Shopలో ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి అవసరమైన ప్రమాణాలు
Shop కోసం రెండు వేర్వేరు ప్రమాణాల సమూహాలు ఉన్నాయి. మీరు Shopలో కస్టమర్లకు మీ ఉత్పత్తులను ప్రదర్శించడానికి మాత్రమే అర్హులా, లేదా నేరుగా విక్రయించడానికి కూడా అర్హులా అనేది ఇవి నిర్ణయిస్తాయి:
- Shopలో ప్రదర్శించడానికి అవసరమైన ప్రమాణాలను తీర్చడం వల్ల మీ స్టోర్, ఉత్పత్తులు Shopలో కనిపిస్తాయి.
- Shopలో నేరుగా విక్రయించడానికి అవసరమైన ప్రమాణాలను తీర్చడం వల్ల కస్టమర్లు Shop నుంచి బయటకు వెళ్లకుండానే మీ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.
మీ స్టోర్ Shopలో ప్రదర్శించడానికి అవసరమైన ప్రమాణాలను తీర్చి, నేరుగా విక్రయించడానికి అవసరమైన ప్రమాణాలను తీర్చకపోయినా, మీ ఉత్పత్తులు Shopలో కనిపిస్తాయి. అయితే, కొనుగోలును పూర్తి చేయడానికి కస్టమర్లను మీ ఆన్లైన్ స్టోర్‌కు మళ్లిస్తారు. మీ స్టోర్ ఈ రెండు రకాల ప్రమాణాలను తీరుస్తే, కస్టమర్లు Shop నుంచి బయటకు వెళ్లకుండానే మీ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. Shopలో ఉత్పత్తులను ప్రదర్శించడం, విక్రయించడం గురించి మరింత తెలుసుకోండి.
అర్హత ఉన్న స్టోర్లు Shopకు ఆటోమేటిక్‌గా జోడించబడతాయి. అర్హత పొందడానికి మీరు Shop ఛానెల్‌ను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఛానెల్‌ను ఇన్స్టాల్ చేస్తే అదనపు ఫీచర్లు, సెట్టింగ్‌లకు యాక్సెస్ లభిస్తుంది. మీ స్టోర్‌కు Shopలో నేరుగా విక్రయించే అర్హత ఉంటే, మీరు Shop ఛానెల్‌ను ఇన్స్టాల్ చేయకపోయినా Shop ద్వారా ఆర్డర్లు రావచ్చు.
ఈ ప్రమాణాలను తీర్చడానికి మీరు స్టోర్‌లో మార్పులు చేస్తే, అవి అమల్లోకి వచ్చి, మీ ఆమోద స్థితి అప్డేట్ కావడానికి 48 గంటల వరకు పట్టవచ్చు.
ఈ పేజీలో
Shopలో మీ స్టోర్‌ను, ఉత్పత్తులను ప్రదర్శించడానికి అవసరమైన ప్రమాణాలు
మీ స్టోర్ కింది ప్రమాణాలను తీరుస్తే, కస్టమర్లు Shopలో మీ ఉత్పత్తులను బ్రౌజ్ చేయవచ్చు. కొనుగోలును పూర్తి చేయడానికి వారిని మీ ఆన్లైన్ స్టోర్‌కు మళ్లిస్తారు:
- సేవా నిబంధనలు మరియు ఆమోదయోగ్యమైన వినియోగ విధానాన్ని పాటించడం: మీ స్టోర్ Shopify సేవా నిబంధనలు మరియు ఆమోదయోగ్యమైన వినియోగ విధానాన్ని పాటిస్తుంది.
- యాక్టివ్ Shopify ప్లాన్: మీ స్టోర్ యాక్టివ్‌గా ఉన్న Shopify ప్లాన్‌లో ఉంది. మీ ప్రస్తుత ప్లాన్‌ను తనిఖీ చేయడం లేదా అప్‌గ్రేడ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
- వ్యాపార వివరాలు: మీ స్టోర్‌కు వ్యాపార వివరాలు జోడించి ఉన్నాయి.
- నెరవేర్చిన ఆర్డర్లు: మీ స్టోర్ కనీసం ఒక ఆర్డర్‌ను నెరవేర్చింది.
- ఆన్లైన్ స్టోర్ విక్రయాల ఛానెల్: మీ స్టోర్‌లో ఆన్లైన్ స్టోర్ విక్రయాల ఛానెల్ ఉంది. స్టోర్ ప్రైవేట్ మోడ్‌లో లేదు. మీ ఆన్లైన్ స్టోర్‌లో ప్రైవేట్ మోడ్ గురించి మరింత తెలుసుకోండి.
- కస్టమర్ యాక్సెస్: మీ ఆన్లైన్ స్టోర్ B2B కస్టమర్లకు మాత్రమే పరిమితం కాదు.
- యాప్ అనుకూలత: మీరు Advanced Registration, B2B Login Access Management, Login to View Price మరియు MagicPass Wholesale వంటి పాస్వర్డ్ నియంత్రణ లేదా వయస్సు ధృవీకరణ యాప్‌లను ఉపయోగించడం లేదు.
- Locksmith పాస్వర్డ్ నియంత్రణ యాప్‌కు మినహాయింపు ఉంది. ఇది Shopతో అనుకూలంగా పనిచేస్తుంది. మీరు Locksmithతో కొన్ని ఉత్పత్తులను లాక్ చేసినా, మీ స్టోర్ Shopలో కనిపిస్తుంది. లాక్ చేసిన ఉత్పత్తులు మాత్రం మీ షాప్ స్టోర్‌లో కనిపించవు.
Shopలో నేరుగా విక్రయించడానికి అవసరమైన ప్రమాణాలు
మీ స్టోర్ కింది నిబంధనలకు అనుగుణంగా ఉంటే, కస్టమర్లు Shop నుంచి బయటకు వెళ్లకుండానే మీ ఉత్పత్తులను చూసి కొనుగోలు చేయవచ్చు:
- సేవా నిబంధనలు మరియు ఆమోదయోగ్యమైన వినియోగ విధానాన్ని పాటించడం: మీ స్టోర్ Shopify సేవా నిబంధనలు మరియు ఆమోదయోగ్యమైన వినియోగ విధానాన్ని పాటిస్తుంది.
- యాక్టివ్ Shopify ప్లాన్: మీ స్టోర్ యాక్టివ్‌గా ఉన్న Shopify ప్లాన్‌లో ఉంది. మీ ప్రస్తుత ప్లాన్‌ను తనిఖీ చేయడం లేదా అప్‌గ్రేడ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
- Shopify Payments యాక్టివేషన్: మీ స్టోర్‌లో Shopify Payments యాక్టివేట్ అయి ఉంది. Shopify Payments అవసరాల గురించి మరింత తెలుసుకోండి.
- ఛార్జ్‌బ్యాక్ రేటు: గత 90 రోజుల్లో మీ స్టోర్ ఛార్జ్‌బ్యాక్ రేటు 5% కంటే తక్కువగా ఉంది. Shopify Paymentsతో ప్రాసెస్ చేసిన లావాదేవీలపై వచ్చిన అన్ని ఛార్జ్‌బ్యాక్‌లు మీ ఛార్జ్‌బ్యాక్ రేటులో లెక్కిస్తారు.
- ఉత్పత్తి అర్హత: మీ ఉత్పత్తుల్లో కనీసం ఒకటి Shop ఉత్పత్తి అర్హత ప్రమాణాలను తీరుస్తుంది. మీరు నిషేధిత ఉత్పత్తులు, ఆమోదించిన ఉత్పత్తులు రెండింటినీ విక్రయిస్తే, ఆమోదించిన ఉత్పత్తులు మాత్రమే Shopలో అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తి అర్హత ట్రబుల్షూటింగ్ గురించి మరింత తెలుసుకోండి.