ABC ఇన్వెంటరీ విశ్లేషణ

సాధారణంగా, మీ లాభాలలో ఎక్కువ భాగం కేవలం కొన్ని ఉత్పత్తుల నుండే వస్తుందని మీరు గుర్తించవచ్చు. ఇతర ఉత్పత్తులు అరుదుగా ఆర్డర్ చేయబడతాయి, మరియు వాటికి అనవసరమైన గిడ్డంగి, నిర్వహణ లేదా ప్రకటనల ఖర్చులు అవసరం కావచ్చు. మీ స్టోర్ వ్యాపారంలో తిరిగి పెట్టగలిగే నగదును ఇలాంటివి వృథా చేస్తాయి. చివరగా, కొన్ని ఉత్పత్తులు తక్కువ విక్రయాలు కలిగి ఉండవచ్చు, అత్యధికంగా విక్రయించబడేవిగా మారవచ్చు, లేదా అప్పుడప్పుడూ అస్సలు విక్రయించబడకపోవచ్చు.

ఒక సిస్టమ్ యొక్క ఎక్కువ శాతం అవుట్‌పుట్ తక్కువ శాతం ఇన్‌పుట్ ద్వారానే వస్తుందనే ఈ పరిశీలన, బహుళ విభాగాలలో కనుగొనబడింది. దీనిని సాధారణంగా 80/20 నియమం లేదా పెరెటో సూత్రం అని అంటారు.

ఇన్వెంటరీ నిర్వహణలో, ఒక ABC విశ్లేషణ ఈ సూత్రాన్ని ఉపయోగిస్తుంది మరియు మీ వ్యాపార ప్రయత్నాలను ఎక్కడ కేంద్రీకరించాలో ప్రాధాన్యత ఇవ్వడంలో మీకు సహాయపడటానికి, మీ ఉత్పత్తులను మూడు కేటగిరీలలో ఉంచుతుంది. మీ Shopify అడ్మిన్‌లో ఉత్పత్తి ద్వారా ABC విశ్లేషణ రిపోర్ట్‌ను మీరు యాక్సెస్ చేయవచ్చు. మీ స్టోర్ Basic లేదా Lite ప్లాన్‌లో ఉన్నట్లయితే, మీరు Shopify App Store నుండి ABC విశ్లేషణ ఉన్న రిపోర్టింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ABC ఇన్వెంటరీ విశ్లేషణ గ్రేడ్‌లు

ABC విశ్లేషణ మీ ఉత్పత్తులను కింది గ్రేడ్‌లుగా విభజిస్తుంది:

  • A-గ్రేడ్: ఇవి మీ రాబడిలో దాదాపు 80% వాటాను కలిగి ఉండే అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తులు. A-గ్రేడ్ ఉత్పత్తులు మీ అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులు.
  • B-గ్రేడ్: ఈ ఉత్పత్తుల ద్వారా మీ రాబడిలో 15% వస్తుంది. ఈ కేటగిరీలోని ఉత్పత్తులు కొన్నిసార్లు A స్థాయికి లేదా C స్థాయికి మారతాయి.
  • C-గ్రేడ్: ఈ ఉత్పత్తుల ద్వారా మీ రాబడిలో 5% వస్తుంది.

ABC ఇన్వెంటరీ విశ్లేషణను వర్తింపజేయడం

మీ A-గ్రేడ్ ఉత్పత్తుల పట్ల అత్యంత శ్రద్ధ వహించండి. ఇవి మీకు అత్యధిక రాబడిని అందించే ఉత్పత్తులు మరియు ఈ ఉత్పత్తుల ఇన్వెంటరీ లేకపోవడం వల్ల మీ విక్రయాలపై ప్రభావం పడుతుంది. మరోవైపు, మీరు మీ C-గ్రేడ్ ఉత్పత్తులను మీకు అవసరమైన వాటి కంటే ఎక్కువగా స్టాక్ చేసినా లేదా వాటిని ఎల్లప్పుడూ స్టాక్‌లో ఉంచడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినా, వాటి వల్ల అనవసరమైన ఖర్చులు తలెత్తవచ్చు.

A-గ్రేడ్ ఉత్పత్తుల కోసం వ్యూహాలు

A గ్రేడ్ ఉన్న ఉత్పత్తుల ద్వారా మీ రాబడిలో 80% వస్తుంది మరియు ఇవి ఉత్తమ పనితీరు కనబరిచే ఉత్పత్తులు. ఈ ఉత్పత్తుల కోసం, కింది వ్యూహాలను ఉపయోగించడాన్ని పరిగణించండి:

  • నష్టాలు, దొంగతనాల నివారణకు A-గ్రేడ్ ఇన్వెంటరీపై మెరుగైన నియంత్రణలు, భద్రతను ఏర్పాటు చేయండి.
  • ఎల్లప్పుడూ A-గ్రేడ్ ఇన్వెంటరీని చేతిలో ఉంచుకోండి. A-గ్రేడ్ ఇన్వెంటరీ బ్యాకప్ స్టాక్‌ను ఉంచుకోవడాన్ని పరిగణించండి మరియు మీ ఇన్వెంటరీ అయిపోతుందని మీరు అంచనా వేయడానికి చాలా ముందుగానే ఈ ఉత్పత్తులను రీఆర్డర్ చేయండి.
  • మీ మార్కెటింగ్ కంటెంట్ మరియు ప్రచారాలలో A-గ్రేడ్ ఉత్పత్తులకు మరింత విజిబిలిటీని కల్పించండి.

B-గ్రేడ్ ఉత్పత్తుల కోసం వ్యూహాలు

B గ్రేడ్ ఉన్న ఉత్పత్తులు మీ రాబడిలో కొంత మధ్యస్థ శాతాన్ని సూచిస్తాయి. ఈ ఉత్పత్తులు తరచుగా A గ్రేడ్‌లు, C గ్రేడ్‌ల మధ్య మారుతూ ఉంటాయి. ఈ ఉత్పత్తులు మీ A-గ్రేడ్ ఉత్పత్తులంత విలువైనవి కావు, కానీ ఏ ఉత్పత్తులు అప్పుడప్పుడు A గ్రేడ్‌కు మరియు ఏవి C గ్రేడ్‌కు మారుతున్నాయో వాటిపై శ్రద్ధ వహించండి.

ఈ ఉత్పత్తుల కోసం, కింది వ్యూహాలను ఉపయోగించడాన్ని పరిగణించండి:

  • ఎల్లప్పుడూ B-గ్రేడ్ ఇన్వెంటరీని చేతిలో ఉంచుకోండి. స్టాక్ అయిపోతుందని మీరు అంచనా వేసిన కొద్ది సమయం ముందు కొత్త స్టాక్ వచ్చేలా ఈ ఉత్పత్తులను రీఆర్డర్ చేయండి.
  • B-గ్రేడ్ ఉత్పత్తులను A-గ్రేడ్ ఉత్పత్తులకు బండిల్స్‌గా లేదా యాడ్-ఆన్‌లుగా ప్రమోట్ చేయండి.
  • అప్పుడప్పుడు A గ్రేడ్‌కి మారే ఉత్పత్తుల కోసం A-గ్రేడ్ వ్యూహాలను ఉపయోగించడాన్ని పరిగణించండి.
  • అప్పుడప్పుడు C గ్రేడ్‌కి మారే ఉత్పత్తుల కోసం C-గ్రేడ్ వ్యూహాలను ఉపయోగించడాన్ని పరిగణించండి.

C-గ్రేడ్ ఉత్పత్తుల కోసం వ్యూహాలు

C గ్రేడ్ ఉన్న ఉత్పత్తులు మీ రాబడిలో చిన్న శాతాన్ని సూచిస్తాయి. వాటిని తరచుగా డెడ్ లేదా స్లో-మూవింగ్ ఇన్వెంటరీగా పరిగణిస్తారు. అయినప్పటికీ, వీటి ద్వారా కూడా కొన్ని విక్రయాలు జరుగుతాయి, ఇవి పూర్తిగా అమ్ముడుపోవడం వల్ల కస్టమర్ అనుభవం లోపించే అవకాశం ఉంది. ఈ స్టాక్‌ను విక్రయించి, మీ కేటలాగ్ నుండి ఆ ఉత్పత్తిని తీసివేయడం తరచుగా లాభదాయకంగా ఉంటుంది.

ఈ ఉత్పత్తుల కోసం, కింది వ్యూహాలను ఉపయోగించడాన్ని పరిగణించండి:

  • C-గ్రేడ్ ఇన్వెంటరీని తగ్గింపు ధరకు విక్రయించండి మరియు ఇది అమ్ముడుపోయిన తర్వాత మీ కేటలాగ్ నుండి ఉత్పత్తిని తీసివేయండి.
  • విక్రయాలను పెంచడానికి, ఇతర కొనుగోళ్లతో పాటు C-గ్రేడ్ ఇన్వెంటరీని ఉచితంగా అందించండి.
  • C-గ్రేడ్ ఇన్వెంటరీని ఛారిటీకి ఇవ్వండి.
  • గిడ్డంగి ఖర్చులను తగ్గించడానికి C-గ్రేడ్ ఇన్వెంటరీని అరుదుగా లేదా జస్ట్-ఇన్-టైమ్ ప్రాతిపదికన ఆర్డర్ చేయండి.
  • ఇది మీ వ్యాపారం కోసం మరేదైనా ప్రయోజనాన్ని అందిస్తే తప్ప, C-గ్రేడ్ ఇన్వెంటరీని ఆర్డర్ చేయడం ఆపివేయండి.