Facebook Shop

Meta వారి Facebook మరియు Instagramలో Facebook Shop ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు మీ Shopify ఉత్పత్తులను మీ Facebook Pageలో ప్రదర్శించవచ్చు.

మీరు Facebook Shop ఫీచర్‌ను సెటప్ చేసినప్పుడు, Facebook మీ Facebook Pageలో ఒక Shop సెక్షన్‌ను సృష్టిస్తుంది. కస్టమర్‌లు మీ Facebook Page నుండి కొనుగోలు చేయడానికి వీలుగా మీ Shopify ఉత్పత్తులు Shop సెక్షన్‌లో ప్రదర్శించబడతాయి. ఒకవేళ మీరు Shopifyలో ఏదైనా ఉత్పత్తికి మార్పులు చేస్తే, ఆ మార్పులు మీ Facebook Shopలో కూడా అప్‌డేట్ చేయబడతాయి.

మీ అకౌంట్ Facebook ద్వారా వెరిఫై చేయబడిన తర్వాత, మీ Facebook Pageలో ఒక Shop సెక్షన్ ప్రదర్శించబడుతుంది, ఇక్కడ మీరు Meta వారి Facebook మరియు Instagramలో Facebook Shop ఫీచర్‌ను యాక్టివేట్ చేసినప్పుడు మీ ఉత్పత్తులు ప్రదర్శించబడతాయి. మీరు మీ ఉత్పత్తులను, ఆర్డర్‌లను, అలాగే కస్టమర్‌లను మీ Shopify అడ్మిన్ నుండి మేనేజ్ చేయవచ్చు.

Facebook మీ ప్రధాన Facebook Pageలో ఒక Shop Now బటన్‌ను జోడిస్తుంది, అది మీ Facebook Pageలోని Shop సెక్షన్‌కు లింక్ చేస్తుంది. మీరు ఆ బటన్‌ను మీ ఆన్‌లైన్ స్టోర్‌కు లింక్ చేయడంతో సహా, దానికి Facebookలో మార్పులు చేయవచ్చు.

కస్టమర్ విచారణలు

కస్టమర్‌లు Messengerను ఉపయోగించడం ద్వారా మీ Facebook Page ద్వారా మీకు మెసేజ్ చేయవచ్చు, అలాగే మీరు మీ బిజినెస్ తరఫున దానికి ప్రతిస్పందించవచ్చు.

మీ కస్టమర్‌లు Facebookలోని విక్రేతను సంప్రదించండి (Contact Seller) బటన్‌ను ఉపయోగించి ఇమెయిల్ ద్వారా కూడా మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ బటన్ కస్టమర్ విచారణలను మీరు మీ Shopify అడ్మిన్‌లో సెట్ చేసిన కస్టమర్ సపోర్ట్ ఇమెయిల్‌కి ఫార్వార్డ్ చేస్తుంది.

కస్టమర్ సమాచారం

Facebook Shop ద్వారా మీరు సేకరించే కస్టమర్ సమాచారాన్ని వారి కామర్స్ వ్యాపారి ఒప్పందానికి అనుగుణంగా మీరు హ్యాండిల్ చేయాలని Facebook కోరుతోంది.