లాంచ్ కోసం మీ Shopify స్టోర్‌ను సిద్ధం చేయడం
మీరు మీ స్టోర్‌ను లాంచ్ చేయడానికి ముందు, చెక్‌అవుట్ ప్రక్రియ ఎలా పని చేస్తుందో సమీక్షించడానికి కొన్ని పరీక్ష ఆర్డర్‌లను ఉంచండి. మీరు సిద్ధమైన తర్వాత, ప్రైవేట్ నుండి పబ్లిక్‌కు యాక్సెస్‌ను మార్చడానికి, మీరు మీ స్టోర్‌ను లాంచ్ చేయవచ్చు.
పరీక్ష ఆర్డర్ చేయడం
ఒక పరీక్ష ఆర్డర్ చేయడం ద్వారా, మీ స్టోర్‌కు చెందిన కింది భాగాల కోసం మీ సెట్టింగ్‌లు సరిగ్గా పని చేస్తున్నాయని మీరు నిర్ధారించుకోవచ్చు:
పరీక్ష ఆర్డర్‌లకు ఛార్జీలు వర్తించవు. మీ స్టోర్ సెటప్ సమయంలో లేదా మీ చెల్లింపు సెట్టింగ్‌లలో మార్పులు చేసినప్పుడల్లా మీరు కనీసం ఒక్క పరీక్ష ఆర్డర్‌ను ఉంచాలి.
Shopify Payments టెస్ట్ మోడ్‌తో లావాదేవీని పరీక్షించండి
మీరు మీ Shopify అడ్మిన్ నుండి ఎప్పుడైనా Shopify Payments టెస్ట్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. టెస్ట్ మోడ్‌లో, వివిధ లావాదేవీ విధానాలను ముందుగా చూడటానికి, మీరు విజయవంతమైన లావాదేవీలు, విఫలమైన లావాదేవీలను అనుకరించవచ్చు. మీ పరీక్ష ఆర్డర్‌లను ఉంచిన తర్వాత, మీ కస్టమర్‌ల నుండి నిజమైన చెల్లింపులను అంగీకరించడానికి టెస్ట్ మోడ్‌ను ఆఫ్ చేశారని నిర్ధారించుకోండి. టెస్ట్ మోడ్ గురించి మరింత తెలుసుకోండి.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > చెల్లింపులు ఆప్షన్‌కు వెళ్లండి.
Shopify Payments విభాగంలో, ఎడిట్ క్లిక్ చేయండి.
టెస్ట్ మోడ్‌ను ఉపయోగించండి ఆప్షన్‌ను చెక్ చేయండి.
సేవ్ చేయండి క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఆప్షన్‌ను ట్యాప్ చేయండి, ఆపై
సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
స్టోర్ సెట్టింగ్‌లు విభాగంలో, చెల్లింపులు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Shopify Payments విభాగంలో, ఎడిట్ ట్యాప్ చేయండి.
టెస్ట్ మోడ్‌ను ఉపయోగించండి ఆప్షన్‌ను చెక్ చేయండి.
సేవ్ చేయండి లేదా ✓ ట్యాప్ చేయండి.
ఇతర పేమెంట్ ప్రొవైడర్‌లతో లావాదేవీని పరీక్షించండి
ఒకవేళ మీరు Shopify Payments ఉపయోగించనట్లయితే, మీ పేమెంట్ ప్రొవైడర్ లావాదేవీలను పరీక్షించడానికి పరిష్కారాలను అందిస్తుందో లేదో తనిఖీ చేయవచ్చు. పేమెంట్ ప్రొవైడర్‌లో లావాదేవీలను పరీక్షించడానికి ఎటువంటి ఆప్షన్‌లు లేకుంటే, మీరు ఈ కింది మార్గాలలో పరీక్ష ఆర్డర్‌ను చేయవచ్చు:
- లావాదేవీని అనుకరించడానికి, Shopify యొక్క టెస్ట్ పేమెంట్ గేట్‌వేను ఉపయోగించండి.
- నిజమైన పేమెంట్ ప్రొవైడర్‌ను ఉపయోగించి, వెంటనే ఆర్డర్‌ను రద్దు చేయండి, అలాగే రీఫండ్ చేయండి.
మీ స్టోర్‌ను ప్రివ్యూ చేయండి
మీరు మీ పాస్‌వర్డ్‌ను తీసివేయడానికి ముందు, మీరు మీ స్టోర్‌ఫ్రంట్‌ను ప్రివ్యూ చేయవచ్చు. మీ Shopify అడ్మిన్‌లోని విక్రయ ఛానెల్‌లు విభాగంలో, ఆన్‌లైన్ స్టోర్ క్లిక్ చేయండి. ఆపై, స్టోర్ ప్రివ్యూ క్లిక్ చేయండి. మీ థీమ్ ప్రివ్యూలో నావిగేట్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
ప్రివ్యూ ఒక కొత్త ట్యాబ్‌లో తెరుచుకుంటుంది, అలాగే మీ స్టోర్ కస్టమర్‌కు ఎలా ప్రదర్శించబడుతుందో అలా చూపిస్తుంది. Shopify అడ్మిన్‌కు తిరిగి వెళ్లడానికి, మీ మునుపటి ట్యాబ్‌కు తిరిగి వెళ్లండి లేదా స్క్రీన్ దిగువన ఉన్న అడ్మిన్‌కు నావిగేట్ చేయండి క్లిక్ చేయండి.
మీ స్టోర్‌ను లాంచ్ చేయండి
మీ ఉచిత ట్రయల్ సమయంలో, మీ ఆన్‌లైన్ స్టోర్ ఆటోమేటిక్‌గా ప్రైవేట్ మోడ్‌లో ఉంటుంది. ప్రైవేట్ మోడ్‌లో, మీ సైట్ పేజీలు యాక్సెస్ చేయబడవు, దానికి బదులుగా పాస్‌వర్డ్ ఆప్షన్ ఉన్న అనుకూలీకరించదగిన ల్యాండింగ్ పేజీ ప్రదర్శించబడుతుంది. కస్టమర్‌లు మీ స్టోర్‌ను సందర్శించినప్పుడు, మీరు వారికోసం ఒక పాస్‌వర్డ్‌ను సృష్టించవచ్చు మరియు ఒక కస్టమ్ సందేశాన్ని జోడించవచ్చు.
మీరు మీ స్టోర్‌ను లాంచ్ చేయడానికి ముందు, మీరు కింది ఆవశ్యక దశలను తప్పనిసరిగా పూర్తి చేయాలి:
- ఒక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకోండి. మీరు ఉచిత ట్రయల్ సమయంలో ప్లాన్‌ను ఎంచుకున్నట్లయితే, మీ ఉచిత ట్రయల్ గడువు ముగిసే వరకు మీకు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రుసుములు ఛార్జ్ చేయబడవు.
- సెట్టింగ్‌లు > సాధారణం పేజీలోని వ్యాపార వివరాలు విభాగానికి ఒక స్టోర్ అడ్రస్‌ను జోడించండి.
- ఒక చెల్లింపు పద్ధతిని సెటప్ చేయండి, అలాగే టెస్ట్ మోడ్ డీయాక్టివేట్ చేయబడిందని నిర్ధారించుకోండి.
మీరు మీ ఆన్‌లైన్ స్టోర్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైనప్పుడు, మీరు మీ Shopify అడ్మిన్ యొక్క కింది ప్రదేశాలలో దేని నుండి అయినా లాంచ్ చేయవచ్చు:
- ఆన్‌లైన్ స్టోర్ పేజీలోని యాక్సెస్ సెట్టింగ్ మెనూ నుండి.
- స్టోర్ యాక్సెస్ విభాగంలోని ఆన్‌లైన్ స్టోర్ > ప్రాధాన్యతలు పేజీ నుండి.
- ఆన్‌లైన్ స్టోర్ పేజీలోని మీ ప్రధాన థీమ్ ప్రివ్యూలో ఉన్న లాంచ్ బ్యానర్ నుండి లేదా థీమ్ ఎడిటర్‌లో.
- Shopify అడ్మిన్ హోమ్ పేజీలోని లాంచ్ కార్డ్ నుండి.
దశలు:
లాంచ్ బటన్‌ని ఉపయోగించి మీ స్టోర్‌ను లాంచ్ చేయండి
- ఈ కింది లొకేషన్‌లలో దేని నుండి అయినా లాంచ్ బటన్‌ను యాక్సెస్ చేయండి: Shopify అడ్మిన్ హోమ్ పేజీ, ఆన్‌లైన్ స్టోర్ పేజీ లేదా థీమ్ ఎడిటర్.
- స్టోర్‌ను లాంచ్ చేయండిపై క్లిక్ చేయండి.
ఆన్‌లైన్ స్టోర్ యాక్సెస్ మెనూను ఉపయోగించి మీ స్టోర్‌ను లాంచ్ చేయండి
మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్‌కి వెళ్లండి.
ప్రైవేట్‌పై క్లిక్ చేయండి.
పబ్లిక్‌ను ఎంచుకోండి.
స్టోర్‌ను లాంచ్ చేయండిపై క్లిక్ చేయండి.
ఆన్‌లైన్ స్టోర్ > ప్రాధాన్యతల నుండి మీ స్టోర్‌ను లాంచ్ చేయండి
మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్ > ప్రాధాన్యతలుకి వెళ్లండి.
స్టోర్ యాక్సెస్ విభాగంలో, ప్రైవేట్ మోడ్ సెట్టింగ్‌ను డీయాక్టివేట్ చేయండి.
సేవ్ చేయండి క్లిక్ చేయండి.