రోల్అవుట్‌ను సృష్టించడం

మీరు మీ Shopify అడ్మిన్‌లోని మార్కెట్‌లు > Rollouts పేజీ నుండి కొత్త రోల్అవుట్‌ను సృష్టించవచ్చు, ఆపై మీ రోల్అవుట్‌కు మార్పులు మరియు వివరాలను జోడించవచ్చు.

రోల్అవుట్‌ను సృష్టించడానికి, ఈ దశలను అనుసరించండి:

  1. రోల్అవుట్‌ను సృష్టించండి.
  2. రోల్అవుట్‌కు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్పులను జోడించండి.
  3. రోల్అవుట్ వివరాలను కాన్ఫిగర్ చేయండి.

మీరు ప్రారంభించడానికి ముందు

మీరు మీ రోల్అవుట్‌కు జోడించాలనుకుంటున్న మార్పు రకాన్ని బట్టి, మీరు రోల్అవుట్‌ను సృష్టించడానికి ముందు మీ Shopify అడ్మిన్‌లోని సంబంధిత విభాగంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. రోల్అవుట్‌కు మార్పును జోడించడానికి కింది అంశాలను పరిశీలించండి:

  • మీరు మీ ప్రధాన థీమ్‌ను సవరించాలనుకుంటే, మీ ప్రధాన థీమ్‌కు సవరణలు చేయడానికి ముందు మీరు రోల్అవుట్‌ను సేవ్ చేయాలి.
    • మీరు మీ ప్రధాన థీమ్‌ను మాత్రమే సవరించగలరు. మీ ప్రధాన థీమ్ అనేది, మీరు సవరించాలనుకుంటున్న థీమ్ అని నిర్ధారించుకోండి.
  • మీరు మీ ప్రధాన థీమ్‌ను భర్తీ చేయాలనుకుంటే, ముందుగా మీరు ఆ థీమ్‌ను మీ ఆన్‌లైన్ స్టోర్‌కి జోడించాలి. దాన్ని రోల్అవుట్‌కు జోడించిన తర్వాత కూడా మీరు రీప్లేస్‌మెంట్ థీమ్‌ను సవరించవచ్చు.
  • మీరు మీ చెక్‌అవుట్, అకౌంట్‌ల కాన్ఫిగరేషన్‌ను భర్తీ చేయాలనుకుంటే, ముందుగా మీరు కాన్ఫిగరేషన్‌ను సృష్టించాలి. దాన్ని రోల్అవుట్‌కు జోడించిన తర్వాత కూడా మీరు రీప్లేస్‌మెంట్ కాన్ఫిగరేషన్‌ను సవరించవచ్చు.
  • మీరు కేటలాగ్ మార్పును జోడించాలనుకుంటే, ముందుగా మీరు కేటలాగ్‌ను సృష్టించాలి. మీరు మార్పును జోడించినప్పుడు ఇప్పటికే ఉన్న కేటలాగ్‌ను ఎంచుకుంటారు, ఆపై రోల్అవుట్ ఆ కేటలాగ్‌ను యాక్టివ్‌గా లేదా డ్రాఫ్ట్‌గా సెట్ చేస్తుందో లేదో ఎంచుకోవచ్చు. మీరు మార్కెట్‌ల కోసం సృష్టించే కేటలాగ్‌లను మాత్రమే జోడించగలరు మరియు ఆ కేటలాగ్ ఇంకా ఏ మార్కెట్‌కూ కేటాయించబడాల్సిన అవసరం లేదు. కంపెనీ లొకేషన్ కోసం మీరు సృష్టించే B2B కేటలాగ్‌లను జోడించలేరు మరియు ఆర్కైవ్ చేసిన కేటలాగ్‌లను కూడా జోడించలేరు. మీరు కేటలాగ్‌ను ఎంచుకున్నప్పుడు ఈ రెండూ ప్రదర్శించబడవు.
  • మీరు తగ్గింపులను యాక్టివేట్ లేదా డియాక్టివేట్ చేయాలనుకుంటే, మీకు ఇప్పటికే ఉన్న తగ్గింపులు అవసరం. ఒక తగ్గింపు అనేది ఒకేసారి ముగియని ఒక రోల్అవుట్‌లో మాత్రమే భాగం కాగలదు.

దశ 1: రోల్అవుట్‌ను సృష్టించండి

ముందుగా, మీ రోల్అవుట్‌ను సృష్టించి, పేరు పెట్టండి, ఆపై మీరు సృష్టించాలనుకుంటున్న రోల్అవుట్ రకాన్ని ఎంచుకోండి లేదా సెట్టింగ్‌లను సర్దుబాటు చేయండి.

రోల్అవుట్ రకాన్ని ఎంచుకోవడం ద్వారా రోల్అవుట్ తేదీలు, ఆడియన్స్ మరియు రోల్అవుట్ ముగిసిన తర్వాత ఆ మార్పులు ఏమవుతాయి అనే వాటి కోసం డిఫాల్ట్‌లు సెట్ చేయబడతాయి. రకాన్ని ఎంచుకున్న తర్వాత కూడా మీరు ఏవైనా సెట్టింగ్‌లను అనుకూలీకరించవచ్చు మరియు సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం వల్ల రోల్అవుట్ రకం కూడా మారవచ్చు. ఉదాహరణకు, మీరు రోల్అవుట్ రకంగా లాంచ్‌ను ఎంచుకుని ముగింపు తేదీని జోడిస్తే, అప్పుడు రోల్అవుట్ రకం ఈవెంట్‌కి మారుతుంది. ఎందుకంటే, లాంచ్ రోల్అవుట్ అనేది షెడ్యూల్ చేసిన వ్యవధి తర్వాత మార్పులను వెనక్కి తీసుకునే బదులు వాటిని శాశ్వతంగా వర్తింపజేస్తుంది. విభిన్న రోల్అవుట్ రకాల గురించి మరింత తెలుసుకోండి.

మీరు జోడించాలనుకుంటున్న మార్పులను బట్టి, మార్పులను జోడించడానికి ముందు మీరు మీ రోల్అవుట్‌ను సేవ్ చేయాల్సి రావచ్చు.

  1. మీ Shopify అడ్మిన్ నుండి, మార్కెట్‌లు > Rolloutsకి వెళ్లండి.

  2. రోల్అవుట్‌ను సృష్టించండి మీద క్లిక్ చేయండి.

  3. పేరు విభాగంలో, కొత్త రోల్అవుట్ కోసం Summer Sale 2026 లాంటి పేరును జోడించండి.

  4. రోల్అవుట్ రకం మెనూలో, లాంచ్, ఈవెంట్ లేదా ప్రయోగంను ఎంచుకోండి.

దశ 2: రోల్అవుట్‌కు మార్పులను జోడించండి

మీరు రోల్అవుట్‌కు కింది రకాల మార్పులను జోడించవచ్చు:

మీరు ప్రతి రోల్అవుట్‌కు ఒక థీమ్ మార్పు మరియు ఒక చెక్‌అవుట్, ఖాతాల మార్పును మాత్రమే జోడించగలరు. రోల్అవుట్‌లోని మార్పుల రకాల గురించి మరింత తెలుసుకోండి.

మీరు మీ ప్రధాన థీమ్‌ను భర్తీ చేయాలనుకుంటే, మీరు Translate & Adapt యాప్ లాంటి అనుకూలమైన అనువాద యాప్‌ను ఉపయోగించి రీప్లేస్‌మెంట్ థీమ్ కంటెంట్‌ను కూడా అప్‌డేట్ చేయవచ్చు.

దశలు:

  1. మీ రోల్అవుట్‌లోని మార్పులు విభాగంలో, మార్పులను జోడించండి మీద క్లిక్ చేయండి.
  2. ఐచ్ఛికం: మీరు మీ ప్రధాన థీమ్‌ను సవరించాలనుకుంటే, మీ రోల్అవుట్‌ను సేవ్ చేయడానికి సేవ్ క్లిక్ చేయండి.
  3. ​ మార్పులను జోడించండి డైలాగ్‌లో, మీరు జోడించాలనుకుంటున్న మార్పు కేటగిరీని ఎంచుకోండి:
    • ​ ఆన్‌లైన్ స్టోర్ మార్పుల కోసం, కింది ఆప్షన్‌లలో ఒకదాన్ని ఎంచుకోండి:
      • మీ ప్రస్తుత థీమ్‌కు మార్పులను సిద్ధం చేయండి విభాగంలో, థీమ్‌ను సవరించండి క్లిక్ చేసి, థీమ్ ఎడిటర్‌లో మీ థీమ్‌ను అనుకూలీకరించండి, ఆపై సేవ్ క్లిక్ చేయండి.
      • ప్రస్తుత థీమ్‌ను భర్తీ చేయండి విభాగంలో, కొత్త థీమ్‌ను ఎంచుకోండి.
    • Checkout & accounts మార్పుల కోసం, ప్రస్తుత కాన్ఫిగరేషన్‌ను భర్తీ చేయండి విభాగంలో, ఒక కాన్ఫిగరేషన్‌ను ఎంచుకోండి.
    • కేటలాగ్‌ల మార్పుల కోసం, మీరు మార్చాలనుకుంటున్న ప్రతి కేటలాగ్‌ను సెర్చ్ చేసి ఎంచుకోండి, ఆపై ఆ కేటలాగ్ కోసం యాక్టివ్‌కి సెట్ చేయండి లేదా డ్రాఫ్ట్‌కి సెట్ చేయండిపై క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న ప్రతి కేటలాగ్ మీరు దానిని మార్చే వరకు యాక్టివ్‌గా సెట్ చేయబడుతుంది, కాబట్టి మీరు ఉపసంహరించుకోవాలనుకునే ఏదైనా కేటలాగ్ కోసం డ్రాఫ్ట్‌కి సెట్ చేయండి ఎంచుకోండి.
    • డిస్కౌంట్‌ల మార్పుల కోసం, మీరు మార్చాలనుకుంటున్న ప్రతి డిస్కౌంట్‌ను ఎంచుకోండి, ఆపై మీ రోల్అవుట్‌లోని కస్టమర్‌ల కోసం ఆ డిస్కౌంట్ యాక్టివేట్ చేయబడిందా లేదా డీయాక్టివేట్ చేయబడిందా అనేది సెట్ చేయండి.
  4. వర్తింపజేయండి క్లిక్ చేయండి.
  5. ఆప్షనల్: మరొక రకమైన మార్పును జోడించడానికి, మార్పులను జోడించండి క్లిక్ చేయండి.

దశ 3: రోల్అవుట్ వివరాలను కాన్ఫిగర్ చేయండి

మీ రోల్అవుట్‌కు మార్పులను జోడించిన తర్వాత, ప్రేక్షకులు, అలాగే రోల్అవుట్ ప్రారంభ, ముగింపు తేదీల లాంటి మీ రోల్అవుట్ కోసం వివరాలను మీరు కాన్ఫిగర్ చేయవచ్చు.

ట్రాఫిక్ కేటాయింపును సెట్ చేయండి

ప్రేక్షకులు విభాగంలో, ట్రాఫిక్ కేటాయింపు సెట్టింగ్ రోల్అవుట్ వర్తించే అర్హులైన సందర్శకుల శాతాన్ని కంట్రోల్ చేస్తుంది. మీ రోల్అవుట్‌లోని అన్ని మార్పులకు ఈ శాతం వర్తిస్తుంది. రోల్అవుట్ 100% కంటే తక్కువ మంది సందర్శకులకు వర్తిస్తే, మీరు ప్రారంభ తేదీ, ముగింపు తేదీని కూడా తప్పక ఎంచుకోవాలి.

అర్హత (Eligibility) సెట్టింగ్ రోల్అవుట్ వర్తించే మార్కెట్‌లను చూపుతుంది. మీరు రోల్అవుట్‌కి జోడించిన మార్పుల ఆధారంగా మార్కెట్‌లు నిర్ణయించబడతాయి, కాబట్టి మీరు వాటిని ఎంచుకోలేరు. థీమ్ భర్తీ అనేది ఎల్లప్పుడూ అన్ని మార్కెట్‌లకు వర్తిస్తుంది.

కస్టమర్ విభాగం, కస్టమర్ ట్యాగ్ లేదా పరికరానికి మీరు రోల్అవుట్‌ను టార్గెట్ చేయలేరు. సందర్శకులను ఉద్దేశ్యరహితంగా (random గా) సమూహాలలో ఉంచుతారు. సందర్శకులకు సమూహాలను ఎలా కేటాయిస్తారు అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

రోల్అవుట్ మీ కస్టమర్‌లలో 100% కంటే తక్కువ మందిని చేరుకుంటే, మీ ప్రకటనలు, లిస్టింగ్‌లు మరియు ఉత్పత్తి ఫీడ్‌లు మీ ఆన్‌లైన్ స్టోర్‌లో కొంతమంది కస్టమర్‌లకు చూపబడే వాటితో సరిపోలకపోవచ్చు. రోల్అవుట్ రీచ్ మరియు బాహ్య ఛానెల్‌ల గురించి మరింత తెలుసుకోండి.

దశలు:

  1. మీ రోల్అవుట్‌లో, ప్రేక్షకులు విభాగానికి వెళ్లండి.
  2. ట్రాఫిక్ కేటాయింపు విభాగంలో, అర్హత ఉన్న సందర్శకులందరూపై క్లిక్ చేసి, స్లయిడర్‌ని అడ్జస్ట్ చేయండి లేదా శాతాన్ని ఎంటర్ చేయండి.

ప్రారంభ తేదీ, సమయాన్ని సెట్ చేయండి

భవిష్యత్ తేదీ, సమయంలో ప్రారంభమై, ముగిసేలా మీరు రోల్అవుట్‌ను షెడ్యూల్ చేయవచ్చు. సెట్టింగ్‌లు > సాధారణంలో మీ స్టోర్ టైమ్‌జోన్‌కు టైమ్‌జోన్ సెట్ చేయబడింది.

తేదీ ఫీల్డ్‌ల కోసం లేబుల్ మీరు ఎంచుకున్న రోల్అవుట్ రకానికి సరిపోలుతుంది: లాంచ్ కోసం మార్పులు ప్రచురించబడతాయి, ఈవెంట్ కోసం ఈవెంట్ రన్ అయ్యేది మరియు ప్రయోగం కోసం ప్రయోగం రన్ అయ్యేది.

కొత్త థీమ్‌ను ప్రచురించడం వల్ల మీ రోల్అవుట్‌లపై ప్రభావం పడవచ్చు. కొత్త థీమ్‌ను ప్రచురించడం గురించి మరింత తెలుసుకోండి.

దశలు:

  1. షెడ్యూల్ చేయడం విభాగంలో, ప్రారంభ తేదీపై క్లిక్ చేయండి.
  2. తేదీ, సమయాన్ని ఎంచుకోండి లేదా ఎంటర్ చేయండి.
  3. పూర్తయిందిపై క్లిక్ చేయండి.

ముగింపు తేదీ, సమయాన్ని సెట్ చేయండి

ఒక రోల్అవుట్ షెడ్యూల్ చేసిన సమయానికి మాత్రమే వర్తించి, ఆ తర్వాత రోల్ బ్యాక్ చేయబడాలని మీరు కోరుకుంటే, మీరు రోల్అవుట్ కోసం ముగింపు తేదీ, సమయాన్ని సెట్ చేయవచ్చు. ఈ కింది ప్రేక్షకులు కాన్ఫిగరేషన్‌లలో దేనికైనా మీరు తప్పనిసరిగా ముగింపు తేదీని సెట్ చేయాలి:

  • మీరు ట్రాఫిక్ విభజనను 100% ట్రీట్‌మెంట్ కంటే తక్కువకు కేటాయిస్తారు.
  • మీరు ట్రాఫిక్ కేటాయింపును 100% కంటే తక్కువగా సెట్ చేస్తారు.

రోల్అవుట్ ముగిసినప్పుడు ఏమి జరుగుతుందనే దాని వివరణను రోల్అవుట్ డిస్‌ప్లే చేస్తుంది, తద్వారా మీరు దాన్ని సేవ్ చేయడానికి ముందే ఆ ప్రవర్తనను నిర్ధారించవచ్చు. ముగింపు తేదీని తీసివేయడానికి రోల్అవుట్ రకాన్ని లాంచ్‌కి మార్చవచ్చు, దానికి బదులుగా మార్పులను శాశ్వతంగా వర్తింపజేయవచ్చు.

రోల్అవుట్ డ్రాఫ్ట్ లేదా షెడ్యూల్ చేయబడింది స్టేటస్‌ను కలిగి ఉంటే, మీరు రోల్అవుట్ కాన్ఫిగరేషన్ వివరాలను ఎడిట్ చేసి, ఈ చర్యను మార్చవచ్చు. రోల్అవుట్ యాక్టివ్‌గా ఉండి, మీరు దాని షెడ్యూల్ చేసిన సమయానికి ముందే దానిని ముగించాలనుకుంటే, దానికి బదులుగా మీరు రోల్అవుట్‌ను మాన్యువల్‌గా ముగించవచ్చు.

దశలు:

  1. ముగింపు తేదీని సెట్ చేయండిపై క్లిక్ చేయండి.
  2. తేదీ, సమయాన్ని ఎంచుకోండి లేదా ఎంటర్ చేయండి.
  3. పూర్తయిందిపై క్లిక్ చేయండి.

ప్రయోగం కోసం ట్రాఫిక్ స్ప్లిట్‌ను సెట్ చేయండి

మీరు రోల్అవుట్ రకంగా ప్రయోగంను ఎంచుకుంటే, ఆడియన్స్ విభాగం నియంత్రణ మరియు ట్రీట్‌మెంట్ మధ్య ట్రాఫిక్ స్ప్లిట్‌ను ప్రదర్శిస్తుంది. డిఫాల్ట్‌గా, కొత్త ప్రయోగం 50% నియంత్రణ మరియు 50% ట్రీట్‌మెంట్‌తో కూడిన ట్రాఫిక్ స్ప్లిట్‌ను, ప్రయోగం ప్రారంభమైన 90 రోజుల తర్వాత ముగింపు తేదీని ఉపయోగిస్తుంది. విభిన్న రోల్అవుట్ రకాల గురించి మరింత తెలుసుకోండి.

దశలు:

  1. ప్రేక్షకులు విభాగంలో, ట్రాఫిక్ విభజన శాతంపై క్లిక్ చేయండి.
  2. ప్రీసెట్ ఆప్షన్‌లలో ఒకదాన్ని ఎంచుకోండి లేదా కంట్రోల్, ట్రీట్‌మెంట్ మధ్య విభజనను అడ్జస్ట్ చేయడానికి స్లయిడర్‌ను ఉపయోగించండి.

మీరు సేవ్ చేయడానికి ముందు వైరుధ్యాలను రివ్యూ చేయండి

మీరు రోల్అవుట్‌ను కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు, మీ స్టోర్‌లోని ఇతర రోల్అవుట్‌లకు వ్యతిరేకంగా రోల్అవుట్ తనిఖీ చేయబడుతుంది, ఏవైనా వైరుధ్యాలు ఉంటే మీరు సేవ్ చేయడానికి ముందే డిస్‌ప్లే చేయబడతాయి. ఈ కింది సందేశాల రకాలను రివ్యూ చేయండి:

  • రోల్అవుట్ వైరుధ్యాలను పరిష్కరించండి: మీరు రోల్అవుట్‌ను సేవ్ చేయడానికి ముందు సమస్యను పరిష్కరించాలి.
  • రోల్అవుట్ వైరుధ్యాలను రివ్యూ చేయండి: మీరు రోల్అవుట్‌ను సేవ్ చేయవచ్చు, మరొక రోల్అవుట్ మీ మార్పులను ఎలా ప్రభావితం చేస్తుందో సందేశం వివరిస్తుంది.

ఒకే సమయంలో యాక్టివ్‌గా ఉన్న రోల్అవుట్‌లు ట్రాఫిక్ కేటాయింపును, సందర్శకులకు ఏ మార్పులు అందుబాటులో ఉంటాయనే విషయాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇలా ఒకేసారి అమలవడం వల్ల కలిగే ప్రభావం ప్రతి రోల్అవుట్‌లోని మార్పులు, వాటి ట్రాఫిక్ సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటుంది. రోల్అవుట్‌ను సేవ్ చేసే ముందు వైరుధ్య సందేశాలను సమీక్షించి, సమస్యలను పరిష్కరించండి. యాక్టివ్‌గా ఉన్న బహుళ రోల్అవుట్‌ల నిర్వహణ గురించి మరింత తెలుసుకోండి.

థీమ్ ఎడిటర్‌లో మీ ప్రధాన థీమ్‌ను ఎడిట్ చేయడం

థీమ్ ఎడిటర్‌లో మీరు చేసే ఏవైనా అనుకూలీకరణలు ఆ రోల్అవుట్‌కు మాత్రమే వర్తిస్తాయి. రోల్అవుట్‌లో అనుకూలీకరించబడని మీ థీమ్ ప్రాంతాలు ఆటోమేటిక్‌గా మీ పబ్లిష్ చేసిన థీమ్‌కి చేసిన అనుకూలీకరణలతో సమకాలీకరించబడి ఉంటాయి. మీకు బహుళ రోల్అవుట్‌లు ఉంటే లేదా మీ పబ్లిష్ చేసిన థీమ్‌లో ఎడిట్‌లు చేయాలనుకుంటే, థీమ్ ఎడిటర్ మెనూ బార్‌లోని రోల్అవుట్‌ల మెనూ నుండి మీరు వేరొక ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

మీకు ఒకటి కంటే ఎక్కువ మార్కెట్‌లు ఉన్నట్లయితే, మార్పులను వర్తింపజేయడానికి మీరు నిర్దిష్ట మార్కెట్‌లను ఎంచుకోవచ్చు. మార్కెట్‌లను సృష్టించడం, మేనేజ్ చేయడం మరియు నిర్దిష్ట మార్కెట్‌ల కోసం మీ థీమ్‌ను అనుకూలీకరించడం గురించి మరింత తెలుసుకోండి.

కొత్త థీమ్‌ను ప్రచురించడం వలన ఈ అనుకూలీకరణలు తీసివేయబడవచ్చు. కొత్త థీమ్‌ను ప్రచురించడం గురించి మరింత తెలుసుకోండి. మీ ప్రధాన థీమ్‌ను ఎడిట్ చేయడానికి ముందు రోల్అవుట్‌లను ఉపయోగించడం కోసం ఉన్న అవసరాలు మరియు పరిగణనలను సమీక్షించండి.

మీ థీమ్‌ను అనుకూలీకరించడానికి థీమ్ ఎడిటర్‌ను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్కి వెళ్లండి.

  2. మీ ప్రధాన థీమ్ పక్కన ఉన్న Rolloutsపై క్లిక్ చేయండి.

  3. మీరు అనుకూలీకరించాలనుకుంటున్న రోల్అవుట్ పేరుపై క్లిక్ చేయండి లేదా రోల్అవుట్ కోసం సెర్చ్ చేయండి.

  4. థీమ్ ఎడిటర్‌లో, మీ థీమ్‌ను అనుకూలీకరించండి.

  5. సేవ్ చేయండి క్లిక్ చేయండి.

థీమ్ కంటెంట్‌ను ఎడిట్ చేయడం

మీరు మీ రోల్అవుట్‌కు థీమ్ రీప్లేస్‌మెంట్ మార్పును జోడిస్తే, Translate & Adapt యాప్ వంటి అనుకూల అనువాద యాప్‌ను ఉపయోగించి మీరు రీప్లేస్‌మెంట్ థీమ్ కంటెంట్‌ను, అనువాదాలను అప్‌డేట్ చేయవచ్చు.

ఈ కింది పద్ధతుల్లో దేనిని ఉపయోగించి అయినా మీరు రోల్అవుట్ కోసం మీ రీప్లేస్‌మెంట్ థీమ్ భాషలను, అనువాదాలను అప్‌డేట్ చేయలేరు:

  • మాన్యువల్ అనువాదాలను జోడించడం.
  • CSVతో అనువాదాలను అప్‌లోడ్ చేయడం.
  • అనుకూలత లేని అనువాద యాప్‌ను ఉపయోగించడం. అనుకూల యాప్‌లు తప్పనిసరిగా Shopifyకి చెందిన Admin APIని ఉపయోగించాలి. మీ అనువాద యాప్ అనుకూలంగా ఉందో లేదో మీకు కచ్చితంగా తెలియనట్లయితే, యాప్ సరైన APIని ఉపయోగిస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి యాప్ డెవలపర్‌లను సంప్రదించండి.
  • Horizontal menu > డిఫాల్ట్ థీమ్ కంటెంట్‌ను ఎడిట్ చేయండిపై క్లిక్ చేయడం ద్వారా థీమ్ ఎడిటర్ నుండి డిఫాల్ట్ థీమ్ కంటెంట్‌ను ఎడిట్ చేయడం.

మీ ఆన్‌లైన్ స్టోర్‌లో కంటెంట్‌ను స్థానికీకరించడానికి, అనువదించడానికి గల ఆవశ్యకతల గురించి మరింత తెలుసుకోండి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, యాప్‌లు > Translate & Adaptకు వెళ్లండి.

  2. థీమ్ విభాగంలో ఏదైనా కేటగిరీని ఎంచుకోండి.

  3. థీమ్ సెలెక్టర్‌పై క్లిక్ చేయండి.

  4. Rollouts విభాగంలో, మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్‌పై క్లిక్ చేయండి.

  5. ఏదైనా భాషకు సంబంధించి థీమ్ కంటెంట్‌లో తగిన సర్దుబాట్లు చేయండి.

  6. సేవ్ చేయండి క్లిక్ చేయండి.