మీ స్టోర్‌కు వ్యాపార సెట్టింగ్‌లను జోడించడం
మీరు మీ Shopify స్టోర్‌ను సెటప్ చేయడం ప్రారంభించే ముందు, మీరు Shopify ఖాతాను సృష్టించాలి, మీ స్టోర్ కోసం వ్యాపార సమాచారాన్ని జోడించాలి. మీరు ప్రతి వివరాన్ని వెంటనే చేర్చాల్సిన అవసరం లేదు, కానీ కింది ఐటెమ్‌లను తప్పకుండా జోడించండి:
- స్టోర్ పేరు
- చట్టబద్ధమైన వ్యాపార పేరు మరియు చిరునామా
- స్టోర్ టైమ్ జోన్
- డిఫాల్ట్ స్టోర్ కరెన్సీ
- డిఫాల్ట్ బరువు యూనిట్
- మీ ఆన్‌లైన్ స్టోర్‌ను సురక్షితంగా ఉంచడానికి పాస్‌వర్డ్
ఈ పేజీలో
- మీ myshopify.com డొమైన్ పేరును రివ్యూ చేయండి
- మీ స్టోర్ పేరు, సంప్రదింపు సమాచారాన్ని సెట్ చేయండి లేదా మార్చండి
- మీ స్టోర్ చిరునామాను సెట్ చేయండి లేదా మార్చండి
- మీ స్టోర్ టైమ్ జోన్‌ను సెట్ చేయండి లేదా మార్చండి
- స్టోర్ కరెన్సీని ఎంచుకోండి
- బహుళ కరెన్సీలను డిస్ప్లే చేయండి
- మీ స్టోర్ డిఫాల్ట్ బరువు యూనిట్‌ను సెట్ చేయండి లేదా మార్చండి
- మీ హోమ్ పేజీ మెటాడేటాను సెట్ చేయండి లేదా అప్‌డేట్ చేయండి
- మీ ఆర్డర్ IDలను ఫార్మాట్ చేయండి
- తర్వాతి దశలు
మీ myshopify.com డొమైన్ పేరును రివ్యూ చేయండి
ఖాతా సృష్టి సమయంలో, మీకు ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యే myshopify.com డొమైన్ పేరు అసైన్ చేయబడుతుంది, ఉదాహరణకు 1a2b3c4-5.myshopify.com. మీ myshopify.com డొమైన్ మీ స్టోర్‌కు ప్రత్యేకమైనది, ఇది మీ Shopify అడ్మిన్‌కి లాగిన్ కావడానికి, మీ ఖాతాను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, మీ ఖాతాను కనెక్ట్ చేయడానికి థర్డ్-పార్టీ యాప్‌లు లేదా సర్వీస్‌లు మీ myshopify.comని Shopify ఖాతా ID లేదా ఖాతా నంబర్‌గా అడగవచ్చు.
మీ Shopify అడ్మిన్ తన URLలో భాగంగా myshopify.com IDని కూడా ఉపయోగిస్తుంది. ఉదాహరణకు: admin.shopify.com/store/1a2bc4-5.
మీరు మీ Shopify అడ్మిన్ నుండి కొత్త myshopify.com డొమైన్ పేరును కేవలం 1 సారి మాత్రమే ఎంచుకోగలరు.
ఈ డొమైన్ పేరు డిఫాల్ట్‌గా మీ స్టోర్ ప్రాథమిక డొమైన్‌గా కూడా పరిగణించబడుతుంది, అయినప్పటికీ కస్టమర్‌లు మీ స్టోర్‌ను సందర్శించడానికి ఉపయోగించే వెబ్ చిరునామాగా మీ myshopify.com డొమైన్‌ను భర్తీ చేయడానికి మీరు కస్టమ్ డొమైన్‌ను కొనుగోలు చేయవచ్చు.
కొత్త myshopify.com డొమైన్ పేరును ఎంచుకోండి
మీరు Shopifyకి సైన్ అప్ చేసినప్పుడు, మీ డిఫాల్ట్ myshopify.com డొమైన్ పేరు మీ కోసం జనరేట్ అవుతుంది. మీరు మీ Shopify అడ్మిన్‌లో ఉన్నప్పుడు ఈ డొమైన్ పేరు మీ వెబ్ బ్రౌజర్ అడ్రస్ బార్‌లో ప్రదర్శించబడుతుంది మరియు మీ ఆన్‌లైన్ స్టోర్‌ను సందర్శించే కస్టమర్‌లకు ప్రదర్శితమయ్యే డిఫాల్ట్ స్టోర్‌ఫ్రంట్ చిరునామా కూడా ఇదే.
మీ స్టోర్‌ను బ్రౌజ్ చేసే కస్టమర్‌లకు మీ బ్రాండ్‌ను నొక్కి చెప్పాలనుకుంటే, మీకు ఈ క్రింది ఆప్షన్‌లు ఉన్నాయి:
- కస్టమ్ డొమైన్‌ను కొనుగోలు చేసి, జోడించండి. మీరు కస్టమ్ డొమైన్‌ను మీ ప్రాథమిక డొమైన్‌గా ఉపయోగించినప్పుడు, మీ
myshopify.comడొమైన్ పేరు కస్టమర్‌లకు ప్రదర్శించబడదు మరియు మీ Shopify అడ్మిన్‌లోకి లాగిన్ అయ్యేటప్పుడు మీరు మరియు మీ సిబ్బంది మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. - కస్టమర్‌లకు ప్రదర్శించడానికి ఉచితంగా కొత్త
myshopify.comడొమైన్ పేరును ఎంచుకోండి. మీ Shopify అడ్మిన్ నుండి దీన్ని కేవలం 1 సారి మాత్రమే మార్చగలరు. - మీరు మీ
myshopify.comడొమైన్‌ను అప్‌డేట్ చేసినప్పుడు, మీ Shopify అడ్మిన్ URL కూడా అదే సమయంలో మీ కొత్తmyshopify.comడొమైన్‌కు అప్‌డేట్ అవుతుంది. ఉదాహరణకు, మీరు మీ.myshopify.comడొమైన్‌నుjohns-apparel.myshopify.comకి అప్‌డేట్ చేస్తే, అప్పుడు మీ Shopify అడ్మిన్ URLadmin.shopify.com/store/johns-apparelగా మారుతుంది.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > డొమైన్‌లకు వెళ్లండి.
డొమైన్‌ల పేజీలో, మీ
myshopify.comడొమైన్‌పై హోవర్ చేసి, దాన్ని మార్చడానికి పెన్సిల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి.కొత్త పేరును ఎంటర్ చేసి, ఆపై డొమైన్‌ను జోడించండిని క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ని ట్యాప్ చేసి, ఆపై
సెట్టింగ్‌లుని ట్యాప్ చేయండి.
స్టోర్ సెట్టింగ్‌ల విభాగంలో, డొమైన్‌లను ట్యాప్ చేయండి.
డొమైన్‌ల పేజీలో, మీ
myshopify.comడొమైన్ కోసం చర్యలను ట్యాప్ చేసి, ఆపై myshopify.com డొమైన్‌ను మార్చండిని ట్యాప్ చేయండి.కొత్త పేరును ఎంటర్ చేసి, ఆపై డొమైన్‌ను జోడించండిని ట్యాప్ చేయండి.
కొత్త myshopify.com డొమైన్ ఆటోమేటిక్‌గా మీ ప్రాథమిక డొమైన్ అవుతుంది మరియు మునుపటి myshopify.com డొమైన్ ఆటోమేటిక్‌గా కొత్తదానికి దారి మళ్లించబడుతుంది. మీరు ఎలాంటి అదనపు URL దారిమళ్లింపులను సృష్టించాల్సిన అవసరం లేదు.
మీరు మరియు మీ సిబ్బంది మీ Shopify అడ్మిన్‌లోకి లాగిన్ అవ్వడానికి మరియు మీ స్టోర్ గురించి Shopify సపోర్ట్‌ను సంప్రదించేటప్పుడు ఇప్పటికీ మీ మునుపటి myshopify.com డొమైన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
మీ స్టోర్ పేరు మరియు సంప్రదింపు సమాచారాన్ని సెట్ చేయండి లేదా మార్చండి
మీ స్టోర్ పేరు అనేది మీ వెబ్‌సైట్ యొక్క ప్రతి పేజీలో ప్రదర్శించబడే పేరు. డిఫాల్ట్‌గా, మీ స్టోర్ పేరు "నా స్టోర్" అని ఉంటుంది. Shopify ఖాతాను తెరవడానికి, మీరు తప్పనిసరిగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు, మీ వ్యాపార చిరునామా, యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్ మరియు సరైన ఇమెయిల్ చిరునామాను అందించాలి. ఒకవేళ అడిగితే మీరు మరింత సమాచారాన్ని అందించాల్సి రావచ్చు. Shopify ఖాతా కోసం రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడు మీ గుర్తింపును ధృవీకరించడానికి ఈ సమాచారం ఉపయోగించబడుతుంది మరియు ఇది మీ కస్టమర్‌లతో షేర్ చేయబడదు. మీరు మరింత సమాచారాన్ని అందించాల్సి రావచ్చు. Shopify యొక్క సేవా నిబంధనల గురించి మరింత తెలుసుకోండి.
స్టోర్ సంప్రదింపు సమాచారం పబ్లిక్‌గా ఉంటుంది. కస్టమర్‌లు మీ స్టోర్ మరియు పాలసీ పేజీలలో ఈ సమాచారాన్ని వీక్షించగలరు. కస్టమర్ సేవను అందించడం కోసం మీ ఫోన్ నంబర్ లాంటి సమాచారాన్ని కస్టమర్‌లతో షేర్ చేయడాన్ని మీరు ఎంచుకోవచ్చు.
మీ స్టోర్ గనుక Shopify Paymentsని ఉపయోగిస్తుంటే, మీ Shopify Payments ఖాతాలోని వ్యాపార పేరును మార్చడానికి మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అది కాకుండా, మీ స్టోర్ పేరు మరియు సంప్రదింపు సమాచారాన్ని మార్చడానికి ఎలాంటి పరిమితులు లేవు. మీరు ఎప్పుడైనా, మీకు కావలసినన్ని సార్లు వాటిని మార్చుకోవచ్చు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > జనరల్కు వెళ్లండి.
స్టోర్ సంప్రదింపు వివరాల విభాగంలో, మీ స్టోర్ పేరును క్లిక్ చేయండి లేదా మీ స్టోర్ పేరు కోసం >ని క్లిక్ చేయండి.
స్టోర్ సంప్రదింపు వివరాల పేజీలోని, స్టోర్ పేరు ఫీల్డ్‌లో, మీ స్టోర్ పేరును ఎడిట్ చేయండి.
సేవ్ క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ని ట్యాప్ చేసి, ఆపై
సెట్టింగ్‌లుని ట్యాప్ చేయండి.
స్టోర్ సెట్టింగ్‌ల విభాగంలో, జనరల్‌ను ట్యాప్ చేయండి.
స్టోర్ సంప్రదింపు వివరాల విభాగంలో, మీ స్టోర్ పేరును ట్యాప్ చేయండి.
స్టోర్ సంప్రదింపు వివరాల పేజీలోని, స్టోర్ పేరు ఫీల్డ్‌లో, మీ స్టోర్ పేరును ఎడిట్ చేయండి.
సేవ్ లేదా ✓ను ట్యాప్ చేయండి.
మీ స్టోర్ చిరునామాను సెట్ చేయండి లేదా మార్చండి
మీ స్టోర్ చిరునామా అనేది మీ వ్యాపారానికి సంబంధించిన భౌతిక లేదా కస్టమర్‌లకు కనిపించే చిరునామా. కస్టమర్‌లు మీ స్టోర్ మరియు పాలసీ పేజీలలో ఈ చిరునామాను వీక్షించగలరు. మీరు సెట్టింగ్‌లు > జనరల్లోని స్టోర్ సంప్రదింపు వివరాల విభాగంలో దీన్ని సెట్ చేయవచ్చు.
మీ Shopify బిల్లులలోని కంపెనీ పేరు మరియు చిరునామా మీ బిల్లింగ్ చిరునామా నుండి తీసుకోబడతాయి, ఇది ఒక ప్రత్యేకమైన సెట్టింగ్. మీ స్టోర్ చిరునామాను మార్చడం ద్వారా మీ బిల్లింగ్ చిరునామా మారదు. మీ Shopify బిల్లింగ్ చిరునామాను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > జనరల్కు వెళ్లండి.
స్టోర్ సంప్రదింపు వివరాల విభాగంలో, స్టోర్ చిరునామాను క్లిక్ చేయండి.
మీ కంపెనీ పేరు మరియు స్టోర్ చిరునామాను ఎంటర్ చేయండి.
సేవ్ క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ని ట్యాప్ చేసి, ఆపై
సెట్టింగ్‌లుని ట్యాప్ చేయండి.
స్టోర్ సెట్టింగ్‌ల విభాగంలో, జనరల్‌ను ట్యాప్ చేయండి.
స్టోర్ సంప్రదింపు వివరాల విభాగంలో, స్టోర్ చిరునామాను ట్యాప్ చేయండి.
మీ కంపెనీ పేరు మరియు స్టోర్ చిరునామాను ఎంటర్ చేయండి.
సేవ్ లేదా ✓ను ట్యాప్ చేయండి.
మీ స్టోర్ గనుక Shopify Payments, Shopify Balance, Shopify Capital, లేదా Shopify Credit లాంటి ఆర్థిక సేవలను ఉపయోగిస్తుంటే, మీ Shopify అడ్మిన్‌లో మీ స్టోర్ దేశాన్ని మార్చడానికి ముందుగా మీరు అన్ని ఆర్థిక సేవలను డీయాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.
మీ స్టోర్ టైమ్ జోన్‌ను సెట్ చేయండి లేదా మార్చండి
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > జనరల్కు వెళ్లండి.
స్టోర్ డిఫాల్ట్‌ల విభాగంలో, టైమ్ జోన్ లిస్ట్ నుండి కొత్త టైమ్ జోన్‌ను ఎంచుకోండి.
సేవ్ క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ని ట్యాప్ చేసి, ఆపై
సెట్టింగ్‌లుని ట్యాప్ చేయండి.
స్టోర్ సెట్టింగ్‌ల విభాగంలో, జనరల్‌ను ట్యాప్ చేయండి.
స్టోర్ డిఫాల్ట్‌ల విభాగంలో, టైమ్ జోన్ లిస్ట్ నుండి కొత్త టైమ్ జోన్‌ను ఎంచుకోండి.
సేవ్ లేదా ✓ను ట్యాప్ చేయండి.
స్టోర్ కరెన్సీని ఎంచుకోండి
మీ Shopify అడ్మిన్‌లోని జనరల్ సెట్టింగ్‌ల పేజీలో, మీ స్టోర్ ఉపయోగించే కరెన్సీని (ఉదాహరణకు, USD, EUR, CAD, AUD, JPY) మీరు ఎంచుకోవచ్చు.
మీరు Shopify Paymentsని మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ గేట్‌వేగా ఉపయోగిస్తుంటే, Shopify Payments ఉపయోగించే బ్యాంక్ ఖాతా మరియు కరెన్సీ సెట్టింగ్‌లను ఎడిట్ చేయడం ద్వారా మీరు తప్పనిసరిగా మీ కరెన్సీని మార్చుకోవాలి.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > జనరల్కు వెళ్లండి.
స్టోర్ డిఫాల్ట్‌ల విభాగంలో,
> స్టోర్ కరెన్సీని మార్చండి క్లిక్ చేయండి.
డ్రాప్-డౌన్ మెనుతో కొత్త ద్రవ్య యూనిట్‌ను ఎంచుకోండి.
మీ మొదటి ఆర్డర్ తర్వాత మీరు కరెన్సీని మారుస్తుంటే, మీరు స్టోర్ కరెన్సీని మార్చడంలో ఉన్న రిస్క్ నాకు అర్థమైందిని కూడా చెక్ చేయాలి. మీరు కరెన్సీని మార్చడానికి గల కారణాన్ని కూడా కావాలనుకుంటే ఎంచుకోవచ్చు. సేవ్ క్లిక్ చేయండి.
ఆప్షనల్: ద్రవ్య మొత్తాలు ప్రదర్శించబడే విధానాన్ని మార్చడానికి, కింది దశలను పూర్తి చేయండి:
> కరెన్సీ ఫార్మాటింగ్‌ను మార్చండి క్లిక్ చేయండి.
- మీ కరెన్సీ ఫార్మాటింగ్‌కు మార్పులు చేయండి.
- సేవ్ క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ని ట్యాప్ చేసి, ఆపై
సెట్టింగ్‌లుని ట్యాప్ చేయండి.
స్టోర్ సెట్టింగ్‌ల విభాగంలో, జనరల్‌ను ట్యాప్ చేయండి.
స్టోర్ డిఫాల్ట్‌ల విభాగంలో,
లేదా
> స్టోర్ కరెన్సీని మార్చండిపై ట్యాప్ చేయండి.
డ్రాప్-డౌన్ మెనుతో కొత్త ద్రవ్య యూనిట్‌ను ఎంచుకోండి.
మీ మొదటి ఆర్డర్ తర్వాత మీరు కరెన్సీని మారుస్తుంటే, మీరు స్టోర్ కరెన్సీని మార్చడంలో ఉన్న రిస్క్ నాకు అర్థమైందిని కూడా చెక్ చేయాలి. కరెన్సీని మార్చడానికి గల కారణాన్ని మీరు కావాలనుకుంటే ఎంచుకోవచ్చు. సేవ్పై ట్యాప్ చేయండి.
ఆప్షనల్: ద్రవ్య మొత్తాలు ప్రదర్శించబడే విధానాన్ని మార్చడానికి, కింది దశలను పూర్తి చేయండి:
లేదా
> కరెన్సీ ఫార్మాటింగ్‌ను మార్చండిపై ట్యాప్ చేయండి.
- మీ కరెన్సీ ఫార్మాటింగ్‌కు మార్పులు చేయండి.
- సేవ్ లేదా ✓ను ట్యాప్ చేయండి.
బహుళ కరెన్సీలను ప్రదర్శించండి
మీరు Shopify Paymentsను ఉపయోగిస్తే, మీరు బహుళ కరెన్సీలలో విక్రయించడానికి మీ స్టోర్‌ను సెటప్ చేయవచ్చు. కస్టమర్‌లు మీ ఆన్‌లైన్ స్టోర్‌ను బ్రౌజ్ చేయవచ్చు మరియు వారు ఇష్టపడే స్థానిక కరెన్సీలో చెక్‌అవుట్ చేయవచ్చు.
ఒకవేళ మీరు Shopify Paymentsను ఉపయోగించకపోతే, ప్రదర్శన ప్రయోజనాల కోసం మాత్రమే మీ ఆన్‌లైన్ స్టోర్‌లో బహుళ కరెన్సీలను చేర్చడానికి మీరు థీమ్‌లను అనుకూలీకరించవచ్చు. స్టోర్ డిఫాల్ట్‌ల విభాగంలో మీ జనరల్ సెట్టింగ్‌ల పేజీలో మీరు సెట్ చేసిన కరెన్సీలో మాత్రమే మీ కస్టమర్‌లు చెక్‌అవుట్ చేయగలరు.
మీ థీమ్‌లో బహుళ కరెన్సీలకు ఎలా మద్దతు ఇవ్వాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
మీ స్టోర్ డిఫాల్ట్ బరువు యూనిట్‌ను సెట్ చేయండి లేదా మార్చండి
మీరు కింది డిఫాల్ట్ బరువు యూనిట్‌ల నుండి ఎంచుకోవచ్చు:
- పౌండ్లు (lb) - ఇంపీరియల్ సిస్టమ్
- ఔన్సులు (oz) - ఇంపీరియల్ సిస్టమ్
- కిలోగ్రాములు (kg) - మెట్రిక్ సిస్టమ్
- గ్రాములు (g) - మెట్రిక్ సిస్టమ్
మీ బిజినెస్‌కు అత్యంత అనుకూలమైన బరువు యూనిట్‌ను ఎంచుకోండి. ఇది కేవలం డిఫాల్ట్ వాల్యూ మాత్రమే, అలాగే దీన్ని ఆ తర్వాత ఒక్కో ఉత్పత్తి (product-by-product) ఆధారంగా ఎడిట్ చేయవచ్చు.
మీ డిఫాల్ట్ బరువు యూనిట్‌ను ఎంచుకోవడానికి ముందు, మీరు అదే స్క్రీన్ నుండి మీ యూనిట్ సిస్టమ్‌ను ఎంచుకోవాలి.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > జనరల్కు వెళ్లండి.
స్టోర్ డిఫాల్ట్‌ల విభాగంలో, మీకు నచ్చిన బరువు యూనిట్‌ను ఎంచుకోవడానికి యూనిట్ సిస్టమ్ మరియు డిఫాల్ట్ బరువు యూనిట్ డ్రాప్-డౌన్ మెనులను ఉపయోగించండి.
సేవ్ క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ని ట్యాప్ చేసి, ఆపై
సెట్టింగ్‌లుని ట్యాప్ చేయండి.
స్టోర్ సెట్టింగ్‌ల విభాగంలో, జనరల్‌ను ట్యాప్ చేయండి.
స్టోర్ డిఫాల్ట్‌ల విభాగంలో, మీకు నచ్చిన బరువు యూనిట్‌ను ఎంచుకోవడానికి యూనిట్ సిస్టమ్ మరియు డిఫాల్ట్ బరువు యూనిట్ డ్రాప్-డౌన్ మెనులను ఉపయోగించండి.
సేవ్ లేదా ✓ను ట్యాప్ చేయండి.
మీ హోమ్ పేజీ మెటాడేటాను సెట్ చేయండి లేదా అప్‌డేట్ చేయండి
సెర్చ్ ఇంజిన్ ఫలితాలలో పేజీ టైటిల్ మరియు మెటా డిస్క్రిప్షన్ లాంటి మెటాడేటా ప్రదర్శించబడుతుంది. ఇది సెర్చ్ ఇంజిన్ ద్వారా లిస్ట్ చేయబడే మీ అవకాశాలను ప్రభావితం చేయదు, కానీ సరైన మెటా డిస్క్రిప్షన్ ద్వారా సందర్శకులు మీ స్టోర్‌పై క్లిక్ చేసే అవకాశాన్ని పెంచుతుంది. మరింత ట్రాఫిక్‌ను ఆకర్షించడానికి ఇది ఒక గొప్ప మార్గం.
ప్రతి పేజీకి టైటిల్ మరియు మెటా డిస్క్రిప్షన్ విలక్షణంగా (unique) ఉండాలి, అలాగే ఆ పేజీ కంటెంట్‌ను వివరిస్తూ ఉండాలి. మీ Shopify అడ్మిన్‌లోని ప్రతి ఉత్పత్తి, పేజీ లేదా బ్లాగ్ కోసం ఒక సెర్చ్ ఇంజిన్ విభాగం ఉంటుంది, సెర్చ్ ఇంజిన్ ఫలితాల పేజీలలో సమాచారం ఎలా ప్రదర్శించబడాలో మీరు అక్కడ ఇన్‌పుట్ చేయవచ్చు.
టైటిల్స్ కోసం 70 క్యారెక్టర్‌ల పరిమితి ఉంటుంది. క్యారెక్టర్‌ల పరిమితిని చేరుకున్న తర్వాత అన్ని సెర్చ్ ఇంజిన్‌లూ దాన్ని కత్తిరించవు (truncate), అయితే చాలావరకు చదవడానికి వీలుగా పదం మధ్యలో కాకుండా ఒక పదం పూర్తయ్యాక దాన్ని కత్తిరిస్తాయి. సెర్చ్ ఇంజిన్‌లు మీ టైటిల్ ట్యాగ్ కింద మీ మెటా డిస్క్రిప్షన్‌కి సంబంధించి సుమారు 140 క్యారెక్టర్‌లను మాత్రమే లిస్ట్ చేస్తాయి, కాబట్టి దాన్ని తక్కువ పొడవులో ఉంచండి.
Google ఫలితాల పేజీలో సెర్చ్ ఫలితంగా మీ పేజీ ఎలా ప్రదర్శించబడుతుందనే ప్రివ్యూను మీరు చూడవచ్చు.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్ > ప్రాధాన్యతలుకు వెళ్లండి.
సోషల్ షేరింగ్ చిత్రం మరియు SEO విభాగంలో, హోమ్ పేజీ టైటిల్ మరియు మెటా డిస్క్రిప్షన్ ఫీల్డ్‌లలో మీ హోమ్ పేజీ మెటాడేటాను ఎంటర్ చేయండి.
సేవ్ క్లిక్ చేయండి.
మీ Shopify స్టోర్‌కు SEO కోసం కీవర్డ్‌లను జోడించడం గురించి మరింత తెలుసుకోండి.
మీ ఆర్డర్ IDలను ఫార్మాట్ చేయండి
డిఫాల్ట్‌గా, మీ మొదటి ఆర్డర్ IDకి #1001 ఫార్మాట్ ఇవ్వబడింది. ఆ తర్వాతి ఆర్డర్‌లు ప్రతి కొత్త ఆర్డర్ కోసం 1 పెంచబడతాయి. మీ ఆర్డర్‌లు ప్రారంభమయ్యే నంబర్ (1001)ను మీరు మార్చలేరు, కానీ ఆర్డర్ ID ప్రిఫిక్స్ లేదా సఫిక్స్‌ను జోడించడం లేదా ఎడిట్ చేయడం ద్వారా మీరు మీ ఆర్డర్ IDల ఫార్మాట్‌ను అనుకూలీకరించవచ్చు.
ఆర్డర్ ID ప్రిఫిక్స్‌ను జోడించండి లేదా ఎడిట్ చేయండి
ప్రిఫిక్స్ ఫీల్డ్‌లోని #ను మీరు తొలగించవచ్చు లేదా దాన్ని A-Z, 0-9 క్యారెక్టర్‌లు లేదా ఏవైనా చిహ్నాలతో భర్తీ చేయవచ్చు. మీరు కావాలనుకుంటే బహుళ క్యారెక్టర్‌లతో కూడా భర్తీ చేయవచ్చు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > జనరల్కు వెళ్లండి.
ఆర్డర్ ID ఫార్మాట్ విభాగంలో, ప్రిఫిక్స్ ఫీల్డ్‌పై క్లిక్ చేసి, ఆ తర్వాత మీ ఆర్డర్ ఫార్మాట్ కోసం ప్రిఫిక్స్‌ను ఎంటర్ చేయండి.
సేవ్ క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ని ట్యాప్ చేసి, ఆపై
సెట్టింగ్‌లుని ట్యాప్ చేయండి.
స్టోర్ సెట్టింగ్‌ల విభాగంలో, జనరల్‌ను ట్యాప్ చేయండి.
ఆర్డర్ ID ఫార్మాట్ విభాగంలో, ప్రిఫిక్స్ ఫీల్డ్‌పై ట్యాప్ చేసి, ఆ తర్వాత మీ ఆర్డర్ ఫార్మాట్ కోసం ప్రిఫిక్స్‌ను ఎంటర్ చేయండి.
సేవ్ లేదా ✓ను ట్యాప్ చేయండి.
ఆర్డర్ ID సఫిక్స్‌ను జోడించండి లేదా ఎడిట్ చేయండి
సఫిక్స్ ఫీల్డ్‌లోని #ను మీరు తొలగించవచ్చు లేదా దాన్ని A-Z, 0-9 క్యారెక్టర్‌లు లేదా ఏవైనా చిహ్నాలతో భర్తీ చేయవచ్చు. మీరు కావాలనుకుంటే బహుళ క్యారెక్టర్‌లతో కూడా భర్తీ చేయవచ్చు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > జనరల్కు వెళ్లండి.
ఆర్డర్ ID ఫార్మాట్ విభాగంలో, సఫిక్స్ ఫీల్డ్‌పై క్లిక్ చేసి, ఆ తర్వాత మీ ఆర్డర్ ఫార్మాట్ కోసం సఫిక్స్‌ను ఎంటర్ చేయండి.
సేవ్ క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ని ట్యాప్ చేసి, ఆపై
సెట్టింగ్‌లుని ట్యాప్ చేయండి.
స్టోర్ సెట్టింగ్‌ల విభాగంలో, జనరల్‌ను ట్యాప్ చేయండి.
ఆర్డర్ ID ఫార్మాట్ విభాగంలో, సఫిక్స్ ఫీల్డ్‌పై ట్యాప్ చేసి, ఆ తర్వాత మీ ఆర్డర్ ఫార్మాట్ కోసం సఫిక్స్‌ను ఎంటర్ చేయండి.
సేవ్ లేదా ✓ను ట్యాప్ చేయండి.
తదుపరి దశలు
మీ బిజినెస్ సమాచారాన్ని సెటప్ చేసిన తర్వాత, మీ స్టోర్‌ను రూపొందించడం ప్రారంభించడానికి ఇది సమయం.