మీ ఉత్పత్తులకు HS కోడ్‌లను జోడించడం

మీరు అంతర్జాతీయంగా షిప్పింగ్ చేస్తుంటే, అప్పుడు మీ ప్రతి ఉత్పత్తికి తప్పనిసరిగా ఒక HS కోడ్ ఉండాలి.

HS కోడ్ అనేది సాధారణంగా ఆరు అంకెలు ఉండే అంతర్జాతీయ వాణిజ్య కోడ్, ఇది ఉత్పత్తి అంటే ఏమిటో వివరించడానికి ఉపయోగించబడుతుంది. మీ ఉత్పత్తులకు HS కోడ్‌లను జోడించడం వలన నాన్-కంప్లయన్స్ పెనాల్టీలు, సరిహద్దు ఆలస్యాలు, ఉత్పత్తుల సీజ్ లేదా దిగుమతి తిరస్కరణను నివారించడంలో సహాయపడుతుంది. కింది వనరుల నుండి మీరు HS కోడ్‌ల సిస్టమ్ గురించి మరింత తెలుసుకోవచ్చు:

మూల దేశం మరియు దేశం-ఆధారిత HS కోడ్‌లు

మూల దేశం లేదా ప్రాంతం (COO) అనగా ఉత్పత్తి ఎక్కడ రూపొందించబడింది లేదా మీరు విక్రయించే రూపంలోకి ఎక్కడ అసెంబుల్ చేయబడింది మరియు దానికి సంబంధించిన HS కోడ్ వర్గీకరణను తీసుకునే చోటు. ఉదాహరణకు, మీరు ఒక టేబుల్‌ను విక్రయిస్తున్నారు. టేబుల్ అనేది కెనడా నుండి తెచ్చిన చెక్కతో, మెక్సికో గ్లూతో మరియు చైనా స్క్రూలతో తయారు చేయబడింది. ఈ మెటీరియల్‌తో టేబుల్‌ను యునైటెడ్ స్టేట్స్‌లో అసెంబుల్ చేశారు. ఈ సందర్భంలో మూల దేశం లేదా ప్రాంతం యునైటెడ్ స్టేట్స్ అవుతుంది, ఎందుకంటే టేబుల్‌ను రూపొందించడానికి మెటీరియల్‌లు అక్కడే ఉపయోగించబడ్డాయి కాబట్టి.

మరింత వర్గీకరణ కోసం ఒక్కో దేశం, HS కోడ్ మొదటి ఆరు అంకెల తర్వాత అదనపు అంకెలను జోడించవచ్చు. దేశం-ఆధారిత HS కోడ్ ఉన్నప్పుడు, సుంకాలను లెక్కించడానికి ఆ కోడ్ ఉపయోగించబడుతుంది. ఒకవేళ దేశం-ఆధారిత HS కోడ్ లేకపోతే, దానికి బదులుగా ఆరు అంకెల గ్లోబల్ కోడ్ ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, మీ ఉత్పత్తి యొక్క HS కోడ్ 3210.00 అనుకుందాం, అలాగే మీరు దానిని కెనడా మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లకు విక్రయిస్తున్నారు. మీ వద్ద కెనడా కోసం దేశం-ఆధారిత కోడ్ లేదు, కానీ యునైటెడ్ కింగ్‌డమ్ కోసం 3210.00.123 ఉంది. ఈ సందర్భంలో UK ఆర్డర్‌లు 3210.00.123ని ఉపయోగిస్తాయి మరియు కెనడియన్ ఆర్డర్‌లు 3210.00ని ఉపయోగిస్తాయి.

మీరు మీ ఉత్పత్తులకు ఒక్కొక్కటిగా, CSV ఫైల్‌తో లేదా బల్క్ ఎడిటర్ ఉపయోగించడం ద్వారా COOని జోడించవచ్చు. అలాగే మీరు, ఉత్పత్తికి ఏదీ అసైన్ చేయబడనప్పుడు ఉపయోగించడానికి ఒక డిఫాల్ట్ COOని కూడా సెట్ చేయవచ్చు.

షిప్పింగ్ లేబుల్‌లను కొనుగోలు చేసేటప్పుడు HS కోడ్‌లను జోడించండి

మీరు మీ ఉత్పత్తులకు ఇంకా HS కోడ్‌లను జోడించనట్లయితే, మీరు వాటిని లేబుల్ కొనుగోలు సమయంలో జోడించవచ్చు.

అంతర్జాతీయ ఆర్డర్‌లను నెరవేర్చే సిబ్బందికి ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ సమయంలో ఉత్పత్తి యొక్క HS కోడ్‌ను చూడటానికి మరియు ఉపయోగించడానికి తప్పనిసరిగా ఉత్పత్తులను వీక్షించండి అనుమతి ఉండాలి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లుకు వెళ్లండి.

  2. నెరవేర్చబడని ఐటెమ్‌లను కలిగి ఉన్న ఆర్డర్‌ను క్లిక్ చేయండి.

  3. నెరవేర్చబడనివి విభాగంలో, షిప్పింగ్ లేబుల్‌ను సృష్టించండిని క్లిక్ చేయండి.

  4. ఐటెమ్‌లు విభాగంలో, కస్టమ్స్ సమాచారాన్ని ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.

  5. ప్రతి ఐటెమ్ కోసం ఒక HS కోడ్‌ను జోడించండి.

  6. ఆప్షనల్: మీ ఉత్పత్తులను HS కోడ్‌తో అప్‌డేట్ చేయడానికి షిప్పింగ్ సమాచారాన్ని ఉత్పత్తి వివరాలకు సేవ్ చేయండిని ఎంచుకోండి.

  7. కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్‌ను అప్‌డేట్ చేయండి కింద, కింది ఆప్షన్‌లలో ఒకదాన్ని ఎంచుకోండి:

    • బహుళ ఆర్డర్‌లను అప్‌డేట్ చేయండి
    • ఈ ఆర్డర్ మాత్రమే
  8. సేవ్ క్లిక్ చేయండి.

ఉత్పత్తి పేజీలో HS కోడ్‌లను జోడించండి

మీరు అప్‌డేట్ చేయడానికి ఎక్కువ ఉత్పత్తులను కలిగి లేకపోతే, అలాగే మీ ఉత్పత్తి HS కోడ్‌లు మీకు తెలియకపోతే, అప్పుడు మీరు నేరుగా ఒక ఉత్పత్తి పేజీలో HS కోడ్‌ను జోడించవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఉత్పత్తులుకు వెళ్లండి.

  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ఉత్పత్తిని క్లిక్ చేయండి.

  3. షిప్పింగ్ విభాగంలో, ఫిజికల్ ఉత్పత్తి సెట్టింగ్ యాక్టివేట్ చేయబడిందని నిర్ధారించుకోండి.

  4. మీ ఉత్పత్తి వివరాలకు కస్టమ్స్ సమాచారాన్ని జోడించండి:

    1. మూల దేశం క్లిక్ చేయండి, ఆపై డ్రాప్-డౌన్ మెను నుండి మూల దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి.
    2. హార్మోనైజ్డ్ సిస్టమ్ (HS) కోడ్‌లో, ఒక HS కోడ్‌ను నమోదు చేయండి. మీ ఉత్పత్తికి HS కోడ్ లేకపోతే, తగిన కోడ్ కోసం శోధించడానికి మీ ఉత్పత్తి వివరణను టైప్ చేయడం ప్రారంభించండి.
  5. ఆప్షనల్: మీరు విక్రయించే దేశాలు మరియు ప్రాంతాలకు సంబంధించి మీకు మరింత వివరం అవసరమైతే, అప్పుడు మీరు మీ ఉత్పత్తిని ప్రాంతం ఆధారంగా మరింత వర్గీకరించవచ్చు:

    1. దేశ-నిర్దిష్ట HS కోడ్‌కు అదనపు అంకెలను జోడించండి. ప్రత్యామ్నాయంగా, Horizontal menu క్లిక్ చేయండి, ఆపై దేశం/ప్రాంతం ద్వారా HS కోడ్‌లను జోడించండిని క్లిక్ చేయండి.
    2. దేశం/ప్రాంతం ద్వారా HS కోడ్‌లను జోడించండి మోడల్ విండోలో, ఎంచుకోండి క్లిక్ చేయండి, ఆపై వర్గీకరణ కోసం దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి. మీరు మీ మార్కెట్‌ల నుండి దేశాలు లేదా ప్రాంతాలను మాత్రమే ఎంచుకోగలరు.
    3. HS కోడ్ విభాగంలో, ఆ ప్రాంతానికి నిర్దిష్టంగా ఉన్న HS కోడ్‌ను నమోదు చేయండి. సాధారణంగా, ఇది చివరలో అదనపు అంకెలు లేదా అక్షరాలు జోడించబడి ఉన్న ప్రామాణిక ఆరు-అంకెల కోడ్.
    4. అదనపు HS కోడ్‌లను జోడించడానికి, దేశం/ప్రాంతాన్ని జోడించండిని క్లిక్ చేయండి.
  6. జోడించండి క్లిక్ చేయండి.

బల్క్ ఎడిటర్‌ను ఉపయోగించి HS కోడ్‌లను జోడించండి

మీరు అప్‌డేట్ చేయడానికి ఎక్కువ ఉత్పత్తులను కలిగి లేకపోతే, అలాగే మీ ఉత్పత్తి HS కోడ్‌లు మీకు ముందుగానే తెలిసి ఉంటే, అప్పుడు మీరు బల్క్ ఎడిటర్‌ను ఉపయోగించి HS కోడ్‌ను అలాగే మూల దేశం లేదా ప్రాంతాన్ని జోడించవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఉత్పత్తులుకు వెళ్లండి.

  2. మీరు సవరించాలనుకుంటున్న ఉత్పత్తులను చెక్ చేయండి.

  3. బల్క్ ఎడిట్ క్లిక్ చేయండి.

  4. నిలువు వరుసలు క్లిక్ చేయండి.

  5. షిప్పింగ్ విభాగంలో, హార్మోనైజ్డ్ సిస్టమ్ కోడ్ మరియు మూల దేశంపై క్లిక్ చేయండి.

  6. మీ ఉత్పత్తులను అవసరమైన విధంగా ఎడిట్ చేయండి, ఆపై సేవ్ క్లిక్ చేయండి.

CSV ఫైల్‌ను దిగుమతి చేయడం ద్వారా HS కోడ్‌లు మరియు మూల దేశాన్ని జోడించండి

అప్‌డేట్ చేయడానికి మీ వద్ద చాలా ఉత్పత్తులు ఉన్నట్లయితే మరియు మీ ఉత్పత్తి HS కోడ్‌లు మీకు ఇప్పటికే తెలిసి ఉంటే, లేదా మీ ఉత్పత్తులలో వేటికి కోడ్‌లు లేవో మీకు ఖచ్చితంగా తెలియనట్లయితే, మీరు మీ ఉత్పత్తులను అప్‌డేట్ చేయడానికి CSV ఫైల్ను ఉపయోగించవచ్చు.

మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న మార్కెట్ కోసం నిర్వహించండి > సుంకాలు మరియు దిగుమతి పన్నులుపై క్లిక్ చేయడం ద్వారా, మీరు మార్కెట్‌లు వద్ద Shopify అడ్మిన్ నుండి కూడా ఈ సెట్టింగ్‌లకు వెళ్లవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు మరియు సుంకాలుకి వెళ్లండి.

  2. సుంకాలు మరియు దిగుమతి పన్నులు విభాగంలో, నిర్వహించండిని క్లిక్ చేయండి.

  3. సమాచారం మిస్ అయిన ఉత్పత్తుల CSV ఫైల్‌ను ఎగుమతి చేయండి.

    1. ఉత్పత్తి సమాచారం విభాగంలో, CSVతో అప్‌డేట్ చేయండిని క్లిక్ చేయండి.
    2. ఎగుమతి చేయండిని క్లిక్ చేయండి.
    3. మీరు ప్రాధాన్యత ఇచ్చే ఫైల్ ఆకృతిని ఎంచుకుని, ఉత్పత్తులను ఎగుమతి చేయండిని క్లిక్ చేయండి. మీకు ఇమెయిల్‌లో ఒక CSV ఫైల్ పంపబడుతుంది.
  4. Google Sheets లాంటి స్ప్రెడ్‌షీట్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించి మీ CSV ఫైల్‌ను ఎడిట్ చేయండి.

  5. మీరు ఎడిట్ చేసిన CSV ఫైల్‌ను దిగుమతి చేయండి.

    1. ఉత్పత్తి సమాచారం విభాగంలో, CSVతో అప్‌డేట్ చేయండిని క్లిక్ చేయండి.
    2. దిగుమతి చేయండిని క్లిక్ చేయండి.
    3. ఫైల్‌ను జోడించండిని క్లిక్ చేయడం ద్వారా లేదా దిగుమతి విండోకు మీ ఫైల్‌ను లాగి వదలడం ద్వారా, దిగుమతి చేయడానికి మీ ఫైల్‌ను జోడించండి.
    4. అప్‌లోడ్ చేయండి క్లిక్ చేయండి.
    5. దిగుమతి చేయండిని క్లిక్ చేయండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు ఇమెయిల్ పంపబడుతుంది.

సుంకాలు మరియు దిగుమతి పన్నుల CSV ఫైల్‌లోని నిలువు వరుసలు

సుంకాలు మరియు దిగుమతి పన్నుల CSV ఫైల్ అనేది, మీరు Shopifyలో ఉపయోగించే ఇతర CSV ఫైల్‌ల లాగానే ఉంటుంది, కానీ ఇది వేరే నిలువు వరుసలను కలిగి ఉంటుంది.

మీ ఉత్పత్తులకు HS కోడ్‌లు మరియు మూల దేశాన్ని జోడించడానికి మీరు ఉపయోగించే సుంకాలు మరియు దిగుమతి పన్నుల CSV ఫైల్‌లో ఉండే నిలువు వరుసల వివరణ.
నిలువు వరుసవివరణ
Product Handleహ్యాండిల్‌లు అనేవి ప్రతి ఉత్పత్తికి ఉండే ప్రత్యేకమైన పేర్లు. అవి అక్షరాలు, డ్యాష్‌లు మరియు సంఖ్యలను కలిగి ఉండవచ్చు, కానీ స్పేస్‌లు ఉండకూడదు. ప్రతి ఉత్పత్తి యొక్క URLలో హ్యాండిల్ ఉపయోగించబడుతుంది.
Product titleశీర్షిక (Title) నిలువు వరుస ఆప్షనల్, దాన్ని ఖాళీగా ఉంచవచ్చు.
Variant SKUఉత్పత్తి లేదా వేరియంట్‌కు సంబంధించిన స్టాక్ కీపింగ్ యూనిట్ (SKU). ఇన్వెంటరీ ట్రాకింగ్ సర్వీస్‌లతో ఇన్వెంటరీని ట్రాక్ చేయడానికి ఈ విలువ ఉపయోగించబడుతుంది.
Option1 Nameఒక ఉత్పత్తికి ఆప్షన్ ఉంటే, దాని పేరు ఈ నిలువు వరుసలో చూపబడుతుంది. ఉదాహరణకు, రంగు. కేవలం ఒకే ఆప్షన్ ఉన్న ఉత్పత్తుల కోసం, ఈ విలువ శీర్షిక (Title) అయి ఉండాలి.
Option1 Valueఒక ఉత్పత్తికి ఆప్షన్ ఉంటే, దానికి సంబంధించిన విలువ ఈ నిలువు వరుసలో చూపబడుతుంది. ఉదాహరణకు, నలుపు. కేవలం ఒకే ఆప్షన్ ఉన్న ఉత్పత్తుల కోసం, ఈ విలువ డిఫాల్ట్ శీర్షిక (Default Title) అయి ఉండాలి.
Option2 Nameఉత్పత్తికి రెండవ ఆప్షన్ ఉంటే, దాని పేరు ఈ నిలువు వరుసలో చూపబడుతుంది. ఉదాహరణకు, పరిమాణం.
Option2 Valueఉత్పత్తికి రెండవ ఆప్షన్ ఉంటే, దానికి సంబంధించిన విలువ ఈ నిలువు వరుసలో చూపబడుతుంది. ఉదాహరణకు, పెద్దది.
Option3 Nameఉత్పత్తికి మూడవ ఆప్షన్ ఉంటే, దాని పేరు ఈ నిలువు వరుసలో చూపబడుతుంది. ఉదాహరణకు, మెటీరియల్.
Option3 Valueఉత్పత్తికి మూడవ ఆప్షన్ ఉంటే, దాని విలువ ఈ నిలువు వరుసలో చూపబడుతుంది. ఉదాహరణకు, కాటన్.
Country of originఒక ఉత్పత్తి ఎక్కడ తయారు చేయబడిందో లేదా విక్రయించబడే రూపంలోకి అసెంబుల్ చేయబడిందో ఆ దేశాన్ని మూల దేశం అంటారు. ఈ నిలువు వరుసలోని విలువను అంతర్జాతీయ కస్టమర్‌ల కోసం సుంకాలు మరియు దిగుమతి పన్నులను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు.
HS codeHS కోడ్ అనేది అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఉత్పత్తిని వర్గీకరించే సంఖ్య. ఈ నిలువు వరుసలోని విలువను అంతర్జాతీయ కస్టమర్‌ల కోసం సుంకాలు మరియు దిగుమతి పన్నులను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు.

డిఫాల్ట్ మూల దేశాన్ని సెట్ చేయండి

మీరు మీ స్టోర్‌లోని ఉత్పత్తుల కోసం ఉపయోగించడానికి డిఫాల్ట్ మూల దేశాన్ని సెట్ చేయవచ్చు. మీ ఉత్పత్తులలో ఎక్కువ భాగం ఒకే మూల దేశం లేదా ప్రాంతం నుండి వచ్చినట్లయితే, సుంకాలు మరియు దిగుమతి పన్నుల లెక్కింపు కోసం ఆటోమేటిక్‌గా ఉపయోగించడానికి మీరు ఒక COOని సెట్ చేయవచ్చు. ఉత్పత్తికి ఏ COO కేటాయించబడనప్పుడు మాత్రమే డిఫాల్ట్ COO ఉపయోగించబడుతుంది. ఒకవేళ ఉత్పత్తికి ఇప్పటికే COO కేటాయించబడి ఉంటే, ఆటోమేటిక్‌గా సెట్ చేయబడిన డిఫాల్ట్ COO స్థానంలో మాన్యువల్‌గా కేటాయించిన COO వర్తిస్తుంది.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > పన్నులు మరియు సుంకాలుకి వెళ్లండి.

  2. కస్టమ్స్ సమాచారం విభాగంలో, Horizontal menuను క్లిక్ చేయండి.

  3. డిఫాల్ట్ మూల దేశంను క్లిక్ చేయండి.

  4. మీ ఉత్పత్తుల కోసం డిఫాల్ట్ COOగా ఉపయోగించడానికి దేశాన్ని ఎంచుకోండి.

  5. సేవ్ క్లిక్ చేయండి.

Managed Marketsలో HS కోడ్‌లు మరియు మూల దేశం

మీరు Managed Marketsను యాక్టివేట్ చేసినప్పుడు, మీ స్టోర్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. వాటిలో మీ ఉత్పత్తుల కస్టమ్స్ సమాచారంలో జరిగే మార్పు ఒకటి:

  • మీ ఉత్పత్తులకు HS కోడ్‌లు ఆటోమేటిక్‌గా కేటాయించబడతాయి. మీ ఉత్పత్తులకు ఇప్పటికే HS కోడ్‌లు కేటాయించబడి ఉంటే, మీ ఉత్పత్తులకు Managed Markets వర్తింపజేసే HS కోడ్‌లను నిర్ణయించేటప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, మీ ఉత్పత్తి కోసం మీరు నమోదు చేసిన ఖచ్చితమైన HS కోడ్‌నే Managed Markets కూడా ఉపయోగిస్తుందని గ్యారెంటీ లేదు.
  • మీ స్టోర్‌లో మీరు ఇప్పటికే డిఫాల్ట్ COOను సెట్ చేయకపోయి ఉంటే, మీ ఉత్పత్తులు అత్యధికంగా ఎక్కడ తయారవుతాయి అనేదాని ఆధారంగా Managed Markets ఒక డిఫాల్ట్ COOను కేటాయిస్తుంది. మీరు ఇప్పటికే డిఫాల్ట్ COOని కలిగి ఉంటే, ఎటువంటి మార్పులు ఉండవు.

మీరు మీ ఉత్పత్తులకు మాన్యువల్‌గా HS కోడ్‌లు మరియు COOని కేటాయించినట్లయితే, Managed Markets వాటికి కేటాయించే HS కోడ్‌లతో మీరు వాటిని సమీక్షించవచ్చు మరియు పోల్చి చూడవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఉత్పత్తులుకు వెళ్లండి.

  2. మీరు సమీక్షించాలనుకుంటున్న ఉత్పత్తిని క్లిక్ చేయండి.

  3. షిప్పింగ్ విభాగంలో, హార్మోనైజ్డ్ సిస్టమ్ (HS) కోడ్ పక్కన ఉన్న Horizontal menuను క్లిక్ చేయండి.

  4. Managed Markets కోడ్‌లుపై క్లిక్ చేయండి.