Shopify Collective యాప్‌లోని విశ్లేషణలు, ఇంకా ఇన్‌సైట్‌లను అర్థం చేసుకోవడం

Shopify Collectiveతో మీ స్టోర్ విశ్లేషణలు, ఇంకా ఇన్‌సైట్‌లను చూడటం ద్వారా మీ విక్రయాల పనితీరును మెరుగుపరచుకోవడానికి మీరు తగిన చర్యలు తీసుకోవచ్చు.

Shopify Collectiveతో మీ స్టోర్ విశ్లేషణలను చూడండి

మీరు కింది రకాల రిపోర్ట్‌ల ద్వారా Shopify Collective కోసం స్టోర్ విశ్లేషణలను చూడవచ్చు:

  • నికర విక్రయాలు
  • ఆర్డర్‌లు
  • స్థూల లాభం
  • సరఫరాదారు వారీగా విక్రయాలు
  • ఉత్పత్తి వారీగా ఆర్డర్‌లు
  • కేటగిరీ వారీగా ఆర్డర్‌లు

స్థూల లాభం అనేది రిటర్న్‌లు మరియు రీఫండ్‌ల తర్వాత, మీ నికర విక్రయాల నుండి మీ ఉత్పత్తి ఖర్చులను తీసివేయగా వచ్చేది. మీరు లేదా మీ కస్టమర్ చెల్లించే పన్నులు మరియు ఏదైనా షిప్పింగ్ ఖర్చు ఇందులో ఉండవు.

పూర్తి రిపోర్ట్‌ను చూడటానికి మీ Shopify అడ్మిన్‌లోని అనలిటిక్స్ > రిపోర్ట్‌లు విభాగంలో ఏదైనా విక్రయాలు, ఆర్డర్‌లు లేదా స్థూల లాభం లింక్‌పై మీరు క్లిక్ చేయవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, యాప్‌లు > Collectiveకు వెళ్లండి.

  2. ఐచ్ఛికం: మీ Shopify Collective విశ్లేషణల కోసం తేదీ పరిధిని మార్చడానికి, గత 30 రోజులు డ్రాప్-డౌన్ మెనుని క్లిక్ చేయండి, మీరు వీక్షించాలనుకుంటున్న తేదీ పరిధిని ఎంచుకోండి, ఆపై వర్తింపజేయండిని క్లిక్ చేయండి.

  3. మీకు ఆసక్తి ఉన్న పూర్తి రిపోర్ట్‌ను చూడటానికి, ఏదైనా విక్రయాలు, ఆర్డర్‌లు లేదా స్థూల లాభం లింక్‌పై క్లిక్ చేయండి.

Shopify Collectiveతో మీ స్టోర్ ఇన్‌సైట్‌లను వీక్షించండి

మీరు Shopify Collectiveను ఎంత కాలంగా ఉపయోగిస్తున్నారు, మీకు ఎన్ని విక్రయాలు అలాగే ఆర్డర్‌లు జరిగాయి, మరియు మీ కస్టమర్‌లు ఏ రకమైన ఉత్పత్తులపై ఆసక్తి కలిగి ఉన్నారనే దాని ఆధారంగా, మీ Shopify Collective యాప్‌లో కింది ఇన్‌సైట్‌ల కార్డ్‌లు ప్రదర్శించబడవచ్చు:

  • మైలురాళ్లు: కింది సందర్భాలలో ఈ కార్డ్‌లు ప్రదర్శించబడతాయి:
    • మీరు మీ మొదటి Collective విక్రయాన్ని చేసినప్పుడు, ఇతర మొత్తం Collective విక్రయాల మైలురాళ్లను చేరుకున్నప్పుడు.
    • మీ అన్ని Collective ఉత్పత్తులు లేదా నిర్దిష్ట ఉత్పత్తులు, మీ కస్టమర్‌లు వాటిని ఎన్నిసార్లు వీక్షించారనే దానికి సంబంధించి నిర్దిష్ట మైలురాళ్లను చేరుకున్నప్పుడు.
    • నిర్దిష్ట ఉత్పత్తులు నిర్దిష్ట విక్రయ మైలురాళ్లను చేరుకున్నప్పుడు.
  • కస్టమర్ సెర్చ్‌లు: కస్టమర్‌లు మీ స్టోర్‌లో నిర్దిష్ట రకాల ఉత్పత్తుల కోసం వెతుకుతున్నప్పటికీ, ఎలాంటి సంబంధిత ఫలితాలు కనుగొనబడనప్పుడు ఈ కార్డ్‌లు ప్రదర్శించబడతాయి. కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి, అలాగే మీ విక్రయాలను పెంచడానికి ఈ ఉత్పత్తులను జోడించడాన్ని మీరు పరిగణించవచ్చు.
  • జనాదరణ పొందిన/అనుబంధ ఉత్పత్తులు: మీ కస్టమర్‌లలో ఇప్పటికే జనాదరణ పొందిన ఉత్పత్తి రకాలకు, ఇలాంటి లేదా అనుబంధ ఉత్పత్తులను జోడించడానికి అవకాశాలు ఉన్నప్పుడు ఈ కార్డ్‌లు ప్రదర్శించబడతాయి.

మీ స్టోర్‌లో కస్టమర్ డిమాండ్‌ను పూర్తిగా తీర్చే Shopify Collective ఉత్పత్తి కేటలాగ్‌ను రూపొందించడంలో మీకు సహాయపడటానికి, మీ విక్రయం, ఆర్డర్ మైలురాళ్లు, కస్టమర్ కొనుగోలు ట్రెండ్‌లు, అనుబంధ ఉత్పత్తులు, అలాగే ఉత్పత్తి సెర్చ్ గ్యాప్‌లకు సంబంధించిన వివరాలను ఇన్‌సైట్‌ల కార్డ్‌లు అందిస్తాయి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, యాప్‌లు > Collectiveకు వెళ్లండి.

  2. ఇన్‌సైట్‌లు విభాగంలో, వీటిలో ఏదైనా చేయండి:

    • మైలురాయి కార్డ్ కోసం:
      1. రిపోర్ట్‌ను వీక్షించండిని క్లిక్ చేయండి.
      2. మీ Shopify అడ్మిన్‌లోని అనలిటిక్స్ > రిపోర్ట్‌లు విభాగంలో పూర్తి రిపోర్ట్‌ను వీక్షించండి.
    • ఉత్పత్తుల కార్డ్ కోసం:
      1. ఉత్పత్తులను కనుగొనండిని క్లిక్ చేయండి.
      2. మీ Shopify Collective యాప్‌లోని డిస్కవరీ విభాగంలో, మీరు మీ స్టోర్‌లో విక్రయించాలనుకుంటున్న ఏవైనా ఉత్పత్తులను జోడించండి లేదా వాటి యాక్సెస్ కోసం అభ్యర్థించండి.