జర్మనీలో విక్రయించడం కోసం సాధారణ చెక్‌లిస్ట్

Shopifyతో ప్రారంభించడానికి మీరు తీసుకోనవల్సిన అన్ని దశలను ఈ చెక్‌లిస్ట్ వివరిస్తుంది. ఈ దశలు, Shopifyతో ప్రారంభించడానికి ముందు మీరు ఏమి చేయాలో వివరిస్తాయి మరియు మీ ఆన్‌లైన్ స్టోర్‌ను లాంచ్ చేయడానికి మరియు ప్రమోట్ చేయడానికి మీకు మార్గనిర్దేశం చేస్తాయి. సెటప్ ప్రాసెస్ అంతటా రెఫర్ చేయడానికి ఈ చెక్‌లిస్ట్‌ను ప్రింట్ చేయడం లేదా దాన్ని PDF వలె డౌన్‌లోడ్ చేసుకోవడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

మీరు ప్రారంభించడానికి ముందు

మీ Shopify స్టోర్‌ను సెటప్ చేయడం ప్రారంభించడానికి ముందు, మీ లక్ష్యాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ స్టోర్ గురించి ప్రాథమిక ప్రశ్నలను మిమ్మల్ని మీరే అడగండి. ఇది మీ దృష్టిని కేంద్రీకరించడానికి మరియు మీ సెటప్ ప్రాసెస్‌ను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. మీ అవసరాలకు ఏ ధరల ప్లాన్ సరిపోతుందో కూడా మీరు ఆలోచించవచ్చు. అయితే, మీ ఉచిత ట్రయల్ ముగిసే వరకు మీరు ప్లాన్‌ను ఎంచుకోవలసిన అవసరం లేదు.

పరిగణనలు మరియు పరిమితులు

  • మీ Shopify సబ్‌స్క్రిప్షన్ ధరల ప్లాన్ అనేది సిబ్బంది ఖాతాల సంఖ్య, లావాదేవీల రుసుములు, రిపోర్టింగ్ సామర్థ్యాలు మరియు విక్రయాల ఛానెల్ అర్హతతో సహా మీకు అందుబాటులో ఉండే ఫీచర్‌లపై ప్రభావం చూపుతుంది.
  • Shopify POS హార్డ్‌వేర్ లభ్యత మరియు Tap to Pay మద్దతు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
  • మీరు మీ స్టోర్‌ను ఇతర ప్లాట్‌ఫారమ్ నుండి Shopifyకి మళ్లిస్తుంటే, అప్పుడు మీ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లను సంరక్షించుకోవడానికి మీరు URL దారిమళ్లింపులను సెటప్ చేయాల్సి ఉంటుంది.
  • విక్రయాల ఛానెల్ అర్హత అనేది మీ ప్రాంతం, ఉత్పత్తి రకాలు మరియు కొన్నిసార్లు మీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. విక్రయాల వ్యూహానికి కట్టుబడి ఉండే ముందు ఒక్కొక్క ఛానెల్ అవసరాలను రివ్యూ చేయండి.

ప్రారంభించడానికి చెక్‌లిస్ట్

మొదటి దశలు

మీరు మీ Shopify స్టోర్‌ను ఉత్పత్తులతో స్టాక్ చేయడానికి ముందు, మీ గురించి, అలాగే మీ స్టోర్ గురించి కొంత సమాచారాన్ని నమోదు చేయాలి. మీ ఉత్పత్తి లిస్టింగ్‌లు, కస్టమర్ లావాదేవీల కోసం కొన్ని ప్రాథమిక ప్రమాణాలను మీరు నిర్ణయించుకోవాలి. అలాగే, మీ కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో మీ స్టోర్‌ను కనుగొనగలరని నిర్ధారించుకోవడానికి మీరు మీ డొమైన్‌ను సెటప్ చేయాలి.

పరిగణనలు మరియు పరిమితులు

  • మీ myshopify.com డొమైన్ పేరును కేవలం ఒక్కసారి మాత్రమే మార్చవచ్చు. ప్రాథమిక సెటప్ సమయంలో జాగ్రత్తగా ఎంచుకోండి.
  • Gmail, Yahoo వంటి ప్రధాన ఈమెయిల్ ప్రొవైడర్‌లకు ఇమెయిల్ పంపినవారి ప్రామాణీకరణ (SPF, DKIM రికార్డ్‌లు) అవసరం. ఇది లేకపోతే, మీ స్టోర్ ఇమెయిల్‌లు స్పామ్ లేదా జంక్ ఫోల్డర్‌లకు పంపబడవచ్చు.
  • పన్ను సమ్మతి అనేది మీ బాధ్యత. మీరు Shopify Tax ఆటోమేటెడ్ ఫైలింగ్‌ను ఉపయోగిస్తే తప్ప, Shopify పన్నులను లెక్కిస్తుంది కానీ మీ తరపున ఫైల్ చేయదు లేదా రెమిట్ చేయదు.
  • జర్మన్ వ్యాపారులు GoBD, KassenSichV పన్ను రికార్డు నిర్వహణ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి.
  • మీరు జోడించగల సిబ్బంది ఖాతాల సంఖ్య మీ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. Basic ప్లాన్ అదనపు సిబ్బందిని అనుమతించదు, Grow ప్లాన్ 5గురిని, Advanced ప్లాన్ 15 మందిని అనుమతిస్తుంది, అలాగే Shopify Plus ప్లాన్ అపరిమిత సిబ్బందిని అనుమతిస్తుంది.
  • స్టోర్ పాలసీ టెంప్లేట్‌లు ఆంగ్లంలో అందుబాటులో ఉన్నాయి. జర్మన్ కోసం, మీరు మీ స్వంత పాలసీలను డ్రాఫ్ట్ చేసుకోవాలి.
  • మీరు సృష్టించగల మార్కెట్‌ల సంఖ్య మీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.
  • మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేసినప్పుడు, అన్ని యాప్‌లు ఆటోమేటిక్‌గా అన్‌ఇన్‌స్టాల్ చేయబడతాయి, కానీ Shopify బిల్లింగ్ వెలుపల బిల్ చేయబడే యాప్ ఛార్జీలు కొనసాగవచ్చు.

మొదటి దశల చెక్‌లిస్ట్

మీ ఆన్‌లైన్ స్టోర్‌ను ఆర్గనైజ్ చేయండి

మీ స్టోర్ డిజైన్ చేయబడిన విధానం, మీరు విక్రయించబోయే ఉత్పత్తుల రకాలు మీ ఆన్‌లైన్ స్టోర్‌లో అత్యంత ముఖ్యమైన రెండు భాగాలు. మీ వ్యాపారానికి ఏది బాగా ప్రాతినిధ్యం వహిస్తుందో నిర్ధారించడానికి కొన్ని విభిన్న థీమ్‌లను ప్రయత్నించండి, ఆపై విక్రయించడానికి కొన్ని ఉత్పత్తులను జోడించండి.

మీరు ఎన్ని ఉత్పత్తులను అందించాలని ప్లాన్ చేస్తున్నారనే దాని ఆధారంగా, మీ ఉత్పత్తి లిస్టింగ్‌లను జోడించడం, ఆర్గనైజ్ చేయడం అనేది Shopify స్టోర్‌ను సెటప్ చేయడంలో అత్యంత సమయం తీసుకునే దశ కావచ్చు. మీ ఉత్పత్తులను జోడించడానికి, వాటిని లాజికల్ గ్రూపులుగా ఆర్గనైజ్ చేయడానికి, అలాగే అవసరమైన పన్ను, షిప్పింగ్ సమాచారాన్ని సెట్ చేయడానికి మీకు మీరు తగినంత సమయం ఇస్తున్నారని నిర్ధారించుకోండి.

పరిగణనలు మరియు పరిమితులు

  • ఉత్పత్తులకు కనీసం శీర్షిక, ధర అవసరం. మీరు ఒక్కో ఉత్పత్తికి 250 ట్యాగ్‌ల వరకు జోడించవచ్చు లేదా Shopify Plus ప్లాన్‌లో అపరిమిత సంఖ్యలో ట్యాగ్‌లను జోడించవచ్చు.
  • ఉత్పత్తి URL హ్యాండిల్స్ను తరచుగా మార్చడాన్ని నివారించండి, ఎందుకంటే ఇది మీ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లపై ప్రభావం చూపవచ్చు.
  • సుదీర్ఘమైన ఉత్పత్తి శీర్షికలు, వివరణలు సెర్చ్ ఇంజిన్ ఫలితాలలో కత్తిరించబడవచ్చు. శీర్షికలను సంక్షిప్తంగా ఉంచండి, అలాగే ముఖ్యమైన కీవర్డ్‌లను ప్రారంభంలో ఉంచండి.
  • Shopify Theme Store నుండి ఉచిత, చెల్లింపు థీమ్‌లు లేఅవుట్, ఫీచర్‌లలో భిన్నంగా ఉంటాయి. థీమ్ మీ కంటెంట్ అవసరాలకు మద్దతు ఇస్తుందని నిర్ధారించుకోవడానికి ప్రచురించే ముందు థీమ్‌లను ప్రివ్యూ చేయండి.
  • మీరు యూరోపియన్ ఆర్థిక ప్రాంతం (EEA)లోని కస్టమర్‌లకు విక్రయిస్తుంటే, ధర తగ్గింపులను ప్రకటించేటప్పుడు మీరు తప్పనిసరిగా యూరోపియన్ ప్రైసింగ్ ఇండికేషన్ డైరెక్టివ్కు అనుగుణంగా ఉండాలి.
  • జర్మన్ కస్టమర్‌లలో Klarna వంటి స్థానిక చెల్లింపు పద్ధతులు ప్రసిద్ధి చెందాయి.
  • ఉత్పత్తి పేజీలలో VAT కలిపిన ధరలను ప్రదర్శించాలని జర్మన్ చట్టం కోరుతోంది.

మీ ఆన్‌లైన్ స్టోర్‌ను ఆర్గనైజ్ చేయడానికి చెక్‌లిస్ట్

మీ ఆన్‌లైన్ స్టోర్‌ను పరీక్షించండి

మీ ఆన్‌లైన్ స్టోర్‌ను లాంచ్ చేయడానికి ముందు, చెక్‌అవుట్ ప్రక్రియ ఏ విధంగా పని చేస్తుందో సమీక్షించడానికి కొన్ని పరీక్ష ఆర్డర్‌లను ఉంచండి.

పరిగణనలు మరియు పరిమితులు

  • Grow ప్లాన్ లేదా అంతకంటే పై స్థాయి ప్లాన్‌లలో లేదా Shopify Payments ఉన్న ఏదైనా ప్లాన్‌లో మోసాల విశ్లేషణ సిఫార్సులు అందుబాటులో ఉంటాయి. Shopify Payments లేని Basic ప్లాన్ కేవలం మోసాల సూచికలను మాత్రమే అందిస్తుంది.
  • అధిక ఛార్జ్‌బ్యాక్ రేట్ల కారణంగా Shopify Payments డీయాక్టివేట్ కావచ్చు. ఆర్డర్‌లను నెరవేర్చడానికి ముందు అత్యధిక ప్రమాదం ఉన్నవిగా ఫ్లాగ్ చేసిన వాటిని సమీక్షించండి.
  • ఛార్జీల రివర్సల్స్‌పై మీ బ్యాంక్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఛార్జ్‌బ్యాక్ నష్టాలను Shopify భరించదు.
  • ప్రతి చెక్‌అవుట్ దశ తర్వాత, కార్ట్ ఇన్వెంటరీ మళ్లీ-ధృవీకరించబడుతుంది. చెల్లింపు వివరాలు సమర్పించినప్పుడు మాత్రమే ఇన్వెంటరీ హోల్డ్ చేయబడుతుంది.

మీ ఆన్‌లైన్ స్టోర్‌ను పరీక్షించడానికి చెక్‌లిస్ట్

మీ ఆన్‌లైన్ స్టోర్‌ను లాంచ్ చేయండి

మీరు ఒక ప్లాన్‌ను ఎంచుకుని, మీ ఆన్‌లైన్ స్టోర్‌ను పరీక్షించిన తర్వాత, కస్టమర్‌లు దానిని సందర్శించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టే. మీ స్టోర్‌ను మరొకసారి సమీక్షించండి, ఆపై దానిని లాంచ్ చేయండి.

పరిగణనలు మరియు పరిమితులు

మీ ఆన్‌లైన్ స్టోర్‌ను లాంచ్ చేయడానికి చెక్‌లిస్ట్

ఇతర ఆన్‌లైన్ విక్రయాల ఛానెల్‌లను జోడించండి

మీ ఆన్‌లైన్ స్టోర్‌ను లాంచ్ చేసిన తర్వాత, మీ Shopify స్టోర్‌కు మరికొన్ని ఇతర ఆన్‌లైన్ ఛానెల్‌లను జోడించడం వల్ల మీ వ్యాపారానికి ప్రయోజనం చేకూరవచ్చు. ఆన్‌లైన్‌లో విక్రయించేటప్పుడు, మీరు మీ Shopify అడ్మిన్‌కు జోడించగల పలు ఐచ్ఛిక ఆన్‌లైన్ ఛానెల్‌లు ఉంటాయి.

పరిగణనలు మరియు పరిమితులు

  • Google & YouTubeలకు Google Merchant Center అకౌంట్, మీ స్టోర్‌లో కనిపించే విధంగా సంప్రదింపు సమాచారం, మీ స్టోర్‌ఫ్రంట్ ఫుటర్‌లో రీఫండ్ అలాగే సేవా నిబంధనల విధానాలు, అలాగే సపోర్ట్ చేయబడే దేశానికి షిప్పింగ్ అవసరం. ఉత్పత్తి డేటాలో గ్లోబల్ ట్రేడ్ ఐటెమ్ నంబర్ (GTIN), తయారీదారు పార్ట్ నంబర్ (MPN) లేదా బ్రాండ్ వంటి వివరాలు తప్పనిసరిగా ఉండాలి.
  • Facebook and Instagram by Metaకు ఒక Meta వ్యాపార పోర్ట్‌ఫోలియో అవసరం, అలాగే ఇది Meta వాణిజ్య విధానాలకు అనుగుణంగా ఉండాలి. Meta ఛానెల్ ఆర్డర్‌లపై పన్నును సేకరించడం, చెల్లించడానికి వ్యాపారులే బాధ్యత వహిస్తారు.
  • TikTok అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఐర్లాండ్, మెక్సికో, జపాన్ అలాగే బ్రెజిల్ వంటి ఎంచుకున్న దేశాలలో అందుబాటులో ఉంటుంది. ఉత్పత్తులు తప్పనిసరిగా TikTok ప్రాంతీయ నిషేధిత-ఉత్పత్తుల విధానాలకు అనుగుణంగా ఉండాలి.
  • Shop ఛానెల్ కోసం Shopify Payments యాక్టివ్‌గా ఉండాలి, అలాగే గత ఆరు నెలల్లో ఛార్జ్‌బ్యాక్ రేటు 1% లోపు ఉండాలి.
  • డిస్కౌంట్ కోడ్‌లను నిర్దిష్ట విక్రయాల ఛానెల్స్‌కు మాత్రమే పరిమితం చేయడం సాధ్యపడదు. మీ ఆన్‌లైన్ స్టోర్‌లో పనిచేసే కోడ్, మీరు విక్రయాలు జరిపే ఇతర ఛానెల్స్‌లో కూడా పనిచేస్తుంది.
  • తగ్గింపు కలయికలు ప్రతి ఆర్డర్‌కు గరిష్టంగా 5 ఉత్పత్తి లేదా ఆర్డర్ డిస్కౌంట్ కోడ్‌లతో పాటు 1 షిప్పింగ్ డిస్కౌంట్ కోడ్‌కు, అలాగే గరిష్టంగా 25 యాక్టివ్ ఆటోమేటిక్ డిస్కౌంట్‌లకు మాత్రమే పరిమితం చేయబడతాయి.

విక్రయాల ఛానెల్స్‌ను జోడించడానికి చెక్‌లిస్ట్

మీ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రమోట్ చేయండి

మీ ఆన్‌లైన్ స్టోర్‌ను లాంచ్ చేసిన తర్వాత, దాన్ని మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ ఇంజిన్‌లు ఉపయోగించే సమాచారాన్ని జోడించడం ద్వారా, అలాగే తగిన ప్రదేశాలన్నింటిలో మీ స్టోర్‌ను ప్రమోట్ చేయడం ద్వారా మీరు మీ స్టోర్ విజిబిలిటీని మెరుగుపరచవచ్చు.

పరిగణనలు మరియు పరిమితులు

  • సెర్చ్ ఇంజిన్ ఇండెక్సింగ్ తక్షణమే జరగదు. కొత్త పేజీలను ఇండెక్స్ చేయడానికి Google, ఇతర సెర్చ్ ఇంజిన్‌లకు 48 నుండి 72 గంటల సమయం పట్టవచ్చు, అన్ని పేజీలు ఇండెక్స్ అవుతాయని ఎలాంటి హామీ లేదు.
  • Shopify Messagingకి యాక్టివ్ పెయిడ్ ప్లాన్ అవసరం, ఇది Basic ప్లాన్ లేదా అంతకంటే పై స్థాయి ప్లాన్‌లలో అందుబాటులో ఉంటుంది. ధర నిర్ణయం అనేది పంపే ఇమెయిల్, SMS వాల్యూమ్‌కి కనెక్ట్ చేయబడింది. ట్రయల్ లేదా Pause and Build ప్లాన్‌లలో, మీరు ప్రచారాలను రూపొందించవచ్చు, మీకు మీరుగా టెస్ట్‌లను పంపుకోవచ్చు, కానీ సబ్‌స్క్రైబర్‌లకు పంపలేరు.
  • Shopify Inbox అనేది Basic, Grow, Advanced, Shopify Plus ప్లాన్‌లలో అందుబాటులో ఉంటుంది.
  • రిపోర్ట్‌లు, విశ్లేషణల ఫీచర్‌లు ప్లాన్‌ను బట్టి మారుతాయి. అధునాతన, అనుకూల రిపోర్ట్‌లు ఉన్నత-స్థాయి ప్లాన్‌లలో అందుబాటులో ఉంటాయి.

మీ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రమోట్ చేయడానికి చెక్‌లిస్ట్