ఏజెంటిక్ ప్లాన్
ఏజెంటిక్ ప్లాన్ అనేది ఇప్పటికే Shopifyని తమ ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగించని వ్యాపారుల కోసం. Shopify ఆన్‌లైన్ స్టోర్‌ను కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా లేదా మీ ప్రస్తుత కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి మైగ్రేట్ చేయాల్సిన అవసరం లేకుండానే, మీ ఉత్పత్తులను Shopify Catalogకు జోడించడానికి, అలాగే వాటిని Shopify ఏజెంటిక్ స్టోర్‌ఫ్రంట్‌ల ద్వారా విక్రయించడానికి ఈ ప్లాన్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
కస్టమర్‌లు AI ఛానెల్‌లలో మీ ఉత్పత్తులను కనుగొనగలరు, అలాగే వాటిని కొనుగోలు చేయగలరు. Shop ఛానెల్ లాంటి ఇతర Shopify ఛానెల్‌లలో విక్రయించడానికి కూడా ఏజెంటిక్ ప్లాన్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఏజెంటిక్ ప్లాన్‌తో మీరు Shopify ఆన్‌లైన్ స్టోర్‌ను కూడా రూపొందించవచ్చు. మీ Shopify ఆన్‌లైన్ స్టోర్‌ను పబ్లిష్ చేయడానికి, దాని ద్వారా విక్రయించడానికి, మీరు పెయిడ్ Shopify సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు మారాలి. ఏజెంటిక్ ప్లాన్‌లో ఆన్‌లైన్ స్టోర్ యాక్సెస్ గురించి మరింత తెలుసుకోండి.
కింది రకాల వ్యాపారాలకు ఏజెంటిక్ ప్లాన్ పని చేస్తుంది:
- డెవలప్‌మెంట్ పని ఎక్కువ లేకుండా, ఏజెంటిక్ కామర్స్ ద్వారా విక్రయించాలని కోరుకునే లెగసీ లేదా కస్టమ్ ప్లాట్‌ఫారమ్‌లలోని వ్యాపారాలు.
- ఏజెంటిక్ కామర్స్ ద్వారా విక్రయించాలనుకునే ఏ స్థాయికి చెందిన వ్యాపారాలైన, ప్రతి ఒక్క ఏజెంటిక్ ఛానెల్‌కు మాన్యువల్‌గా కనెక్ట్ కావాలనుకోని వ్యాపారాలు.
- పెయిడ్ Shopify సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు మారే ముందు Shopify ఆన్‌లైన్ స్టోర్‌ను నిర్మించాలనుకునే వ్యాపారాలు.
ఏజెంటిక్ ప్లాన్‌తో ఏజెంటిక్ స్టోర్‌ఫ్రంట్‌లలో విక్రయించడం గురించి మరింత తెలుసుకోవడానికి, ఏజెంటిక్ ప్లాన్‌లో ఉన్న స్టోర్‌ల కోసం ఏజెంటిక్ స్టోర్‌ఫ్రంట్‌లను సెటప్ చేయడం అనే దాన్ని చూడండి.
ఈ పేజీలో
ఏజెంటిక్ ప్లాన్ ఫీచర్‌లు
ఏజెంటిక్ ప్లాన్‌కు ఎటువంటి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రుసుము లేదు. కింది ఇతర రుసుములు ఇప్పటికీ మీ స్టోర్‌కు వర్తించవచ్చు:
- ఒక కస్టమర్ తమ కొనుగోలును AI ఛానెల్లో Shopify-ఆధారిత డైరెక్ట్ చెక్‌అవుట్‌లో పూర్తి చేసినప్పుడు, మీ పేమెంట్ ప్రొవైడర్‌ను బట్టి, మీరు Shopify Payments రుసుములను లేదా థర్డ్-పార్టీ లావాదేవీ రుసుములను చెల్లిస్తారు.
- మీరు పెయిడ్ సర్వీస్‌లను లేదా పెయిడ్ యాప్‌లను ఉపయోగిస్తే, ఆ ఛార్జీలు మీ స్టోర్‌కు వర్తిస్తాయి.
- మీరు పెయిడ్ Shopify సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు మారితే, ఆ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ రుసుము వర్తిస్తుంది.
కస్టమర్ ఉపయోగించే చెక్‌అవుట్ రకం ఆధారంగా పేమెంట్ రుసుములు ఉంటాయి. కొన్ని AI ఛానెల్‌లు కస్టమర్‌లను మీ ప్రస్తుత ఆన్‌లైన్ స్టోర్ చెక్‌అవుట్‌కి పంపుతాయి. ఇతర AI ఛానెల్‌లు Shopify-ఆధారిత డైరెక్ట్ చెక్‌అవుట్‌ను ఉపయోగిస్తాయి, దీనికి మీ Shopify అడ్మిన్‌లో పేమెంట్ ప్రొవైడర్‌ను సెటప్ చేయాల్సి ఉంటుంది.
ఏజెంటిక్ ప్లాన్‌తో మీరు ఏమి చేయగలరో మరింత తెలుసుకోవడానికి, అన్ని ప్లాన్‌లలోని ఫీచర్‌లు విభాగాన్ని చూడండి.
ఏజెంటిక్ ప్లాన్‌లో ఆన్‌లైన్ స్టోర్ యాక్సెస్
Shopify ఆన్‌లైన్ స్టోర్‌ను నిర్మించి సిద్ధం చేయడానికి మీరు ఏజెంటిక్ ప్లాన్‌తో పాటు ఆన్‌లైన్ స్టోర్ విక్రయాల ఛానెల్‌ను ఉపయోగించవచ్చు. మీ ఆన్‌లైన్ స్టోర్ పాస్‌వర్డ్‌తో రక్షించబడి ఉంటుంది, కాబట్టి కస్టమర్‌లు దాన్ని సందర్శించలేరు, అలాగే కస్టమర్‌లు మీ ఆన్‌లైన్ స్టోర్ చెక్‌అవుట్‌లో కొనుగోలును పూర్తి చేయలేరు.
మీ Shopify ఆన్‌లైన్ స్టోర్‌ను పబ్లిష్ చేసి, మీ ఆన్‌లైన్ స్టోర్ చెక్‌అవుట్ ద్వారా ఆర్డర్‌లను ఆమోదించడానికి, మీరు పెయిడ్ Shopify సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు మారాలి.
మీరు Shopify ఆన్‌లైన్ స్టోర్‌ను నిర్మించినప్పుడు, మీ ఏజెంటిక్ స్టోర్‌ఫ్రంట్‌కి ఏమీ కాదు. కస్టమర్‌లు ఇప్పటికీ AI ఛానెల్‌లలో మీ ఉత్పత్తులను కనుగొని, కొనుగోలు చేయవచ్చు, అలాగే మీ ఉత్పత్తి లింక్‌లు మీ ప్రస్తుత ఆన్‌లైన్ స్టోర్‌కే తీసుకెళ్తాయి. ఏజెంటిక్ ప్లాన్‌తో Shopify ఆన్‌లైన్ స్టోర్‌ను ఎలా నిర్మించాలో తెలుసుకోవడానికి, ఏజెంటిక్ ప్లాన్‌తో ఆన్‌లైన్ స్టోర్ యాక్సెస్ను చూడండి.
ఏజెంటిక్ ప్లాన్‌లో అందుబాటులో లేని ఫీచర్‌లు
కింది ఫీచర్‌లు ఏజెంటిక్ ప్లాన్‌లో అందుబాటులో లేవు:
- మీ ఆన్‌లైన్ స్టోర్‌ను పబ్లిష్ చేయడం లేదా మీ ఆన్‌లైన్ స్టోర్ చెక్‌అవుట్ ద్వారా విక్రయించడం
- Shopify Messaging
- గిఫ్ట్ కార్డ్‌లను విక్రయించడం
- ఆర్డర్‌లను మాన్యువల్‌గా క్రియేట్ చేయడం
- కొనుగోలు తర్వాతి Shop ఆఫర్లు
ఏజెంటిక్ స్టోర్‌ఫ్రంట్‌లతో విక్రయించడానికి అర్హత అవసరాలు
Shopify ఏజెంటిక్ స్టోర్‌ఫ్రంట్‌లతో విక్రయించడానికి మీ అర్హత కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:
- మీ వ్యాపారం, మీ ఉత్పత్తులు.
- మీ కస్టమర్ లొకేషన్.
- మీ Shopify అడ్మిన్‌లోని పేమెంట్ సెటప్.
- కస్టమర్ ఉపయోగించే AI ఛానెల్.
మీ ఉత్పత్తులను AI ఛానెల్‌లకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అవి Shopify Catalog అవసరాలకు కూడా అనుగుణంగా ఉండాలి.
నిర్దిష్ట AI సమాధానం లేదా ఉత్పత్తి ప్లేస్‌మెంట్‌లో మీ ఉత్పత్తులు ప్రదర్శితమవుతాయని ఈ అర్హత హామీ ఇవ్వదు. కస్టమర్ అభ్యర్థన కోసం ఏ ఉత్పత్తులను ప్రదర్శించాలనేది ఒక్కో AI ఛానెల్ నిర్ణయిస్తుంది.
పెయిడ్ Shopify సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు మారడం
కింది కారణాల వల్ల మీరు ఏజెంటిక్ ప్లాన్ నుండి పెయిడ్ Shopify సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు మారవచ్చు:
- మీ Shopify ఆన్‌లైన్ స్టోర్‌ను పబ్లిష్ చేయడానికి.
- మీ Shopify ఆన్‌లైన్ స్టోర్ చెక్‌అవుట్ ద్వారా ఆర్డర్‌లను ఆమోదించడానికి.
- ఏజెంటిక్ ప్లాన్‌లో చేర్చబడని Shopify ఫీచర్‌లను ఉపయోగించడానికి.
మీరు సైన్ అప్ చేసే ఏదైనా కొత్త ప్లాన్‌కి మీ ఉత్పత్తులు, స్టోర్ సెట్టింగ్‌లు, అలాగే ఏజెంటిక్ స్టోర్‌ఫ్రంట్‌ల సెటప్ తీసుకువెళ్లబడతాయి. మీ ఆన్‌లైన్ స్టోర్‌ను పబ్లిష్ చేసిన తర్వాత మాత్రమే మీ ఏజెంటిక్ స్టోర్‌ఫ్రంట్‌ల ఉత్పత్తి లింక్‌లు మీ Shopify ఆన్‌లైన్ స్టోర్‌కు తీసుకువెళ్తాయి.
Shopify సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను సరిపోల్చడానికి, సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం అనే దాన్ని చూడండి. మీ ప్లాన్‌ను మార్చడం గురించి తెలుసుకోవడానికి, మీ Shopify బిల్లింగ్ ప్లాన్ మార్పులను మేనేజ్ చేయడం అనే దాన్ని చూడండి.
ఎంటర్‌ప్రైజ్ వ్యాపారాల కోసం ఏజెంటిక్ ప్లాన్
ప్రామాణిక ఏజెంటిక్ ప్లాన్‌లో మీరు చేయగలిగే వాటికి అదనంగా, ఎంటర్‌ప్రైజ్ వ్యాపారాల కోసం ఏజెంటిక్ ప్లాన్‌లో కింది ఫీచర్‌లు అందుబాటులో ఉంటాయి:
- అపరిమిత సిబ్బంది
- కంబైన్డ్ లిస్టింగ్‌లు
- క్యారియర్-గణించిన షిప్పింగ్
- నెరవేర్పుకు పేమెంట్ క్యాప్చర్
- అదనపు ఇన్వెంటరీ లొకేషన్లు
డెవలపర్‌ల కోసం, ఎంటర్‌ప్రైజ్ వ్యాపారాల ఏజెంటిక్ ప్లాన్‌లో కింది ఫీచర్‌లు ఉంటాయి:
- Shopify Plusకు అనుగుణంగా ఉండే API రేట్ పరిమితులు
- కస్టమ్ యాప్‌లలో స్థాయి 2 సంరక్షిత కస్టమర్ డేటాకు యాక్సెస్
- Shopify Functions APIలను కలిగి ఉన్న కస్టమ్ యాప్‌లు