Marketplace Connect ఉత్పత్తి లిస్టింగ్ ఆవశ్యకతలు

మీరు మార్కెట్‌ప్లేస్‌లో Shopify ఉత్పత్తిని జాబితా చేస్తున్నప్పుడు, అది మీరు జాబితా చేస్తున్న మార్కెట్‌ప్లేస్‌కు సంబంధించిన ఉత్పత్తి ఆవశ్యకతలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవాలి. ప్రతి మార్కెట్‌ప్లేస్‌కు మీరు అనుసరించాల్సిన నిర్దిష్ట ఉత్పత్తి లిస్టింగ్ మార్గదర్శకాలు ఉంటాయి:

Amazon, Walmart, eBay అలాగే Target Plusలకు కూడా గ్లోబల్ ట్రేడ్ ఐటెమ్ నంబర్ (GTIN), యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్ (UPC), తయారీదారు పార్ట్ నంబర్ (MPN) లేదా యూరోపియన్ ఆర్టికల్ నంబర్ (EAN) లాంటి ప్రత్యేకమైన ఉత్పత్తి ఐడెంటిఫైయర్‌లు ప్రతి ఉత్పత్తికి అవసరం అవుతాయి. ప్రైవేట్ లేబుల్ వస్తువులు లాంటి ప్రత్యేకమైన ఉత్పత్తి ఐడెంటిఫైయర్‌లు లేని ఉత్పత్తులను మీరు విక్రయిస్తుంటే, ఆ మార్కెట్‌ప్లేస్‌ల నుండి మినహాయింపు కోసం మీరు అప్లయ్ చేయాలి. ప్రత్యేకమైన ఉత్పత్తి ఐడెంటిఫైయర్‌ల గురించి మరింత తెలుసుకోండి.

మార్కెట్‌ప్లేస్‌లకు అవసరమైన కొంత ఉత్పత్తి సమాచారం మీ Shopify అడ్మిన్‌లోని మీ ఉత్పత్తి వివరాలలో భాగంగా ఉండదు. మీ Shopify ఉత్పత్తుల నుండి మీ మార్కెట్‌ప్లేస్ లిస్టింగ్‌ల వరకు ఈ అవసరమైన వివరాలను చేర్చడానికి అలాగే సింక్ చేయడానికి, మెటాఫీల్డ్‌లు ఇంకా లక్షణాల మ్యాపింగ్ ద్వారా మీ ఉత్పత్తి లిస్టింగ్‌లను ఎలా అనుకూలీకరించాలో తెలుసుకోండి.