అంతర్జాతీయ షిప్‌మెంట్‌ల కోసం కస్టమ్స్ డాక్యుమెంటేషన్
కస్టమ్స్ సరిహద్దును దాటే అంతర్జాతీయ షిప్‌మెంట్ గురించి గమ్యస్థాన దేశంలోని కస్టమ్స్ అథారిటీకి డిక్లేర్ చేయబడుతుంది. మీరు Shopifyలో దేనికైనా లేబుల్‌ను సృష్టించినప్పుడు, ఆ డిక్లరేషన్ మీ ఉత్పత్తులు మరియు ఆర్డర్ వివరాలతో రూపొందుతుంది.
కస్టమ్స్ వివరాలు లేకపోయినా లేదా తప్పుగా ఉన్నా షిప్‌మెంట్ సరిహద్దు వద్ద ఆగిపోవచ్చు, ఊహించని సుంకాలు యాడ్ అవ్వచ్చు లేదా లేబుల్ ఏ మాత్రం క్రియేట్ అవ్వకుండా నిరోధించవచ్చు.
ఈ పేజీలో
అవసరమైన కస్టమ్స్ వివరాలు
కస్టమ్స్ డిక్లరేషన్ అవసరమైన షిప్‌మెంట్ కోసం మీరు లేబుల్‌ను క్రియేట్ చేయడానికి ముందు, షిప్‌మెంట్‌లోని ప్రతి ఐటెమ్‌కు కింది వివరాలు అవసరం:
- కనీసం 6 అంకెలు ఉండే హార్మోనైజ్డ్ సిస్టమ్ (HS) కోడ్. మీ ఉత్పత్తులకు HS కోడ్‌లను జోడించడం గురించి మరింత తెలుసుకోండి.
- మూల దేశం లేదా ప్రాంతం, అంటే ఐటెమ్ ఎక్కడ తయారైంది అని అర్థం.
- వస్తువుల వివరణ.
- ఐటెమ్ పరిమాణం.
- ఐటెమ్ విలువ.
- ఐటెమ్ బరువు.
- యూరోపియన్ యూనియన్‌కు పంపబడే, €150 EUR లేదా అంతకంటే తక్కువ విలువ గల పార్శిల్‌కు, ప్రతి ఐటెమ్‌కి ఒక ప్రొడక్ట్ ఐడెంటిఫైయర్ అవసరం. యూరోపియన్ యూనియన్‌కు షిప్‌మెంట్‌ల కోసం ప్రొడక్ట్ ఐడెంటిఫైయర్లను జోడించడం గురించి మరింత తెలుసుకోండి.
మీరు ఉత్పత్తి పేజీలో, లేబుల్ కొనుగోలు చేసే సమయంలో, బల్క్ ఎడిటర్‌తో లేదా ఇన్వెంటరీ CSV ఫైల్ ద్వారా HS కోడ్‌లను మరియు మూల దేశాలను జోడించవచ్చు. మీరు ఉత్పత్తిలో సేవ్ చేసే వివరాలు ఆ ఉత్పత్తి ప్రతి అంతర్జాతీయ లేబుల్‌లో మళ్లీ ఉపయోగించబడతాయి.
కస్టమ్స్ డాక్యుమెంటేషన్ కోసం పరిగణించవలసినవి
మీరు అంతర్జాతీయంగా షిప్పింగ్ చేయడానికి ముందు, కింది అంశాలను సమీక్షించండి:
- ఆర్డర్‌కు మీరు నేరుగా జోడించే కస్టమ్ ఐటెమ్‌కు ఉత్పత్తి పేజీ ఉండదు, కాబట్టి లేబుల్ కొనుగోలు చేసే సమయంలో మీరు దాని HS కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- యునైటెడ్ స్టేట్స్ సైనిక మరియు దౌత్యపరమైన చిరునామాలు అంతర్జాతీయంగా పరిగణించబడతాయి, కాబట్టి ఆర్మీ పోస్ట్ ఆఫీస్ (APO), ఫ్లీట్ పోస్ట్ ఆఫీస్ (FPO) లేదా డిప్లొమాటిక్ పోస్ట్ ఆఫీస్ (DPO) చిరునామాకు పంపే షిప్‌మెంట్‌లకు కస్టమ్స్ వివరాలు అవసరం.
- మీరు Managed Marketsని ఉపయోగిస్తుంటే, మీ ఉత్పత్తుల కోసం HS కోడ్‌లు కేటాయించబడతాయి, వాటిని ఎడిట్ చేయడం సాధ్యపడదు.
- మీరు యునైటెడ్ స్టేట్స్‌లో నియంత్రిత వినియోగదారుల ఉత్పత్తులను విక్రయిస్తుంటే, కస్టమ్స్ క్లియర్ చేయడానికి మీ షిప్‌మెంట్‌లకు CPSC eFiling డేటా కూడా అవసరం కావచ్చు.
కస్టమ్స్ డిక్లరేషన్‌లపై వస్తువుల వివరణలు
మీ కస్టమ్స్ డిక్లరేషన్‌లోని వివరణ సాధారణంగా మీ ఉత్పత్తి శీర్షిక నుండి కాకుండా, ఐటెమ్ యొక్క HS కోడ్ నుండి వస్తుంది. ప్రతి HS కోడ్ కస్టమ్స్ అధికారులు గుర్తించే ప్రమాణీకరించిన వివరణను కలిగి ఉంటుంది, కాబట్టి ఆ వివరణ మీ కస్టమర్‌లకు తెలిసిన పేరు కంటే పొడవుగా లేదా మరింత సాంకేతికంగా ఉండవచ్చు. కోడ్ కోసం ఎటువంటి ప్రమాణీకరించిన వివరణ అందుబాటులో లేకపోతే, అప్పుడు దానికి బదులుగా ఉత్పత్తి లేదా ఐటెమ్ పేరు ఉపయోగించబడుతుంది.
లేబుల్ కొనుగోలు చేసే సమయంలో మీరు కస్టమ్స్ సమాచారాన్ని ఎడిట్ చేయండి విభాగంలో వివరణను ఎడిట్ చేయవచ్చు. ఎడిట్ చేసిన వివరణ ఆ లేబుల్‌కు మాత్రమే వర్తిస్తుంది మరియు తదుపరి షిప్‌మెంట్‌ల కోసం అది ఉత్పత్తిలో సేవ్ చేయబడదు.
కొన్ని క్యారియర్‌లు తమ సిస్టమ్ అక్షర పరిమితులకు సరిపోయేలా పొడవైన వివరణను షార్ట్ చేస్తాయి, ఇదొక సాధారణ ప్రక్రియ.
కస్టమ్ ఐటెమ్‌కి సంబంధించి వివరాలు తీసుకోవడానికి దానికి ఉత్పత్తి పేజీ లేదు, కాబట్టి దాని వివరణ మీరు ఆర్డర్‌లో ఎంటర్ చేసిన ఐటెమ్ పేరుతో మ్యాచ్ అవుతుంది.
కస్టమ్స్ ఫారమ్‌లు మరియు కమర్షియల్ ఇన్‌వాయిస్‌లు
అంతర్జాతీయ షిప్‌మెంట్‌కు రెండు రకాల పేపర్‌వర్క్ అవసరం కావచ్చు:
- షిప్‌మెంట్‌లో ఏముందో కస్టమ్స్ ఫారమ్ డిక్లేర్ చేస్తుంది. కొన్ని షిప్‌మెంట్‌లకు ప్రింట్ చేసిన ఫారమ్ అవసరం కాగా, మరికొన్నింటికి డిక్లరేషన్ ఎలక్ట్రానిక్‌గా సమర్పించబడుతుంది. కస్టమ్స్ ఫారమ్‌ను ప్రింట్ చేయడం మరియు కస్టమ్స్ ఫారమ్‌లను ప్రింట్ చేసేటప్పుడు పరిగణించవలసినవి గురించి మరింత తెలుసుకోండి.
- కమర్షియల్ ఇన్‌వాయిస్ షిప్‌మెంట్ విలువ మరియు డెలివరీ నిబంధనలను పేర్కొంటుంది. కమర్షియల్ ఇన్వాయిస్లను సృష్టించడం గురించి మరింత తెలుసుకోండి.
ఎలక్ట్రానిక్ డాక్యుమెంటేషన్‌కు మద్దతు ఇచ్చే గమ్యస్థానాల కోసం అనేక క్యారియర్‌లు కస్టమ్స్ డాక్యుమెంటేషన్‌ను ఎలక్ట్రానిక్‌గా సమర్పిస్తాయి, తద్వారా మీరు కేవలం షిప్పింగ్ లేబుల్ మాత్రమే ప్రింట్ చేయాల్సి వస్తుంది. మీ క్యారియర్‌కు ఏయే గమ్యస్థానాలు అర్హత పొందుతాయో తెలుసుకోవడానికి, DHL Express, కెనడాలోని DHL Express లేదా UPSని చూడండి.
ఎలక్ట్రానిక్‌గా డాక్యుమెంటేషన్ సమర్పించబడిన షిప్‌మెంట్ కోసం డ్రైవర్ గనక పేపర్ కమర్షియల్ ఇన్‌వాయిస్ కావాలని అడిగితే, లేబుల్‌తో పాటే క్యారియర్‌కు ఇన్‌వాయిస్ పంపబడిందని వారికి చెప్పండి. డ్రైవర్‌కు ఇంకా పేపర్ కాపీ అవసరమైతే, మీరు మీ క్యారియర్ ఇన్‌వాయిస్ టూల్ ద్వారా దాన్ని క్రియేట్ చేయవచ్చు.
కస్టమ్స్ సమాచారాన్ని ట్రబుల్షూటింగ్ చేయడం
ఒకవేళ కస్టమ్స్ డిక్లరేషన్ మిమ్మల్ని లేబుల్ క్రియేట్ చేయనివ్వకపోతే, కింది సాధారణ సమస్యలు మరియు పరిష్కారాలను సమీక్షించండి.
షిప్పింగ్ సేవలను చూడటానికి కస్టమ్స్ డిక్లరేషన్‌కి ఐటెమ్ బరువును జోడించండి
మీరు అంతర్జాతీయ లేబుల్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ మెసేజ్ కనిపిస్తే, ఆర్డర్‌లోని ఐటెమ్‌కి బరువు లేదని అర్థం.
- ఐటెమ్‌లు విభాగంలో, కస్టమ్స్ సమాచారాన్ని ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
- ప్రతి ఐటెమ్‌కి బరువును జోడించండి.
- మిస్సైన ఏదైనా HS కోడ్ మరియు మూల దేశం లేదా ప్రాంతాన్ని జోడించండి.
- సేవ్ చేయండిని క్లిక్ చేయండి.
ఆర్డర్‌లోని ప్రతి ఐటెమ్‌కి బరువు, HS కోడ్ మరియు మూల దేశం లేదా ప్రాంతం ఉన్న తర్వాత మాత్రమే షిప్పింగ్ సేవలు ప్రదర్శించబడతాయి.
లేబుల్ కొనుగోలు చేసే సమయంలో మిస్సైన HS కోడ్ లేదా మూల దేశాన్ని ట్రబుల్షూట్ చేయండి
షిప్‌మెంట్‌కు కస్టమ్స్ డిక్లరేషన్ అవసరమైనప్పుడు, ప్రతి ఐటెమ్‌కి ఒక HS కోడ్ మరియు మూల దేశం లేదా ప్రాంతం ఉండే వరకు మీరు దాని లేబుల్‌ను సృష్టించలేరు. వాటిని కస్టమ్స్ సమాచారాన్ని ఎడిట్ చేయండి విభాగంలో జోడించండి, ఆపై షిప్పింగ్ సమాచారాన్ని ఉత్పత్తి వివరాలకు సేవ్ చేయండిని ఎంచుకోండి, తద్వారా మీ తదుపరి షిప్‌మెంట్‌లో అదే ఐటెమ్‌లకు ఇవి మళ్లీ అవసరం ఉండవు.
మీ ఉత్పత్తులకు వర్తించే కోడ్‌లను ఎక్కడ కనుగొనాలో తెలుసుకోవడానికి, మీ ఉత్పత్తులకు HS కోడ్‌లను జోడించడంని చూడండి.
డెసిమల్ పాయింట్‌లను కోల్పోయే HS కోడ్ కోసం ట్రబుల్షూటింగ్
మీరు 10-అంకెల కోడ్ లాగా 6 అంకెల కంటే పొడవుగా ఉన్న కోడ్‌ను నమోదు చేయవచ్చు. కోడ్ నిల్వ చేయబడినప్పుడు డెసిమల్ పాయింట్‌లు తీసివేయబడతాయి, కాబట్టి 1234.56.78.90 అనేది 1234567890గా నిల్వ చేయబడుతుంది. ఇది ఆశించినదే మరియు మీరు నమోదు చేసిన క్రమంలోనే అంకెలు ఉంచబడతాయి.
ఒకవేళ మీరు కస్టమ్స్ ఫారమ్‌లోని ఐటెమ్ బరువులను ఎడిట్ చేసినా, ఇంకా లేబుల్‌ను సృష్టించలేకపోతే, అప్పుడు షిప్పింగ్ లేబుల్‌ల ట్రబుల్షూటింగ్ని చూడండి.