కొనుగోలు బటన్‌ను సృష్టించడం
మీ Shopify అడ్మిన్‌లో మీరు కొనుగోలు బటన్ విక్రయాల ఛానెల్‌ను జోడించిన తర్వాత, మీరు ఉత్పత్తి లేదా కలెక్షన్ కోసం కొనుగోలు బటన్‌ను సృష్టించవచ్చు.
మీరు కొనుగోలు బటన్‌ను సృష్టించిన తర్వాత, ఆటోమేటిక్‌గా రూపొందించబడిన కోడ్‌ను కాపీ చేసి, ఆపై బటన్ ప్రదర్శించబడాలని మీరు కోరుకునే వెబ్‌పేజీ లేదా బ్లాగ్ పోస్ట్‌కు ఆ కోడ్‌ను జోడిస్తారు. ఉదాహరణకు, మీరు మీ Wordpress బ్లాగ్ లేదా Squarespace వెబ్‌సైట్‌కు కొనుగోలు బటన్‌ను జోడించాలనుకోవచ్చు.
మీ వెబ్‌సైట్‌లో మీరు దాన్ని ఎంబెడ్ చేసిన తర్వాత కొనుగోలు బటన్ రూపాన్ని మార్చడం సాధ్యపడదు. ఒకవేళ మీరు దాన్ని మార్చాలనుకుంటే, అప్పుడు మీరు ఛానెల్‌లో ఒక కొత్త బటన్‌ను సృష్టించాలి, అలాగే అసలైన కోడ్‌ను కొత్త కోడ్‌తో భర్తీ చేయాలి.
ఈ పేజీలో
కొనుగోలు బటన్‌లను అనుకూలీకరించడం
మీరు కొనుగోలు బటన్ రూపాన్ని, అలాగే దాని ప్రవర్తనను అనుకూలీకరించవచ్చు:
- దాని రంగు
- దాని పరిమాణం
- దాని ఫాంట్
- బటన్‌ను క్లిక్ చేసినప్పుడు జరిగే చర్య
- చెక్‌అవుట్ కొత్త బ్రౌజర్ విండోలో తెరవబడుతుందా అనేది
మీరు బటన్‌ను అనుకూలీకరించే కొలదీ, మీ మార్పులను మీరు ప్రివ్యూ చూడవచ్చు. ప్రివ్యూను క్లిక్ చేయడం ద్వారా మీరు కొనుగోలు బటన్ ప్రవర్తనను పరీక్షించవచ్చు.
లేఅవుట్ స్టైల్
మీరు కొనుగోలు బటన్ లేఅవుట్‌ను ఎంచుకోవచ్చు.
| Basic | ఎటువంటి ఉత్పత్తి చిత్రం లేకుండా కొనుగోలు బటన్‌ను జోడించడానికి ఈ లేఅవుట్‌ను ఎంచుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికే ఆన్‌లైన్‌లో వేరొకచోట మీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ, కొనుగోలు చేయడం కోసం కేవలం బటన్‌ను మాత్రమే జోడించాలనుకుంటే మీరు దీనిని చేయవచ్చు. |
| Classic | కొనుగోలు బటన్ పక్కన ఉత్పత్తి చిత్రం మరియు ధరను ప్రదర్శించడానికి ఈ లేఅవుట్‌ను ఎంచుకోండి. బ్లాగ్ పోస్ట్ వంటి వాటిలో శీఘ్ర ఉత్పత్తి ప్రివ్యూ కోసం ఈ లేఅవుట్ ఉపయోగపడుతుంది. |
| పూర్తి వీక్షణ | కొనుగోలు బటన్ పక్కన ఉత్పత్తి చిత్రం, ధర మరియు వివరణను ప్రదర్శించడానికి ఈ లేఅవుట్‌ను ఎంచుకోండి. ఈ లేఅవుట్ మీ ఆన్‌లైన్ స్టోర్‌లోని ఉత్పత్తి వివరాల పేజీని అనుకరిస్తుంది. |
కొనుగోలు బటన్ చర్యలు
మీరు కొనుగోలు బటన్‌ను సృష్టించినప్పుడు, బటన్‌ను క్లిక్ చేసినప్పుడు జరిగే చర్యను మీరు ఎంచుకోవచ్చు.
ఒకవేళ కొనుగోలు బటన్ కలెక్షన్ కోసం అయితే, కలెక్షన్‌లోని ప్రతి ఉత్పత్తికి ఆ చర్య వర్తిస్తుంది.
- కార్ట్‌కు ఉత్పత్తిని జోడించండి (Add product to cart) అనేది ఉత్పత్తిని షాపింగ్ కార్ట్‌కు జోడిస్తుంది. కస్టమర్‌లు షాపింగ్ కొనసాగించవచ్చు, అలాగే అదనపు ఉత్పత్తులను కార్ట్‌కు జోడించవచ్చు.
- నేరుగా చెక్‌అవుట్‌కు వెళ్లండి (Direct to checkout) కస్టమర్‌ను నేరుగా మీ చెక్‌అవుట్‌కు తీసుకువెళుతుంది, అక్కడ వారు ఉత్పత్తిని కొనుగోలు చేయవచ్చు. కస్టమర్‌లు తమ ఆర్డర్‌కు అదనపు ఉత్పత్తులను జోడించలేరు.
- ఉత్పత్తి వివరాలను తెరవండి అనేది ఉత్పత్తిని చూడండి బటన్‌ను ప్రదర్శిస్తుంది. కస్టమర్ బటన్‌ను క్లిక్ చేసినప్పుడు, వారు ఉత్పత్తి వివరణను చూడవచ్చు, అందుబాటులో ఉన్న ఏదైనా ప్రొడక్ట్ వేరియంట్‌లను ఎంచుకోవచ్చు, అలాగే కార్ట్‌కు ఉత్పత్తిని జోడించవచ్చు. ఒకవేళ ఉత్పత్తి బహుళ ఉత్పత్తి చిత్రాలను కలిగి ఉంటే, అవి కూడా ప్రదర్శించబడతాయి.
- మీరు పూర్తి వీక్షణ లేఅవుట్‌ను ఎంచుకున్నప్పుడు ఈ ఆప్షన్ అందుబాటులో ఉండదు, ఎందుకంటే పూర్తి వీక్షణ లేఅవుట్ ఇప్పటికే అన్ని ఉత్పత్తి వివరాలను ప్రదర్శిస్తుంది.
చెక్‌అవుట్ కొత్త బ్రౌజర్ విండోలో తెరవబడాలా లేదా మీ వెబ్‌సైట్ ఉన్న అదే ట్యాబ్‌లో తెరవబడాలా అని కూడా మీరు ఎంచుకోవచ్చు. డిఫాల్ట్‌గా, చెక్‌అవుట్ కొత్త విండోలో తెరవబడుతుంది.
కొనుగోలు బటన్ రూపం
- బటన్ స్టైల్ అనేది కొనుగోలు బటన్‌లోని బటన్ భాగానికి సంబంధించిన ఆకారం, రంగు మరియు టైపోగ్రఫీని కలిగి ఉంటుంది.
- లేఅవుట్ మీరు ఎంచుకున్న లేఅవుట్ స్టైల్‌పై ఆధారపడి, మీరు బటన్ అమరిక, చిత్ర పరిమాణం, బటన్ వచనం, ఫాంట్, రంగు మరియు పరిమాణం వంటి సెట్టింగ్‌లను అనుకూలీకరించవచ్చు.
- షాపింగ్ కార్ట్ అనేది ఎంబెడ్ చేసిన షాపింగ్ కార్ట్ కోసం వచన మరియు రంగు ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. దానికి తోడుగా, మీరు ఆర్డర్ గమనిక ఫీల్డ్ కోసం లేబుల్‌ను కూడా ఎనేబుల్ చేసి, అనుకూలీకరించవచ్చు. ఆర్డర్‌ను ఎలా సిద్ధం చేయాలి మరియు డెలివరీ చేయాలి అనే దాని గురించి కస్టమర్‌ల నుండి ప్రత్యేక సూచనలను సేకరించడానికి మీరు ఆర్డర్ గమనికలను ఉపయోగించవచ్చు. అదనపు సమాచారం ఫీల్డ్ మీ కస్టమర్‌లకు సందేశాన్ని పంపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
- మీరు బటన్ చర్యగా కార్ట్‌కు ఉత్పత్తిని జోడించండి (Add product to cart) లేదా ఉత్పత్తి వివరాలను తెరవండి (Open product details)ని ఎంచుకున్నట్లయితే మాత్రమే మీరు షాపింగ్ కార్ట్ కోసం సెట్టింగ్‌లను ఎడిట్ చేయగలరు.
- వివరణాత్మక పాప్-అప్లో ఉత్పత్తి వివరాల పాప్-అప్ విండోకు సంబంధించిన సెట్టింగ్‌లు ఉంటాయి. మీరు బటన్ టెక్స్ట్‌ని, పరిమాణం ఫీల్డ్‌ని చేర్చాలా వద్దా అనే విషయాన్ని, బ్యాక్‌గ్రౌండ్, లేబుల్‌ల కోసం ఉపయోగించే రంగులను మరియు లేబుల్‌ల ఫాంట్, ఫాంట్ పరిమాణాన్ని అనుకూలీకరించవచ్చు. మీరు బటన్ చర్యగా ఉత్పత్తి వివరాలను తెరవండిని ఎంచుకుంటే మాత్రమే ఈ సెట్టింగ్‌లను ఎడిట్ చేయగలరు.
ఒకే ఉత్పత్తి కోసం కొనుగోలు బటన్‌ను సృష్టించండి
మీరు ఒకే ఉత్పత్తి కోసం కొనుగోలు బటన్‌ను సృష్టించవచ్చు. కొనుగోలు బటన్, ఉత్పత్తికి సంబంధించిన ఒకటి లేదా అన్ని వేరియంట్‌లను కలిగి ఉండవచ్చు. మీరు కొనుగోలు బటన్‌ను సృష్టించినప్పుడు, మీరు లేఅవుట్ స్టైల్‌ను ఎంచుకుంటారు మరియు బటన్ రంగు, టెక్స్ట్, రూపాన్ని అలాగే కస్టమర్ దానిపై క్లిక్ చేసినప్పుడు జరిగే చర్యను అనుకూలీకరిస్తారు. కొనుగోలు బటన్‌లను అనుకూలీకరించడం గురించి మరింత తెలుసుకోండి.
ఉత్పత్తి కోసం కొనుగోలు బటన్‌ను సృష్టించడానికి ముందు, మీరు మీ Shopify అడ్మిన్‌లో ఉత్పత్తిని జోడించి, దాన్ని కొనుగోలు బటన్ విక్రయాల ఛానెల్‌కు అందుబాటులో ఉంచాలి.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, విక్రయ ఛానెల్‌లు > కొనుగోలు బటన్కు వెళ్లండి.
కొనుగోలు బటన్‌ను సృష్టించండిని క్లిక్ చేయండి.
ఉత్పత్తి కొనుగోలు బటన్‌ను క్లిక్ చేయండి.
మీ కేటలాగ్ నుండి ఉత్పత్తిని ఎంచుకోండి లేదా ఉత్పత్తిని కనుగొనడానికి సెర్చ్‌ను ఉపయోగించండి. ఎంచుకోండిని క్లిక్ చేయండి.
ఐచ్ఛికం: కొనుగోలు బటన్‌ను అనుకూలీకరించండి.
- మీ ఉత్పత్తికి వేరియంట్‌లు ఉంటే, అన్ని వేరియంట్‌లును ఎంచుకోండి లేదా మీరు చేర్చాలనుకుంటున్న వేరియంట్‌ను ఎంచుకోండి.
- ఒక లేఅవుట్ స్టైల్ని మరియు కస్టమర్ బటన్‌ను క్లిక్ చేసినప్పుడు జరిగే చర్యను ఎంచుకోండి. మీరు బటన్ రూపాన్ని కూడా అనుకూలీకరించవచ్చు.
- డిఫాల్ట్‌గా, చెక్‌అవుట్ ప్రవర్తన కొత్త విండోను తెరుస్తుంది, అయితే మీరు మీ వెబ్‌సైట్ ఉన్న బ్రౌజర్ ట్యాబ్‌లోనే చెక్‌అవుట్‌ను తెరవడానికి ఎంచుకోవచ్చు. అధునాతన సెట్టింగ్‌లు > అదే ట్యాబ్‌లో దారి మళ్లించండిని క్లిక్ చేయండి.
తర్వాతని క్లిక్ చేయండి.
కోడ్‌ను కాపీ చేయండిని క్లిక్ చేయండి.
మీరు కొనుగోలు బటన్‌ను ప్రదర్శించాలనుకుంటున్న వెబ్‌పేజీ కోసం HTML ఎడిటర్‌ను తెరవండి. HTMLకు కొనుగోలు బటన్ కోడ్‌ని జోడించడంని చూడండి.
HTMLలో కొనుగోలు బటన్ కనిపించాలనుకుంటున్న చోట కోడ్‌ను పేస్ట్ చేసి, ఆపై మీ మార్పులను సేవ్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
విక్రయ ఛానెల్‌లు విభాగంలో, కొనుగోలు బటన్‌ను ట్యాప్ చేయండి.
కొనుగోలు బటన్‌ను సృష్టించండిని ట్యాప్ చేయండి.
ఉత్పత్తి కొనుగోలు బటన్‌ను ట్యాప్ చేయండి.
మీ కేటలాగ్ నుండి ఉత్పత్తిని ఎంచుకోండి లేదా ఉత్పత్తిని కనుగొనడానికి సెర్చ్‌ను ఉపయోగించండి మరియు ఆపై ఎంచుకోండిని ట్యాప్ చేయండి.
ఐచ్ఛికం: అనుకూలీకరించండిని ట్యాప్ చేయండి.
- మీ ఉత్పత్తికి బహుళ వేరియంట్‌లు ఉంటే, అన్ని వేరియంట్‌లును ఎంచుకోండి లేదా డ్రాప్-డౌన్ జాబితా నుండి వేరియంట్‌ను ఎంచుకోండి.
- ఒక లేఅవుట్ స్టైల్ని మరియు కస్టమర్ బటన్‌ను క్లిక్ చేసినప్పుడు జరిగే చర్యను ఎంచుకోండి. మీరు బటన్ రూపాన్ని కూడా అనుకూలీకరించవచ్చు.
- డిఫాల్ట్‌గా, చెక్‌అవుట్ ప్రవర్తన కొత్త విండోను తెరుస్తుంది, అయితే మీరు మీ వెబ్‌సైట్ ఉన్న బ్రౌజర్ ట్యాబ్‌లోనే చెక్‌అవుట్‌ను తెరవడానికి ఎంచుకోవచ్చు. అధునాతన సెట్టింగ్‌లు > అదే ట్యాబ్‌లో దారి మళ్లించండిని ట్యాప్ చేయండి.
పూర్తయిందిని ట్యాప్ చేయండి.
కోడ్‌ను కాపీ చేయండిని ట్యాప్ చేయండి.
మీరు కొనుగోలు బటన్‌ను ప్రదర్శించాలనుకుంటున్న వెబ్‌పేజీ కోసం HTML ఎడిటర్‌ను తెరవండి. HTMLకు కొనుగోలు బటన్ కోడ్‌ని జోడించడంని చూడండి.
HTMLలో కొనుగోలు బటన్ కనిపించాలనుకుంటున్న చోట కోడ్‌ను పేస్ట్ చేసి, ఆపై మీ మార్పులను సేవ్ చేయండి.
కలెక్షన్ కోసం కొనుగోలు బటన్‌ను సృష్టించండి
మీరు కలెక్షన్ కోసం కొనుగోలు బటన్‌ను సృష్టించినప్పుడు, వాస్తవానికి మీరు కలెక్షన్‌లోని ప్రతి ఉత్పత్తి కోసం బటన్‌ను సృష్టిస్తున్నారు.
మీరు కొనుగోలు బటన్‌ను సృష్టించినప్పుడు, మీరు లేఅవుట్ స్టైల్‌ను ఎంచుకుంటారు మరియు బటన్ రంగు, టెక్స్ట్, రూపాన్ని అలాగే కస్టమర్ దానిపై క్లిక్ చేసినప్పుడు జరిగే చర్యను అనుకూలీకరిస్తారు. కొనుగోలు బటన్‌లను అనుకూలీకరించడం గురించి మరింత తెలుసుకోండి.
కలెక్షన్ కోసం కొనుగోలు బటన్‌ను సృష్టించడానికి ముందు, మీరు వీటిని చేసి ఉండాలి:
- మీ Shopify అడ్మిన్‌లో ఉత్పత్తులను జోడించి ఉండాలి,
- కొనుగోలు బటన్ విక్రయాల ఛానెల్‌కు ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలి
- కలెక్షన్‌ను సృష్టించి ఉండాలి.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, విక్రయ ఛానెల్‌లు > కొనుగోలు బటన్కు వెళ్లండి.
కొనుగోలు బటన్‌ను సృష్టించండిని క్లిక్ చేయండి.
కలెక్షన్ కొనుగోలు బటన్‌ను క్లిక్ చేయండి.
కలెక్షన్‌ను ఎంచుకోండి లేదా కలెక్షన్‌ను కనుగొనడానికి సెర్చ్‌ను ఉపయోగించండి. ఎంచుకోండిని క్లిక్ చేయండి.
ఐచ్ఛికం: కొనుగోలు బటన్‌ను అనుకూలీకరించండి.
- కస్టమర్ బటన్‌ను క్లిక్ చేసినప్పుడు జరిగే చర్యను ఎంచుకోండి. మీరు బటన్ రూపాన్ని కూడా అనుకూలీకరించవచ్చు.
- డిఫాల్ట్‌గా, చెక్‌అవుట్ ప్రవర్తన కొత్త విండోను తెరుస్తుంది, అయితే మీరు మీ వెబ్‌సైట్ ఉన్న బ్రౌజర్ ట్యాబ్‌లోనే చెక్‌అవుట్‌ను తెరవడానికి ఎంచుకోవచ్చు. అధునాతన సెట్టింగ్‌లు > అదే ట్యాబ్‌లో దారి మళ్లించండిని క్లిక్ చేయండి.
తర్వాతని క్లిక్ చేయండి.
కోడ్‌ను కాపీ చేయండిని క్లిక్ చేయండి.
మీరు కొనుగోలు బటన్‌ను ప్రదర్శించాలనుకుంటున్న వెబ్‌పేజీ కోసం HTML ఎడిటర్‌ను తెరవండి. HTMLకు కొనుగోలు బటన్ కోడ్‌ని జోడించడంని చూడండి.
HTMLలో కొనుగోలు బటన్ కనిపించాలనుకుంటున్న చోట కోడ్‌ను పేస్ట్ చేసి, ఆపై మీ మార్పులను సేవ్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
విక్రయ ఛానెల్‌లు విభాగంలో, కొనుగోలు బటన్‌ను ట్యాప్ చేయండి.
కొనుగోలు బటన్‌ను సృష్టించండిని ట్యాప్ చేయండి.
కలెక్షన్ కొనుగోలు బటన్‌ను ట్యాప్ చేయండి.
కలెక్షన్‌ను ఎంచుకోండి లేదా కలెక్షన్‌ను కనుగొనడానికి సెర్చ్‌ను ఉపయోగించండి మరియు ఆపై ఎంచుకోండిని ట్యాప్ చేయండి.