సరఫరాదారుల కోసం Collective కమ్యూనిటీ మార్గదర్శకాలను అర్థం చేసుకోవడం

Shopify Collective అనేది మీరు రిటైలర్‌లతో విజయవంతమైన సంబంధాలను ఏర్పరచుకునే ప్రదేశంగా ఉండేలా చూసేందుకు, కింది కమ్యూనిటీ మార్గదర్శకాలు, ఉత్తమ పద్ధతులను రివ్యూ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. కలిసి పని చేయడానికి గల ఉత్తమ మార్గాలను అంగీకరించేందుకు, మీరు భాగస్వామిగా ఉన్న రిటైలర్‌లతో కమ్యూనికేట్ చేయడానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది:

  • ఆహ్వాన మర్యాద: Collectiveలో మీ ఉత్పత్తులను ఆఫర్ చేయాలనుకునే రిటైలర్‌లకు మాత్రమే కనెక్షన్ ఆహ్వానాలను పంపండి. మీరు కనెక్షన్ ఆహ్వానాలను స్వీకరిస్తున్నా లేదా తిరస్కరిస్తున్నా, వాటికి వెంటనే స్పందించండి.
  • ఉత్పత్తి లిస్టింగ్‌లు: సరైన ఉత్పత్తి వివరాలతో మీ ఉత్పత్తులను జాబితా చేశారని నిర్ధారించుకోండి. మీరు ఉత్పత్తి వివరణలను వ్రాసేటప్పుడు కనీసం 150 అక్షరాలు ఉండేలా లక్ష్యంగా పెట్టుకోండి, అలాగే అధిక నాణ్యత గల ఇమేజ్‌లను చేర్చండి.
  • ఫుల్‌ఫిల్‌మెంట్‌ను మేనేజ్ చేయడం: కస్టమర్ ఆర్డర్‌లపై ఊహించని డెలివరీ జాప్యాలను నివారించడానికి మీ ఇన్వెంటరీని కరెక్ట్‌గా మేనేజ్ చేయండి, మీ షిప్పింగ్ ప్రొఫైల్స్ ఖచ్చితమైన రవాణా సమయ అంచనాలను కలిగి ఉన్నాయని నిర్ధారించుకోండి. మీరు రవాణా చేసే అన్ని భౌతిక ఉత్పత్తులకు ఖచ్చితమైన ట్రాకింగ్ నంబర్‌లను అందించండి.
  • రిటైలర్‌పై గౌరవం: మీరు నేరుగా మీ రిటైలర్‌ల కస్టమర్‌లకు ఉత్పత్తులను రవాణా చేసినప్పుడు, ప్యాకేజీలలో మీ స్వంత మార్కెటింగ్ మెటీరియల్‌లను, డిస్కౌంట్ కోడ్‌లను లేదా ఇన్‌వాయిస్‌లను చేర్చవద్దు.
  • రిటర్న్ నియమాలు: మీ కనెక్ట్ చేయబడిన రిటైలర్‌లతో మీరు అంగీకరించే రిటర్న్‌ల విధానాన్ని ఫాలో అవ్వండి.
  • కస్టమర్ అనుభవం: కస్టమర్ సపోర్ట్ విచారణలకు 48 గంటల్లో ప్రతిస్పందించడం లక్ష్యంగా పెట్టుకోండి. ఏవైనా కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి, మీరు కమ్యూనికేట్ చేస్తూ, మీ రిటైలర్‌లతో సమర్థవంతంగా కలిసి పని చేస్తున్నారని నిర్ధారించుకోండి.

ఒకవేళ మీకు ఏదైనా భాగస్వామ్యంతో అసంతృప్తిగా ఉన్నట్లయితే, నేరుగా రిటైలర్‌తో మాట్లాడండి. అంచనాల గురించిన స్పష్టమైన కమ్యూనికేషన్ ద్వారా చాలా సమస్యలు పరిష్కరించబడతాయి.

మీరు ఏదైనా భాగస్వామ్యాన్ని ముగించాలనుకుంటే, మీరు మీ Shopify Collective విక్రయాల ఛానెల్‌లో రిటైలర్‌తో డిస్‌కనెక్ట్ కావచ్చు, అలాగే రిటైలర్ మోసపూరిత పద్ధతులు లేదా దుష్ప్రవర్తనను ఆప్షనల్‌గా రిపోర్ట్ చేయవచ్చు. రిటైలర్‌ల ప్రవర్తనలో ఏవైనా సంభావ్య నమూనాలను గుర్తించడానికి మాత్రమే Shopify ఈ రిపోర్ట్‌లను రివ్యూ చేస్తుంది. మీరు రిటైలర్‌ను రిపోర్ట్ చేసిన తర్వాత, మీ ఫీడ్‌బ్యాక్ గురించి Shopify నుండి మీకు తదుపరి కమ్యూనికేషన్ అందదు.