కరెన్సీ కన్వర్షన్‌లు మరియు మారకపు రేట్లు

మీరు చెల్లింపును క్యాప్చర్ చేసినప్పుడు, రీఫండ్ జారీ చేసినప్పుడు లేదా ఛార్జ్‌బ్యాక్ జరిగినప్పుడు వంటి లావాదేవీల సమయంలో కరెన్సీ కన్వర్షన్ జరుగుతుంది. ఎల్లప్పుడూ లావాదేవీ సమయంలో ఉన్న విదేశీ మారకపు రేటు మాత్రమే ఉపయోగించబడుతుంది.

మీరు లావాదేవీ బ్రేక్‌డౌన్‌ని ఆర్డర్ టైమ్‌లైన్‌లో చూడవచ్చు.

ప్రతి మార్కెట్ కోసం ఒక్కో ఉత్పత్తి ధర ఎలా లెక్కించబడిందనే దాని బ్రేక్‌డౌన్‌ని మీరు చూడవచ్చు.

కరెన్సీ నిర్వచనాలు మరియు కన్వర్షన్‌లు

మీ స్టోర్ మూడు రకాల కరెన్సీలను కలిగి ఉంటుంది:

  • స్టోర్ కరెన్సీ - మీ Shopify అడ్మిన్ కరెన్సీ. ఇది మీ ప్రాథమిక మార్కెట్‌లోని మీ ఉత్పత్తులు, ప్రొడక్ట్ వేరియంట్‌ల ధరలను సెట్ చేయడానికి మీరు ఉపయోగించే కరెన్సీ, అలాగే ఇది మీ రిపోర్ట్‌లలో ప్రదర్శించబడే కరెన్సీ.
  • స్థానిక కరెన్సీ (కస్టమర్ కరెన్సీ లేదా ప్రెజెంట్‌మెంట్ కరెన్సీ అని కూడా పిలుస్తారు) - మీ స్టోర్‌లో కస్టమర్‌కి ప్రదర్శించబడే కరెన్సీ, అలాగే కస్టమర్‌లు చెక్‌అవుట్ వద్ద వారి ఆర్డర్‌లకు చెల్లించేటప్పుడు ఉపయోగించే కరెన్సీ.
  • చెల్లింపు కరెన్సీ - మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేసేటప్పుడు Shopify ఉపయోగించే కరెన్సీ.

కరెన్సీ కన్వర్షన్ రిస్క్‌లు

కరెన్సీ రేట్లు ఎల్లప్పుడూ హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. చెల్లింపులు లేదా రీఫండ్‌లను ప్రాసెస్ చేయడంలో జాప్యం జరిగినప్పుడల్లా, కరెన్సీ కన్వర్షన్‌ల కారణంగా మీరు డబ్బును కోల్పోయే లేదా పొందే అవకాశం ఉంది.

కింది సందర్భాలలో మీరు డబ్బును కోల్పోవచ్చు లేదా పొందవచ్చు:

ఆటోమేటిక్ మారకపు రేటు కన్వర్షన్‌లు

మీరు స్థానిక కరెన్సీలతో కూడిన మార్కెట్‌లలో విక్రయించినప్పుడు, మీ ఆన్‌లైన్ స్టోర్ ధరలు మీ కస్టమర్ కరెన్సీలోకి మార్చబడతాయి. మార్కెట్ మారకపు రేట్లకు అనుగుణంగా మీ స్టోర్‌లోని ధరలు ఆటోమేటిక్‌గా మారుతాయి.

ఉత్పత్తి ధరను కరెన్సీ కన్వర్షన్ రేట్‌తో గుణించి, కన్వర్షన్ ఫీజును జోడించి, వర్తిస్తే ఆ కరెన్సీకి సంబంధించిన రౌండింగ్ నియమాలను వర్తింపజేయడం ద్వారా మీ ధరలు మార్చబడతాయి. మార్చబడిన మీ ధరలలో మీ కరెన్సీ కన్వర్షన్ ఖర్చులు ఉంటాయి. ఉదాహరణకు, ఒక $10.00 USD ఉత్పత్తిని యూరోల్లోకి మార్చినప్పుడు, ఆ మార్చబడిన ధర €8.81లో కరెన్సీ కన్వర్షన్ రేట్ మరియు కన్వర్షన్ ఫీజు కూడా కలిసి ఉంటాయి.

(**Product price** x **currency conversion rate**) x (**1** + **currency conversion fee**)</br>
  <br>($10.00 USD x 0.867519) x (1 + .015) = &euro;8.81</br>

మీరు రౌండింగ్ నియమాలను యాక్టివ్‌గా ఉంచితే, మార్చబడిన ధర €8.85కు రౌండప్ చేయబడుతుంది.

మాన్యువల్ మారకపు రేటు కన్వర్షన్‌లు

Managed Marketsతో, మీరు మీ ప్రతి మార్కెట్ కోసం కరెన్సీ మారకపు రేటును మాన్యువల్‌గా సెట్ చేయవచ్చు. దీని ద్వారా, ఆటోమేటిక్ మారకపు రేట్లతో మీ ధరలు హెచ్చుతగ్గులకు గురికాకుండా, మార్కెట్‌కు మీ ధరలను స్థిరీకరించుకోవచ్చు.

మాన్యువల్ మారకపు రేటు కన్వర్షన్‌లను ఉపయోగించినప్పుడు, మీ మాన్యువల్ మారకపు రేటు, ప్రస్తుత మార్కెట్ మారకపు రేటు మధ్య ఉన్న వ్యత్యాసం ఆధారంగా మీరు డబ్బు పొందవచ్చు లేదా కోల్పోవచ్చు.

మీ కరెన్సీ కన్వర్షన్‌కు కన్వర్షన్ ఫీజు వర్తిస్తుంది. మీరు మీ మాన్యువల్ రేటులో ఈ ఫీజును చేర్చాలనుకుంటే, మీ స్టోర్ దేశానికి సంబంధించిన కన్వర్షన్ ఫీజుతో మీ రేటును గుణించండి. ఉదాహరణకు, 1.5% కన్వర్షన్ ఫీజుతో USD నుండి EURకి మారకపు రేటు ఈ విధంగా ఉండవచ్చు: 0.90867 x 1.015 = 0.9223.

మీ ప్రాథమిక మార్కెట్ కాని మార్కెట్‌ల కోసం మీరు మాన్యువల్ కన్వర్షన్ రేట్‌ను సెట్ చేయవచ్చు. మీరు మీ స్టోర్ కరెన్సీకి భిన్నమైన బేస్ కరెన్సీని సెట్ చేసిన మార్కెట్‌లలో కూడా, ఈ రేట్లు సెట్టింగ్‌లు > జనరల్లో మీ స్టోర్ బేస్ కరెన్సీ ఆధారంగా ఉంటాయి.

మాన్యువల్ మారకపు రేట్లతో పాటుగా మీరు ధర సర్దుబాట్లను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ స్టోర్ కరెన్సీ USDలో 20.00 ధర ఉన్న ఉత్పత్తిని కలిగి ఉండి, అన్ని మార్కెట్‌ల కోసం దగ్గరి 1.00కి ధర రౌండింగ్ ఆన్ చేయబడితే, మీరు మీ కెనడా మార్కెట్ కోసం ధరలను కింది మార్గాల్లో దేనిలోనైనా నియంత్రించవచ్చు:

  • CAD ధరను స్థిరీకరించడానికి మీరు మాన్యువల్ మారకపు రేటును 1.3కి సెట్ చేసి, ఆపై 20% ధర సర్దుబాటును వర్తింపజేయవచ్చు. ధర 20.00 x 1.3 x 1.2 = 32.00 CADగా లెక్కించబడుతుంది.
  • మీరు మాన్యువల్ మారకపు రేటును 1గా సెట్ చేసి, కేవలం ధర సర్దుబాటును ఉపయోగించడం ద్వారా CAD ధరను నియంత్రించేందుకు 50% సర్దుబాటును వర్తింపజేయవచ్చు. ధర 20.00 x 1 x 1.5 = 30.00 CADగా లెక్కించబడుతుంది.
  • మీరు ఆటోమేటిక్ మారకపు రేట్లను ఎంచుకుని, ఆపై CAD ధరలకు 50% ధర సర్దుబాటును వర్తింపజేయవచ్చు. ధర 20.00 x [ప్రస్తుత మారకపు రేటు] x 1.5గా లెక్కించబడుతుంది. దానికి అదనంగా జోడించిన 50% ధర సర్దుబాటు, ప్రస్తుత మారకపు రేట్ల ఆధారంగా ధర హెచ్చుతగ్గులకు లోనవుతుంది.

మార్కెట్ బేస్ కరెన్సీ మార్చబడినా లేదా మాన్యువల్ కన్వర్షన్ రేట్లు ఆటోమేటిక్‌కు మార్చబడినా, మాన్యువల్ రేటు డీయాక్టివేట్ చేయబడుతుంది కానీ తొలగించబడదు. అంటే, అసలు మార్కెట్ కరెన్సీ పునరుద్ధరించబడినా లేదా మాన్యువల్ కన్వర్షన్ రేట్లు మళ్లీ ఆన్ చేయబడినా, మాన్యువల్ కన్వర్షన్ రేటు మళ్లీ యాక్టివ్ అవుతుంది.

మాన్యువల్ మారకపు రేటును యాక్టివేట్ చేయండి

మీ మార్కెట్‌లు పేజీ నుండి, మీరు ఏకైక-దేశ మార్కెట్‌లు లేదా స్థానిక కరెన్సీలను ఆఫ్ చేసిన బహుళ-దేశాల మార్కెట్‌ల కోసం మాన్యువల్ కన్వర్షన్ రేట్లను సెటప్ చేయవచ్చు. మీరు మాన్యువల్ కన్వర్షన్ రేట్‌ను ఉపయోగించాలనుకుంటున్న ప్రతి దేశం లేదా ప్రాంతం కోసం ఏకైక-దేశ మార్కెట్‌లను సృష్టించాలి.

మాన్యువల్ కన్వర్షన్ రేట్లను మీ ప్రాథమిక మార్కెట్‌కు వర్తింపజేయలేరు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, మార్కెట్‌లకు వెళ్లండి.

  2. మీరు మాన్యువల్ మారకపు రేటును జోడించాలనుకుంటున్న మార్కెట్‌ను క్లిక్ చేయండి.

  3. కరెన్సీ సెలెక్టర్‌లో, కరెన్సీ ఆప్షన్‌లను ప్రదర్శించడానికి మార్కెట్ కరెన్సీని క్లిక్ చేయండి.

  4. మారకపు రేటు (FX) విభాగంలో, మాన్యువల్‌ను ఎంచుకోండి.

  5. మారకపు రేటును ఎంటర్ చేయండి.

  6. పూర్తయిందిని క్లిక్ చేయండి.

మాన్యువల్‌గా క్యాప్చర్ చేయబడిన చెల్లింపులు

మీరు స్థానిక కరెన్సీలలో విక్రయించినప్పుడు, చెల్లింపుగా మీకు అందే మొత్తం కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను ఛార్జ్ చేసే సమయంలోని కరెన్సీ రేటు ఆధారంగా ఉంటుంది. మీరు చెల్లింపులను మాన్యువల్‌గా క్యాప్చర్ చేస్తే, కస్టమర్ తమ ఆర్డర్‌ను సమర్పించినప్పుడు కాకుండా వారి ఆర్డర్‌ను మీరు ప్రాసెస్ చేసినప్పుడు వారి క్రెడిట్ కార్డ్‌కు ఛార్జ్ చేయబడుతుంది. ప్రామాణీకరణ సమయానికి, మీ నిధులను మాన్యువల్‌గా క్యాప్చర్ చేసే సమయానికి మధ్య కరెన్సీ మారకపు రేటు మారవచ్చు, దీని వలన స్వల్ప వ్యత్యాసం ఏర్పడుతుంది.

మీ Shopify అడ్మిన్‌లో, మీ విక్రయాలను నివేదించడం మీకు సులభతరం చేసేందుకు వేర్వేరు కరెన్సీలలోని ఆర్డర్‌లు మీ స్టోర్ కరెన్సీలోకి మార్చబడతాయి. కస్టమర్‌ల ఆర్డర్‌కు మీరు ఛార్జ్ చేసే వరకు, మార్చబడిన విలువలన్నీ కేవలం అంచనాలు మాత్రమే.

ఉదాహరణకు, మీ స్టోర్ కరెన్సీ USD అయి ఉండి, మీరు USD ఇంకా EURలలో విక్రయిస్తుంటే, మీ కస్టమర్ €90 బుక్‌షెల్ఫ్ కోసం ఆర్డర్‌ను సృష్టించారు అనుకుందాం. వారు తమ ఆర్డర్‌ను సమర్పించినప్పుడు, $1 USD అనేది €0.90 EURకు సమానంగా ఉంటుంది.

చెల్లింపు క్యాప్చర్‌కు ముందు స్టోర్ మరియు కస్టమర్ కరెన్సీ ధరల తులనాత్మక పట్టిక ఉదాహరణ.
స్టోర్ కరెన్సీ ధరకస్టమర్ కరెన్సీ ధరఅంచనా వేసిన ఆర్డర్ మొత్తం
$100 USD€90 EUR$100 USD

కొద్ది రోజుల తర్వాత కరెన్సీ రేటు మారి, ఇప్పుడు $1 USD అనేది €0.85 EURకు సమానం అయింది. మీ కస్టమర్ క్రెడిట్ కార్డ్‌కు మీరు €90 EUR కోసం ఛార్జ్ చేస్తారు. కరెన్సీ కన్వర్షన్ రేటు మారి $1 USD = €0.85 EUROగా అయినందున, ఆ €90 కాస్తా $98 USDగా మారుతుంది. మీకు $98 USD అందుతుంది.

కరెన్సీ హెచ్చుతగ్గుల తర్వాత స్టోర్ కరెన్సీలో చెల్లింపు క్యాప్చర్ మొత్తాల ఉదాహరణ.
స్టోర్ కరెన్సీ ధరకస్టమర్ కరెన్సీ ధరస్టోర్ కరెన్సీకి మార్చబడి, క్యాప్చర్ చేసిన మొత్తం
$100 USD€90 EUR$98 USD

రీఫండ్‌లు

కస్టమర్ ఆర్డర్ చేసిన దానికి, వారు దాన్ని రిటర్న్ చేసిన దానికి మధ్య సాధారణంగా కొంత సమయం గ్యాప్ ఉంటుంది. ఫలితంగా, ఆర్డర్ కోసం మీరు పొందిన కన్వర్ట్ అయిన మొత్తం అనేది సాధారణంగా మీరు రీఫండ్‌లో తిరిగి ఇచ్చే కన్వర్ట్ అయిన మొత్తానికి సమానంగా ఉండదు. కస్టమర్ వారి స్థానిక కరెన్సీలో చెల్లించిన పూర్తి మొత్తాన్ని మీరు రీఫండ్ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. దీని అర్థం కరెన్సీ కన్వర్షన్‌ల కారణంగా మీరు డబ్బును నష్టపోవచ్చు లేదా లాభపడవచ్చు. స్థానిక కరెన్సీలలో విక్రయించేటప్పుడు ఆర్డర్‌లను రీఫండ్ చేయడం గురించి తెలుసుకోండి.

ఛార్జ్‌బ్యాక్‌లు

కార్డుదారు ఛార్జ్‌బ్యాక్‌ను ప్రారంభించినప్పుడు, ఆర్డర్ సమయంలో ఉన్న కన్వర్షన్ రేట్‌ను కాకుండా ఫండ్స్ బదిలీ అయిన సమయంలో ఉన్న కన్వర్షన్ రేట్‌ను ఉపయోగించి కరెన్సీ కన్వర్షన్‌లు వర్తింపజేయబడతాయి.

Shopify రీఫండ్ చేయబడే మొత్తాన్ని కన్వర్ట్ చేసి, వివాదాస్పదమైన మొత్తాన్ని కార్డుదారుకు క్రెడిట్ చేస్తుంది. ఆ తర్వాత మీ తరపున కార్డుదారు బ్యాంక్‌కు రుసుమును చెల్లిస్తుంది. అలాగే మీ తదుపరి పేఅవుట్ నుండి రీఫండ్ చేయబడే మొత్తాన్ని మినహాయిస్తుంది. ఈ కరెన్సీ కన్వర్షన్ కోసం మీకు కన్వర్షన్ రుసుము విధించబడదు.

మీరు ఛార్జ్‌బ్యాక్‌ను వివాదించి, అది మీకు అనుకూలంగా పరిష్కరించబడితే, ఛార్జ్‌బ్యాక్‌లో వివాదాస్పదమైన మొత్తం మీకు రీఫండ్ చేయబడుతుంది మరియు ప్రస్తుత కన్వర్షన్ రేట్ ఆధారంగా మీకు ఛార్జ్‌బ్యాక్ రుసుము రీఫండ్ చేయబడుతుంది.

ఛార్జ్‌బ్యాక్‌లు ఎలా ప్రాసెస్ చేయబడతాయో మరింత తెలుసుకోండి.

వేర్వేరు కరెన్సీలలో విక్రయించడం, సెటిల్ చేయడం మరియు స్థానిక కరెన్సీలలో విక్రయించడం

చాలా కరెన్సీ కన్వర్షన్‌లు మీ కస్టమర్ స్థానిక కరెన్సీ మరియు మీ స్టోర్ కరెన్సీ మధ్య జరుగుతాయి. ఒకవేళ మీ స్టోర్ కరెన్సీ, మీ చెల్లింపు కరెన్సీకి భిన్నంగా ఉంటే, కస్టమర్ స్థానిక కరెన్సీ మరియు మీ చెల్లింపు కరెన్సీ మధ్య కరెన్సీ కన్వర్షన్‌లు జరుగుతాయి.