Shopify Collective విక్రయ ఛానెల్‌లో రిటైలర్‌ల నుండి డిస్‌కనెక్ట్ చేయడం

మీ భాగస్వామ్యాన్ని ముగించాలని మీరు నిర్ణయించుకుంటే, మీ Shopify Collective విక్రయ ఛానెల్‌లోని రిటైలర్ నుండి మీరు డిస్‌కనెక్ట్ చేయవచ్చు. మీరు రిటైలర్ నుండి డిస్‌కనెక్ట్ చేసినప్పుడు, మీ స్టోర్‌లు ఇకపై కనెక్ట్ చేయబడవని ఇమెయిల్ ద్వారా వారికి తెలియజేయబడుతుంది. రిటైలర్‌ల నుండి డిస్‌కనెక్ట్ చేయడం వల్ల వారితో ఉత్పత్తుల సింక్ అవ్వడం ఆగిపోతుంది.

రిటైలర్ నుండి డిస్‌కనెక్ట్ చేయడానికి ముందు, నెరవేర్చబడిన ఆర్డర్‌ల కోసం చెల్లించాల్సిన ఏవైనా చెల్లింపులను చర్చించడానికి, అలాగే నెరవేర్చని ఏవైనా ఆర్డర్‌లను మీరు ఎలా డీల్ చేస్తారు అనే దాని గురించి అంగీకరించడానికి వారిని సంప్రదించండి.

రిటైలర్‌ల నుండి డిస్‌కనెక్ట్ చేయడానికి పరిగణనలు

మీ Shopify Collective విక్రయ ఛానెల్‌లోని రిటైలర్ నుండి డిస్‌కనెక్ట్ చేయడానికి ముందు, ఈ కింది పరిగణనలను రివ్యూ చేయండి:

  • రిటైలర్ నుండి డిస్‌కనెక్ట్ చేయడం వల్ల మీ Shopify స్టోర్‌ల మధ్య కనెక్షన్ వెంటనే ముగిసిపోతుంది. ఇమెయిల్ ద్వారా రిటైలర్‌కు తెలియజేయబడుతుంది.
  • రిటైలర్‌కు చెందిన Shopify స్టోర్‌లో, వారు మీ నుండి దిగుమతి చేసుకున్న అన్ని ఉత్పత్తుల ఇన్వెంటరీ 0కి సెట్ చేయబడుతుంది.
  • నెరవేర్చని ఆర్డర్‌ల గురించి చర్చించడానికి మీరు రిటైలర్‌ను సంప్రదించాలి లేదా మీ Shopify అడ్మిన్‌లో మీరు నెరవేర్చని ఆర్డర్‌లను రద్దు చేయవచ్చు.
  • మీరు రిటైలర్ నుండి డిస్‌కనెక్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆర్డర్ సింక్ చేయడం ఆగిపోతుంది, ఒకవేళ ఆర్డర్‌లకు ట్రాకింగ్ నంబర్‌లు జోడించబడి ఉంటే, అవి కూడా సింక్ అవ్వవు.
  • నెరవేర్చిన ఆర్డర్‌ల కోసం చెల్లింపులకు ఎలాంటి అంతరాయం కలగదు, అలాగే రీఫండ్‌లను ప్రాసెస్ చేయడం కూడా కొనసాగుతుంది.

భాగస్వామ్యం ముగిసిన తర్వాత చెల్లింపును పొందడం

డిస్‌కనెక్ట్ చేయబడిన రిటైలర్‌తో కొత్త ఆర్డర్‌లను క్రియేట్ చేయడం సాధ్యం కాదు, అయితే మీరు ఇంకా చెల్లింపును పొందని ఆర్డర్‌లు ఇప్పటికే ఉండవచ్చు. ఈ ఆర్డర్‌లకు సంబంధించి మీరు ఎలా చెల్లింపును పొందుతారు అనేది, Shopify Collective విక్రయ ఛానెల్‌లోని మీ చెల్లింపు సెట్టింగ్‌లు, అలాగే రిటైలర్‌లతో మీరు చేసుకునే వ్యక్తిగత అరేంజ్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది.

రిటైలర్‌తో ఆటోమేటిక్ చెల్లింపులు యాక్టివేట్ చేయబడి ఉంటే

మీరు రిటైలర్‌తో ఆటోమేటిక్ చెల్లింపులను ఉపయోగిస్తుంటే, వారి నుండి మీరు డిస్‌కనెక్ట్ అయిన తర్వాత, మీరు నెరవేర్చిన ఆర్డర్‌ల కోసం మీరు వారి నుండి ఆటోమేటిక్‌గా చెల్లింపులను పొందుతూనే ఉంటారు.

రిటైలర్‌ను డిస్‌కనెక్ట్ చేసిన తర్వాత మీరు కొనసాగించే ఏవైనా నెరవేర్చని ఆర్డర్‌లకు ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరగవు. నెరవేర్చని ఆర్డర్‌లను రవాణా చేయడానికి ముందు, రిటైలర్‌తో మాన్యువల్ చెల్లింపు పద్ధతి, నిబంధనలపై అంగీకరించేలా చూసుకోండి.

రిటైలర్‌తో ఆటోమేటిక్ చెల్లింపులు డీయాక్టివేట్ చేయబడి ఉంటే

మీరు రిటైలర్‌తో ఆటోమేటిక్ చెల్లింపులను ఉపయోగించకపోతే, మీరు వారి నుండి డిస్‌కనెక్ట్ అయిన తర్వాత, గతంలో నెరవేర్చిన అన్ని ఆర్డర్‌ల కోసం వారి నుండి చెల్లింపులను మాన్యువల్‌గా వసూలు చేయడం కొనసాగించండి. Collectiveలో మీ భాగస్వామ్యం ముగిసిన తర్వాత రవాణా చేయడానికి మీరు అంగీకరించే ఏవైనా నెరవేర్చని ఆర్డర్‌లకు కూడా మాన్యువల్ చెల్లింపుల సేకరణ వర్తిస్తుంది.

రిటైలర్ నుండి డిస్‌కనెక్ట్ చేయండి

ఒకవేళ మీరు Shopify Collectiveలో భాగస్వామ్యాన్ని ముగించాలనుకుంటే, మీరు రిటైలర్ నుండి డిస్‌కనెక్ట్ చేయవచ్చు. మీరు డిస్‌కనెక్ట్ చేసినప్పుడు, మీకు ఎదురయ్యే ఏదైనా దుష్ప్రవర్తన గురించి కూడా మీరు ఆప్షనల్‌గా రిపోర్ట్ చేయవచ్చు.

రిటైలర్ నుండి డిస్‌కనెక్ట్ చేసిన తర్వాత కూడా, Shopify Collective విక్రయ ఛానెల్‌లోని మీ రిటైలర్‌లు పేజీలో ఉన్న ఆర్కైవ్ ట్యాబ్‌లో, మీరు వారి సంప్రదింపు వివరాలను, అలాగే మీ ఆర్డర్‌లు, విక్రయాల మెట్రిక్స్‌ను చూడవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, విక్రయ ఛానెల్‌లు > Collective: Supplierకు వెళ్లండి.

  2. రిటైలర్‌లుని క్లిక్ చేయండి.

  3. కనెక్ట్ చేయబడినవి ట్యాబ్ నుండి, మీరు డిస్‌కనెక్ట్ చేయాలనుకుంటున్న రిటైలర్‌ను క్లిక్ చేయండి లేదా ఎంచుకోండి.

  4. రిటైలర్‌ను డిస్‌కనెక్ట్ చేయండిని క్లిక్ చేయండి

  5. ఆప్షనల్: రిటైలర్ గురించి మీరు Collective బృందానికి రిపోర్ట్‌ను పంపాలనుకుంటే, దుష్ప్రవర్తన గురించి రిటైలర్‌ను రిపోర్ట్ చేయండిని ఎంచుకుని, ఆపై మెసేజ్‌ను ఎంటర్ చేయండి.

  6. డిస్‌కనెక్ట్ చేయండిని క్లిక్ చేయండి.