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ నిబంధనల (ITAR) కింద యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ద్వారా నియంత్రించబడతాయి. EAR లేదా ITAR కిందకు వచ్చే ఐటెమ్‌లు Managed Markets‌లో పరిమితం చేయబడ్డాయి.

వ్యవసాయం

వ్యవసాయంలో ఉపయోగించే ఐటెమ్‌లు లేదా యంత్రాలు అన్ని ప్రాంతాలలో పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • ట్రాక్టర్ విడిభాగాలు మరియు యాక్సెసరీలు
  • ట్రాక్టర్ టైర్‌లు
  • గుర్రపు దాణా
  • హార్స్ వార్మర్‌లు
  • లైవ్ ఫిషింగ్ బైట్
  • మల్టీఫంక్షనల్ టూల్స్

మండే స్వభావం మరియు ఒత్తిడితో కూడిన వస్తువులు

అడెసివ్‌లు మరియు ఏరోసోల్స్ వంటి మండే స్వభావం మరియు ఒత్తిడితో కూడిన ఐటెమ్‌లు Managed Markets‌లో పరిమితం చేయబడ్డాయి.

ఆహారం మరియు పానీయాలు

ఆహారం మరియు పానీయాలకు దిగుమతి చేసుకునే దేశంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేదా దానికి సమానమైన సంస్థ యొక్క అనుమతులు మరియు పరీక్షా ఆవశ్యకతలు వర్తిస్తాయి. ఈకామర్స్ యొక్క టైమ్-సెన్సిటివ్ స్వభావం కారణంగా, ఈ ఉత్పత్తులు పరిమితం చేయబడ్డాయి.

తినదగినవి, వెల్‌నెస్ మరియు వైద్య పరికరాలు

తినదగిన ఐటెమ్‌లు పరిమితం చేయబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ద్వారా వైద్య పరికరాలుగా వర్గీకరించబడిన ఐటెమ్‌లు పరిమితం చేయబడ్డాయి (మరింత సమాచారం కోసం, FDA వెబ్‌సైట్‌ను చూడండి). FDAలో రిజిస్టర్ చేయబడిన లేదా లేజర్‌లను ఉపయోగించే బ్యూటీ పరికరాలు, FDA లేదా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌కు సమానమైన పర్మిట్‌లు/లైసెన్స్‌లకు లోబడి పరిమితం చేయబడతాయి. ఏవైనా ఆరోగ్యం, వైద్య లేదా వెల్‌నెస్ క్లెయిమ్‌లను చేసే అన్ని ఐటెమ్‌లు అంతర్జాతీయంగా పరిమితం చేయబడతాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • కేవలం ప్రిస్క్రిప్షన్‌తో ఇచ్చే మందులు
  • ఓవర్-ది-కౌంటర్ (OTC) మందులు
  • లైసెన్స్ పొందిన ఫార్మసిస్ట్ మాత్రమే విక్రయించాల్సిన మందులు
  • విటమిన్‌లు, సప్లిమెంట్‌లు మరియు షేక్‌లతో సహా తినదగినవి
  • హెర్బల్ లేదా హోమియోపతిక్ ఉత్పత్తులు
  • లైసెన్స్ లేని మందులు మరియు వైద్యపరమైన లేదా ఆరోగ్య క్లెయిమ్‌లను చేసే ఉత్పత్తులు
  • HIV, డ్రగ్ లేదా గర్భ నిర్ధారణ పరీక్షలు వంటి వైద్య పరీక్షలు
  • వినికిడి యంత్రాలు
  • మెడికల్ అలారాలు
  • ప్రథమ చికిత్స కిట్‌లు
  • యాక్టివిటీ మానిటర్‌లు
  • గర్భనిరోధకాలు

ఇల్లు మరియు తోట ఉత్పత్తులు

కొన్ని ఇల్లు మరియు తోట ఐటెమ్‌లు Managed Marketsలో పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • కొవ్వొత్తులు
  • ఎసెన్షియల్ ఆయిల్స్ మరియు ఆయిల్ వార్మర్‌లు
  • అగరుబత్తీలు
  • కత్తులు (కత్తుల కోసం దేశ-స్థాయి పరిమితులను రివ్యూ చేయండి)
  • ఇసుక, మట్టి, ఎరువులు మరియు మల్చ్‌తో సహా ఆర్గానిక్ పదార్థాలు
  • ఇండోర్ మరియు అవుట్‌డోర్ మొక్కలు

మానవ కేశాలు

స్పెయిన్, ఇటలీ మరియు కోస్టారికా వంటి నిర్దిష్ట ప్రాంతాలలో, అసలైన మానవ కేశాలతో తయారు చేసిన విగ్‌లు, ఎక్స్‌టెన్షన్‌లు లేదా సారూప్య ఉత్పత్తులు పరిమితం చేయబడ్డాయి.

ఇన్‌యాక్టివ్ ఉత్పత్తులు

మీ Shopify స్టోర్‌ఫ్రంట్‌లో ఆర్కైవ్ చేయబడినవి, డ్రాఫ్ట్‌లో ఉన్నవి లేదా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నవి కావడం వల్ల విక్రయించదగినవి కాని ఐటెమ్‌లు, ఆటోమేటిక్‌గా ప్రతి ప్రాంతంలోనూ పరిమితం చేయబడతాయి. మీరు ఈ ఉత్పత్తులను యాక్టివ్ చేసిన తర్వాత, అవి రివ్యూ చేయబడతాయి.

ఉత్పత్తి స్టేటస్ గురించి మరింత తెలుసుకోండి.

ఆభరణాలు మరియు విలువైన రత్నాలు

విడి రాళ్లు (కట్ చేసినవి లేదా కట్ చేయనివి, పాలిష్ చేసినవి లేదా పాలిష్ చేయనివి), అలాగే మదర్ ఆఫ్ పెరల్, పగడం, ఇంకా గవ్వలతో చేసిన ఉపకరణాలు Managed Marketsలో నియంత్రించబడ్డాయి. క్యారియర్ ఆవశ్యకతల కారణంగా $10,000 USD కంటే ఎక్కువ విలువైన ఆభరణాలు నియంత్రించబడతాయి.

కింది దేశాలతో సహా ప్రాంతాల ఉపసమితిలో అన్ని ఇతర ఆభరణాలు పాక్షికంగా పరిమితం చేయబడ్డాయి:

  • బ్రెజిల్
  • ఫ్రాన్స్
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • కువైట్
  • మలేషియా
  • మెక్సికో
  • పోర్చుగల్
  • రష్యా
  • స్విట్జర్లాండ్

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లలో కింది ఆభరణాల ఐటెమ్‌లు చేరి ఉంటాయి, అయితే వీటికే పరిమితం కావు:

  • బ్రాస్‌లెట్‌లు
  • నెక్లెస్‌లు
  • పూత పూసిన ఆభరణాలు
  • లాపెల్ మరియు అలంకరణ పిన్‌లు

కత్తులు

రవాణా భద్రతా కారణాల దృష్ట్యా, క్యారియర్ మరియు దేశ దిగుమతి పరిమితుల ఆధారంగా అన్ని రకాల (వేట, వంట, కట్లరీ మరియు ఇతర ఉపయోగాలు) కత్తులపై వివిధ ఆంక్షలు ఉంటాయి. ఆటబొమ్మ కత్తులు కూడా పరిమితికి లోబడి ఉండవచ్చు. కింది దేశాలు మరియు ప్రాంతాలలో కత్తులు పరిమితం చేయబడ్డాయి:

  • ఆస్ట్రేలియా
  • బెలారస్
  • చైనా
  • డెన్మార్క్
  • ఎల్ సాల్వడార్
  • ఫారో ఐలాండ్స్
  • ఫిన్లాండ్
  • హంగేరి
  • ఐస్లాండ్
  • ఇజ్రాయెల్
  • జపాన్
  • కజకిస్థాన్
  • కెన్యా
  • లీచ్టెన్‌స్టెయిన్
  • లిథువేనియా
  • మడగాస్కర్
  • మలేషియా
  • మారిషస్
  • మెక్సికో
  • మొనాకో
  • న్యూజిలాండ్
  • సింగపూర్
  • దక్షిణ కొరియా
  • టర్కియే
  • ఉక్రెయిన్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • వెనిజులా

చట్టవిరుద్ధమైన చర్యలను వర్ణించే మెటీరియల్స్

మీరు నిర్వహించే దేశంలో లేదా మీరు విక్రయించే దేశాలలో, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను వర్ణించే లేదా సమర్థించే ఉత్పత్తులు Managed Marketsలో పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను వర్ణించే లేదా సమర్థించే మెటీరియల్స్ (నిజమైనవైనా లేదా కల్పితమైనవైనా)
  • హింసను లేదా దుర్వినియోగాన్ని వర్ణించే లేదా సమర్థించే మెటీరియల్స్ (నిజమైనవైనా లేదా కల్పితమైనవైనా)

చెల్లింపుగా ఉపయోగించే డబ్బు లేదా ద్రవ్య సంబంధిత ఐటెమ్‌లు

డబ్బు లేదా చెల్లింపుగా ఉపయోగించే ఏవైనా ఇతర ఐటెమ్‌లు పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • కరెన్సీ
  • నగదుకు సమానమైనవి
  • గిఫ్ట్ కార్డ్‌లు (థర్డ్-పార్టీ స్టోర్‌ల కోసం)
  • విడి విలువైన రాళ్లు
  • లాటరీ టిక్కెట్‌లు

మిస్టరీ ఐటెమ్‌లు లేదా సరిగ్గా వివరించబడని ఉత్పత్తులు

కస్టమర్‌లు తాము దేనిని కొనుగోలు చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకునేలా, ఉత్పత్తులకు టైటిల్ మరియు వివరణ తప్పక ఉండాలి. స్పష్టంగా వివరించబడని లేదా గుర్తించబడని ఉత్పత్తులు Managed Marketsలో పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • మిస్టరీ ఐటెమ్‌లు (ఉత్పత్తిని కొనుగోలు చేసి, డెలివరీ చేసేంత వరకు అది ఏమిటో కస్టమర్‌కు తెలియకుండా ఉండేవి)
  • థీమ్ ఆధారిత 'సర్‌ప్రైజ్' బాక్స్‌లు
  • అస్పష్టమైన వివరణలతో ఉన్న ఉత్పత్తులు

తాకట్టు దుకాణాలు

తాకట్టు దుకాణాలు పరిమితం చేయబడ్డాయి.

మొక్కలు, కలప మరియు విత్తన ఉత్పత్తులు

న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా వంటి నిర్దిష్ట ప్రాంతాలలో పూర్తిస్థాయిలో లేదా పాక్షికంగా సహజమైన/మొక్కల ఫైబర్‌లతో (గడ్డి, రత్తన్, రాఫియా మరియు జనపనారతో సహా) తయారు చేసిన ఐటెమ్‌లు పరిమితం చేయబడ్డాయి.

కలప, వెదురు, కార్క్ లేదా ఉత్పాదిత ఉత్పత్తులతో తయారు చేసిన లేదా వాటిని కలిగి ఉన్న ఐటెమ్‌లు ఆస్ట్రేలియా, మెక్సికో మరియు న్యూజిలాండ్‌లలో పరిమితం చేయబడ్డాయి. కాగితం, ఫ్యాబ్రిక్, అట్ట, లామినేట్ చేయబడినవి, మీడియం-డెన్సిటీ ఫైబర్‌బోర్డ్ (MDF) లేదా ప్లైవుడ్ వంటివి వీటికి మినహాయింపు కావచ్చు.

అద్దె ఉత్పత్తులు

అద్దెకు, కిరాయికి లేదా లీజుకు ఇవ్వబడే ఉత్పత్తులు Managed Marketsలో పరిమితం చేయబడ్డాయి. ఉత్పత్తుల విక్రయానికి Managed Markets సపోర్ట్ చేస్తుంది, కాబట్టి కేవలం అద్దెకు మాత్రమే అందుబాటులో ఉండే ఉత్పత్తులు అర్హత పొందవు మరియు అవి మీ అంతర్జాతీయ కస్టమర్‌లకు ప్రదర్శించబడవు.

లైంగిక మరియు శృంగార ఉత్పత్తులు

లైంగికపరంగా ప్రేరేపించే లేదా అసభ్యకరమైన మెటీరియల్‌లను వర్ణించే లేదా లైంగిక లేదా శృంగార కార్యకలాపాలకు సంబంధించిన ఐటెమ్‌లు Managed Marketsలో పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • పుస్తకాలు, వీడియోలు, వీడియో గేమ్‌లు లేదా బాహాటంగా శృంగార లేదా లైంగిక స్వభావం ఉన్న (నిజమైనవైనా లేదా కల్పితమైనవైనా) ఇతర కంటెంట్ మాధ్యమాలు
  • ఛాయాచిత్రాలు లేదా చిత్రాల రూపంలో ఉన్న ఇంద్రియ సంబంధిత లేదా లైంగిక కంటెంట్ వర్ణనలు ఉండే దుస్తులు, పోస్టర్‌లు, బొమ్మలు లేదా ఇతర మెటీరియల్స్
  • కదలికను నిరోధించే లేదా నొప్పిని కలిగించే ఉత్పత్తులు

ప్రత్యేకమైన దుస్తులు

Convention on International Trade of Endangered Species (CITES)కు లోబడి అంతరించిపోతున్న జాతుల భాగాలను కలిగి ఉన్న ఐటెమ్‌లు మరియు ఇతర పరిమిత ఐటెమ్‌లను ప్రోత్సహించే లేదా ప్రదర్శించే ఐటెమ్‌లు Managed Marketsలో పరిమితం చేయబడ్డాయి.

దిగుమతి మరియు ఎగుమతి నియంత్రిత US జాతుల భాగాలను కలిగి ఉండే ఐటెమ్‌లు కూడా పర్యవేక్షించబడతాయి, అలాగే ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లలో పరిమితం చేయబడవచ్చు.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • మదర్ ఆఫ్ పెర్ల్ బటన్‌లు
  • మొసలి (హ్యాండ్‌బ్యాగ్‌లు మరియు షూస్)
  • కొండచిలువ (బెల్ట్‌లు)
  • ఈకలు (బోవాలు మరియు ట్రిమ్)
  • అల్లిగేటర్ (షూస్ మరియు హ్యాండ్‌బ్యాగ్‌లు)
  • ఆస్ట్రిచ్ (లెదర్ ఉత్పత్తులు)
  • డ్రగ్స్ వంటి నిషేధించబడిన ఇతర ఐటెమ్‌లను ప్రోత్సహించే లేదా వాటికి సంబంధించిన దుస్తులు
  • మిలిటరీ మరియు భద్రతా సిబ్బంది యూనిఫారమ్‌లు
  • పెయింట్‌బాల్ దుస్తులు

సబ్‌స్క్రిప్షన్ ఉత్పత్తులు

సబ్‌స్క్రిప్షన్ విక్రయ ప్రణాళికతో విక్రయించే ఉత్పత్తులకు Managed Markets మద్దతు ఇవ్వదు.

మీరు మీ స్టోర్‌లో సబ్‌స్క్రిప్షన్‌ల కోసం ఉత్పత్తులను సెటప్ చేసి ఉంటే, Managed Markets ద్వారా మేనేజ్ చేయబడే అన్ని అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం సబ్‌స్క్రిప్షన్ విక్రయ ప్రణాళిక తీసివేయబడుతుంది. అయినా కూడా, మీ కస్టమర్‌లు ఒకేసారి కొనుగోలు కింద ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండే ఉత్పత్తులను మీరు విక్రయిస్తే, అవి ఆటోమేటిక్‌గా పరిమితం చేయబడతాయి, అలాగే మీ అంతర్జాతీయ కస్టమర్‌లకు ప్రదర్శించబడవు.

పొగాకు మరియు పొగాకు సంబంధిత ఉత్పత్తులు

పొగాకు మరియు పొగాకు సంబంధిత ఉత్పత్తులు Managed Marketsలో పరిమితం చేయబడ్డాయి.

ఈ కేటగిరీలోని ఐటెమ్‌లు కింది వాటికే పరిమితం కాకుండా ఇంకా చాలా ఉంటాయి:

  • సిగరెట్లు
  • సిగార్లు
  • ఈ-సిగరెట్లు
  • నికోటిన్ ఉండే ఉత్పత్తులు
  • ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తులు

వారంటీలు, సర్వీస్ ప్లాన్‌లు, ఒప్పందాలు మరియు గ్యారెంటీలు

వారంటీలు, సర్వీస్ ప్లాన్‌లు, ఒప్పందాలు మరియు గ్యారెంటీలు వంటి భౌతికేతర వస్తువులు Managed Marketsలో పరిమితం చేయబడ్డాయి.

వాచ్‌లు

క్యారియర్ ఆవశ్యకతల కారణంగా $10,000 USD కంటే ఎక్కువ విలువైన వాచీలపై నియంత్రణలు ఉన్నాయి. ఈ పరిమితి కంటే తక్కువ విలువ ఉన్న వాచీలపై కింది దేశాలతో సహా కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా నియంత్రణలు ఉంటాయి:

  • కువైట్ - అన్ని వాచ్‌లు మరియు వాచ్ బ్యాండ్‌లు
  • స్విట్జర్లాండ్ - విలువైన లేదా పాక్షిక విలువ గల రాళ్లు లేదా లోహాలను కలిగి ఉన్న వాచ్‌లు మరియు వాచ్ బ్యాండ్‌లు

నిషేధించబడిన Managed Markets ఉత్పత్తులను సమీక్షించండి

మీరు Managed Marketsని యాక్టివేట్ చేయడానికి ముందుగా నిషేధించబడిన ఐటెమ్‌ల కోసం మీ ఉత్పత్తుల జాబితా సమీక్షించబడుతుంది. మీరు Managed Marketsను సెటప్ చేసినప్పుడు ఫలితాలు ప్రదర్శించబడతాయి. చాలా ఉత్పత్తుల ఫలితాలు సెకన్లలో అందుతాయి, అయితే పెద్ద ఉత్పత్తుల జాబితాను సమీక్షించడానికి కొన్ని గంటల సమయం పట్టవచ్చు. ఉత్పత్తి సమీక్ష అనేది కొనసాగుతున్న ప్రక్రియ. ఈ సమీక్షా ప్రక్రియ మీరు మీ స్టోర్‌కు జోడించే కొత్త ఉత్పత్తులు, మీరు అప్‌డేట్ చేసే లేదా ఎడిట్ చేసే ఉత్పత్తులు మరియు నిషేధించబడిన స్టేటస్‌లో మార్పు ఉన్న ఉత్పత్తులకు వర్తిస్తుంది.

ఒక ఉత్పత్తిని రివ్యూ చేయడానికి, మీ ఉత్పత్తికి తప్పనిసరిగా టైటిల్, వివరణ, 0 కంటే ఎక్కువ ధర, మరియు ఉత్పత్తి కేటగిరీ ఉండాలి. మీ ఉత్పత్తి బహుళ వేరియంట్‌లను కలిగి ఉన్నప్పుడు, ప్రాథమిక రివ్యూ అత్యధిక వేరియంట్ ధరను ఉపయోగిస్తుంది, కాబట్టి మీ అత్యంత ఖరీదైన వేరియంట్ ద్వారా ట్రిగ్గర్ చేయబడిన విలువ పరిమితి మొత్తం ఉత్పత్తికి వర్తిస్తుంది. చాలా సందర్భాలలో, మీ ఉత్పత్తికి సంబంధించిన రివ్యూ కొద్ది సెకన్లలోనే పూర్తవుతుంది. కొన్ని ఉత్పత్తుల విషయంలో మరింత వివరణాత్మక రివ్యూ అవసరమవుతుంది, దీనికి ఎక్కువ సమయం పడుతుంది.

మీ ఉత్పత్తి స్టేటస్ అనేది మీ ఉత్పత్తి పేజీలోని Managed Markets విభాగంలో ప్రదర్శించబడుతుంది. మీ ఉత్పత్తి సమీక్ష స్టేటస్ గురించి మరింత సమాచారం కోసం కింది పట్టికను చూడండి.

Managed Markets ఉత్పత్తుల సమీక్ష స్టేటస్
సమీక్ష స్టేటస్వివరణ
(X) ప్రాంతాలలో సమీక్షలో ఉంది మీ ఉత్పత్తి సమీక్షించబడుతోంది. సాధారణంగా, సమీక్ష అనేది కొన్ని సెకన్లలోనే పూర్తవుతుంది. కొన్ని ఉత్పత్తులకు మరింత వివరణాత్మక సమీక్ష అవసరమవుతుంది, దీనికి 24 గంటల వరకు సమయం పట్టవచ్చు.

సమీక్ష స్టేటస్‌లో ఉన్న ఉత్పత్తులు మీ ఆన్‌లైన్ స్టోర్‌లో పబ్లిష్ చేయబడవు.
ఉత్పత్తికి మద్దతు లేదు మీ ఉత్పత్తి Managed Marketsలో విక్రయించబడదు. యునైటెడ్ స్టేట్స్ లొకేషన్ నుండి ఫుల్‌ఫిల్‌మెంట్ అవసరం లాంటి మీ ఉత్పత్తికి మద్దతు ఇవ్వకపోవడానికి గల కారణాన్ని ప్రదర్శించడానికి ఉత్పత్తికి మద్దతు లేదుని క్లిక్ చేయండి.

మద్దతు లేని స్టేటస్‌లో ఉన్న ఉత్పత్తులు మీ ఆన్‌లైన్ స్టోర్‌లో పబ్లిష్ చేయబడవు.
(X) ప్రాంతాలలో మద్దతు లేదు నిర్దిష్ట ప్రాంతాలలో మీ ఉత్పత్తికి మద్దతు లేదు. నిర్దిష్ట జంతు లేదా వృక్ష సంబంధిత మెటీరియల్స్ ఉన్న ఉత్పత్తులు పరిమితం చేయబడ్డాయి లాంటి మీ ఉత్పత్తికి మద్దతు ఇవ్వకపోవడానికి గల కారణాన్ని ప్రదర్శించడానికి (X) ప్రాంతాలలో మద్దతు లేదుని క్లిక్ చేయండి. ఉత్పత్తి పరిమితం చేయబడిన ప్రాంతాల జాబితా కూడా ప్రదర్శించబడుతుంది.

ఒక నిర్దిష్ట మార్కెట్ కోసం మద్దతు లేని స్టేటస్‌లో ఉన్న ఉత్పత్తులు ఆ మార్కెట్‌లోని కస్టమర్‌లకు ప్రదర్శించబడవు.
(X) ప్రాంతాలలో మద్దతు ఉందిమీ ఉత్పత్తి సమీక్షించబడింది, అలాగే మీ ప్రస్తుత అన్ని మార్కెట్‌లలో విక్రయించబడవచ్చు.

నిషేధించబడిన ఐటెమ్‌లను ఫిల్టర్ చేయండి

నిర్దిష్ట మార్కెట్ లేదా అన్ని మార్కెట్‌లలో నిషేధించబడిన ఐటెమ్‌లను ప్రదర్శించడానికి మీరు మీ ఉత్పత్తుల జాబితాను ఫిల్టర్ చేయవచ్చు. ఫిల్టర్ ఫలితాలలో మీ ప్రాథమిక మార్కెట్ చేర్చబడదు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఉత్పత్తులుకు వెళ్లండి.

  2. searchfilter ఐకాన్‌ను క్లిక్ చేయండి.

  3. ఫిల్టర్‌ను జోడించండిని క్లిక్ చేసి, ఆపై పబ్లిషింగ్ ఎర్రర్‌ను క్లిక్ చేయండి.

  4. మీరు ఏయే మార్కెట్‌లలో నిషేధించబడిన ఐటెమ్‌లను ఫిల్టర్ చేయాలనుకుంటున్నారో ఆ మార్కెట్‌లను ఎంచుకోండి. నిషేధించబడిన అన్ని ఐటెమ్‌ల కోసం ఫిల్టర్ చేయడానికి, అన్నింటినీ ఎంచుకోండిపై క్లిక్ చేయండి.

నిషేధించబడిన ఐటెమ్‌లను క్రమబద్ధీకరించండి

మీ ఉత్పత్తుల జాబితాలో నిషేధించబడిన ఐటెమ్‌లను కూడా మీరు క్రమబద్ధీకరించవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఉత్పత్తులుకు వెళ్లండి.

  2. క్రమబద్ధీకరణ ఐకాన్‌ను క్లిక్ చేయండి.

  3. పబ్లిషింగ్ ఎర్రర్‌ను ఎంచుకోండి.

  4. ఆప్షనల్: నిషేధించబడిన ఐటెమ్‌ల క్రమం పాత వాటి నుండి కొత్త వాటికి ప్రదర్శించబడాలో లేదా కొత్త వాటి నుండి పాత వాటికి ప్రదర్శించబడాలో ఎంచుకోండి.

నోటిఫికేషన్‌లు

కొత్త ఉత్పత్తి అయినందున లేదా ఆ ఉత్పత్తిని ప్రభావితం చేసే నిబంధనలు మారినందున, నిషేధించబడిన కొత్త ఐటెమ్ గుర్తించబడినప్పుడు, మీ Shopify అడ్మిన్‌లో మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ నుండి, మీరు అన్ని మార్కెట్‌ల కోసం నిషేధించబడిన ఉత్పత్తుల ఫిల్టర్ చేసిన జాబితాను యాక్సెస్ చేయవచ్చు. మీ Shopify అడ్మిన్‌లో అలర్ట్‌లను యాక్సెస్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

మీరు Managed Marketsను యాక్టివేట్ చేయడానికి ముందు మీ ఉత్పత్తుల జాబితా ముందుగా సమీక్షించబడుతుంది, ఆపై మీరు Managed Marketsను ఉపయోగించినంత కాలం ఉత్పత్తి సమీక్ష కొనసాగుతుంది. మరింత తెలుసుకోవడానికి, నిషేధించబడిన Managed Markets ఉత్పత్తులను సమీక్షించండిని చూడండి.

మెటాఫీల్డ్‌లతో నిషేధించబడిన Managed Markets ఉత్పత్తులను అప్‌డేట్ చేయండి

ఒకవేళ మీ ఉత్పత్తి సమీక్షించబడి, మీ మార్కెట్‌ల కోసం మద్దతు లేదు స్థితికి సెట్ చేయబడితే, మీ ఉత్పత్తిని మరింత కచ్చితంగా వివరించడానికి మీరు ఉత్పత్తిపై కేటగిరీ మెటాఫీల్డ్‌లను అప్‌డేట్ చేయవచ్చు. మీ మెటాఫీల్డ్‌లు అప్‌డేట్ చేయబడిన తర్వాత, మీ ఉత్పత్తి మళ్లీ సమీక్షించబడుతుంది.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఉత్పత్తులుకు వెళ్లండి.

  2. అప్‌డేట్ చేయడానికి ఉత్పత్తిని క్లిక్ చేయండి.

  3. కేటగిరీ మెటాఫీల్డ్‌ల విభాగంలో, ప్రతి మెటాఫీల్డ్‌కు తగిన విలువను ఎంచుకోండి.

  4. సేవ్ క్లిక్ చేయండి.

మీ ఉత్పత్తి అప్‌డేట్ అయిన తర్వాత, అది మళ్లీ సమీక్షించబడుతుంది. చాలా సందర్భాలలో సమీక్షలు కొన్ని సెకన్లలో జరుగుతాయి, కానీ కొన్ని సందర్భాల్లో సమీక్షలకు 24 గంటల వరకు సమయం పట్టవచ్చు.