చైనాలోని వ్యాపారుల కోసం క్రాస్-బోర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ గైడ్
క్రాస్-బోర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్‌లో చైనా నుండి ప్రపంచవ్యాప్తంగా కస్టమర్‌లకు ఉత్పత్తులను అందించడం ఇమిడి ఉంటుంది. మీ ఫుల్‌ఫిల్‌మెంట్ వ్యూహం డెలివరీ వేగం, షిప్పింగ్ ఖర్చులు, కస్టమర్ అనుభవం మరియు మీ నగదు ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. మీ వ్యాపార దశకు సరైన ఫుల్‌ఫిల్‌మెంట్ విధానాన్ని ఎంచుకోవడానికి మరియు మీ షిప్పింగ్ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి ఈ గైడ్ మీకు సహాయం చేస్తుంది.
ఈ పేజీలో
క్రాస్-బోర్డర్ లాజిస్టిక్స్ ఓవర్‌వ్యూ
క్రాస్-బోర్డర్ షిప్పింగ్‌లో కింది ఐదు ప్రధాన దశలు ఇమిడి ఉంటాయి:
- ఫస్ట్ మైల్ పికప్: మీ లొకేషన్ లేదా సరఫరాదారు నుండి సేకరించబడిన ఉత్పత్తులు
- హెడ్ హాల్ ట్రాన్స్‌పోర్ట్: అంతర్జాతీయ షిప్పింగ్ హబ్‌కు తరలించిన ఉత్పత్తులు
- ట్రంక్ లైన్ ట్రాన్స్‌పోర్ట్: అంతర్జాతీయ విమాన లేదా సముద్ర రవాణా
- కస్టమ్స్ క్లియరెన్స్: గమ్య స్థానంలో ఉండే దేశం యొక్క కస్టమ్స్ ద్వారా క్లియర్ చేయబడిన ఉత్పత్తులు
- లాస్ట్ మైల్ డెలివరీ: కస్టమర్ అడ్రస్‌కు ఫైనల్ డెలివరీ
ప్రతి దశలో సంభావ్య జాప్యాలు మరియు ఖర్చులు ఉంటాయి. ఈ చైన్‌ను అర్థం చేసుకోవడం ద్వారా మీరు వాస్తవిక డెలివరీ అంచనాలను సెట్ చేయవచ్చు మరియు ఆప్టిమైజేషన్ అవకాశాలను గుర్తించవచ్చు.
షిప్పింగ్ దశల వివరణ
మొత్తం షిప్పింగ్ చైన్ చూడటానికి సరళంగా కనిపించినా, సమస్యలు తరచుగా వివరాలలోనే ఉత్పన్నమవుతాయి. క్యారియర్ మరియు రూట్‌ను బట్టి రవాణా సమయాలు మారుతూ ఉంటాయి, దేశాన్ని బట్టి కస్టమ్స్ విధానాలు భిన్నంగా ఉంటాయి మరియు అన్ని దశలలోనూ ట్రాకింగ్ సిస్టమ్‌లు స్థిరంగా అప్‌డేట్ కాకపోవచ్చు.
సాధారణ లాజిస్టిక్స్ సవాళ్లు
చైనా నుండి షిప్పింగ్ చేసేటప్పుడు, ఈ సవాళ్ల కోసం సిద్ధంగా ఉండండి:
- అస్థిరమైన రవాణా సమయాలు: విభిన్న క్యారియర్‌లు మరియు రూట్‌లు వేర్వేరు వేగాలను కలిగి ఉంటాయి. రద్దీ సీజన్లలో డెలివరీ సమయాలకు మరో 10-15 రోజులు పట్టవచ్చు.
- కస్టమ్స్ రిస్క్‌లు: అసంపూర్ణ డాక్యుమెంటేషన్, సరికాని డిక్లరేషన్‌లు లేదా పరిమితం చేయబడిన ఉత్పత్తుల వలన జప్తు చేయడానికి లేదా రిటర్న్‌లకు దారి తీయవచ్చు.
- ట్రాకింగ్ అంతరాలు: ప్యాకేజీలు అంతర్జాతీయ రవాణాలోకి ప్రవేశించిన తర్వాత దేశీయ ట్రాకింగ్ అప్‌డేట్ కావడం ఆగిపోవచ్చు, ఇది కస్టమర్‌లలో ఆందోళన కలిగిస్తుంది.
ఫుల్‌ఫిల్‌మెంట్ మోడల్‌ను ఎంచుకోవడం
చైనాకు చెందిన చాలా మంది వ్యాపారులు నాలుగు ఫుల్‌ఫిల్‌మెంట్ మోడల్‌లలో ఒకదానిని ఉపయోగిస్తారు. మీ ఎంపిక అనేది మీ వ్యాపార దశ, ఆర్డర్ వాల్యూమ్, మూలధనం మరియు డెలివరీ వేగం ఆవశ్యకతలపై ఆధారపడి ఉంటుంది.
| మోడల్ | డెలివరీ సమయం | అవసరమైన మూలధనం | దీనికి ఉత్తమమైనది |
|---|---|---|---|
| చైనా నుండి సెల్ఫ్-ఫుల్‌ఫిల్‌మెంట్ | 10-30 రోజులు | తక్కువ | ఉత్పత్తులను పరీక్షించడం, తక్కువ ఆర్డర్ పరిమాణం |
| డ్రాప్‌షిప్పింగ్ | 15-40 రోజులు | చాలా తక్కువ | ఉత్పత్తి ధృవీకరణ, పరిమిత బడ్జెట్ |
| వర్చువల్ విదేశీ గిడ్డంగి | 7-10 రోజులు | మధ్యస్థం | అభివృద్ధి చెందుతున్న విక్రేతలు (రోజుకు 5-10 ఆర్డర్‌లు) |
| విదేశీ గిడ్డంగి | 2-5 రోజులు | ఎక్కువ | విస్తరిస్తున్న విక్రేతలు (రోజుకు 10-20+ ఆర్డర్‌లు) |
చైనా నుండి సెల్ఫ్-ఫుల్‌ఫిల్‌మెంట్
సెల్ఫ్-ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే మీరు ఉత్పత్తులను కొనుగోలు చేసి, ప్యాకేజీ చేసి, మీ కస్టమర్‌లకు రవాణా చేసే ఫ్రైట్ ఫార్వార్డర్‌కు పంపడం. దాదాపు 80% కొత్త క్రాస్-బోర్డర్ విక్రేతలు ఈ మోడల్‌తోనే ప్రారంభిస్తారు.
ఇది ఎలా పని చేస్తుంది:
- మీరు మీ Shopify స్టోర్‌లో ఆర్డర్‌ను స్వీకరిస్తారు.
- మీరు మీ ఇన్వెంటరీ నుండి ఉత్పత్తిని కొనుగోలు చేస్తారు లేదా తిరిగి పొందుతారు.
- మీరు ఉత్పత్తిని ప్యాకేజీ చేసి, షిప్పింగ్ లేబుల్‌లను సృష్టిస్తారు.
- మీరు ప్యాకేజీలను మీ ఫ్రైట్ ఫార్వార్డర్ దేశీయ గిడ్డంగికి పంపుతారు.
- ఫ్రైట్ ఫార్వార్డర్ అంతర్జాతీయ షిప్పింగ్, అలాగే లాస్ట్-మైల్ డెలివరీని చూసుకుంటారు.
ఈ మోడల్‌ను ఎప్పుడు ఉపయోగించాలి:
- మీరు కొత్త ఉత్పత్తులను పరీక్షిస్తూ, బల్క్ ఇన్వెంటరీలో పెట్టుబడి పెట్టకూడదనుకుంటే
- మీ ఆర్డర్ పరిమాణం రోజుకు 5 ఆర్డర్‌ల కంటే తక్కువగా ఉంటే
- ప్యాకేజింగ్, అలాగే నాణ్యతపై మీకు పూర్తి నియంత్రణ కావాలనుకుంటే
డ్రాప్‌షిప్పింగ్
డ్రాప్‌షిప్పింగ్‌తో మీరు ఇన్వెంటరీని మెయింటెయిన్ చేయరు. కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు, మీరు సరఫరాదారు నుండి ఉత్పత్తిని కొనుగోలు చేస్తారు, వారు నేరుగా కస్టమర్‌కు దాన్ని రవాణా చేస్తారు.
ప్రయోజనాలు:
- ఇన్వెంటరీలో ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు
- ప్రారంభించడానికి తక్కువ అడ్డంకులు
- ఉత్పత్తి-మార్కెట్ ఫిట్‌ను పరీక్షించడానికి ఉత్తమమైనది
ప్రతికూలతలు:
- ఎక్కువ డెలివరీ సమయాలు (15-40 రోజులు)
- పరిమిత నాణ్యత నియంత్రణ
- కస్టమ్ బ్రాండింగ్ లేదా ప్యాకేజింగ్ ఉండదు
- ఇన్వెంటరీ సింక్ సమస్యల వల్ల ఓవర్‌సెల్లింగ్ జరగవచ్చు
ఈ మోడల్‌ను ఎప్పుడు ఉపయోగించాలి:
- ఇన్వెంటరీలో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు ఉత్పత్తి ఐడియాలను నిర్ధారిస్తుంటే
- మీ వద్ద పరిమిత మూలధనం ఉంటే
- అనిశ్చిత డిమాండ్ ఉన్న ట్రెండింగ్ ఉత్పత్తులను మీరు విక్రయిస్తుంటే
మీరు డ్రాప్‌షిప్పింగ్‌ను ఉపయోగిస్తుంటే, మీ డ్రాప్‌షిప్పింగ్ యాప్ ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్ మీ Shopify అడ్మిన్‌లో సరిగ్గా కాన్ఫిగర్ చేయబడిందని నిర్ధారించుకోండి. షిప్పింగ్ రేట్‌లు ప్రదర్శించబడటానికి, అలాగే ట్రాకింగ్ సరిగ్గా సింక్ అవ్వడానికి ఉత్పత్తులు సరైన లొకేషన్‌కు కేటాయించబడాలి.
వర్చువల్ విదేశీ గిడ్డంగి
వర్చువల్ విదేశీ గిడ్డంగి అనేది ఒక హైబ్రిడ్ మోడల్, దీనిలో మీరు లాస్ట్-మైల్ లేబుల్‌లను ముందే ప్రింట్ చేసి (US గమ్యస్థానాల కోసం USPS లేబుల్‌ల వలె), ఉత్పత్తులను దేశీయంగా ప్యాకేజీ చేస్తారు, ఆపై వాటిని గమ్యస్థాన దేశానికి విమాన రవాణా ద్వారా పంపుతారు, అక్కడ స్థానిక క్యారియర్ డెలివరీని పూర్తి చేస్తారు.
ఇది ఎలా పని చేస్తుంది:
- గమ్యస్థాన దేశ క్యారియర్ కోసం మీరు లాస్ట్-మైల్ లేబుల్‌లను రూపొందిస్తారు.
- ఈ లేబుల్‌లను జత చేసి మీరు ఉత్పత్తులను దేశీయంగా ప్యాకేజీ చేస్తారు.
- ఒక ఫ్రైట్ ఫార్వార్డర్ ప్యాకేజీలను ఏకీకృతం చేసి, విమాన రవాణా ద్వారా పంపుతారు.
- ప్యాకేజీలు గిడ్డంగిలో నిల్వ చేయకుండా నేరుగా స్థానిక క్యారియర్‌కు (USPS లాంటివి) అందజేయబడతాయి.
- కస్టమర్‌లు "USA నుండి రవాణా చేయబడింది" లేదా అదే విధంగా ప్రదర్శించే ట్రాకింగ్‌ను స్వీకరిస్తారు.
ప్రయోజనాలు:
- పూర్తిగా దేశీయ ఫుల్‌ఫిల్‌మెంట్ కంటే వేగవంతమైన డెలివరీ (7-10 రోజులు)
- విదేశీ గిడ్డంగి కంటే తక్కువ మూలధన అవసరం
- కస్టమర్ ట్రాకింగ్ స్థానిక మూలాన్ని చూపుతుంది
- నిల్వ రుసుములు లేవు
ఈ మోడల్‌ను ఎప్పుడు ఉపయోగించాలి:
- మీరు స్థిరమైన ఆర్డర్ పరిమాణాన్ని కలిగి ఉంటే (రోజుకు 5-10 ఆర్డర్‌లు)
- విదేశీ గిడ్డంగికి అవసరమయ్యే మూలధన నిబద్ధత లేకుండా మీరు వేగవంతమైన డెలివరీని కోరుకుంటే
- మీరు విస్తరిస్తూ ఒక బ్రిడ్జ్ పరిష్కారం అవసరమైతే
విదేశీ గిడ్డంగి
విదేశీ గిడ్డంగితో, మీరు మీ లక్ష్య మార్కెట్‌లోని గిడ్డంగికి సముద్ర లేదా విమాన రవాణా ద్వారా బల్క్ ఇన్వెంటరీని రవాణా చేస్తారు. ఆర్డర్‌లు ఈ గిడ్డంగి నుండి స్థానికంగా ఫుల్‌ఫిల్ చేయబడతాయి.
ప్రయోజనాలు:
- అత్యంత వేగవంతమైన డెలివరీ సమయాలు (2-5 రోజులు)
- అత్యుత్తమ కస్టమర్ అనుభవం
- సులభమైన రిటర్న్‌ల హ్యాండ్లింగ్
- దేశీయ విక్రేతలతో పోటీ పడేందుకు వీలుంటుంది
ప్రతికూలతలు:
- బల్క్ ఇన్వెంటరీ కోసం అధిక మూలధనం అవసరం
- నిల్వ రుసుములు నెలనెలా పెరుగుతాయి
- ఉత్పత్తులు అమ్ముడుపోకపోతే డెడ్ స్టాక్ ప్రమాదం ఉంటుంది
- సంక్లిష్టమైన ఇన్వెంటరీ అంచనా
మీ వ్యాపార దశకు ఫుల్‌ఫిల్‌మెంట్‌ను సరిపోల్చడం
మీ వ్యాపారం వృద్ధి చెందుతున్న కొద్దీ మీ ఫుల్‌ఫిల్‌మెంట్ వ్యూహం కూడా మారాలి. మీ ఆర్డర్‌లు పెరిగే కొద్దీ, మీరు మీ ఫుల్‌ఫిల్‌మెంట్ విధానాన్ని మార్చుకోవడాన్ని పరిగణించవచ్చు.
పరీక్షా దశ (రోజుకు 0-5 ఆర్డర్‌లు):
- చైనా నుండి డ్రాప్‌షిప్పింగ్ లేదా సెల్ఫ్-ఫుల్‌ఫిల్‌మెంట్‌ను ఉపయోగించండి
- ఉత్పత్తులను ధృవీకరించడం, అలాగే లాభదాయకమైన ఉత్పత్తులను కనుగొనడంపై దృష్టి పెట్టండి
- ఇన్వెంటరీ లేదా ఫాస్ట్ షిప్పింగ్‌లో భారీగా పెట్టుబడి పెట్టకండి
వృద్ధి దశ (రోజుకు 5-10 ఆర్డర్‌లు):
- వేగవంతమైన డెలివరీ కోసం వర్చువల్ విదేశీ గిడ్డంగికి మారండి
- విశ్వసనీయత కోసం 2-3 ఫ్రైట్ ఫార్వార్డర్‌లతో పని చేయండి
- విశ్వసనీయ సరఫరాదారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం ప్రారంభించండి
స్కేలింగ్ దశ (రోజుకు 10-20+ ఆర్డర్‌లు):
- ఎక్కువగా అమ్ముడయ్యే ఉత్పత్తుల కోసం విదేశీ గిడ్డంగిని పరిగణించండి
- నెమ్మదిగా అమ్ముడయ్యే ఐటెమ్‌ల కోసం స్వీయ-ఫుల్‌ఫిల్‌మెంట్‌ను కొనసాగించండి
- ఇన్వెంటరీ అంచనా మరియు నిర్వహణలో పెట్టుబడి పెట్టండి
- గిడ్డంగుల అంతటా ఇన్వెంటరీని నిర్వహించడానికి బహుళ ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్‌లను సెటప్ చేసి, ఆర్డర్ రూటింగ్ను కాన్ఫిగర్ చేయండి
లాజిస్టిక్స్ ఛానెల్‌లను ఎంచుకోవడం
వేర్వేరు ఉత్పత్తులు మరియు గమ్యస్థానాలకు వేర్వేరు లాజిస్టిక్స్ ఛానెల్‌లు సరిపోతాయి. మీ లక్ష్య మార్కెట్‌లలో ప్రత్యేకత కలిగిన ఫ్రైట్ ఫార్వార్డర్‌లతో పని చేయండి.
గమ్యస్థానం వారీగా ఛానెల్‌లు
| గమ్యం | సిఫార్సు చేసిన ఛానెల్‌లు | సాధారణ డెలివరీ |
|---|---|---|
| యునైటెడ్ స్టేట్స్ మరియు యూరప్ | ప్రత్యేకమైన క్రాస్-బోర్డర్ క్యారియర్‌లు | 7-12 రోజులు |
| మధ్యప్రాచ్యం మరియు ఆగ్నేయాసియా | ప్రాంతీయ క్యారియర్‌లు | 10-15 రోజులు |
| బరువైన లేదా పెద్ద ఐటెమ్‌లు | సముద్ర రవాణా + స్థానిక డెలివరీ | 30-45 రోజులు |
| అధిక-విలువ గల ఉత్పత్తులు | అంతర్జాతీయ ఎక్స్‌ప్రెస్ | 3-5 రోజులు |
ఉత్పత్తి రకం వారీగా ఛానెల్‌లు
కింది మోడల్‌లను ఉపయోగించి మీ ఉత్పత్తి లక్షణాలకు తగిన షిప్పింగ్ ఛానెల్‌ను ఎంచుకోండి:
- అధిక-విలువ, అధిక-మార్జిన్ ఉన్న ఉత్పత్తులు: 3-5 రోజుల డెలివరీ కోసం అంతర్జాతీయ ఎక్స్‌ప్రెస్‌ను (DHL, UPS) ఉపయోగించండి. ఇక్కడ మార్జిన్ ద్వారా, ఎక్కువయ్యే షిప్పింగ్ ఖర్చు సరిచేయబడుతుంది.
- మధ్యస్థ-విలువ గల ఉత్పత్తులు: 10-15 రోజుల డెలివరీ కోసం ప్రత్యేకమైన క్రాస్-బోర్డర్ క్యారియర్‌లు లేదా EMSను (ఎక్స్‌ప్రెస్ మెయిల్ సర్వీస్) ఉపయోగించండి.
- తక్కువ ఖర్చు గల ఉత్పత్తులు: 20-40 రోజుల డెలివరీ కోసం ఎకానమీ ఛానెల్‌లను (చైనా పోస్ట్ వంటివి) ఉపయోగించండి. మీ షిప్పింగ్ విధానంలో డెలివరీ సమయాలను స్పష్టంగా పేర్కొనండి.
ఫ్రైట్ ఫార్వార్డర్‌లతో పని చేయడం
ఎల్లప్పుడూ అత్యంత చవకైన ఎంపికను ఎంచుకోవడానికి బదులుగా, నమ్మదగిన 2-3 ఫ్రైట్ ఫార్వార్డర్‌లతో మంచి సంబంధాలను ఏర్పరచుకోండి. ఫ్రైట్ ఫార్వార్డర్‌లను అంచనా వేసేటప్పుడు, కింది అంశాలను పరిగణించండి:
- కమ్యూనికేషన్: ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు, మీరు వారిని త్వరగా సంప్రదించగలరా?
- ట్రాకింగ్ నాణ్యత: వారు Shopifyతో సింక్ అయ్యే విశ్వసనీయ ట్రాకింగ్‌ను అందిస్తారా?
- సమస్య పరిష్కారం: కోల్పోయిన ప్యాకేజీలు లేదా డెలివరీ జాప్యాలను వారు ఎలా నిర్వహిస్తారు?
- నియంత్రిత ఐటెమ్‌లపై నైపుణ్యం: వారు ఏ ఉత్పత్తులను రవాణా చేయగలరో, వేటిని చేయలేరో వారికి అవగాహన ఉందా?
షిప్పింగ్ ఖర్చులు, ఆప్టిమైజేషన్
సాధారణంగా ఫ్రైట్ ఫార్వార్డర్‌లు వాస్తవ బరువు లేదా డైమెన్షనల్ బరువు, ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే దాని ఆధారంగా ఛార్జ్ చేస్తారు. బరువు లెక్కలను అర్థం చేసుకోవడం వల్ల, తగిన షిప్పింగ్ రేట్‌లను సెట్ చేయడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి మీకు సహాయపడుతుంది. బరువును లెక్కించడానికి కింది వాటిని ఉపయోగించండి:
- వాస్తవ బరువు: తూకం వేసినప్పుడు ప్యాక్ చేసిన ఐటెమ్ చూపే భౌతిక బరువు
- డైమెన్షనల్ బరువు: పొడవు × వెడల్పు × ఎత్తు ÷ 5000గా లెక్కించబడుతుంది (కొంతమంది క్యారియర్‌లు 6000ను ఉపయోగిస్తారు)
ఉదాహరణకు, 40×30×20cm కొలతలు ఉండి 2kg బరువు ఉన్న ప్యాకేజీ డైమెన్షనల్ బరువు 4.8kg (40×30×20÷5000)గా ఉంటుంది. 4.8kg అనేది వాస్తవ బరువు అయిన 2kg కంటే ఎక్కువ కాబట్టి, మీరు 4.8kg బరువుకు చెల్లించాలి.
ప్రారంభ బరువు, అదనపు బరువు ధర
చాలా మంది ఫ్రైట్ ఫార్వార్డర్‌లు కింది భాగాలతో కూడిన ధరల నిర్మాణాన్ని ఉపయోగిస్తారు:
- ప్రారంభ బరువు: మొదటి యూనిట్ కోసం బేస్ రేటు (మొదటి 500g వంటివి)
- అదనపు బరువు: ఆ పైన జోడించే ప్రతి అదనపు బరువు యూనిట్‌కు తగ్గించిన రేటు
ఈ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం వలన ఖర్చులను కచ్చితంగా లెక్కించడానికి, మీ స్టోర్‌లో తగిన షిప్పింగ్ రేట్‌లను సెట్ చేయడానికి మీకు సహాయపడుతుంది.
ప్యాకేజింగ్‌ను ఆప్టిమైజ్ చేయడం
ఫ్రైట్ ఫార్వార్డర్‌లు తరచుగా డైమెన్షనల్ బరువు ఆధారంగా ఛార్జ్ చేస్తారు కాబట్టి, ప్యాకేజీ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా నేరుగా షిప్పింగ్ ఖర్చులు కూడా తగ్గుతాయి.
మీ ప్యాకేజీలను ఎంచుకోవడానికి మీరు కింది వ్యూహాత్మక సూచనలను ప్రయత్నించవచ్చు:
- మృదువైన వస్తువులను వాక్యూమ్ ద్వారా కుదించండి: బట్టలు, దుప్పట్లు మరియు ప్లష్ ఐటెమ్‌లను కుదించడం ద్వారా వాటి పరిమాణాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
- భారీ ఐటెమ్‌ల కోసం గట్టి బాక్స్‌లను వాడండి: దీని వలన షిప్పింగ్ సమయంలో వాటి ఆకారం మారకుండా ఉంటుంది, అలాగే స్థలం వృథా కాకుండా చూసుకోవచ్చు.
- మందపాటి ప్యాడింగ్‌ను భర్తీ చేయండి: మందపాటి ఫోమ్ ప్యాడింగ్‌కు బదులుగా హనీకోంబ్ పేపర్ లేదా బబుల్ బ్యాగ్‌లను ఉపయోగించండి.
- బాక్స్‌ల సైజులను సరిగ్గా ఎంచుకోండి: ఉత్పత్తి సురక్షితంగా పట్టే అత్యంత చిన్న బాక్స్‌ను ఉపయోగించండి. పరిమాణాలలో ప్రతి 5cm తగ్గింపు కూడా షిప్పింగ్ ఖర్చులను ఆదా చేస్తుంది.
షిప్పింగ్ సవాళ్లను నిర్వహించడం
క్రాస్-బోర్డర్ షిప్పింగ్ అనేది సమయం, కస్టమ్స్, పండుగ సీజన్ వాల్యూమ్ వంటి వాటిలో ప్రత్యేకమైన సవాళ్లను తీసుకువస్తుంది. ముందుగా ప్లాన్ చేయడం వలన మీరు భారీ నష్టాలు కలిగించే అంతరాయాలను నివారించవచ్చు.
పీక్ సీజన్ ప్లానింగ్
పీక్ షాపింగ్ సీజన్‌లు క్రాస్-బోర్డర్ షిప్పింగ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. బ్లాక్ ఫ్రైడే, క్రిస్మస్ మరియు చైనీస్ న్యూ ఇయర్ వంటి సమయాల్లో డెలివరీ సమయం 7-12 రోజుల నుండి 20+ రోజులకు పెరగవచ్చు.
కింది కార్యకలాపాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం ద్వారా మీరు పీక్ సీజన్‌ల కోసం సిద్ధపడవచ్చు:
- ముందుగానే స్టాక్ ఉంచుకోండి: పీక్ వ్యవధులు ప్రారంభం కావడానికి ముందే ఇన్వెంటరీని విదేశీ గిడ్డంగులు లేదా ఫ్రైట్ ఫార్వార్డర్‌లకు రవాణా చేయండి
- వేర్వేరు క్యారియర్‌లను వాడండి: ఆర్డర్‌ల వాల్యూమ్ ఎక్కువగా ఉండే సమయాల్లో ఒకే ఫ్రైట్ ఫార్వార్డర్‌పై ఆధారపడవద్దు
- షిప్పింగ్ అంచనాలను అప్‌డేట్ చేయండి: మీ షిప్పింగ్ విధానంలో మీ డెలివరీ సమయ అంచనాలను సవరించండి
- క్రియాశీలంగా కమ్యూనికేట్ చేయండి: కస్టమర్‌లు ఆర్డర్ చేయడానికి ముందే, సంభావ్య జాప్యాల గురించి వారికి తెలియజేయండి
- కటాఫ్ తేదీలను పరిగణించండి: గ్యారెంటీగా హాలిడే డెలివరీ ఇవ్వడం కోసం ఆర్డర్ గడువులను సెట్ చేయండి
కస్టమ్స్ మరియు నియంత్రిత ఐటెమ్‌లు
ఏదైనా ఉత్పత్తిని అంతర్జాతీయంగా రవాణా చేయడానికి ముందు, అది మీ గమ్యస్థాన దేశాలలో నిషేధించబడలేదని నిర్ధారించుకోండి. కస్టమ్స్ సమస్యల వల్ల ఉత్పత్తులను జప్తు చేయడం, రిటర్న్‌లు మరియు జరిమానాలు విధించడం వంటివి జరగవచ్చు.
కింది ఐటెమ్‌లను షిప్పింగ్ చేసే ముందు ఎల్లప్పుడూ మీ ఫ్రైట్ ఫార్వార్డర్‌తో నిర్ధారించుకోండి:
- బ్యాటరీలు మరియు ఎలక్ట్రానిక్స్ (పవర్ బ్యాంక్‌లతో సహా)
- సౌందర్య సాధనాలు, పెర్ఫ్యూమ్‌లు మరియు ఏరోసోల్స్
- ఆహారం మరియు పానీయాలు
- విటమిన్లు, సప్లిమెంట్లు మరియు ఓవర్-ది-కౌంటర్ మందులు
- CBD (కన్నాబిడియోల్) మరియు గంజాయి సంబంధిత ఉత్పత్తులు
- ఇ-సిగరెట్‌లు మరియు వేపింగ్ ఉత్పత్తులు
- పౌడర్‌లు మరియు లిక్విడ్‌లు
కస్టమ్స్ డాక్యుమెంటేషన్
సరైన డాక్యుమెంటేషన్ కస్టమ్స్ జాప్యాలను తగ్గిస్తుంది. మీ ఉత్పత్తుల కోసం ఈ క్రింది సమాచారం ఉండేలా చూసుకోండి:
- HS (హార్మోనైజ్డ్ సిస్టమ్) కోడ్‌లు: అన్ని అంతర్జాతీయ షిప్‌మెంట్‌లకు అవసరం. Shopifyలో మీ ఉత్పత్తులకు HS కోడ్‌లను జోడించండి.
- మూల దేశం: ఉత్పత్తిని ఎక్కడ తయారు చేశారు లేదా అసెంబుల్ చేశారు
- ఖచ్చితమైన ఉత్పత్తి వివరణలు: ప్రతి ప్యాకేజీలో ఏముందో స్పష్టమైన వివరణలు
- ప్రకటించిన విలువలు: ఉత్పత్తి విలువల నిజాయితీగల ప్రకటన
కస్టమ్స్ డాక్యుమెంటేషన్ గురించి మరింత తెలుసుకోండి.
రిటర్న్‌లను నిర్వహించడం
అంతర్జాతీయ రిటర్న్ షిప్పింగ్ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, క్రాస్-బోర్డర్ విక్రేతలకు రిటర్న్‌లు సవాలుగా ఉంటాయి. కింది వ్యూహాలను పరిగణించండి:
- రిటర్న్ ఖర్చు విశ్లేషణ: అనేక క్రాస్-బోర్డర్ ఆర్డర్‌లకు, రిటర్న్ షిప్పింగ్ ఖర్చు ఉత్పత్తి విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. భౌతిక రిటర్న్‌లు ఎప్పుడు సమంజసమో నిర్ణయించడానికి మీ బ్రేక్-ఈవెన్ పాయింట్‌ను లెక్కించండి.
- ప్రత్యామ్నాయ రిటర్న్ వ్యూహాలు, కింది వాటి వంటివి:
- రిటర్న్ లేకుండా పాక్షిక రీఫండ్: తక్కువ-విలువ ఉన్న ఐటెమ్‌లకు, పాక్షిక రీఫండ్‌ను అందించండి అలాగే కస్టమర్‌ను ఉత్పత్తిని ఉంచుకోనివ్వండి. ఇది తరచుగా రిటర్న్ షిప్పింగ్ కోసం చెల్లించడం కంటే చౌకగా ఉంటుంది.
- డిస్కౌంట్ కూపన్: పూర్తి రీఫండ్‌కు బదులుగా స్టోర్ క్రెడిట్ మరియు డిస్కౌంట్ కూపన్‌ను ఆఫర్ చేయండి. ఇది కస్టమర్‌ను నిలుపుకుంటుంది అలాగే మీ నష్టాన్ని తగ్గిస్తుంది.
- స్థానిక రిటర్న్ చిరునామా: మీరు విదేశీ గిడ్డంగిని ఉపయోగిస్తుంటే, ఆ లొకేషన్‌కు రిటర్న్‌లను అంగీకరించండి.
- భౌతిక రిటర్న్ అవసరం: అధిక-విలువ ఉన్న ఐటెమ్‌లకు ($100 USD లేదా అంతకంటే ఎక్కువ) లేదా మోసం అని అనుమానించబడే కేసులకు మాత్రమే భౌతిక రిటర్న్‌లు అవసరం.
- రిటర్న్ అంచనాలను సెట్ చేయడం: మీ వాపసు విధానంలో, ఈ క్రింది వివరాలను స్పష్టంగా తెలియజేయండి:
- ఏయే ఐటెమ్‌లు రిటర్న్‌లకు అర్హత పొందుతాయి
- రిటర్న్ షిప్పింగ్ కోసం ఎవరు చెల్లిస్తారు
- రీఫండ్‌ల కోసం ప్రాసెసింగ్ సమయం
- ఏవైనా రీస్టాకింగ్ రుసుములు