బాట్ రకాలు, వాటి ఉద్దేశాలు

బాట్‌లలో వేర్వేరు రకాలు ఉండటంతో పాటు, అవి వేర్వేరు ఉద్దేశాలను కలిగి ఉంటాయి. బాట్ ఫంక్షన్ అనేది దాని ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. బాట్‌లను వాటి ఉద్దేశం ఆధారంగా ప్రయోజనకరమైనవి, అవాంఛనీయమైనవి, అలాగే హానికరమైనవిగా వర్గీకరించవచ్చు.

ఈ ఆర్టికల్‌లో, మీరు వేర్వేరు బాట్ రకాల గురించి, అలాగే అవి మీ Shopify స్టోర్‌పై ఎలా ప్రభావం చూపుతాయో తెలిపే ఉదాహరణల గురించి మరింత తెలుసుకోవచ్చు.

బాట్ ఉద్దేశాలను అర్థం చేసుకోవడం

ప్రతి ఆటోమేటెడ్ చర్య వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, ఆయా కార్యకలాపాల ప్రభావాన్ని వర్గీకరించడానికి, అలాగే అంచనా వేయడానికి, అంతేకాకుండా Shopifyను రక్షించడానికి, దాన్ని మరింత మెరుగుపరచడానికి వాటిని సమర్థవంతంగా నిర్వహించడంలో ఇది Shopifyకి సహాయపడుతుంది.

ఆటోమేటెడ్ ట్రాఫిక్‌ను నడిపించే అంతర్లీన ప్రయోజనం లేదా లక్ష్యమే ఉద్దేశం. ఉద్దేశాన్ని బట్టి ఆటోమేటెడ్ యాక్టివిటీ ప్రయోజనకరమైనదా, అవాంఛనీయమైనదా లేదా హానికరమైనదా అని మీరు గుర్తించవచ్చు. ఆటోమేటెడ్ యాక్టివిటీస్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా కింది ప్రయోజనాలు ఉండవచ్చు:

  • వ్యూహాన్ని మెరుగుపరచడం: వివిధ ఉద్దేశాలను గుర్తించి, వాటిని అర్థం చేసుకోవడం ద్వారా, మీరు రక్షణ కోసం వ్యూహాత్మక చర్యలను రూపొందించవచ్చు, అలాగే అవి మీ వ్యాపార లక్ష్యాలు, విలువలకి అనుగుణంగా ఉండేలా చూసుకోవచ్చు.
  • పనితీరును ఆప్టిమైజ్ చేయడం: ప్రయోజనకరమైన ఉద్దేశాలను గుర్తించడం వల్ల, సానుకూల ఆటోమేషన్‌కు మద్దతు లభించి, అది మెరుగుపడుతుంది. అలాగే ఇది మొత్తం సామర్థ్యాన్ని పెంచుతుంది.
  • కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడం: ఉద్దేశాలకు సంబంధించి ఒక షేర్డ్ లాంగ్వేజ్, అలాగే స్పష్టమైన వివరణలను ఏర్పాటు చేయడం ద్వారా మీకు, మీ కస్టమర్‌లకు మధ్య మెరుగైన కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది.

బాట్ ఉద్దేశాల కేటగిరీలు

బాట్ ఉద్దేశాలలోని వివిధ కేటగిరీల గురించి మరింత తెలుసుకోవడానికి కింది పట్టికను రివ్యూ చేయండి.

బాట్ ఉద్దేశాలలోని వివిధ కేటగిరీలు
బాట్ ఉద్దేశంవివరణ
ప్రయోజనకరమైనవివిలువను అందించే ఆటోమేటెడ్ కార్యకలాపాలు. ఈ బాట్‌లు ఫంక్షనాలిటీని పెంచుతాయి, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే స్టోర్ కార్యకలాపాలకు సానుకూలంగా సహకరిస్తాయి.
అవాంఛనీయమైనవిఈ బాట్‌ల వల్ల ప్లాట్‌ఫామ్‌కు పెద్దగా ఎలాంటి ప్రయోజనం ఉండదు లేదా హాని కూడా జరగదు. అయితే వీటిలో కొన్ని మీ వ్యాపార లక్ష్యాలకు నేరుగా ఎలాంటి సహకారం అందించకపోయినప్పటికీ, అవి ఎటువంటి తక్షణ ముప్పును కలిగించవు.
హానికరమైనవిఈ బాట్‌లు భద్రత, పనితీరు లేదా కీర్తికి ప్రమాదాలను కలిగిస్తాయి. ఈ కార్యకలాపాల పట్ల తక్షణ శ్రద్ధ వహించి, దాన్ని తగ్గించాల్సి ఉంటుంది.

ప్రయోజనకరమైన బాట్‌లు

సెర్చ్ ఇంజిన్‌లలో మీ స్టోర్ విజిబిలిటీని నిర్వహించడంలో సహాయపడే SEO ఇండెక్సర్‌ల లాంటి చట్టబద్ధమైన వ్యాపార విధులను లేదా వికలాంగులైన కస్టమర్‌లు స్టోర్‌ఫ్రంట్‌ను నావిగేట్ చేయడానికి ఉపయోగించే యాక్సెసిబిలిటీ టూల్స్‌ను ప్రయోజనకరమైన బాట్‌లు కలిగి ఉంటాయి. ప్రయోజనకరమైన బాట్ రకాలు, వాటి ప్రభావం గురించి మరింత తెలుసుకోవడానికి కింది పట్టికను రివ్యూ చేయండి.

ప్రయోజనకరమైన బాట్‌ల ఉదాహరణలు, వాటి ప్రభావం
ప్రయోజనకరమైన బాట్‌కి ఉదాహరణవివరణ
SEO ఇండెక్సర్ బాట్సెర్చ్ ఇంజిన్‌లలో ఒక వెబ్‌సైట్ ర్యాంకింగ్, లిస్టింగ్ అప్‌డేట్‌గా ఉన్నాయని నిర్ధారించడానికి, ఇది ఆ వెబ్‌సైట్‌ను క్రాల్ చేస్తుంది.
కస్టమర్‌లు, యాక్సెసిబిలిటీ బాట్ఇది కస్టమర్ ఖాతాకు సైన్ అప్ చేస్తుంది, మీ స్టోర్‌ను బ్రౌజ్ చేస్తుంది, కార్ట్‌కు ఉత్పత్తిని జోడిస్తుంది, ఉత్పత్తిని చెక్‌అవుట్ చేస్తుంది, యాక్సెసిబిలిటీ టూల్స్‌ను ఉపయోగించి వెబ్‌పేజీని బ్రౌజ్ చేస్తుంది లేదా యాక్సెసిబిలిటీ టూల్‌ను ఉపయోగించి ఉత్పత్తిని కొనుగోలు చేస్తుంది.
ఆటోమేటెడ్ అధీకృత ఇంటిగ్రేషన్‌ల బాట్వ్యాపారుల స్టోర్‌ను నిర్వహించడానికి యాప్‌లను సెటప్ చేస్తుంది.

అవాంఛనీయ బాట్‌లు

అవాంఛనీయ బాట్‌లు తటస్థమైన లేదా మిశ్రమ ఉద్దేశాలను కలిగి ఉంటాయి. ఇవి Shopify ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారం మోపే అనధికారిక లోడ్ పరీక్షల లాంటివి లేదా అనుమతి లేకుండా డేటాను సేకరించే తెలియని స్క్రాపర్‌ల లాంటివి. అవాంఛనీయ బాట్ రకాలు, వాటి ప్రభావం గురించి మరింత తెలుసుకోవడానికి కింది పట్టికను రివ్యూ చేయండి.

అవాంఛనీయ బాట్‌ల ఉదాహరణలు, వాటి ప్రభావం
అవాంఛనీయ బాట్‌కి ఉదాహరణవివరణ
అనధికారిక లోడ్ పరీక్షల బాట్ముందస్తు హెచ్చరిక లేకుండానే, స్టోర్ల ట్రాఫిక్‌ను Shopify హ్యాండిల్ చేయగలదని ఇది నిర్ధారిస్తుంది.
ఆటోమేటెడ్ వ్యాపారి సైన్అప్ క్రియేషన్ బాట్ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారం వేస్తుంది, కీర్తిని దెబ్బతీస్తుంది లేదా Shopify ఇమెయిల్‌లతో వినియోగదారులను స్పామ్ చేస్తుంది
తెలియని స్క్రాపర్ బాట్డేటాను సేకరిస్తుంది, టాస్క్‌లను ఆటోమేట్ చేస్తుంది, పరిమితమైన కంటెంట్‌ను యాక్సెస్ చేస్తుంది, నకిలీ కంటెంట్ సమస్యలను సృష్టిస్తుంది, సెర్చ్ ఇంజిన్‌లను గందరగోళానికి గురిచేస్తుంది లేదా క్లిక్ మోసానికి పాల్పడుతుంది.
ఫారమ్, అలాగే బ్లాగ్ స్పామ్ బాట్మెరుగైన ర్యాంకింగ్ కోసం SEO బ్యాక్‌లింకింగ్ చేస్తుంది, స్థిరపడిన వెబ్‌సైట్ ర్యాంకింగ్‌ను దెబ్బతీయడానికి SEOపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, వ్యాపారికి ఉండే Google ట్రస్ట్ రేటింగ్‌ను తగ్గిస్తుంది లేదా వ్యాపారులను వేధిస్తుంది.
రీస్టాక్ బాట్ఇది ఇన్వెంటరీ సమాచారాన్ని స్క్రాప్ చేస్తుంది, ఉత్పత్తులను రీస్టాక్ చేసిన వెంటనే వాటిని ఆటోమేటిక్‌గా కొనుగోలు చేస్తుంది, ఇంకా పబ్లిక్ చేయబడని (ఫుట్‌ప్రింటింగ్) లైవ్ వెబ్ URLల కోసం వెతుకుతుంది, అలాగే ఇన్వెంటరీని యాక్సెస్ చేయనివ్వదు.
చెక్‌అవుట్ బాట్ఉత్పత్తులను ఆటోమేటిక్‌గా కొనుగోలు చేస్తుంది, అలాగే చెక్‌అవుట్ క్యూ సమయాన్ని పెంచుతుంది

హానికరమైన బాట్‌లు

సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ (DDoS) దాడుల లాంటివి లేదా ఆర్థిక మోసం, అలాగే డేటా చౌర్యానికి పాల్పడే బాట్‌ల లాంటి హానికరమైన ఉద్దేశాలను హానికరమైన బాట్‌లు కలిగి ఉంటాయి. హానికరమైన బాట్ రకాలు, వాటి ప్రభావం గురించి మరింత తెలుసుకోవడానికి కింది పట్టికను రివ్యూ చేయండి.

హానికరమైన బాట్‌ల ఉదాహరణలు, వాటి ప్రభావం
హానికరమైన బాట్‌కి ఉదాహరణవివరణ
డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ (DDoS) బాట్Shop లేదా Shopify సాధారణ పనితీరుకు దురుద్దేశపూర్వకంగా ఆటంకం కలిగిస్తుంది. ఒక పంపిణీ చేయబడిన సిస్టమ్‌ను (distributed system) ఉపయోగించుకుని, తక్కువ వ్యవధిలో పెద్ద మొత్తంలో వెబ్ అభ్యర్థనలను పంపడం ద్వారా దాడి చేసేవారు Shopify ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఓవర్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ దాడిని ఆటోమేటిక్‌గా గుర్తించి, బ్లాక్ చేయడాన్ని మరింత కష్టతరం చేయడానికి పంపిణీ చేయబడిన సిస్టమ్ ఉపయోగించబడుతుంది.
ప్రైవేట్ డేటాను దొంగిలించే బాట్మీ సంస్థ నుండి ప్రైవేట్ డేటాను లేదా కస్టమర్ల ప్రైవేట్ డేటాను బయటకు బదిలీ చేస్తుంది
ఆటోమేటెడ్ కస్టమర్ సైన్అప్ క్రియేషన్ బాట్డొమైన్ మరియు ఇమెయిల్ ప్రతిష్టను దిగజారుస్తుంది, మార్కెటింగ్ ప్రయత్నాలను కష్టతరం చేసి యాడ్ వ్యయంపై రాబడి (ROAS) మీద ప్రభావం చూపుతుంది, సైన్ అప్ చేయని కస్టమర్లకు ఇమెయిల్‌లను పంపడం ద్వారా స్టోర్ ప్రతిష్టను దెబ్బతీస్తుంది, ఆటోమేటిక్‌గా ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది లేదా క్లిక్ మోసానికి పాల్పడుతుంది.
ఆర్థిక మోసాల బాట్ఉచిత ఉత్పత్తులను పొందడానికి మోసపూరిత ఆర్డర్‌లను సృష్టిస్తుంది, కార్డ్ వివరాలు చెల్లుబాటు అవుతాయో లేదో నిర్ధారించుకోవడానికి కార్డ్‌లను పరీక్షిస్తుంది లేదా వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఛార్జ్‌బ్యాక్‌లను జారీ చేస్తుంది.
కౌంటర్‌ఫిట్ స్క్రాపర్ బాట్కంటెంట్‌ను క్లోన్ చేయడానికి వెబ్‌సైట్‌ను స్క్రాప్ చేస్తుంది, SEOపై ప్రతికూల దాడులు చేస్తుంది లేదా డబ్బు సంపాదించడానికి ఒక స్టోర్‌లా నటిస్తుంది.